దూడల పోషణ – ఆహార పద్ధతులు
- దూడను వివిధ సంకటాల నుండి రక్షిస్తూ, ఆహార నియమావళి సక్రమంగా పాటించటం వలన, దూడల ఎదుగుదల బాగుంటుంది.
- తక్కువ వయసులోనే ఎదకు వస్తాయి.
- జీవిత కాలంలో ఎక్కువ దూడలకు జన్మనిస్తాయి.
- సాధారణంగా దూడ పుట్టినపుడు 25-30 కిలోల బరువు వుంటుంది.
మొదటి రెండు రోజులు, జున్నుపాలు రోజుకు 2 నుండి 2.5 లీటర్లు పాలు త్రాగించాలి.
మడు నుంచి 5 రోజుల వరకు, రోజుకు – 2 నుండి 2.5 లీటర్లు పాలు త్రాగించాలి.
6 నుండి 15 రోజుల వరకు, రోజుకు – 2.5 లీటర్లు పాలు త్రాగించాలి.
16 నుండి 25 రోజుల వరకు, రోజుకు – 2.5 లీటర్లుపాలు + 100 గ్రా॥ దాణా ఇవ్వాలి.
26 రోజుల నుండి ఆపైన, రోజుకు – 2.5 లీటర్లుపాలు + 250 గ్రా॥ దాణా ఇవ్వాలి.
మామలు పాలు, సోయాగింజల పాలు సమపాళ్ళలో కలిపి కూడా త్రాగించవచ్చు.
తల్లి దగ్గర జున్ను పాలు లభ్యం కానపుడు, ఈ క్రింది మిశ్రమాన్ని, దూడ పుట్టిన రోజు నుండి 5 రోజుల వరకు, రోజుకు 3 పర్యాయాలు త్రాగించాలి.
అరలీటరు పాలు + పావులీటరు నీళ్ళు + కోడిగ్రుడ్డు ఒకటి + 30 మి.లీ ఆముదం బాగా కలిపి, గిలక్కొట్టి త్రాగించాలి.
దూడకు 15వ రోజు వయస్సునుండి ఎండుగడ్డి, పచ్చిగడ్డి రోజుకు 150 గ్రా॥ తినటం అలవాటు చేయాలి.
మలబద్దకం, బంక విరోచనాలు, తెల్లగా పారటం గమనించి తగు చికిత్సలు చేయించాలి. - దూడలకు ప్రత్యేకమైన దాణా (CALF STARTER)
మొక్క జొన్నలు / జొన్నలు 60 పాళ్ళు
నువ్వు చెక్క / ప్రొద్దుతిరుగుడు చెక్క 20 పాళ్ళు
తవుడు 17 పాళ్ళు
మినరల్ మిక్చర్ 2 పాళ్ళు
ఉప్పు 1 పాలు
మొత్తం 100 పాళ్ళు
వీటిని బాగా కలిపి, మెత్తగా ఉడకబెట్టి తినిపించాలి. వయస్సును బట్టి మోతాదు నిర్ణయించాలి. దానిలో లెవోఫ్లాక్ససిన్ (LEVOFLOXACIN), విటాబ్లెండ్ (VITABLEND) పొడి 1 గ్రా॥ 1 కిలో దాణాలో కలపాలి. - నువ్వుల నూనె రోజుకు 10 మి.లీ. చొ॥న 3 నెలల వరకు త్రాగించాలి.
- నువ్వులు, బెల్లం సమపాళ్ళలో మిశ్రమం చేసి, బాగా నూరి, రోజుకు 50 గ్రా॥ చొ॥న తినిపించాలి.
- చలిగాలులు, వేడిగాలుల నుండి దూడలను కాపాడాలి.
- వ్యాధినిరోధక శక్తి పెరగటానికి వారానికి రెండు సార్లు, 10 మి.లీ. వేపాకు / కరివేపాకు / కొత్తిమీర రసం 4 వారాల వరకు త్రాగించాలి. నెల వయస్సు నుండి 15 రోజులకు ఒక పర్యాయం, 20 మి.లీ వేపాకు రసం, దూడకు 6 నెలల వయస్సు వచ్చే వరకు త్రాగించాలి.
- పుట్టిన వారం రోజుల నుండి వారానికి ఒకసారి 2 మి.లీ. చొ॥న విటమిన్ ‘ఎ’ ఇంజక్షను 4 వారాలు చేయించాలి.
హోమియో:
- సల్ఫర్ 200 దూడ పుట్టగానే 10 మాత్రలు తినిపించాలి. నెలరోజులకు అదే మోతాదులో మళ్ళీ తినిపించాలి.
- కాల్కేరియా కార్బ్ 200 మందు 3 నెలల వయసులో 10 మాత్రలు తినిపించాలి.
- కాల్కేరియా ఫాస్ 30 మొదటి నెల నుండి 6 నెలల వరకు వారానికొకసారి 10 మాత్రలు తినిపించాలి.
- సల్ఫర్ 200, నక్స్ వామిక 200, మందులను మార్చి మార్చి 6 నెలల వయసు నుండి 15 రోజులకు ఒక పర్యాయం తినిపించాలి.
- సోరినం 1M మందు 10 మాత్రలు 12 నెలల నుండి 18 నెలల వరకు నెలకొక పర్యాయం తినిపించాలి.
- వ్యాధి నిరోధక టీకా :- సైకోటిక్ కో 30 / స్ట్రెప్టోకోకినం 30 / ఈ. కోలై నోసోడ్ 30 దూడ పుట్టిన వెంటనే 5 మాత్రల మోతాదు, అప్పటి నుండి 24 గంటలకు 2 వ మోతాదు, 48 గంటలకు 3 వ మోతాదు, 72 గంటలకు 4 వ మోతాదు చొప్పున తినిపించాలి.
అల్లోపతి:
దూడలకు వ్యాధినిరోధక టీకాల పట్టిక
పుట్టిన మొదటి రోజు టెట్‌వ్యాక్ (TETVAC) ఒక మి.లీ. కండకు ధనుర్వాతం రాకుండా ఇంజక్షను చేయించాలి.
40 రోజుల వయసులో రక్ష ‘ఒ’ వ్యాక్ (RAKSHA ‘O’ VAC) 1 మి.లీ. కండకు గాలికుంటు వ్యాధి రాకుండా చేయించాలి.
60 రోజుల వయసులో బయోవ్యాక్ (BIOVAC)1 మి.లీ. కండకు గురక వ్యాధి రాకుండా చేయించాలి.
లేదా
6 మాసాల వయసుకి గురక మరియు జబ్బ వాపు టీకా మందు (H.S. & B.Q VACCINE) 3 మి.లీ. కండకు (IMగా) చేయించాలి.
పైన సూచించిన టీకా ఇంజక్షన్లు చేయించిన తేదీలు పుస్తకంలో రాసుకొని క్రమం తప్పకుండా పశ”వైద్యుని సలహా మేరకు తిరిగి చేయించాలి.
……………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.


