ముందుగా పచ్చి కొబ్బరితో పొడి తయారు చేసుకోవాలి.. ఎలా అంటే, ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ముక్కలుగా చేసుకుని కొబ్బరికి వెనక వున్న నల్లని పెంకు బాగాన్ని తీసెయ్యాలి.

ఆ తర్వాత మంచి నీళ్లతో కడిగి ఒక పొడి బట్ట మీద పూర్తిగా నీరు పోయేదాకా ఆరబెట్టాలి.. ఆ తర్వాత మిక్సిలో పౌడర్ చేసుకోవాలి. (ముక్కలో ఏమైనా తడి వుంటే కొబ్బరి పొడికి బదులుగా పచ్చడిలా తయారు అవుతుంది. అందుకే కొబ్బరి పూర్తిగా ఆరిపోయేలా జాగ్రత్త తీసుకోవాలి)

అర కప్పు కొబ్బరిపొడి, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కండెన్సెడ్ మిల్క్… మూడు వేసి చక్కగా, పూర్తిగా కలిసేటట్లు కలుపుకోవాలి.

ఆ తరువాత కొంచెం గోడు వున్న పళ్లెంలో కొంచెం పల్చగా కొబ్బరి పొడి చల్లుకోవాలి. ఈ కలుపుకున్న పిండి వేసి మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాదాం, పిస్తా ముక్కలతో కొద్దిగా అలంకరణ చేసుకుంటే కొబ్బరి బర్ఫి రెడీ.

రచనః లీలాకుమారి ఏలూరి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
…………………………………………………………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.