వండని వంట… నువ్వుల కారం పిండి

కావాల్సిన పదార్థాలు

  • తెల్లనువ్వులు
  • జీలకర్ర – కొంచెం
  • ఎండుమిర్చి – సరిపడా
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
తెల్ల నువ్వులు శుభ్రం చేసుకుని, ఎండలో పెట్టి, కొంచం సేపు ఎండగానే, తెచ్చి పక్కన పెట్టుకోవాలి, (ఎక్కువ సేపు ఎండలో పెడితే నూనె వస్తుంది) నువ్వులతోపాటు మిర్చి, జీలకర్ర కూడా ఎండబెట్టుకోవాలి. తరువాత అన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ పట్టకూడదు.. నూనె వస్తుంది… అలానే రోట్లో దంచుకోవచ్చు కూడా.. తరువాత ఉప్పు కలిపి వాడుకోవడమే… నువ్వుల కారపు పిండిని నేరుగా అన్నంలో వేసుకుని, పచ్చి నూనె వేసుకొని తినవచ్చు. లేదా కూరలు, పులుసులో కూడా కలిపి వాడుకోవచ్చు.

రచన: సంధ్య శశికాంత్, వాకలపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… ఆరోగ్యకరమైన చాక్లెట్

కావాల్సిన పదార్థాలు

  • కోకో పౌడర్ (తీపి లేనిది) – అరకప్పు
  • తినే కొబ్బరి నూనె – అర కప్పు
  • పొడి బెల్లం – అర కప్పు
  • జీడి పప్పు పలుకులు – 1½ టేబుల్ స్పూను
  • ఎండు ద్రాక్ష పలుకులు – 1 ½ టేబుల్ స్పూన్

తయారుచేయు విధానం: కోకో పౌడర్, బెల్లం పొడి మరియు కొబ్బరి నూనెను బ్లెండర్ లేదా మిక్సీజార్‌లో వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి జీడి పప్పు మరియు ఎండు ద్రాక్ష పలుకులు వేసి, చాక్లెట్ మౌల్డ్‌లో పోసి రెండు గంటల పాటు ఫ్రిడ్ౙ్‌లో పెట్టాలి.

గమనికః కొబ్బరి నూనె వద్దు అనుకున్నవారు ఉప్పు లేని వెన్నను కరగబెట్టి వాడుకోవచ్చు. జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష బదులుగా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్ వాడుకోవచ్చు.

రచన: విజయలక్ష్మి గిరినాథం, బెంగళూరు, కర్నాటక

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ జ్యూస్

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు – మనకు అవసరమైనన్ని
  • నిమ్మ రసం – రుచికి సరిపడా
  • మజ్జిగ – కొంచెం (కావాలంటే వేసుకోవచ్చు)
  • అల్లం-చిన్న ముక్క

తయారుచేయు విధానం: ఒక గ్లాసు జ్యూస్‌కు పెద్ద కప్పు ముక్కలు సరిపోతాయి. గుమ్మడికాయను దాని పైనున్న బూడిద పోయేలాగా బాగా కడగాలి. తర్వాత మనకు కావలసినన్ని ముక్కలు కోసుకోవాలి. కాయ పైనున్న చెక్కు, లోపల గింజలు తీయనవసరం లేదు. అన్ని వేసుకోవచ్చు. దీనిలో చిన్న గ్లాసు మజ్జిగ కానీ, నాలుగు స్పూన్ల పెరుగు కానీ వేసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వద్దనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. గుమ్మడికాయలోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అల్లం చిన్నముక్క తీసుకుని కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో కానీ జ్యూసర్‌లో కానీ వేసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. జ్యూస్ తయారయిన తర్వాత మిక్సీలో వేసుకున్న జ్యూస్‌ను వడకట్టుకోవాలి. జ్యూసర్‌లో అయితే వడగట్టనవసరం లేదు. దీనిలో నిమ్మరసం రుచికి తగినంత కలపాలి.

ఇప్పుడు కొంతమంది జ్యూస్ షాపుల వారు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తున్నారు.
  • రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… ఉసిరి పచ్చడి

తయారుచేయు విధానం
ఉసిరికాయలను కడిగి, తేమ లేకుండా ఆరబెట్టి, రోట్లో ఒక్కొక్కటి దంచుకుంటూ దానిలోని గింజలను తీసివేయాలి. ఇప్పుడు ఆ ముక్కలను చిన్న జార్లో వేసుకొని దానిలోనే కారప్పొడి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలను వేసుకొని, కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాతకి కొత్తిమీర, నువ్వుల నూనె కలుపుకొని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినవచ్చు.

