పెసర పప్పు పొడి తయారీకి కావలసిన పదార్థాలు:

  • చిన్న కప్పు పెసరపప్పు * పదిహేను ఎండుమిర్చి
  • రాళ్ళుప్పు సరిపడా * ఒక స్పూన్ జీలకర్ర
  • ఒక స్పూను నిండుగా ఇంగువ.

ముందుగా పెసరపప్పుని ఒక పళ్ళెంలో పోసుకొని బాగా కటకటలాడేట్లు ఎండపెట్టుకోవాలి.
తర్వాత ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఇంగువ అన్నీ కలిపి మిక్సీ వెసుకోవటమే.
అంతే. ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఈ పొడి వేడివేడి అన్నంలో ఆవు నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

పూర్వం తిరగలిలో వేసి విసిరేవాళ్ళు.

రోటిలో రుబ్బిన పచ్చడికి, తిరగలిలో విసిరే పొడులకి రుచి ఎక్కువ.

రచన: శ్రీమతి కొలను పద్మావతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి