కావాల్సిన పదార్థాలు
- కాకరకాయలు – పావు కేజీ,
- ఆవపిండి – మూడు టేబుల్ స్పూన్లు
- కారం – సరిపడేంత
- ఉప్పు – తగిన మోతాదులో
- పసుపు చిటికెడు
- మూడు కాయల నిమ్మరసం
- అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టీ స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15
- బెల్లం తురుము నాలుగు టీ స్పూన్లు
- జిలకర, మెంతులు, ఆవాలు – కొద్దిగా
- సరిపడునంత నువ్వుల నూనె
తయారుచేయు విధానం: కాకరకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని, ఇష్టమైన రీతిలో ముక్కలుగా కోసిపెట్టుకొని, వాటికి తగిన మోతాదులలో తమ తమ రుచులకు అనుగుణంగా కారం, ఆవపిండి, ఉప్పు, జీలకర్ర ఆవాల పొడి, మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు, బెల్లం తురుము, నువ్వుల నూనె, నిమ్మరసం చేర్చి చేతితో మంచిగా కలుపుకొని, పొడిగా ఉన్న గాజు సీసాలోకి తీసి పెట్టుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే అయిదారు నెలలు లేదా బయట పెట్టుకుంటే 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.
- రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

