కావాల్సిన పదార్థాలు
- ఎండుకొబ్బరి
- ఉప్పు
- గొడ్డుకారం (ఎండు మిర్చితో కొట్టిన కారం)
- వెల్లుల్లి
- జీలకర్ర
- కరివేపాకు
తయారుచేయు విధానం:
కొబ్బరిని ముందుగా ముక్కలుగా కోసి, కోర్స్‌గా మిక్సీ వేయాలి, లేదా తురుము పీఠ మీద తురుము కోవచ్చు. కోరిన కొబ్బరి తురుము, కారం, ఉప్పు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ కలిపి మిక్సీలో ఒకసారి తిప్పితే (రోట్లో కూడా దంచుకోవచ్చు.) కొబ్బరికారం రెడీ!
ఇడ్లీ, దోసె, ఊతప్పం, వేడివేడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది.
- ఫణీంద్ర లక్ష్మీ అప్పసాని,* తక్కెళ్ళపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

