ఎండు ద్రాక్ష * జీడిపప్పు (ఆసక్తిని బట్టి ఎన్ని రకాల ఎండు పండ్ల ముక్కలనైనా కలుపుకోవచ్చు)
తయారుచేయు విధానం: సొరకాయను నీళ్లతో శుభ్రం చేసి, ఆరనిచ్చి, ముక్కలుగా కోసుకుని, గింజలు తీసివేసి, చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తగా నూరి, గుజ్జును శుభ్రమైన గుడ్డలో వేసి గట్టిగా పిండి, నీటిని వేరు చెయ్యాలి. ఎంతగా నీటిని పిండేస్తే, గుజ్జు అంత త్వరగా ఎండుతుంది.
సొరకాయ గుజ్జుకు సమానంగా బెల్లం తురుమును కలుపుకుని, మళ్ళీ మిక్సీలో వేసి కాస్తా తిప్పాలి. సొరకాయ బెల్లం గుజ్జును, వెడల్పాటి స్టీల్ ప్లేట్లో పలుచగా పరిచి ఎండబెట్టాలి. కొంత గట్టిపడిన తరువాత, కావాల్సిన ఆకారాలలో, పలుచగా, బిళ్లలుగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న బిళ్లలకు ఎండు ద్రాక్ష, జీడిపప్పు బద్దలను అద్దుకోవాలి. బిళ్లల మీద అలా అద్దడం వల్ల, ఆకర్షణీయంగా పిల్లలకు కనపడతాయి, రుచి, పోషకాలు కూడా పెరుగుతాయి.
సొర తాండ్రలో స్ధూల సూక్ష్మ పోషకాలు ఎన్నో ఉన్నాయి. బయటి వాతావరణంలో కూడా నెలల పాటు నిల్వ ఉంటాయి! పిల్లలు, వృద్దులు, ఏ వయసు వారైనా సరే, రోజుకు ఒక సొర తాండ్ర బిళ్ల తినవచ్చు. సొరకాయ తాండ్రను ఎండబెట్టేటప్పుడు, చీమలు పట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. (సొరకాయ నీళ్లను తాగవచ్చు, పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు)
జామ పండ్లు ఎక్కువ ఉత్పత్తి వచ్చినప్పుడు కూడా జామ తాండ్రను తయారు చేసుకోవచ్చు. కాకపోతే జామగుజ్జు నుంచి గింజలను వేరు చేసుకోవాలి.
జామ గుజ్జును జల్లెడలో వేసి చేత్తో రాస్తూ ఉంటే, గుజ్ౙు కిందికి జారి, గింజలు జాలి పైన మిగులుతాయి, గింజలను పారెయ్యాలి. మిగతా ప్రాసెస్ సేమ్ సేమ్.
రచన : తుమ్మేటి రఘోత్తమరెడ్డి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
కొతిమీర 50 సెం.మీ. ఎత్తు పెరిగే మెత్తని మొక్క. ఆకులు అనేక ఆకారాలలో ఉంటాయి. మొక్క మొదలు వద్ద ఆకులు వెడల్పుగా ఉండి అనేక భాగాలుగా ఉంటాయి. పూత వచ్చే కాండాలపై ఆకులు సన్నగా ఈకలులా ఉంటాయి. పూలు చిన్న అంబెల్‌పై ఏర్పడతాయి. తెలుపు లేదా లేత పింకు రంగులో ఉంటాయి. కాయ గుండ్రంగా 2-6 మి.మీ. పొడవు, 3-5 మి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.
సాధారణ నామం : కోరియాండర్ శాస్త్రీయ నామం : కోరియాండ్రం సెటైవం కుటుంబం: ఎపియేసి (అంబెల్లిఫెరే)
ఉపయోగాలు : ఔషధరంగంలో …
కొతిమీర బహుళ ఆరోగ్య ప్రయోజనాలు గల మొక్క. ఇది అద్భుతమైన ఆకలిని కలిగిస్తుంది. కడుపులో జీర్ణాశయంలో అనేక ఎంజైములు, జీర్ణ రసాలు స్రవించడానికి సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి విరేచనం సాఫీగా అయేలా చేస్తుంది. ఇది ఆహారంలో పీచు పదార్థం అందిస్తుంది. జీర్ణకోశంలో వాయువులను విడుదల చేస్తుంది. మలబద్దకం, మొల్లలు, కడుపునొప్పికి ప్రయోజనకారి. దగ్గు తగ్గించడానికి, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక అద్భుత యాంటిసెప్టిక్. కఫాన్ని తగ్గించి, జ్వరాన్ని పోగొట్టి చల్లదనాన్ని ఇస్తుంది.
కొతిమీరలో అనేక పోషక విలువలుండటం వలన దీనిని “ప్రపంచ అద్భుత హెర్బల్ మొక్క”గా పరిగణిస్తారు. ఇది అనేక పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటిసెప్టిక్, బాధనాశక, ఉత్తేజిత, శిలీంద్రనాశక లక్షణాలు కలిగి ఉంటుంది.
కొతిమీర విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఎసెన్షియల్ ఆయిల్స్, ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఆకులలో కాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, సోడియం ఉంటాయి.
కొతిమీరలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ కీళ్ళ నొప్పుల వల్ల కలిగే శరీర వాపుని తగ్గిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. కండ్ల కలక చకిత్సకు అద్భుత ఔషధం కొతిమీరలో ఉండే బీటాకెరోటిన్, యాంటిఆక్పిడెంట్లు కంటి సంబంధిత సమస్యలను నివారిస్తాయి. నోటి పుండ్ల నివారణకు ఇంటిమందు. ఎముకలను బలపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది. రుతు సమస్యలకు మహిళలు 5 గ్రా. కొత్తిమీర, ఒక చెంచా పంచదార అర లీటరు నీటిలో కలిపి మరగించిన కషాయాన్ని వడపోసి రోజుకి 3 సార్లు సేవించాలి. కేశ నష్టాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కోలన్ క్యాన్సర్‌ని నివారిస్తుంది.
కొతిమీర చట్నీ తయారు చేసి వడ్డించవచ్చు. పొడి చేసిన గింజలను కేకుల తయారీలో ఉపయోగించవచ్చు. గ్రైప్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. కొతిమీర యాంటిసెప్టిక్, అనాల్ౙెసిక్, అఫ్రోడియాసిక్, యాంటిస్పాస్మోడిక్, డియోడరెంట్, ఫంగిసైడల్, స్టిమ్యుటెంట్, స్టమకిక్, యాంటి బయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొతిమీరలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. యాంటిక్యాన్సర్, యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
వ్యవసాయరంగంలో
కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్‌లో లినలూల్ (57.57%), జిరానిల్ అసిటేట్ (15.09) ఎక్కువగా ఉంటాయి. ఈ రసాయనాలు ట్రైబోలియం కాస్టానియం కంటే కొల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించాయి. (ఖని, రహ్‌దారి, 2012).
టమాట పంటలో కొతిమీరని అంతరపంటగానే వేయడం వల్ల వివిధ రసం పీల్చే పురుగులు, తెల్లదోమ (బెమిసియా టబాసి), పేనుబంక (ఎఫిస్‌గాసిపి), జాసిడ్స్ (ఎంపోవాస్కాస్పీసీస్), తామర పురుగులు (త్రిప్స్ టబాసి), రెండు మచ్ౘ్ల ఎర్రనల్లి (టెట్రానైకస్ అర్టికె) సమర్ధవంతంగా, గణనీయంగా నివారించబడ్డాయి. ఈ పరిశోధనా ఫలితాలు ఆర్థిక పంటలతో ఆకర్షక మొక్కలను పెంచే పద్ధతిని సమగ్ర సస్యరక్షణ పథకాలలో ఒక భాగంగా సిఫారసు చేసి ఆర్థిక పంటలను పురుగుల బారి నుండి రక్షించవచ్చని వెల్లడించాయి (అబోషనాబ్, అతని అనుచరులు, 2017).
సహజ సుగంధపంటలైన పైపర్‌నైగ్రం, క్యూమినం సిమ్నియం, సిన్నమోమం వెరం, అల్లియం సెటైవం, కోరియాండ్రం సెటైనం, కర్కుమ, ఫీనిక్యులం వుల్గేర్, ట్రైగొనెల్లా ఫీనం గ్రీకం, సైజిగియం ఆరోమాటికం, క్యాప్సికం, జింజిబర్ అఫిసినాలిస్, మురయూ కోయినిగీ, బ్రాసికా నైగ్రా, సోడియం క్లోరైడ్‌లను కలిపిన మిశ్రమాన్ని పాటింగ్ మట్టితో కలిపి మొక్కలకు వేయాలి. ఈ జీవ పురుగు మందు వికర్షక చర్య, జీర్ణాశయంలో నిలిచిపోవడం, పక్షవాతం, ఊపిరాడకుండా చేయడం ద్వారా పురుగులను నివారిస్తాయి. ఈ జీవమందుని పొడిరూపంలో లేదా ద్రవరూపంలో పంటపై పిచికారి చేసి పురుగులను 48-72 గంటలలో నివారించవచ్చు. (గండిఐషాడోటి, 2012). ఈ జీవ పురుగు మందుని చ.మీ.కి. 100-500 గ్రా. చొప్పున వేయాలి.
జాన్‌కౌస్కా & జైట్కా (2016) క్యారట్ పంటలో కొతిమీర (కోరియాండ్రం సెటైవం), సమ్మర్ సావొరి (సాటురేజ హార్టెన్సిస్) అంతర పంటలప్రభావంపై అధ్యయనం చేశారు. అంతర పంటలు క్యారట్‌రస్ట్‌ఫ్లెå (సైలారోజే) వలన వేర్లకు కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించాయి. అంతర పంటలు వేసిన క్యారట్ క్షేత్రంలో ఆకులపై సిల్లిడ్ (ట్రైయజా విరిడ్యులా), పేనుబంక, వేర్లపై నులిపురుగుల నష్టం గణనీయంగా తక్కువగా ఉంది. కొతిమీర, సావరి అంతర పంటలుగా వేయడం వలన క్యారట్ పంటలో ప్రయోజనకర కీటకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయోగాలు జరిపిన అన్ని సంవత్సరాలలో కొతిమీరని అంతర పంటగా వేసిన క్యారట్ క్షేత్రంలో బదనికలు అక్షింతల పురుగులు, సిర్పిడ్ ఈగల సంఖ్య అధికంగా ఉంది.
కొతిమీరలో ఉన్న లిమలూల్ (68.2%), పైనీన్ (5.5%), టెర్పినిన్ (5.5%) అనే ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే అకాంతోసెరిడస్ ఒబ్టెక్షన్‌పై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించాయి (రిగ్నాల్ట్‌రోగర్, 1997).
