వండని వంట… ఆరోగ్యకరమైన చాక్లెట్

కావాల్సిన పదార్థాలు

  • కోకో పౌడర్ (తీపి లేనిది) – అరకప్పు
  • తినే కొబ్బరి నూనె – అర కప్పు
  • పొడి బెల్లం – అర కప్పు
  • జీడి పప్పు పలుకులు – 1½ టేబుల్ స్పూను
  • ఎండు ద్రాక్ష పలుకులు – 1 ½ టేబుల్ స్పూన్

తయారుచేయు విధానం: కోకో పౌడర్, బెల్లం పొడి మరియు కొబ్బరి నూనెను బ్లెండర్ లేదా మిక్సీజార్‌లో వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి జీడి పప్పు మరియు ఎండు ద్రాక్ష పలుకులు వేసి, చాక్లెట్ మౌల్డ్‌లో పోసి రెండు గంటల పాటు ఫ్రిడ్ౙ్‌లో పెట్టాలి.

గమనికః కొబ్బరి నూనె వద్దు అనుకున్నవారు ఉప్పు లేని వెన్నను కరగబెట్టి వాడుకోవచ్చు. జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష బదులుగా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్ వాడుకోవచ్చు.

రచన: విజయలక్ష్మి గిరినాథం, బెంగళూరు, కర్నాటక

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట…. సొరకాయ తాండ్ర

కావాల్సిన పదార్థాలు

  • సొరకాయ * బెల్లం
  • ఎండు ద్రాక్ష * జీడిపప్పు
    (ఆసక్తిని బట్టి ఎన్ని రకాల ఎండు పండ్ల ముక్కలనైనా కలుపుకోవచ్చు)

తయారుచేయు విధానం: సొరకాయను నీళ్లతో శుభ్రం చేసి, ఆరనిచ్చి, ముక్కలుగా కోసుకుని, గింజలు తీసివేసి, చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తగా నూరి, గుజ్జును శుభ్రమైన గుడ్డలో వేసి గట్టిగా పిండి, నీటిని వేరు చెయ్యాలి. ఎంతగా నీటిని పిండేస్తే, గుజ్జు అంత త్వరగా ఎండుతుంది.

సొరకాయ గుజ్జుకు సమానంగా బెల్లం తురుమును కలుపుకుని, మళ్ళీ మిక్సీలో వేసి కాస్తా తిప్పాలి. సొరకాయ బెల్లం గుజ్జును, వెడల్పాటి స్టీల్ ప్లేట్లో పలుచగా పరిచి ఎండబెట్టాలి. కొంత గట్టిపడిన తరువాత, కావాల్సిన ఆకారాలలో, పలుచగా, బిళ్లలుగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న బిళ్లలకు ఎండు ద్రాక్ష, జీడిపప్పు బద్దలను అద్దుకోవాలి. బిళ్లల మీద అలా అద్దడం వల్ల, ఆకర్షణీయంగా పిల్లలకు కనపడతాయి, రుచి, పోషకాలు కూడా పెరుగుతాయి.

సొర తాండ్రలో స్ధూల సూక్ష్మ పోషకాలు ఎన్నో ఉన్నాయి. బయటి వాతావరణంలో కూడా నెలల పాటు నిల్వ ఉంటాయి! పిల్లలు, వృద్దులు, ఏ వయసు వారైనా సరే, రోజుకు ఒక సొర తాండ్ర బిళ్ల తినవచ్చు. సొరకాయ తాండ్రను ఎండబెట్టేటప్పుడు, చీమలు పట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. (సొరకాయ నీళ్లను తాగవచ్చు, పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు)


జామ పండ్లు ఎక్కువ ఉత్పత్తి వచ్చినప్పుడు కూడా జామ తాండ్రను తయారు చేసుకోవచ్చు. కాకపోతే జామగుజ్జు నుంచి గింజలను వేరు చేసుకోవాలి.

జామ గుజ్జును జల్లెడలో వేసి చేత్తో రాస్తూ ఉంటే, గుజ్ౙు కిందికి జారి, గింజలు జాలి పైన మిగులుతాయి, గింజలను పారెయ్యాలి. మిగతా ప్రాసెస్ సేమ్ సేమ్.

