జామకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడి

తయారుచేసే విధానం: జామకాయలని, మామిడి కాయలని, వెల్లుల్లి, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని రుచికి తగినంత ఉప్పుని మామిడికాయ ముక్కలని కచ్చాపచ్చాగా రోటిలో బండతో దంచి, తదుపరి జామకాయ ముక్కలని వెల్లుల్లిని, చిటికెడు పసుపుని వేసి దంచుకోవాలి. రెండు చెంచాలు నూనె వేసి కలపాలి. ఒక గంట తర్వాత మామిడి కాయలో ఉన్న పులుపు వూరి, జామకాయ ముక్కలకి పట్టి కొంచం గ్రేవీగా వస్తుంది. అంతే! పచ్చడి రెడీ!!
ఈ పచ్చడి వేడివేడి అన్నంలోగానీ, రొట్టెలోగానీ, దోసెలోగానీ వేసుకుతింటే… రుచిగా ఉంటుంది!

కావలసిన పదార్థాలు:

  • జామకాయ – 1 (పావుకిలో సైజు)
  • మామిడికాయ – 1 (పావుకిలో సైజు))
  • పచ్చిమిర్చి – 30 గ్రాములు
  • ఉప్పు – రుచికి తగినంత
  • జీలకర్ర – 2 టేబుల్ స్పూన్లు
  • వెల్లుల్లి రేకలు – 10
  • పసుపు – చిటికెడు.
  • ఆయిల్ – రెండు చెంచాలు

రచన: ధనలక్ష్మి కొల్లిపర, గచ్చిబౌలి హైదరాబాద్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… చలివిడి

కావాల్సిన పదార్థాలు

  • బియ్యం * బెల్లం * కొబ్బరి తురుము * యాలక్కాయలు – నాలుగు (అన్నీ బియ్యానికి తగినంతగా).

తయారుచేయు విధానం: బియ్యాన్ని రెండు గంటలు నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు లేకుండా అయిన తర్వాత, మిక్సీలో వేసి పిండి పట్టుకోవాలి. దానిలోనే బెల్లం, యాలక్కాయలు వేసి కలిసే వరకు తిప్పుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము వేసి, మళ్లీ ఒకసారి తిప్పుకుంటే చలివిడి సిద్ధం! (చలిమిడి అని కూడా అంటారు)

  • మెహర్ శాంతి కర్రి, అర్తమూరు, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… నువ్వుల కారం పిండి

కావాల్సిన పదార్థాలు

  • తెల్లనువ్వులు
  • జీలకర్ర – కొంచెం
  • ఎండుమిర్చి – సరిపడా
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
తెల్ల నువ్వులు శుభ్రం చేసుకుని, ఎండలో పెట్టి, కొంచం సేపు ఎండగానే, తెచ్చి పక్కన పెట్టుకోవాలి, (ఎక్కువ సేపు ఎండలో పెడితే నూనె వస్తుంది) నువ్వులతోపాటు మిర్చి, జీలకర్ర కూడా ఎండబెట్టుకోవాలి. తరువాత అన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ పట్టకూడదు.. నూనె వస్తుంది… అలానే రోట్లో దంచుకోవచ్చు కూడా.. తరువాత ఉప్పు కలిపి వాడుకోవడమే… నువ్వుల కారపు పిండిని నేరుగా అన్నంలో వేసుకుని, పచ్చి నూనె వేసుకొని తినవచ్చు. లేదా కూరలు, పులుసులో కూడా కలిపి వాడుకోవచ్చు.

రచన: సంధ్య శశికాంత్, వాకలపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట…. సొరకాయ తాండ్ర

కావాల్సిన పదార్థాలు

  • సొరకాయ * బెల్లం
  • ఎండు ద్రాక్ష * జీడిపప్పు
    (ఆసక్తిని బట్టి ఎన్ని రకాల ఎండు పండ్ల ముక్కలనైనా కలుపుకోవచ్చు)

తయారుచేయు విధానం: సొరకాయను నీళ్లతో శుభ్రం చేసి, ఆరనిచ్చి, ముక్కలుగా కోసుకుని, గింజలు తీసివేసి, చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తగా నూరి, గుజ్జును శుభ్రమైన గుడ్డలో వేసి గట్టిగా పిండి, నీటిని వేరు చెయ్యాలి. ఎంతగా నీటిని పిండేస్తే, గుజ్జు అంత త్వరగా ఎండుతుంది.

సొరకాయ గుజ్జుకు సమానంగా బెల్లం తురుమును కలుపుకుని, మళ్ళీ మిక్సీలో వేసి కాస్తా తిప్పాలి. సొరకాయ బెల్లం గుజ్జును, వెడల్పాటి స్టీల్ ప్లేట్లో పలుచగా పరిచి ఎండబెట్టాలి. కొంత గట్టిపడిన తరువాత, కావాల్సిన ఆకారాలలో, పలుచగా, బిళ్లలుగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న బిళ్లలకు ఎండు ద్రాక్ష, జీడిపప్పు బద్దలను అద్దుకోవాలి. బిళ్లల మీద అలా అద్దడం వల్ల, ఆకర్షణీయంగా పిల్లలకు కనపడతాయి, రుచి, పోషకాలు కూడా పెరుగుతాయి.