కొతిమీర మొక్కలు పురుగుల సహజశత్రువులైన అల్లిక రెక్కల పురుగు (క్రైసోవా), అక్షింతల పురుగులు (కాక్సినెల్లిడ్స్), హోవర్ ఈగలు, పరాన్నజీవులైన చిన్న కందిరీగలను ఆకర్షిస్తాయి.
కాలీఫ్లవర్ పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాకెå్ౙలోసెల్లా సమగ్ర సస్యరక్షణ పథకంలో కొతిమీరని కాలీఫ్లవర్‌లో అంతర పంటగా వేయడం ఒక పద్ధతి.
కాలీఫ్లవర్ పంటలో డైమండ్ బ్యాక్ మాత్ యాజమాన్యానికి సిఫారసు చేసిన సమగ్ర సస్యరక్షణ పథకం క్ర.సం. ట్రీట్‌మెంట్ మోతాదు/ప్లాట్ ఎన్నిసార్లు ఉపయోగించాలి 1. కొతిమీరని అంతర పంటగా సాగు చేయడం అర కిలో విత్తనం ఒకసారి 2. రసాయన పురుగుమందు లోర్స్‌బాన్ (2%) పిచికారి 16 మి.లీ/8 లీ. 3 సార్లు 3. 2% వేపగింజల కషాయం పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు 4. 2% వేపనూనె పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు 5. జీవనియంత్రణట్రైకోగ్రామాకిలోనిస్ (పారసైటాయిడ్) ప్యూపాల కార్డు (పర్వీన్, ఖాన్)
కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్ 3వ దశ లార్వాలపై అత్యధిక ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది. (సౌగ్విర్, అతని అనుచరులు, 2013).
కూరగాయల సాగులో కొతిమీరను సహవాస పంటగా వేస్తే పేనుబంకను వికర్షిస్తుంది. ఎర్రనల్లి, పొటాటో బీటిల్స్ ఆశించకుండా చేస్తుంది. కొతిమీర సహజ శత్రువుల జీవిత కాలాన్ని పెంచుతుంది. అల్లిక రెక్కల పురుగు, హోవర్ ఈగ, ట్రైకోగ్రామా కిలోనిస్ పారసైటాయిడ్‌ని ఆకర్షిస్తుంది (టినాకా, 2014).
ఇర్వింగ్, అతని అనుచరులు (2014) కొత్తిమీర డాలికోగెనిడియా టస్మానికా సహజ శత్రువు జీవిత కాలాన్ని పెంచుతుందని నిరూపించారు.
కొతిమీర నుండి సృష్టించిన కొత్త సస్యరక్షణ ఎసెన్షియల్ ఆయిల్ ఉత్పత్తులు మూడు పేనుబంక జాతులు మాక్రోసైఫం రోజే, ఎఫిస్ నెరీ, ఎఫిస్ పోమి లపై గట్టి కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అటనసోప, 2017).
బెల్‌పెప్పర్‌లో అధిక నష్టం కలిగించే యూరోపియన్ కార్న్‌బోరర్, ఆస్ట్రినియా న్యూబిలాలిస్ సంరక్షణ జీవనియంత్రణకు అధ్యయనం జరిపారు. కొతిమీర, డిల్, బక్‌వీట్ అంతర పంటలను 3 బదనికలు చిన్నపైరేట్‌నల్లి (ఓరియస్ ఇన్సిడియోసస్), పింక్ మచ్చల అక్షింతల పురుగు (కోలియోయెగిల్లా మాక్యులేటస్), ఆకుపచ్చ అల్లిక రెక్కల పురుగు (క్రైసోపాస్పీ.)ని ఆకర్షించడానికి ఎంచుకున్నారు. వీటిని బెల్ పెప్పర్ ప్లాట్ల దక్షిణహద్దులో ఒకదాని తర్వాత ఒకటి 5వరుసల్లో నాటారు. బెల్ పెప్పర్ పంటలో కొతిమీర, డిల్‌ని కలిపి రెండు వరుసల్లో నాటారు. బక్ వీట్‌ని పంటలేని భూమిలో ఒక వరుసలో నాటారు.
పరిశోధనా ఫలితాలు అంతర పంటలు బెల్‌పెప్పర్‌ని తీవ్రంగా ఆశించే యూరోపియన్ కార్న్‌బోరర్‌ని సమర్ధవంతంగా నివారించాయని వెల్లడించాయి. అంతర పంటలు చిన్నపైరేట్ నల్లి, పింక్ మచ్చల అక్షింతల పురుగులు అధికంగా యూరోపియన్ కార్న్‌బోరర్ గుడ్లను తినడాన్ని ప్రోత్సహించాయి. (బికర్‌టన్, హోమిల్టన్, 2017).
ఫాబా చిక్కుడు రకాలలో కొతిమీరని అంతరపంటగా వేయడం వలన పేనుబంక పురుగులు, ఎఫిస్ క్రాక్సివొర గణనీయంగా తగ్గిపోయాయి. బదనికలు, గింజ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ప్లాట్ చుట్టూ కొతిమీర స్ట్రిప్ వేసిన 843 రకం ఫాబి చిక్కుడు ప్లాటులో అతి తక్కువ పేను బంక పురుగుల సంఖ్య నమోదైంది (రిజ్క్, 2011).