రచన : తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… వంకాయ నిల్వ పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • ముదిరిన వంకాయలు – అర కిలో
  • చింతపండు – 150 గ్రా.
  • కారం పొడి – 150 గ్రా.
  • రాళ్ళ ఉప్పు – 150 గ్రా.
  • అవ పొడి – నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు
  • మెంతి పొడి – ఒక టీ స్పూన్
  • ఎల్లిపాయ రెబ్బలు కొన్ని
  • పసుపు కొంచెం మరియు ఇంగువ కొంచెం

తయారుచేయు విధానం:
వంకాయలు మాములు సైజ్ ముక్కలుగా చేసుకోవాలి. దానిలోకి ఉప్పు, చింతపండు మరియు పసుపు చెప్పిన మోతాదులో కలిపి ఒక్క రోజు ఊర పెట్టుకోవాలి.

మరుసటి రోజు దానిని నుండి చింత పండుని వేరు చేసి, చింత పండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తరువాత చింతపండు గుజ్ౙును, వంకాయ ముక్కలు, కారంపొడి, ఆవపొడి, మెంతిపొడి, ఇంగువ అన్ని బాగా కలపాలి

(గమనికః చింతపండుకు బదులుగా నిమ్మ రసం కూడా కలుపుకోవచ్చు, పండిన వంకాయలతో కూడా ఇలాగే నిల్వ పచ్చడి చెయ్యవచ్చు)

ఎల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోవచ్చు లేదా అలాగే రెబ్బలుగా అయినా వేసుకోవచ్చు. వంకాయ పచ్చడి రెడీ.
కావాలి అనుకుంటే కొంచెం గానుగ నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె పచ్చివి కలుపుకోవచ్చు. (వండని వంటలు కనుక, పచ్చి నూనె బాగానే ఉంటుంది, తాలింపు అవసరం లేదు)

వేడి అన్నంలో అయినా, సద్దన్నంలో అయినా వంకాయ పచ్చడి వేసుకొని తినవచ్చు.

  • రచన: ఆర్. నిర్మల, ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట…. చల్ల మిరపకాయలు

కావాల్సిన పదార్థాలు

  • 1 కిలో పచ్చి మిరపకాయలు
  • 200 గ్రాముల ఉప్పు
  • సరిపడినంత చిక్కటి పుల్లటి మజ్జిగ
  • 1 నిమ్మకాయ రసం

తయారుచేయు విధానం: మరీ కారంగా, మరీ చప్పగా కాకుండా, మోస్తరు కారంగా ఉన్న మిరపకాయలు, సైజు కూడా మధ్యస్థంగా ఉన్నవి ఎంచుకోవాలి.

మిరపకాయలను మధ్యకు సన్నగా చీల్చి, ఒక గిన్నెలో వేసుకోవాలి. వాటి పైన ఉప్పు వేసుకొని కలియ తిప్పి, మిరపకాయలు, మునిగే వరకు మజ్జిగ పోసి కలిపి, పైన ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి.

ఒక రోజు మొత్తం 24 గంటలు నాననిచ్చి, తరువాత ఎండకు ఎండపెట్టాలి. తిరిగి రాత్రికి మళ్ళీ మిగిలి ఉన్న మజ్ౙిగలో నానపెట్టాలి. ఇలా మజ్జిగ అయిపోయే వరకు చెయ్యాలి.

ఒకసారి ఎండ పెట్టి తిరిగి మజ్జిగలో వేసి కలిపేటప్పుడు కొంచెం నిదానంగా మిరపకాయలు విరగకుండా కలపాలి. ఎండకు బాగా ఎండిన తరువాత, గాలి చొరని డబ్బాలో నిలువ చేసుకోవాలి.

ఈ ఎండిన చల్లమిరపకాయలను మధ్య మధ్య ఎండపెడుతూ ఉంటే, చెడిపోకుండా, మెత్త పడకుండా, రెండు సంవత్సరాల వరకు నిలువ ఉంటాయి.

మాములుగా అయితే చల్ల మిరపకాయలు నూనెలో వేయించి, అన్నానికి అంచుకు పెట్టుకొని తింటారు. నూనెలో వేయించకుండా కూడా తినొచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా బాగుంటాయి.

