వండని వంట… పుట్నాల లడ్డు

కావాల్సిన పదార్థాలు

  • పుట్నాలు – ఒక కప్పు
  • బెల్లం – ముప్పావు కప్పు
  • నెయ్యి – అర్ధపావు కప్పు
  • ఏలకులు – నాలుగు
  • జీడిపప్పు – నాలుగు

పుట్నాల లడ్డు / శనగ సున్ని లడ్డు (పాక్షికంగా వండని వంట)

తయారుచేయు విధానం: ఒక కప్పు పుట్నాలు, ముప్పావు కప్పు తరిగిన బెల్లం, 4 ఏలకులు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దికొద్దిగా కరిగిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టాలి. నెయ్యి తగ్గించి కొద్దిగా పాలు పోసుకోవచ్చు. పుట్నాల పిండి బదులుగా శనగపిండి వాడవచ్చు.

  • చలసాని రాజ్యలక్ష్మి , హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ ఆవ పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు – పావు కిలో
  • ఆవపిండి – మూడు టేబుల్ స్పూన్లు.
  • జీలకర్ర, మెంతుల పొడి – పావు టీస్పూన్
  • ఉప్పు, కారం – తగిన మోతాదులో
  • పసుపు – చిటికెడు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీ స్పూన్లు,
  • వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15 వరకు,
  • మూడు నిమ్మకాయల రసం
  • జిలకర, మెంతులు, ఆవాలు కొద్దిగా
  • నువ్వుల నూనె – తగిన మోతాదులో

తయారుచేయు విధానం: కొద్దిగా బూడిద పోసిన బూడిది గుమ్మడికాయను శుభ్రంగా కడిగి పైన ఉన్నటువంటి మందంపాటి చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని వాటిని ఒక అరగంట సేపు ఆరబెట్టి, ఆరిన తర్వాత ముక్కలకి మిగతా పదార్థాలు అన్నిటినీ కలుపుకొని పొడిగా ఉన్నటువంటి గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ తీసి పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత ఉపయోగిస్తే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఫ్రిజ్లో పెడితే నెలరోజుల వరకు ముక్క మెత్త పడకుండా బాగుంటుంది.

  • సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట…. కొబ్బరి కారం

కావాల్సిన పదార్థాలు

  • ఎండుకొబ్బరి
  • ఉప్పు
  • గొడ్డుకారం (ఎండు మిర్చితో కొట్టిన కారం)
  • వెల్లుల్లి
  • జీలకర్ర
  • కరివేపాకు

తయారుచేయు విధానం:
కొబ్బరిని ముందుగా ముక్కలుగా కోసి, కోర్స్‌గా మిక్సీ వేయాలి, లేదా తురుము పీఠ మీద తురుము కోవచ్చు. కోరిన కొబ్బరి తురుము, కారం, ఉప్పు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ కలిపి మిక్సీలో ఒకసారి తిప్పితే (రోట్లో కూడా దంచుకోవచ్చు.) కొబ్బరికారం రెడీ!

ఇడ్లీ, దోసె, ఊతప్పం, వేడివేడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది.
  • ఫణీంద్ర లక్ష్మీ అప్పసాని,* తక్కెళ్ళపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… ఉల్లిగడ్డ ముక్కల కారం

ఉల్లిగడ్డలతో మనము రకరకాల వంటలు చేసుకోవచ్చు.

ఇది ఉల్లిగడ్డ ముక్కలతో చేసేది. నోరు బాలేనప్పుడు, చట్నీలు చేసే టైం లేనప్పుడు, దోసెల్లోకి, జొన్నరొట్టెల్లోకి, చపాతీల్లోకి బాగుంటది. చాలా సింపుల్‌గా ఒక నిమిషంలో అయిపోతది.

ఎండాకాలంలో ఎంత ఎక్కువ ఉల్లిగడ్డ తింటే అంత మంచిది. చలువ చేస్తుంది, కాబట్టి వీలైనంత మటుకు ఉల్లిగడ్డను మన ఆహారంలో చేర్చాలి.

కావలసినవి: 2 ఉల్లిగడ్డలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, నూనె… అంతే ! జీలకర్ర, ఎల్లిగడ్డ అవసరం లేదు.
ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, దాంట్లో మనం తినగలిగినంత కారం, కొంచెం ఉప్పు, పచ్చి నూనె కలపాలి. అన్నింటిని మంచిగా కలిపి తినేయడమే.