గ్రీన్‌హౌస్ టమాట సాగులో తెల్లదోమ, ట్రైఎల్యురాడెస్ వేపొరేరియంపై వికర్షక పంటలు తులసి, పుదిన, డిల్, వెల్లుల్లి, ఉల్లి, పార్ల్సీ, కొతిమీర ప్రభావంపై అధ్యయనం చేపట్టారు. ముందుగా వికర్షక పంటల విత్తనాలను చల్లి తర్వాత టమాట నారు మొక్కలను నాటారు. కొతిమీరపై అతి తక్కువ తెల్లదోమలు నమోదవడం వలన దీనిని అత్యుత్తమ వికర్షక మొక్కగా సిఫారసు చేశారు (తస్లి, అతని అనుచరులు, 2017).
కొతిమీర పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది. కొతిమీర కషాయం తయారు చేయడానికి 200 గ్రా. ధనియాలను దంచి 1 లీ. నీటిలో కలిపి 10ని. మరిగించాలి. తర్వాత ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలపాలి. ఉదయంవేళ ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలిపి పురుగాశించిన మొక్క భాగాలపై పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు. (పట్నాయక్, 2017).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
విశిష్టమైన సువాసన, అద్భుతమైన రుచి, అపరిమితమైన పోషక విలువలు కలగలిసిన పండు జామ. తక్కువ ధరకే లభించే ఈ పండును సామాన్యుడి ఆరోగ్యాన్ని కాపాడే “పేదవారి ఆపిల్” గా అభివర్ణిస్తారు. అన్ని వయసుల వారికీ ఎంతో మేలు చేసే సహజ పోషకాహార గని.
జామ పోషకాల సమృద్ధి : జామపండులో విటమిన్లు, ఖనిజాలు, ఆహారపు పీచు, ప్రోటీన్ మరియు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ‘C’కి ఇది అత్యుత్తమ సహజ వనరు. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
జామపండులోని పీచు జీర్ణక్రియను సులభతరం చేయడంతో పాటు పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని పొటాషియం, కాల్షియం, భాస్వరం మరియు ఇతర ఖనిజాలు శరీరంలోని వివిధ జీవక్రియలకు సహకరిస్తాయి.
జామపండులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన స్వేచ్ఛా రాడికల్స్‌తో పోరాడి కణాల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. అందువల్ల, జామపండును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చు.
జామపండును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు సులభంగా లభిస్తాయి. జామపండు శరీరానికి అవసరమైన అనేక పోషకాల సమాహారం. ఇందులో విటమిన్ ‘C’ అత్యధిక పరిమాణంలో ఉంటుంది; ఇది ఆపిల్ మరియు నారింజ వంటి పండ్ల కంటే కూడా అనేక రెట్లు అధికంగా లభిస్తుంది. అలాగే, ఇందులోని ఆహారపు పీచు (Dietary Fiber) జీర్ణ వ్యవస్థ సరైన రీతిలో పనిచేయడానికి ఒక అత్యుత్తమ ఇంధనంగా తోడ్పడుతుంది. వీటితో పాటు పొటాషియం, కాల్షియం, భాస్వరం మరియు ఇనుము (Iron) వంటి అవసరమైన ఖనిజ లవణాలు జామపండులో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీర కణాల క్షీణతను అడ్డుకోవడంలో మరియు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
జామపండుతో లభించే 6 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు
శక్తివంతమైన సహజ రోగనిరోధక కవచం జామపండులోని విటమిన్ C రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జామపండు బ్యాక్టీరియా మరియు వైరస్‌ల దాడి నుంచి శరీరాన్ని సమర్థవంతంగా రక్షిస్తుంది. ఇది జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అందువల్ల, పిల్లల సరైన ఎదుగుదలకు మరియు వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది ఒక అద్భుతమైన సహజ రక్షణ కవచంగా తోడ్పడుతుంది.
జీర్ణక్రియ సమర్థవంతం – మలబద్ధకానికి చెక్ అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామపండు పేగుల కదలికలను క్రమబద్ధీకరించి, మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్తి మరియు గ్యాస్ట్రిక్ వంటి జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించడంలో విశేషంగా సహాయపడుతుంది. అంతేకాకుండా, పేగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా (Probiotics) వృద్ధి చెందడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.
మధుమేహ (డయాబెటిస్) నియంత్రణ జామపండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI) కలిగిన పండు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది. జామపండులోని పీచు పదార్థం వల్ల చక్కెర శరీరంలోకి శోషించబడే వేగం గణనీయంగా తగ్గుతుంది. అందుకే, డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారు తమ పోషకాహార లేదా ఆరోగ్య నిపుణుల సలహాతో దీనిని మితమైన పరిమాణంలో తీసుకోవడం చాలా శ్రేయస్కరం.
గుండె ఆరోగ్యం & కొలెస్ట్రాల్ నియంత్రణ జామపండులో ఉండే పొటాషియం మరియు కరిగే పీచు (Soluble Fiber) గుండెకు కొండంత అండ. జామపండులోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేసి, రక్తపోటును (BP) నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇందులోని పీచు పదార్థం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, రక్తప్రసరణను సులభతరం చేస్తుంది. ఫలితంగా, గుండెపోటు మరియు పక్షవాతం (Stroke) వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు తగ్గుతాయి.
