వండని వంట… పుట్నాల లడ్డు
కావాల్సిన పదార్థాలు
- పుట్నాలు – ఒక కప్పు
- బెల్లం – ముప్పావు కప్పు
- నెయ్యి – అర్ధపావు కప్పు
- ఏలకులు – నాలుగు
- జీడిపప్పు – నాలుగు
పుట్నాల లడ్డు / శనగ సున్ని లడ్డు (పాక్షికంగా వండని వంట)
తయారుచేయు విధానం: ఒక కప్పు పుట్నాలు, ముప్పావు కప్పు తరిగిన బెల్లం, 4 ఏలకులు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దికొద్దిగా కరిగిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టాలి. నెయ్యి తగ్గించి కొద్దిగా పాలు పోసుకోవచ్చు. పుట్నాల పిండి బదులుగా శనగపిండి వాడవచ్చు.
- చలసాని రాజ్యలక్ష్మి , హైదరాబాద్, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.


