వండని వంట… మామిడి గుజ్జు

పచ్చి మామిడికాయలు దొరికేటప్పుడు, వాటిని తురుముకొని నిలువ చేసుకోవడం ద్వారా, సంవత్సరం పాటు మనకు ఎప్పుడు అవసరమైనా అప్పుడు వాడుకోవడానికి అవకాశం ఉంటది.
‘మామిడికాయ పప్పు’ కూరలోకి, కొన్ని రకాల కూరగాయలలో కూడా మనం పచ్చి మామిడికాయ వాడుతుంటాం కదా? పచ్చి మామిడి కాయకు బదులుగా, ‘మామిడికాయ పులిహోర’కి, ‘మామిడికాయ చారు’కి రకరకాలుగా, మామిడి గుజ్జును వాడుకోవచ్చు.

తయారుచేసే విధానం: ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టాలి తడి లేకుండా. తర్వాత చెక్కు తీసి పారేసి, కాయ కండను సన్నగా తురుముకోవాలి. తురిమిన దాంట్లో ఉప్పు, పసుపు కలిపి గాజు బాటిల్‌లో పెట్టుకుంటే, సంవత్సరం ఉంటది.

మనకు పచ్చి మామిడికాయ అవసరం ఉన్న ప్రతి వంటలో దీన్నే వాడుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

  • మామిడికాయ తురుము – ఒక కేజీ (కాయల వెయిట్ కాదు. కాయలను తురిమినాకనే. గుజ్జు బరువును తీసుకోవాలి)
  • ఉప్పు – మామిడికాయ యొక్క పులుపును బట్టి 200 గ్రా. నుంచి 250 గ్రాములు.
  • పసుపు – రెండు స్పూన్స్
  • జిట్టా జ్యోతిరెడ్డి, రామకృష్ణాపురం, యాదగిరి భువనగిరి జిల్లా, తెలంగాణ
    …………………………………………………………………………………………………………………………………..
    రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… కొబ్బరి బర్ఫీ

ముందుగా పచ్చి కొబ్బరితో పొడి తయారు చేసుకోవాలి.. ఎలా అంటే, ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ముక్కలుగా చేసుకుని కొబ్బరికి వెనక వున్న నల్లని పెంకు బాగాన్ని తీసెయ్యాలి.

ఆ తర్వాత మంచి నీళ్లతో కడిగి ఒక పొడి బట్ట మీద పూర్తిగా నీరు పోయేదాకా ఆరబెట్టాలి.. ఆ తర్వాత మిక్సిలో పౌడర్ చేసుకోవాలి. (ముక్కలో ఏమైనా తడి వుంటే కొబ్బరి పొడికి బదులుగా పచ్చడిలా తయారు అవుతుంది. అందుకే కొబ్బరి పూర్తిగా ఆరిపోయేలా జాగ్రత్త తీసుకోవాలి)

అర కప్పు కొబ్బరిపొడి, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కండెన్సెడ్ మిల్క్… మూడు వేసి చక్కగా, పూర్తిగా కలిసేటట్లు కలుపుకోవాలి.

ఆ తరువాత కొంచెం గోడు వున్న పళ్లెంలో కొంచెం పల్చగా కొబ్బరి పొడి చల్లుకోవాలి. ఈ కలుపుకున్న పిండి వేసి మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాదాం, పిస్తా ముక్కలతో కొద్దిగా అలంకరణ చేసుకుంటే కొబ్బరి బర్ఫి రెడీ.

రచనః లీలాకుమారి ఏలూరి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
…………………………………………………………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More