సొర తాండ్రలో స్ధూల సూక్ష్మ పోషకాలు ఎన్నో ఉన్నాయి. బయటి వాతావరణంలో కూడా నెలల పాటు నిల్వ ఉంటాయి! పిల్లలు, వృద్దులు, ఏ వయసు వారైనా సరే, రోజుకు ఒక సొర తాండ్ర బిళ్ల తినవచ్చు. సొరకాయ తాండ్రను ఎండబెట్టేటప్పుడు, చీమలు పట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. (సొరకాయ నీళ్లను తాగవచ్చు, పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు)


జామ పండ్లు ఎక్కువ ఉత్పత్తి వచ్చినప్పుడు కూడా జామ తాండ్రను తయారు చేసుకోవచ్చు. కాకపోతే జామగుజ్జు నుంచి గింజలను వేరు చేసుకోవాలి.

జామ గుజ్జును జల్లెడలో వేసి చేత్తో రాస్తూ ఉంటే, గుజ్ౙు కిందికి జారి, గింజలు జాలి పైన మిగులుతాయి, గింజలను పారెయ్యాలి. మిగతా ప్రాసెస్ సేమ్ సేమ్.

రచన : తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… వంకాయ నిల్వ పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • ముదిరిన వంకాయలు – అర కిలో
  • చింతపండు – 150 గ్రా.
  • కారం పొడి – 150 గ్రా.
  • రాళ్ళ ఉప్పు – 150 గ్రా.
  • అవ పొడి – నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు
  • మెంతి పొడి – ఒక టీ స్పూన్
  • ఎల్లిపాయ రెబ్బలు కొన్ని
  • పసుపు కొంచెం మరియు ఇంగువ కొంచెం

తయారుచేయు విధానం:
వంకాయలు మాములు సైజ్ ముక్కలుగా చేసుకోవాలి. దానిలోకి ఉప్పు, చింతపండు మరియు పసుపు చెప్పిన మోతాదులో కలిపి ఒక్క రోజు ఊర పెట్టుకోవాలి.

మరుసటి రోజు దానిని నుండి చింత పండుని వేరు చేసి, చింత పండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తరువాత చింతపండు గుజ్ౙును, వంకాయ ముక్కలు, కారంపొడి, ఆవపొడి, మెంతిపొడి, ఇంగువ అన్ని బాగా కలపాలి

(గమనికః చింతపండుకు బదులుగా నిమ్మ రసం కూడా కలుపుకోవచ్చు, పండిన వంకాయలతో కూడా ఇలాగే నిల్వ పచ్చడి చెయ్యవచ్చు)

ఎల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోవచ్చు లేదా అలాగే రెబ్బలుగా అయినా వేసుకోవచ్చు. వంకాయ పచ్చడి రెడీ.
కావాలి అనుకుంటే కొంచెం గానుగ నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె పచ్చివి కలుపుకోవచ్చు. (వండని వంటలు కనుక, పచ్చి నూనె బాగానే ఉంటుంది, తాలింపు అవసరం లేదు)

వేడి అన్నంలో అయినా, సద్దన్నంలో అయినా వంకాయ పచ్చడి వేసుకొని తినవచ్చు.

  • రచన: ఆర్. నిర్మల, ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట…. చల్ల మిరపకాయలు

కావాల్సిన పదార్థాలు

  • 1 కిలో పచ్చి మిరపకాయలు
  • 200 గ్రాముల ఉప్పు
  • సరిపడినంత చిక్కటి పుల్లటి మజ్జిగ
  • 1 నిమ్మకాయ రసం

తయారుచేయు విధానం: మరీ కారంగా, మరీ చప్పగా కాకుండా, మోస్తరు కారంగా ఉన్న మిరపకాయలు, సైజు కూడా మధ్యస్థంగా ఉన్నవి ఎంచుకోవాలి.

మిరపకాయలను మధ్యకు సన్నగా చీల్చి, ఒక గిన్నెలో వేసుకోవాలి. వాటి పైన ఉప్పు వేసుకొని కలియ తిప్పి, మిరపకాయలు, మునిగే వరకు మజ్జిగ పోసి కలిపి, పైన ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి.

ఒక రోజు మొత్తం 24 గంటలు నాననిచ్చి, తరువాత ఎండకు ఎండపెట్టాలి. తిరిగి రాత్రికి మళ్ళీ మిగిలి ఉన్న మజ్ౙిగలో నానపెట్టాలి. ఇలా మజ్జిగ అయిపోయే వరకు చెయ్యాలి.

ఒకసారి ఎండ పెట్టి తిరిగి మజ్జిగలో వేసి కలిపేటప్పుడు కొంచెం నిదానంగా మిరపకాయలు విరగకుండా కలపాలి. ఎండకు బాగా ఎండిన తరువాత, గాలి చొరని డబ్బాలో నిలువ చేసుకోవాలి.

