సమస్య:
దద్దుర్లు దురద
చర్మం కందటం రక్తం చమర్చటం
వాపు వెంట్రుకలు ఊడటం
కారణాలు :
బాహ్య పరాన్న జీవుల దాడి కలుషిత నీరు త్రాగటం
విష కీటకాల కాట్లు ప్రతికూల వాతావరణం
అంతరపరాన్న జీవుల భారం కలుషిత పరిసరాలు
మందులు వికటించటం లవణాల లోపం
విషపూరిత ఆహారం తినటం అజీర్ణం
దురదగొండి లాంటి కొన్ని మొక్కల ఆకులు, పూలు, కాయలు తాకటం
పశువైద్యుని సంప్రదించాలి.
ఈ వ్యాధిని MANGE, STING BITES, REACTIONS TO SOME MEDICINESగా
భ్రమించే అవకాశం వుంది. కనుక వ్యాధి భేదాత్మక పరిశీలన అవసరం.
పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం
గృహవైద్యం:
- శుభ్రమైన నీటితో శరీర భాగాల్ని కడగాలి.
- శరీరాన్ని కుంకుడు కాయ నురుగుతో కడగాలి.
- కాలువ లేక చెరువులోని ఒండ్రు / బంక మట్టిని చర్మానికి పట్టించాలి.
- మైలుతుత్తం 5 గ్రా॥, గంధకం 10 గ్రా॥, హారతి కర్పూరం 5 గ్రా॥ నూరి, 50 గ్రా॥ వెన్నతో కలిపి శరీరంపై రాయాలి.
పెరటి వైద్యం:
- గాడిదగడపాకు చూర్ణం, ఆముదం శరీరంపై రాయాలి.
- కుప్పింటాకు రసం 60 గ్రా॥, సున్నం 10 గ్రా॥, నిమ్మరసం 20 గ్రా॥ కలిపి చర్మంపై పూయాలి.
- అవిసె ఆకు, ఉప్పు కలిపి నూరి, చర్మంపై పూయాలి.
- దిరిసెన ఆకు రసం, నువ్వుల నూనె, వస కలిపి చర్మంపై రాయాలి.
- కలబంద గుజ్జు, పసుపు కలిపి చర్మంపై రాయాలి.
ఓషధులు:
తుమ్మ చెక్క చూర్ణం, వేప చెక్క చూర్ణం, కర్పూరం కలిపి శరీరంపై పూయాలి.
మూలికావైద్యం:
- వెలిగారం, గంధకం, కుంకుమ సమపాళ్ళలో కలిపి కొబ్బరి నూనెలో కలిపి శరీరంపై పూయాలి.
- కర్పూరం, వెలిగారం, జింకు ఆక్సైడ్ సమపాళ్ళలో కలిపి కొబ్బరి నూనెలో కలిపి శరీరంపై పూయాలి.
హోమియో
- దద్దుర్లకు, అర్టికా యురెన్స్ 30 లేదా బెల్లడోన 30 లేదా ఆర్సెనికం ఆల్బం 30 ఏదైనా ఒక మందు రోజుకు 5 మాత్రలు దద్దుర్లు తగ్గే దాకా తినిపించాలి.
- దురదకు, డోలికస్ 30 లేదా నేట్రం మర్ 6X రోజుకు 5 మాత్రలు దురద తగ్గే దాకా తినిపించాలి.
- కీటకాల కాటువల్ల దద్దుర్లకు, ఎపిస్ 30 రోజుకు 5 మాత్రలు దద్దుర్లు తగ్గే దాకా తినిపించాలి.
అల్లోపతి:
- మినరల్ మిక్చర్ రోజుకు 10 గ్రాముల చొప్ప్పున నోటిలో వేసి పాలు కుడవటానికి వదలాలి.
- టాపిక్యూర్ (TOPICURE) వంటి మందును పై పూతగా రాయాలి.
- జింక్ ఆక్సైడ్, వేపనూనె (ZINK OXIDE + NEEM OIL) కలిపి పై పూతగా రాయాలి.
- ఎవిల్ (AVIL) లేదా హిస్టానిల్ (HISTANIL) వంటి ANTIHISTAMINICS ఇంజక్షన్లు చేయించాలి.
- పరిసరాల పరిశుభ్రత కొరకు అవసరమైన మందులను వాడాలి.
జాగ్రత్తలు:
ఎలెర్జీకి కారణమైన వాటి నుండి దూడకు రక్షణ ఇవ్వాలి.
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