నిత్య యవ్వన చర్మ సౌందర్యం జామపండులోని యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C చర్మంలో కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తిని పెంచడానికి దోహదపడతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని సమర్థవంతంగా అడ్డుకుని, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నిరోధిస్తూ చర్మాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
రక్తహీనత (అనీమియా) నివారణకు సహకారం జామపండులోని విటమిన్ C, మనం తీసుకునే ఇతర ఆహారాలలోని ఇనుమును (Iron) శరీరం సరిగ్గా గ్రహించేలా (Absorption) చేస్తుంది. అందువల్ల, ఆకుకూరలు మరియు పప్పు ధాన్యాలతో పాటు జామపండును తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరిగి, అనీమియా (రక్తహీనత) మరియు అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.
జామపండును ఉపయోగించాల్సిన సరైన విధానం ప్రకృతి సూచన: స్థానికంగా, చౌకగా లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడమే సంపూర్ణ ఆరోగ్యానికి తొలిమెట్టు.
రోజుకు ఒక మీడియం సైజ్ జామపండును తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. పిల్లలు, గర్భిణులు, శారీరక శ్రమ చేసేవారు మరియు వృద్ధులు – ఇలా ప్రతి ఒక్కరూ దీనిని నిర్భయంగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్ సమయంలో జామపండును తాజాగా కోసి తినడం వల్ల శరీరానికి అందులోని గరిష్ట పోషకాలు లభిస్తాయి.
ముగింపు: జామపండు రుచి, పోషక విలువ మరియు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎంతో విలువైన పండు. ఇందులో విటమిన్ C, పీచు, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మధుమేహ నియంత్రణకు సహకరించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం, బరువు నియంత్రణకు సహాయపడడం మరియు రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ప్రతిరోజూ సమతుల్య ఆహారంతో పాటు జామపండును మితమైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను పొందవచ్చు.
ప్రత్యేకంగా పిల్లలు, గర్భిణులు, పెద్దలు మరియు వృద్ధులకు ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. స్థానికంగా సులభంగా లభించే ఇలాంటి పోషక పండ్లను తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరళమైన మరియు ప్రభావవంతమైన మార్గం.
ఏవో ఖరీదైన పండ్ల వెనుక పడకుండా, మనకు అందుబాటులో ఉండే జామపండును క్రమం తప్పకుండా తింటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం.
బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258
చామ పంటను కూర వండుకు తినే దుంపల కోసం సాగు చేస్తారు. చామ మొక్క వివిధ ఆకారాలు, పరిమాణాలు గల దుంపలను ఉత్పత్తి చేస్తుంది. దీని ఆకులు 40þ24.8 సెం.మీ. పరిమాణంలో ఉంటాయి. దుంపల నుండి వచ్చే ఆకులు పైవైపు ముదురు ఆకుపచ్చ రంగులో, క్రింది వైపు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. త్రికోణాకారంలో కోడిగుడ్డు పరిమాణంలో ఉంటాయి. ఆకు కాడ 0.8-1.2 మీ. ఎత్తులో ఉంటుంది.
సాధారణ నామం : టారో శాస్త్రీయ నామం : కోలకేసియా ఎస్కులెంట కుటుంబం: ఆరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
చామ దుంపలో అనేక పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
చామ దుంపలో కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఇ, బి విటమిన్లు ఉన్నాయి. చామ ఆకులలో విటమిన్లు ఎ మరియు సి, పీచు పదార్థం, అదిక పరిమాణంలో ప్రోటీన్లు ఉంటాయి. చామ దుంప క్యాన్సర్‌ని నివారిస్తుంది.
రుమాటాయిడ్ ఆర్థ్రెåటిస్ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తపోటుని నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. కంటిచూపుని మెరుగు పరుస్తుంది.
రక్త ప్రసరణను పెంచుతుంది. ఎముకల నష్టాన్ని తగ్గిస్తుంది.శరీర చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వ్యవసాయరంగంలో
చామ దుంప అగ్లూటినిన్ (సిఇఎ) శక్తివంతమైన కీటకనాశనిగా గుర్తించబడింది (రాయ్, అతని అనుచరులు, 2002, మజుందార్, అతని అనుచరులు, 2004).
కోలకేసియా ఎస్క్యులెంటా ఎగ్లూటినిన్ (సిఇఎ) ప్రత్తి పంటనాశించే పేనుబంక, ఎఫిస్ గాసిపిని అత్యంత సమర్ధవంతంగా చంపింది. అలసంద పేనుబంక, ఎఫిస్ క్రాక్సివోరాని సిఇఎ సమర్థవంతంగా ఆరమ్ మాక్యులేటం దుంప లెక్టిన్ (ఎటితుల్)తో సమానంగా నివారించింది. సిఇఎ రెడ్ కాటన్ బగ్‌ని అల్లియం సెటైవం (వెల్లుల్లి) లీప్ అగ్లూటిన్ (ఎయసఎయల్) కన్నా అదిక సమర్థవంతంగా నివారించింది (దాస్, అతని అనుచరులు, 2013).
పండుఈగ, బాక్ట్రోసెరా కుకుర్బిటె దోసజాతి పంటలపై విపరీత నష్టం కలిగించే పురుగు. ఈ పురుగు నివారణ అతి కష్టం. చామ దుంప లెక్టిన్ (సిఇఎ) పండుఈగ లార్వాల పెరుగుదల, వృద్ధి నరికట్టింది. కనుక ఈ లెక్టిన్‌ని సమగ్ర పురుగు యాజమాన్య పథకంలో ఒక భాగంగా ఉపయోగించవచ్చు. (ఈ ఠాకూర్, అతని అనుచరులు, 2012).