దీంట్లో నూనెకు బదులుగా నెయ్యి వాడదామని అనుకునేరు, అస్సలు బాగుండదు. కాకపోతే మనం తినే దోసెల మీద లేదా రొట్టెల మీద కొంచెం వెన్నపూస పెట్టుకుంటే బాగుంటది.
అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగుంటది.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ముంత మసాలా

ఇది పాక్షికంగా వండని వంటలు కిందికి వస్తుంది.
సాయంత్రం పూట చిరుతిండిలా లేదా ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకొనేదే ముంత మసాలా.

కావలసినవి: మరమరాలు ఒక 50 గ్రాములు, పెద్ద ఉల్లిపాయ, రెండు బాగా పండిన టొమాటోలు, పుట్నాలు రెండు చెంచాలు, నిమ్మకాయ ఒకటి, కొత్తిమీర తరుగు కొంచెం. ఉప్పు, పసుపు, కారం సరిపడా.
కావాలి అంటే వేసుకునేవి: చిటికెడు గరం మసాలా, కారెట్ తురుము, వేయించిన పల్లీలు, కొబ్బరి తురుము.

తయారీ విధానం: ఉల్లిపాయ, టమాటో సన్నగా తరిగి ఉంచుకోవాలి. నిమ్మరసం గింజలు రాకుండా తీసి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో ఉల్లి, టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా పిసికితే కొంచెం నీరులా వస్తుంది. అప్పుడు మరమరాలు, పుట్నాలు వేసి ఇంకోసారి గట్టిగా పిసికితే మరమరాలు మెత్తబడతాయి. తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి తినడమే.

ఇదే పద్ధతిలో అటుకులు కూడా చేసుకోవచ్చు. అటుకులు ఒక్క నిమిషం నీటిలో వేసి, తర్వాత నీరు పిండి మరమరాల్లాగే చేసుకోవచ్చు.

ఇంకొంచెం రుచిగా ఉండాలి అంటే కారట్ – కొబ్బరి తురుము, కొన్ని వేయించిన వేరుశనగలు కలుపుకోవచ్చు. కారం బదులు పచ్చిమిర్చి లేదా సాంబార్ కారం, పులుపుకి నిమ్మకాయ లేదా మామిడి తురుము వేసుకోవచ్చు. నిమ్మరసం తినేముందు పిండుకోవాలి.

రచన: కనకదుర్గ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… పెసర పప్పు పొడి

పెసర పప్పు పొడి తయారీకి కావలసిన పదార్థాలు:

  • చిన్న కప్పు పెసరపప్పు * పదిహేను ఎండుమిర్చి
  • రాళ్ళుప్పు సరిపడా * ఒక స్పూన్ జీలకర్ర
  • ఒక స్పూను నిండుగా ఇంగువ.

ముందుగా పెసరపప్పుని ఒక పళ్ళెంలో పోసుకొని బాగా కటకటలాడేట్లు ఎండపెట్టుకోవాలి.
తర్వాత ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఇంగువ అన్నీ కలిపి మిక్సీ వెసుకోవటమే.
అంతే. ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఈ పొడి వేడివేడి అన్నంలో ఆవు నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

పూర్వం తిరగలిలో వేసి విసిరేవాళ్ళు.

రోటిలో రుబ్బిన పచ్చడికి, తిరగలిలో విసిరే పొడులకి రుచి ఎక్కువ.

రచన: శ్రీమతి కొలను పద్మావతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… పచ్చిమిర్చి పచ్చడి

పచ్చిమిర్చిని కూరల్లో కారం కోసం వాడతాం కదా. కానీ, ఒక కూరగాయగా కూడా వాడుకోవచ్చు.

పచ్చిమిర్చిని తింటే, కడుపులో మంట వస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ ప్రకృతి ఆహారంలో, ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చిమంచిదని చెప్తారు. ఎందుకంటే పచ్చిమిర్చి ఎండిన తర్వాత, దానికి కారం ఎక్కువగా ఉంటుంది. అందుకని పచ్చిమిర్చి మంచిదని చెప్తారు.

సరే ఆ సంగతి వదిలేసి, పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సులభంగా తయారు చేయవచ్చు.

