దూడల పోషణ – ఆహార పద్ధతులు

  1. దూడను వివిధ సంకటాల నుండి రక్షిస్తూ, ఆహార నియమావళి సక్రమంగా పాటించటం వలన, దూడల ఎదుగుదల బాగుంటుంది.
  2. తక్కువ వయసులోనే ఎదకు వస్తాయి.
  3. జీవిత కాలంలో ఎక్కువ దూడలకు జన్మనిస్తాయి.
  4. సాధారణంగా దూడ పుట్టినపుడు 25-30 కిలోల బరువు వుంటుంది.
    మొదటి రెండు రోజులు, జున్నుపాలు రోజుకు 2 నుండి 2.5 లీటర్లు పాలు త్రాగించాలి.
    మడు నుంచి 5 రోజుల వరకు, రోజుకు – 2 నుండి 2.5 లీటర్లు పాలు త్రాగించాలి.
    6 నుండి 15 రోజుల వరకు, రోజుకు – 2.5 లీటర్లు పాలు త్రాగించాలి.
    16 నుండి 25 రోజుల వరకు, రోజుకు – 2.5 లీటర్లుపాలు + 100 గ్రా॥ దాణా ఇవ్వాలి.
    26 రోజుల నుండి ఆపైన, రోజుకు – 2.5 లీటర్లుపాలు + 250 గ్రా॥ దాణా ఇవ్వాలి.
    మామలు పాలు, సోయాగింజల పాలు సమపాళ్ళలో కలిపి కూడా త్రాగించవచ్చు.
    తల్లి దగ్గర జున్ను పాలు లభ్యం కానపుడు, ఈ క్రింది మిశ్రమాన్ని, దూడ పుట్టిన రోజు నుండి 5 రోజుల వరకు, రోజుకు 3 పర్యాయాలు త్రాగించాలి.
    అరలీటరు పాలు + పావులీటరు నీళ్ళు + కోడిగ్రుడ్డు ఒకటి + 30 మి.లీ ఆముదం బాగా కలిపి, గిలక్కొట్టి త్రాగించాలి.
    దూడకు 15వ రోజు వయస్సునుండి ఎండుగడ్డి, పచ్చిగడ్డి రోజుకు 150 గ్రా॥ తినటం అలవాటు చేయాలి.
    మలబద్దకం, బంక విరోచనాలు, తెల్లగా పారటం గమనించి తగు చికిత్సలు చేయించాలి.
  5. దూడలకు ప్రత్యేకమైన దాణా (CALF STARTER)
    మొక్క జొన్నలు / జొన్నలు 60 పాళ్ళు
    నువ్వు చెక్క / ప్రొద్దుతిరుగుడు చెక్క 20 పాళ్ళు
    తవుడు 17 పాళ్ళు
    మినరల్ మిక్చర్ 2 పాళ్ళు
    ఉప్పు 1 పాలు
    మొత్తం 100 పాళ్ళు
    వీటిని బాగా కలిపి, మెత్తగా ఉడకబెట్టి తినిపించాలి. వయస్సును బట్టి మోతాదు నిర్ణయించాలి. దానిలో లెవోఫ్లాక్ససిన్ (LEVOFLOXACIN), విటాబ్లెండ్ (VITABLEND) పొడి 1 గ్రా॥ 1 కిలో దాణాలో కలపాలి.
  6. నువ్వుల నూనె రోజుకు 10 మి.లీ. చొ॥న 3 నెలల వరకు త్రాగించాలి.
  7. నువ్వులు, బెల్లం సమపాళ్ళలో మిశ్రమం చేసి, బాగా నూరి, రోజుకు 50 గ్రా॥ చొ॥న తినిపించాలి.
  8. చలిగాలులు, వేడిగాలుల నుండి దూడలను కాపాడాలి.
  9. వ్యాధినిరోధక శక్తి పెరగటానికి వారానికి రెండు సార్లు, 10 మి.లీ. వేపాకు / కరివేపాకు / కొత్తిమీర రసం 4 వారాల వరకు త్రాగించాలి. నెల వయస్సు నుండి 15 రోజులకు ఒక పర్యాయం, 20 మి.లీ వేపాకు రసం, దూడకు 6 నెలల వయస్సు వచ్చే వరకు త్రాగించాలి.
  10. పుట్టిన వారం రోజుల నుండి వారానికి ఒకసారి 2 మి.లీ. చొ॥న విటమిన్ ‘ఎ’ ఇంజక్షను 4 వారాలు చేయించాలి.

