దూడకు పాలు మరిపించటం
పరిష్కారాలు:
- ఆవు ఈనటానికి 2 నెలల ముందుగా పాలు తీయటం మానేయాలి.
- అదేవిధంగా, దూడను కుడవనివ్వకూడదు.
- ఏడు నెలల పైబడిన చూడి ఆవును పాలు తీస్తే, తరువాత ఈతలో పాలు బాగా తగ్గిపోతాయి. కనుక దూడను పాలు మాన్పించాలి.
- అందుకు తల్లి పొదుగుకు కుంకుడు కాయ రసం గానీ, ముసాంబరం గానీ పుయ్యాలి.
- దూడకు పోషక విలువలు గల దాణా పెట్టాలి.
- ఉన్నట్లుండి ఒకేసారిగా పాలు మాన్పించకుండా, పాలు పిండే వేళలు మార్చి, మార్చి పాలు పిండాలి.

తల్లి చనిపోయిన దూడ పోషణ (Orphan Calf Rearing)
- తల్లి చనిపోయిన దూడను కొత్తగా ఈనిన మరొక తల్లి దగ్గర అలవాటు చేయాలి
- లేదా మరొక తల్లి పాలు పాల పీక ద్వారా దూడకు కుడిపించాలి
- లేదా వయసు పెరిగిన తరువాత చిన్న శుభ్రమైన గిన్నెలో పాలు పోసి త్రాగేటట్లుగా అలవాటు చేయాలి.
……………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