ఈ ఎండిన చల్లమిరపకాయలను మధ్య మధ్య ఎండపెడుతూ ఉంటే, చెడిపోకుండా, మెత్త పడకుండా, రెండు సంవత్సరాల వరకు నిలువ ఉంటాయి.

మాములుగా అయితే చల్ల మిరపకాయలు నూనెలో వేయించి, అన్నానికి అంచుకు పెట్టుకొని తింటారు. నూనెలో వేయించకుండా కూడా తినొచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా బాగుంటాయి.

రచనః అందుకూరి గిరిజ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… చింతపండు తొక్కు

కావాల్సిన పదార్థాలు

  • చింతపండు
  • కారంపొడి
  • ఉప్పు
  • పచ్చి ధనియాలు
  • జీలకర్ర
  • కరివేపాకు
  • కొత్తిమీర
  • ఉల్లిగడ్డ
  • వెల్లుల్లిపాయలు కొన్ని
  • నువ్వుల నూనె

తయారు చేసే విధానం: ముందుగా చింతపండును శుభ్రంగా కడిగి నీరు పోసి నాన పెట్టుకోవాలి. చింతపండు మంచిగా నానిన తర్వాత మొదలు వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, తగినంత ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టాలి. ఆ తర్వాతకి నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ చేర్చి ఒక రౌండ్ తిప్పుకుంటే ఉల్లిగడ్డ బాగా మెత్తగా కాకుండా ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నువ్వుల నూనె కలుపుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది.

రచన : ఇమ్మిడిశెట్టి ప్రభాకరరావు, హన్మకొండ, తెలంగాణ.

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా, లేదా తురుము కొద్దిగా
  • పెరుగు – సరిపడునంత
  • ఉప్పు – తగిన మోతాదులో
  • ఆవపిండి – అర చెంచా
  • రెండు పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
  • తరిగిన కొత్తిమీర – కొద్దిగా

తయారుచేసే విధానం
బూడిది గుమ్మడికాయ పైన ఉన్న మందపాటి తొక్కను చాకుతో తీసివేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా పెద్ద ముక్కను తురుముగా చేసుకొని అయినా పెరుగు పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు. పెరుగును చల్లకవ్వంతోనే చిల్కి ఈ తురుమును లేదా గ్రైండ్ చేసుకున్న ముద్దను పెరుగులో కలుపుకోవాలి. దానికి తగిన మోతాదు లోపల ఉప్పు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పౌడర్, కొంచెం ఆవపిండిని కలుపుకొని చల్లకవ్వంతోని చక్కగా చిలకాలి.
బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడిని అన్నంలోకి, చపాతీలోకి కూడా తినవచ్చు.

రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… వాము కారం

కావాల్సిన పదార్థాలు

  • వాము – ఒక టీ స్పూను (ఇసుక, మట్టి లేకుండా చూసుకోవాలి)
  • రాళ్ళ ఉప్పు – తగినంత
  • పచ్చిమిర్చి – అరకప్పు

తయారుచేయు విధానం:
వాము కారంలో పచ్చిమిర్చిఎక్కువ ఉండాలి. వాము తక్కువ ఉండాలి. ఎందుకంటే వాము ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనిని తక్కువగా వేసుకోవాలి.

వాము కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో వాము పొడిని బాగా కలిపి ఒక ప్లేట్‌లో ఈ వాము పొడిని పలుచగా పరిచి బాగా ఎండబెట్టుకోవాలి. ఏమాత్రం తేమ ఉండకూడదు. అంటే ఆ మిశ్రమం బాగా క్రిస్పీగా ఎండాలి. అప్పుడు గాజు సీసాలో పోసి నిలువ చేసుకోవాలి. స్టీలు డబ్బాలో పోయకూడదు. ఎందుకంటే ఉప్పు ఉంటుంది కాబట్టి. ఎండిన పొడిని అలాగే అన్నంలోకి, టిఫిన్స్‌లోకి వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.

  • లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… పంచ కజ్జాయం

చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో వాడే ఎండుకొబ్బరి పొడి కోసం ఎండుకొబ్బరి చిప్పను తురిమి తయారుచేసేవారు. ఇప్పుడు ఇంకా సులభంగా చేసుకోవాలంటే ఎండుకొబ్బరి పొడి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి దానితో కూడా చేసుకోవచ్చు.

తయారుచేయు విధానం: అన్ని ఒక బౌల్‌లో ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. పంచ కజ్ౙాయం తయారవుతుంది.

కావాల్సిన పదార్థాలు

  • ఎండుకొబ్బరి తురుము లేదా పొడి – కావలసినంత.
  • చక్కెర – రుచికి తగినంత (నేను బ్రౌన్ షుగర్ వేసుకున్నాను. బెల్లం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది)
  • డ్రైఫ్రూట్స్-జీడిపప్పు, బాదం పప్పు వేశాను. (ఎన్ని రకాలు కావాలన్నా వేసుకోవచ్చు.)
  • యాలకుల పొడి – పదార్ధానికి తగినంత.
  • పచ్ౘ్కర్పూరం – చాలా చాలా కొంచెం.

రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్ : 9676797777 కు సంప్రదించండి.

Read More