పచ్చి మామిడికాయలు దొరికేటప్పుడు, వాటిని తురుముకొని నిలువ చేసుకోవడం ద్వారా, సంవత్సరం పాటు మనకు ఎప్పుడు అవసరమైనా అప్పుడు వాడుకోవడానికి అవకాశం ఉంటది.
‘మామిడికాయ పప్పు’ కూరలోకి, కొన్ని రకాల కూరగాయలలో కూడా మనం పచ్చి మామిడికాయ వాడుతుంటాం కదా? పచ్చి మామిడి కాయకు బదులుగా, ‘మామిడికాయ పులిహోర’కి, ‘మామిడికాయ చారు’కి రకరకాలుగా, మామిడి గుజ్జును వాడుకోవచ్చు.
తయారుచేసే విధానం: ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టాలి తడి లేకుండా. తర్వాత చెక్కు తీసి పారేసి, కాయ కండను సన్నగా తురుముకోవాలి. తురిమిన దాంట్లో ఉప్పు, పసుపు కలిపి గాజు బాటిల్లో పెట్టుకుంటే, సంవత్సరం ఉంటది.
మనకు పచ్చి మామిడికాయ అవసరం ఉన్న ప్రతి వంటలో దీన్నే వాడుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
- మామిడికాయ తురుము – ఒక కేజీ (కాయల వెయిట్ కాదు. కాయలను తురిమినాకనే. గుజ్జు బరువును తీసుకోవాలి)
- ఉప్పు – మామిడికాయ యొక్క పులుపును బట్టి 200 గ్రా. నుంచి 250 గ్రాములు.
- పసుపు – రెండు స్పూన్స్
- జిట్టా జ్యోతిరెడ్డి, రామకృష్ణాపురం, యాదగిరి భువనగిరి జిల్లా, తెలంగాణ
…………………………………………………………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