చామ దుంప లెక్టిన్ (సిఇఎ) తెల్లదోమ, బెమిసియా టబాసి పెరుగుదలను, పునరుత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టింది (అమిత్‌రాయ్, అతని అనుచరులు, 2014).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాము. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందుబాటులో ఉండేలా చూడడం మరియు పోషకాహారం, ఆహార భద్రత పై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే నేటి పరిస్థితుల్లో ఆహార భద్రత అంటే కేవలం ప్రతి ఒక్కరి కడుపు నింపడం మాత్రమే కాదు. పోషకమైన ఆహారం, ఆహార వైవిధ్యం, స్థానిక ఆహార వ్యవస్థల పరిరక్షణ కూడా ఆహార భద్రతలో అంతర్భాగాలే.
ఆహారం నుంచి పోషకాహారం వైపు ఒక కుటుంబానికి తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ ఆహారంలో అవసరమైన పోషకాలు లేకపోతే పూర్తి ఆరోగ్యం సాధ్యం కాదు. నేడు పోషకాహార లోపంతో పాటు అధిక బరువు, ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి జీవనశైలి వ్యాధులు కూడా పెరుగుతున్నాయి.
మన రోజువారీ ఆహారంలో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు మరియు తగినంత నీరు ఉండాలి. కేవలం కడుపు నిండేలా ఆహారం తీసుకోవడం కాకుండా, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. దీనికోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సమతుల్య ఆహారం అంటే శరీరానికి కావలసిన అన్ని పోషకాలు సరైన పాళ్లలో అందేలా తీసుకునే ఆహారం.
అందుకే మన ఆహారంలో ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, నట్స్ మరియు నూనె గింజలు వంటి వివిధ ఆహార సమూహాల నుండి ఆహారం తీసుకోవడం అవసరం. ముఖ్యంగా స్థానికంగా, కాలానుగుణంగా లభించే ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో కుటుంబ ఆహార వైవిధ్యాన్ని పెంచు కోవచ్చు.
చిరుధాన్యాలు పరిమాణంలో చిన్న, పోషకాల్లో మిన్న మన పూర్వీకుల ఆహారంలో ఒకప్పుడు జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాలు ముఖ్యమైన భాగంగా ఉండేవి. మారుతున్న ఆహార అలవాట్లతో వాటి వినియోగం తగ్గినా, ప్రస్తుతం ఆరోగ్యకరమైన మరియు సుస్థిరమైన ఆహార వ్యవస్థలలో చిరుధాన్యాల ప్రాధాన్యం మళ్లీ పెరుగుతోంది. చిరుధాన్యాలు ఆహారంలో వైవిధ్యాన్ని పెంచడమే కాకుండా అధిక మొత్తంలో కాల్షియమ్, ఐరన్, పీచు వంటి పోషకాలను అందిస్థాయి. వీటితో రొట్టెలు, సంగటి, అంబలి లాంటి పాతకాల వంటలే కాకుండా చిన్నపిల్లలు ఇష్ట పడేలా బిస్కెట్లు, కేకులు, మిక్స్చర్, దోసెలు, ఇడ్లీలు వంటి అనేక రకాల పోషకాహార పదార్థాలను తయారు చేయవచ్చు.
పొలాల్లో వైవిధ్యం పెరిగితే, తినే పళ్లెంలోనూ వైవిధ్యం పెరుగుతుంది. ఆహార భద్రతకు పునాది పొలాల్లోనే ఉంటుంది. ఒకే పంటపై ఆధారపడకుండా ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, కూరగాయలు మరియు ఇతర పంటలను కలిపి సాగు చేసే మిశ్రమ పంటలు, రైతులకు ఆహారం భద్రత మరియు ఆదాయ వనరులను అందిస్తాయి.
ఇలాంటి పద్ధతులు పంటల వైవిధ్యాన్ని పెంచడంతో పాటు స్థానిక జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి దోహదపడతాయి. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా విభిన్న పంటలను సాగు చేయడం రైతుల ఆహార మరియు జీవనోపాధి భద్రతను బలోపేతం చేయగలదు. పొలాల్లో పంటల వైవిధ్యాన్ని, ఇళ్లలో ఆహార వైవిధ్యాన్ని పెంపొందించినప్పుడే నిజమైన ఆహార భద్రత సాధ్యమవుతుంది. స్థానికంగా లభించే ఆకుకూరలు మరియు సాగు చేయబడని ఆకుకూరలు పోషకాల గనులు
గ్రామీణ ప్రాంతాల్లో అడవి సోయకూర, పున్నగంటి, బంకంటి, దూసరి, ఏలకచెవుల కూర, జొన్నచెంచలి, సన్న పయాల, తుమ్మి కూర, ఉత్తరేణి, ఎన్నాద్రి, బచ్చలి కూర, దొగ్గలి, పుండి, నేల ఉసిరి, గురుమాషి, చెన్నంగి, తడక దొబ్బుడు, చిత్రమాలం, అంగి భంగి, గంగా వాయిలి వంటి ఎన్నో రకాల సాగుచేయబడని ఆకుకూరలును చూడవచ్చు. జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో వీటిని చూడవచ్చు. ఇటువంటి ఆకుకూరల్లో అనేకమైన పోషకాలు ఉంటాయి. తరతరాలుగా గ్రామీణ కుటుంబాలు వీటిని గుర్తించి, సేకరించి, వివిధ వంటకాలలో ఉపయోగిస్తూ వచ్చారు. అయితే ఆధునిక వ్యవసాయంలో విపరీతమైన మందులు పిచికారి చేయడం వలన ఇటువంటి వనరులను కోల్పోవాల్సి వస్తుంది. సాగుచేయని ఆకుకూరల గురించి అవగాహన కల్పించడం, సురక్షితమైన వినియోగ పద్ధతులను ప్రోత్సహించడం, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా ఆహార వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఆకు కూరలను ముందుగా శుభ్రం చేసి తరువాత తరగడం ద్వారా పోషకాలను కోల్పోము. సన్నగా తరిగన తర్వాత నీటితో శుభ్రం చేయడం ద్వారా నీటిలో కరిగే విటమిన్లను కోల్పోతాం.