హోమియో:

  1. సల్ఫర్ 200 దూడ పుట్టగానే 10 మాత్రలు తినిపించాలి. నెలరోజులకు అదే మోతాదులో మళ్ళీ తినిపించాలి.
  2. కాల్కేరియా కార్బ్ 200 మందు 3 నెలల వయసులో 10 మాత్రలు తినిపించాలి.
  3. కాల్కేరియా ఫాస్ 30 మొదటి నెల నుండి 6 నెలల వరకు వారానికొకసారి 10 మాత్రలు తినిపించాలి.
  4. సల్ఫర్ 200, నక్స్ వామిక 200, మందులను మార్చి మార్చి 6 నెలల వయసు నుండి 15 రోజులకు ఒక పర్యాయం తినిపించాలి.
  5. సోరినం 1M మందు 10 మాత్రలు 12 నెలల నుండి 18 నెలల వరకు నెలకొక పర్యాయం తినిపించాలి.
  6. వ్యాధి నిరోధక టీకా :- సైకోటిక్ కో 30 / స్ట్రెప్టోకోకినం 30 / ఈ. కోలై నోసోడ్ 30 దూడ పుట్టిన వెంటనే 5 మాత్రల మోతాదు, అప్పటి నుండి 24 గంటలకు 2 వ మోతాదు, 48 గంటలకు 3 వ మోతాదు, 72 గంటలకు 4 వ మోతాదు చొప్పున తినిపించాలి.

అల్లోపతి:
దూడలకు వ్యాధినిరోధక టీకాల పట్టిక
పుట్టిన మొదటి రోజు టెట్‌వ్యాక్ (TETVAC) ఒక మి.లీ. కండకు ధనుర్వాతం రాకుండా ఇంజక్షను చేయించాలి.
40 రోజుల వయసులో రక్ష ‘ఒ’ వ్యాక్ (RAKSHA ‘O’ VAC) 1 మి.లీ. కండకు గాలికుంటు వ్యాధి రాకుండా చేయించాలి.
60 రోజుల వయసులో బయోవ్యాక్ (BIOVAC)1 మి.లీ. కండకు గురక వ్యాధి రాకుండా చేయించాలి.
లేదా
6 మాసాల వయసుకి గురక మరియు జబ్బ వాపు టీకా మందు (H.S. & B.Q VACCINE) 3 మి.లీ. కండకు (IMగా) చేయించాలి.
పైన సూచించిన టీకా ఇంజక్షన్లు చేయించిన తేదీలు పుస్తకంలో రాసుకొని క్రమం తప్పకుండా పశ”వైద్యుని సలహా మేరకు తిరిగి చేయించాలి.
……………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

వండని వంట… పచ్చి మునక్కాయల నిల్వ పచ్చడి

నిల్వ పచ్చళ్ళ మూల సూత్రం ఒకటి ఉంది. ఉప్పు, పులుపు తగినంత ఉంటే, పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మొదట తక్కువ కాయలతో నిల్వ పచ్చడి పెట్టుకుని, బాగుంది అని అనిపిస్తే, ఆ అనుభవంతో ఎక్కువ కాయలతో చేసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం తగినంత ఉన్నదీ లేనిదీ, రుచి చూస్తే తెలుస్తుంది. మొదట ఉప్పు పులుపు కారం తక్కువ తక్కువ కలుపుకోవాలి. రుచి చూస్తూ సరిచేసుకోవాలి.
ముదురు కాకుండా లేత కాకుండా, మధ్యస్తంగా ఉండే మునక్కాయలు నాలుగో అయిదో తీసుకుని, పొడి గుడ్డతో తుడిచి, పైపైన కాస్తా పొట్టు తీసి, రెండు అంగుళాల పొడవున ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలను కాసేపు నీడకు ఆరనివ్వాలి. తరువాత ఆ ముక్కలకు తగినంత ఉప్పు, నిమ్మ రసం, ఆవపిండి, మెంతి పిండి, జీలకర్ర పొడి, కారం వేసి కలుపుకోవాలి. రెండు మూడు రోజుల పాటు అలాగే స్టీల్ గిన్నెలో ఉండనిచ్చి మూత పెట్టి, ఉదయం సాయంత్రం ఒకసారి అంతా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి.

ముక్కల్లో కాస్తా నీరు ఊరుతుంది. ఉప్పు కారం పులుపు ఘాటు తగినట్లుగా ఉన్నది లేనిది రుచి చూసి సరిచేసుకోవాలి. చివరికి పచ్చడిలో కాస్తా గానుగ నూనె పోసుకుని కలపాలి. అంతే! పచ్చి మునక్కాయల నిల్వ పచ్చడి సిద్దం!

బయటి వాతావరణంలో కూడా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో, మునక్కాయ పచ్చడి కలుపుకుని తింటే రుచికరంగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు

  • మునక్కాయలు
  • నిమ్మ రసం
  • ఉప్పు * కారం
  • ఆవపిండి
  • మెంతిపిండి
  • జీలకర్ర పొడి
  • గానుగ నూనె
    (ఏ నూనె వాడితే అదే)

రచనః తుమ్మేటి రఘోత్తమరెడ్డి
………………………………………………………………………………………………………………………………….
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More