వండని వంట… కొబ్బరి, వెల్లుల్లి పొడి
కావాల్సిన పదార్థాలు:
- ఎండు కొబ్బరి – సగం చిప్ప
- పుట్నాలు – కప్పుడు
- వెల్లుల్లి రెబ్బలు – 7 రెబ్బలు
- జీలకర్ర – చెంచాడు.
- ఎండుమిర్చి – 5 లేక 6.
- ఉప్పు – కొద్దిగా.
పై పదార్థాలన్నీ మిక్సీలో వేసి గిర్ర గిర్ర నాలుగు తిప్పులు తిప్పితే, కొబ్బరి వెల్లుల్లి పొడి రె’ఢీ’.
వేడి అన్నంలో ఈ కొబ్బరి వెల్లుల్లి పొడి నేతితో కలిపి తింటే, ఆహా… ఓహో… అనక తప్పదు.
- శాంతాజీదత్, రామ్‌నగర్, హైదరాబాద్.
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.




