వండని వంట… వంకాయ నిల్వ పచ్చడి
కావాల్సిన పదార్థాలు
- ముదిరిన వంకాయలు – అర కిలో
- చింతపండు – 150 గ్రా.
- కారం పొడి – 150 గ్రా.
- రాళ్ళ ఉప్పు – 150 గ్రా.
- అవ పొడి – నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు
- మెంతి పొడి – ఒక టీ స్పూన్
- ఎల్లిపాయ రెబ్బలు కొన్ని
- పసుపు కొంచెం మరియు ఇంగువ కొంచెం
తయారుచేయు విధానం:
వంకాయలు మాములు సైజ్ ముక్కలుగా చేసుకోవాలి. దానిలోకి ఉప్పు, చింతపండు మరియు పసుపు చెప్పిన మోతాదులో కలిపి ఒక్క రోజు ఊర పెట్టుకోవాలి.
మరుసటి రోజు దానిని నుండి చింత పండుని వేరు చేసి, చింత పండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తరువాత చింతపండు గుజ్ౙును, వంకాయ ముక్కలు, కారంపొడి, ఆవపొడి, మెంతిపొడి, ఇంగువ అన్ని బాగా కలపాలి
(గమనికః చింతపండుకు బదులుగా నిమ్మ రసం కూడా కలుపుకోవచ్చు, పండిన వంకాయలతో కూడా ఇలాగే నిల్వ పచ్చడి చెయ్యవచ్చు)
ఎల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోవచ్చు లేదా అలాగే రెబ్బలుగా అయినా వేసుకోవచ్చు. వంకాయ పచ్చడి రెడీ.
కావాలి అనుకుంటే కొంచెం గానుగ నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె పచ్చివి కలుపుకోవచ్చు. (వండని వంటలు కనుక, పచ్చి నూనె బాగానే ఉంటుంది, తాలింపు అవసరం లేదు)
వేడి అన్నంలో అయినా, సద్దన్నంలో అయినా వంకాయ పచ్చడి వేసుకొని తినవచ్చు.
- రచన: ఆర్. నిర్మల, ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.



