వండని వంట… నువ్వుల కారం పిండి

కావాల్సిన పదార్థాలు

  • తెల్లనువ్వులు
  • జీలకర్ర – కొంచెం
  • ఎండుమిర్చి – సరిపడా
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
తెల్ల నువ్వులు శుభ్రం చేసుకుని, ఎండలో పెట్టి, కొంచం సేపు ఎండగానే, తెచ్చి పక్కన పెట్టుకోవాలి, (ఎక్కువ సేపు ఎండలో పెడితే నూనె వస్తుంది) నువ్వులతోపాటు మిర్చి, జీలకర్ర కూడా ఎండబెట్టుకోవాలి. తరువాత అన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ పట్టకూడదు.. నూనె వస్తుంది… అలానే రోట్లో దంచుకోవచ్చు కూడా.. తరువాత ఉప్పు కలిపి వాడుకోవడమే… నువ్వుల కారపు పిండిని నేరుగా అన్నంలో వేసుకుని, పచ్చి నూనె వేసుకొని తినవచ్చు. లేదా కూరలు, పులుసులో కూడా కలిపి వాడుకోవచ్చు.

రచన: సంధ్య శశికాంత్, వాకలపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట…. సొరకాయ తాండ్ర

కావాల్సిన పదార్థాలు

  • సొరకాయ * బెల్లం
  • ఎండు ద్రాక్ష * జీడిపప్పు
    (ఆసక్తిని బట్టి ఎన్ని రకాల ఎండు పండ్ల ముక్కలనైనా కలుపుకోవచ్చు)

తయారుచేయు విధానం: సొరకాయను నీళ్లతో శుభ్రం చేసి, ఆరనిచ్చి, ముక్కలుగా కోసుకుని, గింజలు తీసివేసి, చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తగా నూరి, గుజ్జును శుభ్రమైన గుడ్డలో వేసి గట్టిగా పిండి, నీటిని వేరు చెయ్యాలి. ఎంతగా నీటిని పిండేస్తే, గుజ్జు అంత త్వరగా ఎండుతుంది.

సొరకాయ గుజ్జుకు సమానంగా బెల్లం తురుమును కలుపుకుని, మళ్ళీ మిక్సీలో వేసి కాస్తా తిప్పాలి. సొరకాయ బెల్లం గుజ్జును, వెడల్పాటి స్టీల్ ప్లేట్లో పలుచగా పరిచి ఎండబెట్టాలి. కొంత గట్టిపడిన తరువాత, కావాల్సిన ఆకారాలలో, పలుచగా, బిళ్లలుగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న బిళ్లలకు ఎండు ద్రాక్ష, జీడిపప్పు బద్దలను అద్దుకోవాలి. బిళ్లల మీద అలా అద్దడం వల్ల, ఆకర్షణీయంగా పిల్లలకు కనపడతాయి, రుచి, పోషకాలు కూడా పెరుగుతాయి.

సొర తాండ్రలో స్ధూల సూక్ష్మ పోషకాలు ఎన్నో ఉన్నాయి. బయటి వాతావరణంలో కూడా నెలల పాటు నిల్వ ఉంటాయి! పిల్లలు, వృద్దులు, ఏ వయసు వారైనా సరే, రోజుకు ఒక సొర తాండ్ర బిళ్ల తినవచ్చు. సొరకాయ తాండ్రను ఎండబెట్టేటప్పుడు, చీమలు పట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. (సొరకాయ నీళ్లను తాగవచ్చు, పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు)


జామ పండ్లు ఎక్కువ ఉత్పత్తి వచ్చినప్పుడు కూడా జామ తాండ్రను తయారు చేసుకోవచ్చు. కాకపోతే జామగుజ్జు నుంచి గింజలను వేరు చేసుకోవాలి.

జామ గుజ్జును జల్లెడలో వేసి చేత్తో రాస్తూ ఉంటే, గుజ్ౙు కిందికి జారి, గింజలు జాలి పైన మిగులుతాయి, గింజలను పారెయ్యాలి. మిగతా ప్రాసెస్ సేమ్ సేమ్.

రచన : తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ జ్యూస్

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు – మనకు అవసరమైనన్ని
  • నిమ్మ రసం – రుచికి సరిపడా
  • మజ్జిగ – కొంచెం (కావాలంటే వేసుకోవచ్చు)
  • అల్లం-చిన్న ముక్క

తయారుచేయు విధానం: ఒక గ్లాసు జ్యూస్‌కు పెద్ద కప్పు ముక్కలు సరిపోతాయి. గుమ్మడికాయను దాని పైనున్న బూడిద పోయేలాగా బాగా కడగాలి. తర్వాత మనకు కావలసినన్ని ముక్కలు కోసుకోవాలి. కాయ పైనున్న చెక్కు, లోపల గింజలు తీయనవసరం లేదు. అన్ని వేసుకోవచ్చు. దీనిలో చిన్న గ్లాసు మజ్జిగ కానీ, నాలుగు స్పూన్ల పెరుగు కానీ వేసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వద్దనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. గుమ్మడికాయలోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అల్లం చిన్నముక్క తీసుకుని కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో కానీ జ్యూసర్‌లో కానీ వేసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. జ్యూస్ తయారయిన తర్వాత మిక్సీలో వేసుకున్న జ్యూస్‌ను వడకట్టుకోవాలి. జ్యూసర్‌లో అయితే వడగట్టనవసరం లేదు. దీనిలో నిమ్మరసం రుచికి తగినంత కలపాలి.