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, వాటికి సరిపడా చింతపండు, ఉప్పు, ఇంగువ.
నీటిలో కడిగి శుభ్రం చేసి, తేమ లేకుండా తుడిచిన పచ్చిమిర్చిని, ఉప్పును రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి దంచి, కొంచెం దంచిన తర్వాత, దానికి చింతపండు కలిపి దంచుకోవాలి. కావలసిన వారు జీలకర్ర వేసుకోవచ్చు.

ఆఖరున ఇంగువ కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇది అన్నం లోకి, రొట్టెలు, టిఫిన్స్ అన్నింటిలోకీ బాగుంటుంది.

ఆ పచ్చడికి కొత్తిమీర కలిపి చేస్తే , ‘పచ్చిమిర్చి కొత్తిమీర’ పచ్చడి అవుతుంది.

పచ్చిమిర్చి, ఉప్పు, ఇంగువ మాత్రమే కలిపి చేస్తే, అది ‘పచ్చిమిర్చి కారం’ అవుతుంది.

ఈ పచ్చడికి ఉల్లిపాయ కలిపి చేస్తే, ఉల్లిపాయ పచ్చడి అవుతుంది. ఎల్లిపాయ అయినా వేసుకోవచ్చు.
ఒకే విధానంతో రకరకాల పచ్ౘ్ళ్లు చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి లతా కృష్ణమూర్తి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… పుట్నాల పప్పు పచ్చడి

పుట్నాలపప్పు ఒక కప్పు, పదిహేను ఎండుమిర్చి, (మీ కారానికి తగ్గట్టు వేసుకోండి) కారానికి సరిపడా రాళ్ళ ఉప్పు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి.

వెల్లుల్లిని ఇష్టపడనివాళ్ళు, ఇంగువ వేసుకోండి. లేదా మీ ఇష్టం!

మీకు ఇష్టమైతే, ఇందులో రెండురెబ్బల కరివేపాకు కూడా జోడించవచ్చు.

పైన చెప్పినవన్నీ తీసుకుని, తగినంత నీరు పోసి రోట్లో రుబ్బుకోవడమో, మిక్సీలో రుబ్బుకోవడమో మీ ఇష్టం.

అంతే, పప్పు పచ్చడి సిద్దం. పోపు, తాలింపు ఏమీ అవసరం లేదు.

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే, దీని రుచి అమోఘం. మేము ఎక్కువగా సాయంత్రాలు, చారు కాంబినేషన్‌తో కాని, పచ్చిపులుసుతో కానీ తింటుంటాం.

కొంచెం పెరుగుతో పల్ౘ్న చేసుకుని, ఇడ్లీ, దోశెల్లోకి తిన్నా ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.

(గమనికః శనగలను వేపితేనే, పుట్నాలు అవుతాయి. వేపినవి కద, పుట్నాలు వద్దు అనుకుంటే, శనగపప్పును నానబెట్టి, పుట్నాలకు బదులుగా వాడుకోవచ్చు)

రచన: శ్రీమతి పద్మావతి కొలను

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లిగడ్డ పచ్చడి

చాలా సింపుల్ వంటకం.

ఉల్లిగడ్డ కారం లేదా ఉల్లిగడ్డ పచ్చడి

రెండు ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిపాయ (వెల్లుల్లి). కొంచెం జీలకర్ర, ఎండుకారంతో చేస్తే, ఇది ఉల్లిగడ్డ కారం అయితది.

ముందుగా ఉల్లిగడ్డలను పొట్టు తీసి ముక్కలుగా కోసి, అందులో పొట్టు తీసిన ఎల్లిపాయలను వేసి, తగినంత కారం, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. ఎండు కారానికి బదులుగా, పచ్చిమిర్చి కూడా వాడవచ్చు. అవసరమైన వారు పోపు పెట్టుకోవచ్చు. పోపు లేకపోయినా రుచికరంగానే ఉంటుంది.
ఒంట్లో నలతగా ఉన్నప్పుడు, ఏది తినాలని అనిపియ్యనప్పుడు, ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటది. ఇంట్లో కూరగాయ లేనప్పుడు, రెండు నిమిషాల్లో అయిపోతుంది. పచ్చి నూనె కలుపుకొని తిన్నా బాగుంటుంది.
ఈ కారాన్ని పేలాలలో, సలాడ్లలో, అన్నంలో, రొట్టెల్లో, దేంట్లో అయినా కలిపి తినొచ్చు. అన్నిటిలోకి కలిసిపోతుంది.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడి పిందెల పచ్చడి

మామిడి పిందెలను కొన్నిటిని, నీళ్లలో వేసి కొద్దిగా నాననిచ్చి, పిందెల మీద గట్టిపడి ఉన్న సొనను కడగాలి.
కడిగిన మామిడి పిందెలను శుభ్రంగా గుడ్డతో తుడవాలి.