రచనః అందుకూరి గిరిజ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ జ్యూస్

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు – మనకు అవసరమైనన్ని
  • నిమ్మ రసం – రుచికి సరిపడా
  • మజ్జిగ – కొంచెం (కావాలంటే వేసుకోవచ్చు)
  • అల్లం-చిన్న ముక్క

తయారుచేయు విధానం: ఒక గ్లాసు జ్యూస్‌కు పెద్ద కప్పు ముక్కలు సరిపోతాయి. గుమ్మడికాయను దాని పైనున్న బూడిద పోయేలాగా బాగా కడగాలి. తర్వాత మనకు కావలసినన్ని ముక్కలు కోసుకోవాలి. కాయ పైనున్న చెక్కు, లోపల గింజలు తీయనవసరం లేదు. అన్ని వేసుకోవచ్చు. దీనిలో చిన్న గ్లాసు మజ్జిగ కానీ, నాలుగు స్పూన్ల పెరుగు కానీ వేసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వద్దనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. గుమ్మడికాయలోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అల్లం చిన్నముక్క తీసుకుని కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో కానీ జ్యూసర్‌లో కానీ వేసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. జ్యూస్ తయారయిన తర్వాత మిక్సీలో వేసుకున్న జ్యూస్‌ను వడకట్టుకోవాలి. జ్యూసర్‌లో అయితే వడగట్టనవసరం లేదు. దీనిలో నిమ్మరసం రుచికి తగినంత కలపాలి.

ఇప్పుడు కొంతమంది జ్యూస్ షాపుల వారు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తున్నారు.
  • రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… చింతపండు తొక్కు

కావాల్సిన పదార్థాలు

  • చింతపండు
  • కారంపొడి
  • ఉప్పు
  • పచ్చి ధనియాలు
  • జీలకర్ర
  • కరివేపాకు
  • కొత్తిమీర
  • ఉల్లిగడ్డ
  • వెల్లుల్లిపాయలు కొన్ని
  • నువ్వుల నూనె

తయారు చేసే విధానం: ముందుగా చింతపండును శుభ్రంగా కడిగి నీరు పోసి నాన పెట్టుకోవాలి. చింతపండు మంచిగా నానిన తర్వాత మొదలు వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, తగినంత ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టాలి. ఆ తర్వాతకి నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ చేర్చి ఒక రౌండ్ తిప్పుకుంటే ఉల్లిగడ్డ బాగా మెత్తగా కాకుండా ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నువ్వుల నూనె కలుపుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది.

రచన : ఇమ్మిడిశెట్టి ప్రభాకరరావు, హన్మకొండ, తెలంగాణ.

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… ఉసిరి పచ్చడి

తయారుచేయు విధానం
ఉసిరికాయలను కడిగి, తేమ లేకుండా ఆరబెట్టి, రోట్లో ఒక్కొక్కటి దంచుకుంటూ దానిలోని గింజలను తీసివేయాలి. ఇప్పుడు ఆ ముక్కలను చిన్న జార్లో వేసుకొని దానిలోనే కారప్పొడి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలను వేసుకొని, కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాతకి కొత్తిమీర, నువ్వుల నూనె కలుపుకొని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినవచ్చు.

కావాల్సిన పదార్థాలు

  • ఉసిరికాయలు – కొన్ని
  • కారంపొడి – సరిపడునంత
  • ఉప్పు – తగిన మోతాదులో
  • జీలకర్ర – పావు టీ స్పూన్
  • ధనియాలు – పావు టీ స్పూన్
  • వెల్లుల్లిపాయలు – ఐదారు
  • నువ్వుల నూనె – కొద్దిగా
  • తరిగిన కొత్తిమీర – కొద్దిగా

రచన: సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… వాము కారం

కావాల్సిన పదార్థాలు

  • వాము – ఒక టీ స్పూను (ఇసుక, మట్టి లేకుండా చూసుకోవాలి)
  • రాళ్ళ ఉప్పు – తగినంత
  • పచ్చిమిర్చి – అరకప్పు

తయారుచేయు విధానం:
వాము కారంలో పచ్చిమిర్చిఎక్కువ ఉండాలి. వాము తక్కువ ఉండాలి. ఎందుకంటే వాము ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనిని తక్కువగా వేసుకోవాలి.

