పరిష్కారాలు:

  1. ఆవు ఈనటానికి 2 నెలల ముందుగా పాలు తీయటం మానేయాలి.
  2. అదేవిధంగా, దూడను కుడవనివ్వకూడదు.
  3. ఏడు నెలల పైబడిన చూడి ఆవును పాలు తీస్తే, తరువాత ఈతలో పాలు బాగా తగ్గిపోతాయి. కనుక దూడను పాలు మాన్పించాలి.
  4. అందుకు తల్లి పొదుగుకు కుంకుడు కాయ రసం గానీ, ముసాంబరం గానీ పుయ్యాలి.
  5. దూడకు పోషక విలువలు గల దాణా పెట్టాలి.
  6. ఉన్నట్లుండి ఒకేసారిగా పాలు మాన్పించకుండా, పాలు పిండే వేళలు మార్చి, మార్చి పాలు పిండాలి.

తల్లి చనిపోయిన దూడ పోషణ (Orphan Calf Rearing)

  • తల్లి చనిపోయిన దూడను కొత్తగా ఈనిన మరొక తల్లి దగ్గర అలవాటు చేయాలి
  • లేదా మరొక తల్లి పాలు పాల పీక ద్వారా దూడకు కుడిపించాలి
  • లేదా వయసు పెరిగిన తరువాత చిన్న శుభ్రమైన గిన్నెలో పాలు పోసి త్రాగేటట్లుగా అలవాటు చేయాలి.

……………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.