ఇప్పుడు కొంతమంది జ్యూస్ షాపుల వారు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తున్నారు.
  • రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా, లేదా తురుము కొద్దిగా
  • పెరుగు – సరిపడునంత
  • ఉప్పు – తగిన మోతాదులో
  • ఆవపిండి – అర చెంచా
  • రెండు పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
  • తరిగిన కొత్తిమీర – కొద్దిగా

తయారుచేసే విధానం
బూడిది గుమ్మడికాయ పైన ఉన్న మందపాటి తొక్కను చాకుతో తీసివేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా పెద్ద ముక్కను తురుముగా చేసుకొని అయినా పెరుగు పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు. పెరుగును చల్లకవ్వంతోనే చిల్కి ఈ తురుమును లేదా గ్రైండ్ చేసుకున్న ముద్దను పెరుగులో కలుపుకోవాలి. దానికి తగిన మోతాదు లోపల ఉప్పు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పౌడర్, కొంచెం ఆవపిండిని కలుపుకొని చల్లకవ్వంతోని చక్కగా చిలకాలి.
బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడిని అన్నంలోకి, చపాతీలోకి కూడా తినవచ్చు.

రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… క్యాబేజి, కీర పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • సన్నని క్యాబేజీ తురుము – 1 కప్పు
  • కీర తురుము – 1 కప్పు,
  • కమ్మని పెరుగు – 2 కప్పులు,
  • పచ్చిమిర్చి – 3 (మీ కారాన్ని బట్టి)
  • కొత్తిమీర తరుగు
  • జీలకర్ర పొడి
  • ఉప్పు

తయారుచేయు విధానం ముందుగా క్యాబేజీని బాగా సన్నగా బియ్యం గింజ సైజులో తురుము కోవాలి. తరువాత కీర కూడా సన్నగా తురుముకోవాలి.

3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఒకసారి పల్స్ మోడ్‌లో మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్‌లో పెరుగు తీసుకుని, దానిలో క్యాబేజి తురుము, కీర తురుము, పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమం, జీలకర్ర పొడి, సరిపోయినంత ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి.

దీన్ని రోటీల్లో తినొచ్చు. ఉత్తదే కప్పులో వేసుకుని పెరుగన్నం లాగా కూడా తినొచ్చు. బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు దీన్ని తరచుగా రోజు ఉదయం అల్పాహారం లాగా లేదా సాయంత్రం భోజనం బదులు తీసుకోవచ్చు.

  • దామ జ్యోతి, బాచుపల్లి, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బ్రకోలి ఆవ పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • బ్రకోలి ముక్కలు – పావు కేజీ.
  • ఆవపిండి – మూడు టేబుల్ స్పూన్లు.
  • జీలకర్ర, మెంతిపొడి – పావు టీ స్పూను
  • కారం, ఉప్పు తగిన మోతాదులో.
  • పసుపు – చిటికెడు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు.
  • వెల్లుల్లి రెబ్బలు 10 నుండి 15
  • మూడు నిమ్మకాయల రసం
  • నువ్వుల నూనె సరిపోయేంత

తయారు చేయు విధానం:
ముందుగా బ్రకోలీ కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని, ఒక అరగంట సేపు, తేమ లేకుండా ఆరనివ్వాలి. తేమ వల్ల బూజు పడుతుంది. ఆరిన ముక్కలకి మిగతా పదార్థాలు అన్నిటిని కలుపుకొని, పొడిగా ఉన్న గాజు సీసాలో కానీ, జాడీలో కానీ తీసి పెట్టుకోవాలి. నూనె, ఉప్పు సరిపడంత ఉండాలి. అప్పుడే ఏదైనా పచ్చడి బూజు పట్టకుండా ఉంటుంది. మూడు రోజుల తర్వాత వాడుకోవాలి. బయట నిల్వ ఉంటే, పది రోజుల వరకు ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెలరోజుల వరకు కూడా ముక్క మెత్తబడకుండా ఉంటుంది.

ఇమ్మిడిశెట్టి ప్రభాకరరావు, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

‘వండని వంటలు’ ఓ అద్భుతం‘వంద వండని వంటలు’ పుస్తకావిష్కరణలో పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఈరోజు హైదరాబాద్‌లోని వారి నివాసంలో ‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకాన్ని పూర్వ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించి… రచయిత, సంకలన కర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డిని అభినందించారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో బయటి ఆహారం మీద ఆధారపడకుండా, అప్పటికప్పుడు చేసుకుని తినేవిధంగా పలువురు అందించిన ఈ వండని వంటలు ఈతరానికి ఓ ఆరోగ్య దిక్సూచి. ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగించడమే గాక, సమయాన్ని ఆదాచేసే ఈ పుస్తకం ప్రత్యేకించి బ్రహ్మచారులకు, ఉద్యోగాలు చేసుకునే జంటలకు మరింత ప్రయోజనకారి కాగలదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం నేపథ్యంలో పలు పుస్తకాలను అందిస్తున్న ‘రైతునేస్తం’ వ్యవస్థాపకులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి చొరవ ఇదే విధంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పద్మశ్రీ డా॥ యడ్లపల్లి వేంకటేశ్వర రావు, రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, ‘మిసిమి’ పత్రిక సంపాదకులు అశ్వినీ కుమార్, వలేటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777 కు సంప్రదించండి.

