తయారుచేయు విధానం: ముందుగా తవుడును శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఖర్ౙూరంలో ఉన్న గింజలు తీసివేసి మిక్సిలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను పలుకులు మాదిరిగా మిక్సి పట్టాలి. ఇప్పుడు తవుడులో ఒక్కొక్క పదార్ధం, పండు ఖర్ౙూరం పేస్ట్, బెల్లం పొడి, ఎండు కొబ్బరి తురుము, డ్రై ప్రూట్స్ పలుకులు, యాలకుల పొడి మొత్తం తవుడులో కలిపి, లడ్డు తయారు చేసుకోవాలి. ఈ లడ్డు తయారీకి నేను నెయ్యి వాడలేదు. కాని ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండే బళ్లారి కొబ్బరి తురుము తీసుకోవడం జరిగింది. తవుడు లడ్డు బాగా రుచిగా ఉండాలంటే, పండు ఖర్ౙూరం ఎక్కువగా కలపాలి. లేకపోతే తవుడు పచ్చి వాసన ఉంటుంది. మినప లడ్డు లాగానే ఈ లడ్డు కూడా బలవర్ధకమైనది. బాగా ఉంది కదా అని ఎక్కువగా తినకూడదు. ఈ లడ్డు ఆకలిని నియంత్రిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
- తవుడు 2 కప్పులు లేదా 250 గ్రా.
- పండు ఖర్జూరం – అర కిలో
- బెల్లం 50 గ్రా.
- ఎండు కొబ్బరి తురుము – 1 కప్పు లేదా 100 గ్రా.
- డ్రై ఫ్రూట్స్ – గుప్పెడు
- యాలకుల పొడి – అర చెంచా
రచనః దిల్షాద్ ఖాన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్.
………………………………………………………………………………………………………………………………….
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

