వండని వంట… ఉసిరి పులుసు
కావాల్సిన పదార్థాలు
- ఉసిరి కాయలు కొన్ని (వీటిని ‘పప్పు ఉసిరి కాయలు’ అని పిలుస్తారు)
- ఉల్లిగడ్డ ఒకటి * కొత్తిమీర
- కరివేపాకు * కొద్దిగా ఉప్పు
- జీలకర్ర కొద్దిగా * ఒక పచ్చిమిర్చి
తయారుచేయు విధానం: ఉసిరికాయలు ఒక్కొక్కటిగా చిన్న రోట్లో దంచుకుని విత్తనాలను తీసివేయాలి. ఆ ముక్కలను చిన్న జారులో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచము నీటిని కలుపుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు గ్లాసుల నీరు కలుపుకొని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీలకర్రతో కలిపి దంచుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు కలుపుకోవాలి.
ఉసిరి పులుసు అన్నంలో పప్పు కర్రీతో కానీ, ఇతర ఫ్రై కూరగాయలతో కానీ కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చింతపండును ఉపయోగించే బదులుగా ఉసిరి ఎక్కువగా కాస్తున్న కాలంలో వీటిని ఉపయోగించుకుంటే బాగుంటుందని ఆలోచన.
రచనః ఇమ్మిడిశెట్టి ప్రభాకరరావు, హన్మకొండ, తెలంగాణ
……………………………………………………………………………………………………………………………………
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.