Read More

వండని వంట… పచ్చి కొబ్బరి కూర, కోసంబరి

  1. పచ్చి కొబ్బరి తురుముతో కూర !

కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు (రుచికి సరిపడా), పచ్చి మిరపకాయలు, పులుపుకి నిమ్మరసం లేదా తురుమిన మామిడికాయ వాడుకోవచ్చు.

ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి తురుము, దంచుకున్న పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకుంటే, కొబ్బరి తురుము కూర సిద్ధం.

అన్నం, రొట్టెల్లోకి రుచికరంగా ఉంటుంది. (మీకు కావాలని అనిపిస్తే, పోపు కూడా వేసుకోవచ్చు.)
మామూలుగా అయితే, ఒక్క చుక్క నూనె అవసరం లేదు.

  1. కోసంబరి (కర్ణాటక, తమిళనాడు వంటకం)

కావలసినవి: పచ్చి పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి క్యారట్ తురుము, కీరా ముక్కలు, నిమ్మరసం, ఉప్పు.

పైన చెప్పిన పదార్ధాలు అన్నీ గిన్నెలో వేసి కలుపుకోవడమే. మంచి రుచికరమైన రీరిఖిలి ఖిరిరీనీ సిద్ధం.

రచన: సంధ్యా శశికాంత్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఫ్రూట్ సలాడ్

మామూలుగా బయట దొరికే ఫ్రూట్ సలాడ్‌లో కస్టర్డ్ పౌడర్, చక్కెర, పాలలో వేసి మరిగించి చల్లారాక ఫ్రూట్స్ వేసి కలుపుతారు.

చక్కెర, కస్టర్డ్ పౌడర్ లేకుండా, పాలను మరిగించకుండా ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.ఉడికించని ఆహారం కనుక, జీవశక్తిపూరితంగా ఉంటుంది.

తయారీ విధానం: రెండు అరటిపళ్ళు, నాలుగు సపోటాలు బాగా మాగినవి, కొన్ని అంగూర (ద్రాక్ష) పండ్లు, రెండు దోర జామపండ్లు, అన్నిటినీ సన్న ముక్కలుగా తరిగి గిన్నెలో వేసుకొని, పచ్చి పాలు పోసి కలుపుకొని, కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి.

కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.

జీడీపప్పు, బాదం పప్పు ఉంటే వేసుకోవచ్చు.

మాములుగా తినొచ్చు, లేదా ఎండలు బాగా వున్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే, కడుపుకు చల్లగా హాయ్‌గా ఉంటుంది.

చక్కెర అవసరం లేదు. పళ్ళలో వుండే తీపి సరిపోతుంది. ఇంకా తీపి కావాలనిపిస్తే, తేనే కలుపుకోవచ్చు !

రచన: శివారెడ్డి కర్నాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… కడుపులో చల్లటి భోజనం

మామూలుగా ఎండాకాలంలో ఏమి తినాలనిపియదు. నీళ్లు బాగా తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది, కాసేపటికి నీరసం వస్తుంది, అటువంటి పరిస్థితుల్లో దీన్ని బాగా తినొచ్చు.

కావాల్సిన వస్తువులు: ఒక సగం కీర, చిన్న దోసకాయ ముక్క, మూడు నాలుగు క్యారెట్ ముక్కలు అంటే చిన్న క్యారెట్ ఒకటి, చిన్న బీట్రూట్ ముక్క రెడ్ కలర్ ఉండొద్దు అనుకుంటే బీట్రూట్ వేయకుండా ఉండొచ్చు. ఒక టమాటా, ఒక చిన్న కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు కొన్ని….

చేసుకునే విధానం: అన్ని ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది గట్టిగా లేకుండా కొంచెం లూస్‌గా ఉంటేనే బాగుంటుంది. ఉదయము, మధ్యాహ్నము ఎప్పుడైనా మనం దీన్ని తినొచ్చు. అమృత ఆహారం అనలేము, ఎందుకంటే సాల్ట్ కలుస్తుంది కాబట్టి. ఉప్పు లేకుండా కూడా బాగానే ఉంటుంది.
అన్నం తింటేనే కడుపు నిండుతుంది అనుకునేవాళ్ళు కరెక్ట్‌గా ఒక ముద్ద అన్నాన్ని పిసికి, దీంట్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది

కీర లేకున్నా టమాటా, ఉల్లిగడ్డ, పెరుగు…. వీటితో కూడా ట్రై చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More