ఏ మాత్రం తేమ లేకుండా, నీడకు ఆరబెట్టాలి. నీటి తేమ ఉంటే, పచ్చడి నిల్వ ఉండదు, బూజు పడుతుంది.

ఉప్పు తగినంత లేకపోయినా, నిల్వ పచ్చడి బూజు పడుతుంది.

పిందెలను కత్తితో నాలుగు ముక్కలు కోసుకోవాలి. ముక్కల్లో ఉన్న జీడిని తీసెయ్యాలి. అప్పటికి ఇంకా పిందెల్లో పిక్క గట్టి పడదు. పిక్క పొయ్యని పిందెలను, మామిడి రోటి పచ్చడి చేసుకోవచ్చు. లేదా ముదిరితే, కండను కోసుకుని, పిక్కను జీడిని తీసేసి, పచ్చడి చేసుకోవచ్చు.

మనకు లభించిన మామిడి పిందెలను బట్టి చేసుకోవాలి. మార్కెట్లో కూడా దొరుకుతాయి.

ఒక రకం మామిడి మొక్కలు, సంవత్సరం పొడవునా పూత పిందె వచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని మిద్దెతోట, పెరటితోట సేద్యంలో చక్కగా పెంచుకోవచ్చు. (మామిడి జీడిని కూడా ఎండబెట్టి పొడి చేసుకొని వాడుతారు అని, నేలకొండపల్లి ప్రకృతి వైద్యుడు ఒకరు చెప్పారు)

జీడి తీసిన మామిడి పిందె ముక్కలకు తగినంత ఉప్పు, కారం, ఆవపొడి, కొద్దిగా మెంతిపొడిని కలపాలి.

తగినన్ని వెల్లుల్లి పాయలను, జీలకర్రను కూడా మెత్తగా నూరి ముక్కల్లో కలపాలి. ఇక్కడి వరకు, ఇది మామిడి బద్దల పచ్చడి పద్ధతి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసి మెత్తగా నూరి, కొద్దిగా గానుగ నూనె పోసుకుని, సీసాలోకి ఎత్తుకోవాలి.

బయట వాతావరణంలో కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది.
పచ్చడి బూజు పట్టింది అంటే, ఉప్పు తక్కువ అవడం వలన కానీ, తడి తగలడం వలన కానీ అవుతుంది. జాడి లేదా సీసా నుండి నిల్వ పచ్చడిని స్పూన్‌తో తీసేటప్పుడు, మన చేతి వ్రేళ్లకు కూడా ఏ మాత్రం తేమ ఉండకూడదు.

వేడివేడి అన్నం మీద, మామిడి పిందెల రోటి పచ్చడి వేసుకొని, కాస్తా గానుగ నూనె లేదా నెయ్యి వేసి తింటే, ఆవ ఘాటుతో ఎంతో రుచికరంగా ఉంటుంది.

ఇందులోని దినుసుల్లో ఎవరి అభిరుచి ప్రకారం వారు, స్వల్ప మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉప్పు మాత్రం తగినంత ఉండాలి. వంటలకు కొత్తవారు కూడా ట్రై చెయ్యవచ్చు. మొదట ఉప్పు తక్కువగా వేసి, రుబ్బిన తరువాత రుచి చూసుకుని, అవసరం ఉంటే, మరింత కలుపుకోవాలి.

మామిడి పిందెలతో వేపని, ఉడికించని, నిల్వ రోటి ‘పచ్చి పచ్చడి’ తయ్యారు!

మామిడి పిందెలు కుటుంబం అవసరాలకు మించి, చెట్ల నుండి రాలుతున్నప్పుడు, ఇలా నిల్వ పచ్చడి పెట్టి అమ్మవచ్చు.

రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More