వాము కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో వాము పొడిని బాగా కలిపి ఒక ప్లేట్‌లో ఈ వాము పొడిని పలుచగా పరిచి బాగా ఎండబెట్టుకోవాలి. ఏమాత్రం తేమ ఉండకూడదు. అంటే ఆ మిశ్రమం బాగా క్రిస్పీగా ఎండాలి. అప్పుడు గాజు సీసాలో పోసి నిలువ చేసుకోవాలి. స్టీలు డబ్బాలో పోయకూడదు. ఎందుకంటే ఉప్పు ఉంటుంది కాబట్టి. ఎండిన పొడిని అలాగే అన్నంలోకి, టిఫిన్స్‌లోకి వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.

  • లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బీట్రూట్ లడ్డు

కావాల్సిన పదార్థాలు

  • బీట్రూట్ ముక్కలు – పావు కేజీ
  • బెల్లం – తురుము 50 గ్రాములు,
  • తేనె – కొద్దిగా
  • ఇలాచి పౌడర్ – కొద్దిగా
  • బాదం, కిస్మిస్, జీడిపప్పు ముక్కలు – 50 గ్రాములు
  • పల్లీలు – 50 గ్రాములు,
  • నువ్వులు – 50 గ్రాములు.

తయారుచేయు విధానం:
ముందుగా పల్లీలు, నువ్వులు, బెల్లం కలిపి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుని పక్కుకు పెట్టుకోవాలి. అదే జార్‌లో ముందుగా చెక్కు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని పల్చటి క్లాత్‌తో గట్టిగా పిండాలి. ఆ జ్యూస్‌ని బీట్రూట్ జ్యూస్‌గా వాడుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఆ ముద్దకి పైన పేర్కొన్న పల్లీలు నువ్వుల బెల్లం పొడిని మరియు కొద్దిగా ఇలాచీ పొడిని చిన్నచిన్నగా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు బాదం ముక్కలను కలిపి అవసరాన్ని బట్టి తేనెను కలుపుతూ గుండ్రటి లడ్డూలు కట్టుకోవాలి.

ఇవి ఏరోజుకారోజు చేసుకుని తింటే బాగుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్లకు, పార్టీలకు అప్పటికప్పుడు పిల్లలకి రుచికరమైన, బలవర్ధకరమైన ఆహారంగా చేసి ఇవ్వవచ్చు.

ఒకేరోజు మనము బీట్రూట్ లడ్డూలను, బీట్రూట్ జ్యూస్‌ను తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు.

బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగే అలవాటు ఉన్నవాళ్లు చాలా నీటిని పోసి పిప్పి కదా అని దాన్ని వ్యర్థం చేస్తుంటారు. కాకపోతే తక్కువ నీటిని ఉపయోగించి క్యారెట్, బీట్‌రూట్ లడ్డూలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు.

  • సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… పంచ కజ్జాయం

చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో వాడే ఎండుకొబ్బరి పొడి కోసం ఎండుకొబ్బరి చిప్పను తురిమి తయారుచేసేవారు. ఇప్పుడు ఇంకా సులభంగా చేసుకోవాలంటే ఎండుకొబ్బరి పొడి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి దానితో కూడా చేసుకోవచ్చు.

తయారుచేయు విధానం: అన్ని ఒక బౌల్‌లో ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. పంచ కజ్ౙాయం తయారవుతుంది.

కావాల్సిన పదార్థాలు

  • ఎండుకొబ్బరి తురుము లేదా పొడి – కావలసినంత.
  • చక్కెర – రుచికి తగినంత (నేను బ్రౌన్ షుగర్ వేసుకున్నాను. బెల్లం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది)
  • డ్రైఫ్రూట్స్-జీడిపప్పు, బాదం పప్పు వేశాను. (ఎన్ని రకాలు కావాలన్నా వేసుకోవచ్చు.)
  • యాలకుల పొడి – పదార్ధానికి తగినంత.
  • పచ్ౘ్కర్పూరం – చాలా చాలా కొంచెం.

రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్ : 9676797777 కు సంప్రదించండి.

Read More