ఆహార వృథాను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రపంచంలో ఒకవైపు అనేక మంది ప్రజలకు తగిన ఆహారం అందకపోతుండగా, మరోవైపు ఉత్పత్తి చేసిన ఆహారంలో కొంత భాగం వృథా అవుతోంది. ఆహారాన్ని వృథా చేయడం అంటే కేవలం ఆహారాన్ని మాత్రమే కోల్పోవడం కాదు; దాని కోసం వినియోగించిన నీరు, భూమి, శ్రమ, శక్తి మరియు రైతుల కష్టం కూడా వృథా అవుతున్నాయి.
అందువల్ల అవసరానికి తగినంత ఆహారాన్ని మాత్రమే వండటం, మిగిలిన ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేయడం, అందుబాటులో ఉన్న పదార్థాలను సృజనాత్మకంగా ఉపయోగించడం మరియు ఆహారాన్ని గౌరవించడం ప్రతి కుటుంబం బాధ్యత.
ఎం.హేమలత (గృహ విజ్ఞాన శాస్త్రవేత్త), డా సి. వర ప్రసాద్ (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి), జీ. శైలజ (ఉద్యాన శాస్త్రవేత్త), మరియు వి. రమేష్ (సేద్య విభాగ శాస్త్రవేత్త) డిడిఎస్ -కృషి విజ్ఞాన కేంద్రం, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
తయారుచేయు విధానం: ఈ సంపూర్ణ పోషకాహారం అటుకులు, కూరల అన్నం తయారీ ఎలాగంటే…. 10 నిమిషాలు నానిన అటుకుల్లో అన్నీ కలిపేసి తినేస్తే అన్నం పనిలేకుండా సరిపోతుంది. దానిలోనే కొంచెం పెరుగు కూడా కలుపుకు తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అన్నం తినలేదనే ఆలోచన రాదు. నీరసం రానివ్వదు!
నేను బీట్‌రూట్ పెద్దుల్లి కూడా కలుపుకుంటాను. ఇష్టమైనవారు కలుపుకోవచ్చు.
ఫణీంద్ర లక్ష్మీ అప్పసాని, తక్కెళ్ళపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
తయారుచేయు విధానం: ముందుగా పల్లీలు, నువ్వులు, బెల్లం కలిపి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుని పక్కుకు పెట్టుకోవాలి. అదే జార్‌లో ముందుగా చెక్కు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని పల్చటి క్లాత్‌తో గట్టిగా పిండాలి. ఆ జ్యూస్‌ని బీట్రూట్ జ్యూస్‌గా వాడుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఆ ముద్దకి పైన పేర్కొన్న పల్లీలు నువ్వుల బెల్లం పొడిని మరియు కొద్దిగా ఇలాచీ పొడిని చిన్నచిన్నగా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు బాదం ముక్కలను కలిపి అవసరాన్ని బట్టి తేనెను కలుపుతూ గుండ్రటి లడ్డూలు కట్టుకోవాలి.
ఇవి ఏరోజుకారోజు చేసుకుని తింటే బాగుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్లకు, పార్టీలకు అప్పటికప్పుడు పిల్లలకి రుచికరమైన, బలవర్ధకరమైన ఆహారంగా చేసి ఇవ్వవచ్చు.
ఒకేరోజు మనము బీట్రూట్ లడ్డూలను, బీట్రూట్ జ్యూస్‌ను తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు.
బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగే అలవాటు ఉన్నవాళ్లు చాలా నీటిని పోసి పిప్పి కదా అని దాన్ని వ్యర్థం చేస్తుంటారు. కాకపోతే తక్కువ నీటిని ఉపయోగించి క్యారెట్, బీట్‌రూట్ లడ్డూలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు.
సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీమతి సి. విజయ కుమారి వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలం, పప్పనపల్లి వాసి. విజయ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం సామూహిక నిర్వహణ విభాగంలో మైదుకూరు మండలం పోషణ మరియు ఆరోగ్యం కార్యకర్తగా పనిచేస్తుంది. ఆమె గతంలో తన కుటుంబానికి అవసరమైన కూరగాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసేది. పెరుగుతున్న కూరగాయల ధరలు, రసాయన అవశేషాలపై ఆందోళన, అలాగే కుటుంబ సభ్యులు తగినంత ఆకుకూరలు, కూరగాయలు తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆమె గమనించింది.
ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట, ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి పెరటిలో పోషకాహార తోటలు పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శిక్షణలో సమతుల్య పోషకాహారం ప్రాముఖ్యత, ఇంటి పరిసరాల్లో శాస్త్రీయ పద్ధతిలో పోషకాహార తోటలు ఏర్పాటు, సీజన్కు అనుగుణంగా కూరగాయల ఎంపిక, వంటింటి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీ, నీటి పొదుపు పద్ధతులు మరియు సహజ పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అంతేకాక కూరగాయలు, పండ్ల తోటల్లో వాడే వివిధ రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు, వాటివల్ల పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి కలిగే నష్టాలను గూర్చి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమం అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట శాస్త్రవేత్తలు జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ కూరగాయల విత్తనాల కిట్‌ను అందజేయటం జరిగింది. ఈ కిట్‌లో పాలకూర, మిరప, టమాటో, వంగ, బెండకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి మరియు గోరు చిక్కుడు వంటి కూరగాయ విత్తనాలు ఉంటాయి
శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీమతి సి. విజయ కుమారి తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలో టమాటా, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కాకరకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి, బీరకాయ తదితర కూరగాయలను సేంద్రీయ పద్ధతిలోఎటిఎం విధానంలో సాగు చేశారు. కొద్ది వారాల్లోనే కుటుంబ అవసరాలకు సరిపడా తాజా, పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలు ఆమెకు అందుబాటులోకి వచ్చాయి.
దీని ఫలితంగా కుటుంబం మార్కెట్‌పై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. కూరగాయల కొనుగోలు ఖర్చులో నెలకు సుమారు ₹1500–₹2,500 ల వరకు పొదుపు సాధించారు. కుటుంబ సభ్యుల ఆహారంలో ఆకుకూరలు, కూరగాయల వినియోగం పెరగడంతో వారి ఆరోగ్య పరిస్థితిలో సానుకూల మార్పులు కనిపించాయి. మిగులు ఉత్పత్తిని పొరుగువారికి విక్రయించడం ద్వారా ₹4,500 -5,000 లఅదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. అలాగే ఆమె తమ పెరటి తోటలో పండిన కాయగూరలను , ఆకుకూరలను దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో మరియు పాఠశాలలో పిల్లలు భోజనానికి అందించేది.
శ్రీమతి సి. విజయ కుమారి గారి న్యూట్రి గార్డెన్ విజయాన్ని చూసి గ్రామంలోని అనేక మంది తమ ఇళ్లలో కూడా పోషక తోటలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామంలో పోషకాహారం, సేంద్రీయ సాగు మరియు కుటుంబ ఆహార భద్రతపై అవగాహన కల్పించే ఆదర్శ మహిళగా ఆమె నిలిచారు.
విజయ అభిప్రాయం కృషి విజ్ఞాన కేంద్రం అందించిన శిక్షణతో మా ఇంటి ఖాళీ స్థలం పోషకాహారాన్ని అందించే తోటగా మారింది. ఇప్పుడు మా కుటుంబానికి తాజా కూరగాయలు ఇంట్లోనే లభిస్తున్నాయి. డా॥బి. శ్రీ కాంతి శ్రీ, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త తనకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడం వల్లే నేను ఈ విజయం సాధించగలిగాను. ఇప్పుడు మా ఇంటికి కూరగాయల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ప్రతి ఇంట్లో న్యూట్రి గార్డెన్ ఉంటే కుటుంబ ఆరోగ్యం, పోషకాహార భద్రత మరియు ఆర్థిక పొదుపు ఒకేసారి సాధ్యమవుతాయి.
సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7032463875.
డా॥బి. శ్రీ కాంతి శ్రీ , డా ఎం. బాలకృష్ణ, డా ॥ఎన్ .శ్రీ విద్యారాణి, డా ॥టి. విజయ నిర్మల, డా ॥ఎస్ . ఫిరోజ్ హుస్సైన్, డా . బి. గోవిందరాజులు మరియు డా ॥ సి హెచ్ . రూత్, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట – డా॥వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్న గూడెం. Ph: 9493993523
మామూలుగా బయట దొరికే ఫ్రూట్ సలాడ్‌లో కస్టర్డ్ పౌడర్, చక్కెర, పాలలో వేసి మరిగించి చల్లారాక ఫ్రూట్స్ వేసి కలుపుతారు.
చక్కెర, కస్టర్డ్ పౌడర్ లేకుండా, పాలను మరిగించకుండా ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.ఉడికించని ఆహారం కనుక, జీవశక్తిపూరితంగా ఉంటుంది.
తయారీ విధానం: రెండు అరటిపళ్ళు, నాలుగు సపోటాలు బాగా మాగినవి, కొన్ని అంగూర (ద్రాక్ష) పండ్లు, రెండు దోర జామపండ్లు, అన్నిటినీ సన్న ముక్కలుగా తరిగి గిన్నెలో వేసుకొని, పచ్చి పాలు పోసి కలుపుకొని, కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి.
కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.
జీడీపప్పు, బాదం పప్పు ఉంటే వేసుకోవచ్చు.
మాములుగా తినొచ్చు, లేదా ఎండలు బాగా వున్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే, కడుపుకు చల్లగా హాయ్‌గా ఉంటుంది.
చక్కెర అవసరం లేదు. పళ్ళలో వుండే తీపి సరిపోతుంది. ఇంకా తీపి కావాలనిపిస్తే, తేనే కలుపుకోవచ్చు !
రచన: శివారెడ్డి కర్నాటి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి