సమస్య:
జ్వర తీవ్రత
దవడ బిగుసుకుపోవటం
విల్లు ఆకారంలో వంగి పోవటం
కండరాలు, కాళ్ళు బిగుసుకుపోవటం
బిగిసిన కాళ్ళు దూరంగా పెట్టి, బొమ్మలాగా నిలబడటం
వికృతంగా ముడుచుకుపోవటం
తలను లేపితే వణుకు పడటం.
వెలుతురు చూసి ఉలికి ఉలికి పడటం
ఈడ్పులు అన్ని అవయవాలకూ సోకటం
దూడను కదిలిస్తే చాలా కష్టంగా కదలటం
ప్రక్కకు గానీ వెనుకకు గానీ తిరగలేకపోవటం
వ్యాధి ముదిరిన కొద్దీ మెడ, నోరు బిగుసుకుపోవటం
ఆయాసం ఎక్కువై మరణించటం

కారణాలు:
CLOSTRIDIUM TETANI అనే బ్యాక్టీరియా.
పుట్టినపుడు బొడ్డుకు దుమ్ము, మట్టి, మురికి అంటుకోవటం.
దెబ్బలు తగలటం, ఇనుప వస్తువులు గుచ్చుకోవటం.
పుళ్ళ వల్ల గానీ, శస్త్ర చికిత్సల వల్ల గానీ, సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించటం.
శరీరంపై మిన్నల్లులు వుంటే కాకులు పొడుస్తాయి. అప్పుడు పుళ్ళు పడతాయి. వాటి వల్ల వ్యాధి కారక సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి.
దూడ పుట్టగానే ధనుర్వాతం రాకుండా టీకా ఇంజక్షను చేయించకపోవటం.

పశువైద్యుని సంప్రదించాలి. ఈ వ్యాధిని WHITE MUSCLE DISEASE, BLOAT, POISONING, GRASS TETANY, MENINGITIS, RABIES, STRYCHNINE POISONING, HYPOMAGNESEMIA గా భ్రమించే అవకాశం వుంది.

పరిష్కారాలు:

  1. గాయమైన వెంటనే పశువైద్యులను సంప్రదించి, ధనుర్వాతం రాకుండా టెట్‌వ్యాక్ ఇంజక్షను చేయించాలి.
  2. వెలుతురు, గాలి, శబ్దముల వల్ల ఉలికిపాటుతో ఉద్రేకంగా వుంటాయి. కనుక నిశ్శబ్ద వాతావరణంలో వుంచాలి.
  3. వ్యాధి సోకిన తర్వాత చికిత్స ప్రయోజనం వుండదు.

ఆయుర్వేదం:
క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.

గృహవైద్యం:

  1. శరీరానికి ఉప్పు కాపటం పెట్టాలి.
  2. నూకల జావ 10 గ్రా॥, ఒక కోడి గుడ్డు సొన, 50 గ్రా॥ గ్లూకోజు కలిపిన పాలు ఆరగారగా త్రాగించాలి.
  3. గంజి 1 లీటరు, పచ్చ కర్పూరం 1 గ్రా॥, ఇంగువ 1 గ్రా॥ కలిపి త్రాగించాలి.
  4. కోడి గుడ్డు తెల్ల సొన 100 మి.లీ. సున్నపు తేటలో కలిపి త్రాగించాలి.

పెరటివైద్యం:
పొగాకురసం 10 మి.లీ., నల్లేరు కాడ రసం 50 మి.లీ. కలిపి త్రాగించాలి

మూలికావైద్యం:

  1. పొంగించిన నవాసాగరం (టంకనభస్మం) 1 గ్రా॥, 100 మి.లీ. వేడి నీళ్ళలో కలిపి త్రాగించాలి.
  2. అడ్డ సరము ఆకులు గుప్పెడు, ఇంగువ 2 గ్రా॥, కురాసాని వాము 1 గ్రా॥, కామంచి ఆకు గుప్పెడు, జటామాంసి 2 గ్రా॥, టంకనభస్మం 2 గ్రా॥ నూరి, చిట్టాముదంలో కలిపి శరీరంపైన మర్దన చేయాలి.

హోమియో:

  1. దెబ్బ తగిలిన గాయాన్ని కాలెండుల Q/ ఎకినేషియ Qతో శుభ్రంగా కడగాలి.
  2. దూడలకు కండరాలు బిగుసుకుపోతే తగ్గడానికి, లెడం పాల్ + సిక్యుట విరోస 200 ఉదయం, సాయంత్రం 10 మాత్రలు చొ॥న తినిపించాలి.
  3. హైపరికం 30, లెడం పాల్ 30 ఒకదాని తర్వాత మరొకటి మారుస్తూ, 10 మాత్రలు చొ॥న 3-4 రోజులు తినిపించాలి.
  4. ఫిట్స్ వుంటే మాగ్ ఫాస్ 30 లేదా సిక్యుట విరోస 30 మాత్రలు రోజుకు 10 చొప్పున తినిపించాలి.
  5. దవడలు బిగుసుకుపోతే హైడ్రోసయనిక్ యాసిడ్ 200 మందు 10 మాత్రల చొప్పున రోజుకు 3 పర్యాయాలు తినిపించాలి.
  6. బొమ్మలాగా బిగుసుకుపోతే స్ట్రిక్నినం 200 మందు 10 మాత్రల చొప్పున రోజుకు 3 పర్యాయాలు తినిపించాలి.

అల్లోపతి:

  1. కోమాక్స్ వెట్ (COMAX VET) ఇంజక్షను 5 మి.లీ. చొ॥న కండకు (I/Mగా) చేయించాలి.
  2. సిక్విల్ (SIQUIL) ఇంజక్షను 1 మి.లీ. చొ॥న కండకు (I/Mగా) చేయించాలి.
  3. చికిత్స వలన ఫలితం తక్కువ.

జాగ్రత్తలు:

  1. దూడ పుట్టిన వెంటనే బొడ్డుకు టింక్చర్ అయొడిన్ (TR IODINE) రాయాలి.
  2. గాయాలను వెంటనే పొటాషియం పర్మాంగనేట్ (POTASSIUM PERMANGANATE) లోషన్‌తో కడగాలి.
  3. దూడ పుట్టిన వెంటనే టెట్‌వ్యాక్ (TETVAC) ఇంజక్షను చేయించాలి.
    ……………………………………………………………………………………
    రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.