కావాల్సిన పదార్థాలు

  • ఉసిరికాయలు – కొన్ని
  • కారంపొడి – సరిపడునంత
  • ఉప్పు – తగిన మోతాదులో
  • జీలకర్ర – పావు టీ స్పూన్
  • ధనియాలు – పావు టీ స్పూన్
  • వెల్లుల్లిపాయలు – ఐదారు
  • నువ్వుల నూనె – కొద్దిగా
  • తరిగిన కొత్తిమీర – కొద్దిగా

రచన: సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… వాము కారం

కావాల్సిన పదార్థాలు

  • వాము – ఒక టీ స్పూను (ఇసుక, మట్టి లేకుండా చూసుకోవాలి)
  • రాళ్ళ ఉప్పు – తగినంత
  • పచ్చిమిర్చి – అరకప్పు

తయారుచేయు విధానం:
వాము కారంలో పచ్చిమిర్చిఎక్కువ ఉండాలి. వాము తక్కువ ఉండాలి. ఎందుకంటే వాము ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనిని తక్కువగా వేసుకోవాలి.

వాము కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో వాము పొడిని బాగా కలిపి ఒక ప్లేట్‌లో ఈ వాము పొడిని పలుచగా పరిచి బాగా ఎండబెట్టుకోవాలి. ఏమాత్రం తేమ ఉండకూడదు. అంటే ఆ మిశ్రమం బాగా క్రిస్పీగా ఎండాలి. అప్పుడు గాజు సీసాలో పోసి నిలువ చేసుకోవాలి. స్టీలు డబ్బాలో పోయకూడదు. ఎందుకంటే ఉప్పు ఉంటుంది కాబట్టి. ఎండిన పొడిని అలాగే అన్నంలోకి, టిఫిన్స్‌లోకి వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.

  • లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బీట్రూట్ లడ్డు

కావాల్సిన పదార్థాలు

  • బీట్రూట్ ముక్కలు – పావు కేజీ
  • బెల్లం – తురుము 50 గ్రాములు,
  • తేనె – కొద్దిగా
  • ఇలాచి పౌడర్ – కొద్దిగా
  • బాదం, కిస్మిస్, జీడిపప్పు ముక్కలు – 50 గ్రాములు
  • పల్లీలు – 50 గ్రాములు,
  • నువ్వులు – 50 గ్రాములు.

తయారుచేయు విధానం:
ముందుగా పల్లీలు, నువ్వులు, బెల్లం కలిపి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుని పక్కుకు పెట్టుకోవాలి. అదే జార్‌లో ముందుగా చెక్కు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని పల్చటి క్లాత్‌తో గట్టిగా పిండాలి. ఆ జ్యూస్‌ని బీట్రూట్ జ్యూస్‌గా వాడుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఆ ముద్దకి పైన పేర్కొన్న పల్లీలు నువ్వుల బెల్లం పొడిని మరియు కొద్దిగా ఇలాచీ పొడిని చిన్నచిన్నగా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు బాదం ముక్కలను కలిపి అవసరాన్ని బట్టి తేనెను కలుపుతూ గుండ్రటి లడ్డూలు కట్టుకోవాలి.

ఇవి ఏరోజుకారోజు చేసుకుని తింటే బాగుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్లకు, పార్టీలకు అప్పటికప్పుడు పిల్లలకి రుచికరమైన, బలవర్ధకరమైన ఆహారంగా చేసి ఇవ్వవచ్చు.

ఒకేరోజు మనము బీట్రూట్ లడ్డూలను, బీట్రూట్ జ్యూస్‌ను తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు.

బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగే అలవాటు ఉన్నవాళ్లు చాలా నీటిని పోసి పిప్పి కదా అని దాన్ని వ్యర్థం చేస్తుంటారు. కాకపోతే తక్కువ నీటిని ఉపయోగించి క్యారెట్, బీట్‌రూట్ లడ్డూలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు.

  • సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… కొబ్బరి, వెల్లుల్లి పొడి

కావాల్సిన పదార్థాలు:

  • ఎండు కొబ్బరి – సగం చిప్ప
  • పుట్నాలు – కప్పుడు
  • వెల్లుల్లి రెబ్బలు – 7 రెబ్బలు
  • జీలకర్ర – చెంచాడు.
  • ఎండుమిర్చి – 5 లేక 6.
  • ఉప్పు – కొద్దిగా.

పై పదార్థాలన్నీ మిక్సీలో వేసి గిర్ర గిర్ర నాలుగు తిప్పులు తిప్పితే, కొబ్బరి వెల్లుల్లి పొడి రె’ఢీ’.
వేడి అన్నంలో ఈ కొబ్బరి వెల్లుల్లి పొడి నేతితో కలిపి తింటే, ఆహా… ఓహో… అనక తప్పదు.

  • శాంతాజీదత్, రామ్‌నగర్, హైదరాబాద్.

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… పుట్నాల లడ్డు

కావాల్సిన పదార్థాలు

  • పుట్నాలు – ఒక కప్పు
  • బెల్లం – ముప్పావు కప్పు
  • నెయ్యి – అర్ధపావు కప్పు
  • ఏలకులు – నాలుగు
  • జీడిపప్పు – నాలుగు

పుట్నాల లడ్డు / శనగ సున్ని లడ్డు (పాక్షికంగా వండని వంట)

తయారుచేయు విధానం: ఒక కప్పు పుట్నాలు, ముప్పావు కప్పు తరిగిన బెల్లం, 4 ఏలకులు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దికొద్దిగా కరిగిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టాలి. నెయ్యి తగ్గించి కొద్దిగా పాలు పోసుకోవచ్చు. పుట్నాల పిండి బదులుగా శనగపిండి వాడవచ్చు.

  • చలసాని రాజ్యలక్ష్మి , హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… క్యాబేజి, కీర పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • సన్నని క్యాబేజీ తురుము – 1 కప్పు
  • కీర తురుము – 1 కప్పు,
  • కమ్మని పెరుగు – 2 కప్పులు,
  • పచ్చిమిర్చి – 3 (మీ కారాన్ని బట్టి)
  • కొత్తిమీర తరుగు
  • జీలకర్ర పొడి
  • ఉప్పు

తయారుచేయు విధానం ముందుగా క్యాబేజీని బాగా సన్నగా బియ్యం గింజ సైజులో తురుము కోవాలి. తరువాత కీర కూడా సన్నగా తురుముకోవాలి.

3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఒకసారి పల్స్ మోడ్‌లో మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్‌లో పెరుగు తీసుకుని, దానిలో క్యాబేజి తురుము, కీర తురుము, పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమం, జీలకర్ర పొడి, సరిపోయినంత ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి.

దీన్ని రోటీల్లో తినొచ్చు. ఉత్తదే కప్పులో వేసుకుని పెరుగన్నం లాగా కూడా తినొచ్చు. బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు దీన్ని తరచుగా రోజు ఉదయం అల్పాహారం లాగా లేదా సాయంత్రం భోజనం బదులు తీసుకోవచ్చు.

  • దామ జ్యోతి, బాచుపల్లి, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… కాకరకాయ ఆవ పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • కాకరకాయలు – పావు కేజీ,
  • ఆవపిండి – మూడు టేబుల్ స్పూన్లు
  • కారం – సరిపడేంత
  • ఉప్పు – తగిన మోతాదులో
  • పసుపు చిటికెడు
  • మూడు కాయల నిమ్మరసం
  • అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టీ స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15
  • బెల్లం తురుము నాలుగు టీ స్పూన్లు
  • జిలకర, మెంతులు, ఆవాలు – కొద్దిగా
  • సరిపడునంత నువ్వుల నూనె

తయారుచేయు విధానం: కాకరకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని, ఇష్టమైన రీతిలో ముక్కలుగా కోసిపెట్టుకొని, వాటికి తగిన మోతాదులలో తమ తమ రుచులకు అనుగుణంగా కారం, ఆవపిండి, ఉప్పు, జీలకర్ర ఆవాల పొడి, మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు, బెల్లం తురుము, నువ్వుల నూనె, నిమ్మరసం చేర్చి చేతితో మంచిగా కలుపుకొని, పొడిగా ఉన్న గాజు సీసాలోకి తీసి పెట్టుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే అయిదారు నెలలు లేదా బయట పెట్టుకుంటే 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.

  • రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More