సమస్య:
104° F జ్వరం, మెడ బిగిసి పోవటం, కండరాల వణుకు, మెడ ప్రక్కకు పడిపోయి, కర్రలా బిగుసుకుపోవటం
అపస్మారక స్థితి
పాలు త్రాగలేక పోవటం.
ఈ వ్యాధి వల్ల లేగ దూడలలో ఎక్కువ మరణాలు కలుగుతాయి.
కారణాలు:
పరాన్నజీవుల భారం దీనిని అధికం చేస్తుంది.
మెగ్నీషియం లోపం వున్న గ్రాసాలు మేపటం.
పశువైద్యుని సంప్రదించాలి.
ఈ వ్యాధినిTETANUS, ASCARIASIS, ACUTE LEAD POISONING, VITAMIN ‘A’ DEFICIENCY, MENINGITIS, POISONINGగా భ్రమించే అవకాశం వుంది.
పరిష్కారాలు :
- విశ్రాంతి ఇవ్వాలి. 2. పోషక విలువలు గల మేతలు మేపాలి.
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.
గృహవైద్యం:
- ఆవాలు నూరి గానీ చింతపండు పులుసు, పుట్టమన్ను ఉడికించి గానీ శరీరంపై పట్టు వేయాలి.
- కర్పూరతైలం 50 మి.లీ., కొబ్బరినూనె 100 మి.లీ., సబ్బు 5 గ్రా॥ కలిపి, నొప్పులపై మర్దన చేయాలి.
పెరటివైద్యం:
- నల్ల ఉమ్మెత్తాకు పసరు 200 మి.లీ., వస 10 గ్రా॥ కలిపి శరీరంపై రాయాలి.
- నల్లేరు 50 గ్రా॥, పసుపు 10 గ్రా॥, ఉప్పు 5 గ్రా॥ కలిపి దంచి, రోజుకు 2 సార్లు 5,10 రోజులు తినిపించాలి.
- ఇంగువ 1 గ్రా॥, వెల్లుల్లి 10 గ్రా॥, పసుపు 20 గ్రా॥, సన్నావాలు 10 గ్రా॥, తాటి బెల్లం 100 గ్రా॥ కలిపి మెత్తగా నూరి, రోజుకు 20 గ్రా॥ చొ॥న తినిపించాలి.
హోమియో:
- తలవాలేసినపుడు సిక్యుట విరోస 30 లేదా కూప్రం మెట్ 30 లేదా కాల్కేరియా కార్బ్ 30 ఏదైనా ఒక మందు, ఉదయం 10, సాయంత్రం 10 మాత్రలు చొ॥న వ్యాధి తగ్గేదాకా తినిపించాలి.
- అపస్మారకంలో ఉంటే బెల్లడోన 1M / అబ్సింథియం 200 / స్ట్రామోనియం 200 మందు మాత్రలు అరగంటకు ఒక మోతాదు చొప్పున 4 పర్యాయాలు తినిపించాలి.
- మాగ్ ఫాస్ 6ఒ రోజుకు 10 మాత్రలు వ్యాధి తగ్గే దాకా తినిపించాలి.
అల్లోపతి:
- నాలుక మీద ఉప్పు రుద్దాలి.
- మెగ్నీషియం సల్ఫేట్ (MAGNESIUM SULPHATE) 15 గ్రా॥ నీటిలో కలిపి 10 రోజులు త్రాగించాలి.
- టాక్సాల్ (TOXOL) ఇంజక్షను 3 మి.లీ. చొప్పున కండకు (I/M గా) 4 రోజులు చెయ్యాలి.
- మెకొబాల్ – 3 (MECOBOL-3) ఇంజక్షను 5 మి.లీ. కండకు (I/M గా) చేయించాలి.
- డెక్ట్స్రోజ్ సెలైన్ (DEXTROSE SALINE) + బెట్నిసాల్ (BETNESOL) 2 మి.లీ. రక్తంలోకి ఎక్కించాలి.
- మిఫెక్స్ (MIFEX) 125 మి.లీ. రక్తంలోకి (I/Vగా) ఎక్కించాలి.
……………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

