- బొకాషి : కావలసిన పదార్థాలు : 100 కి. వరి లేక గోధుమ తవుడు – 10 కి. ఎండిన ఆవుపేడ పాడి – 10 కి. వేరుశనగ పిండి – 5 కి. ఎండు చేప పొడి – 2 కి. బెల్లం – 12-14 లీ. నీరు – 1 లీ. ఎ.ఇ.యం. – 200 లీ. ప్లాస్టిక్ క్యాన్.
తయారీ విధానం : పైన పేర్కొన్న పదార్థాలను బాగా కలిపి ప్లాస్టిక్ క్యాన్లో వేసి గాలి చొరబడకుండా మూత బిగించి 8-10 రోజులు చల్లని, చీకటి ప్రదేశాలలో పులియ బెట్టాలి. చల్లగా ఉన్న సమయంలో ఒక చ.మీ. కి 100 గ్రా. చొప్పున బొకషి ఎరువుని ఇతర సేంద్రియ ఎరువులతో కలిపి భూమిపై చల్లాలి. ఒక ఎకరానికి 400 కి. బొకాషి అవసరం.
- ఇ.యం. 5
కావలసిన పదార్థాలు : 600 మి.లీ. నీరు; 100 మి.లీ. బెల్లం ద్రావణం; 100 మి.లీ. యాక్టివేటెడ్ ఇ.యం.; 100 మి.లీ. బ్రాంది / రమ్ 100 మి.లీ. సహజ వినెగర్.
తయారీ విధానం : పై పదార్థాలన్నింటినీ 1 లీ. సిసాలో నింపి బాగా కలిపి చల్లని, చీకటి ప్రదేశంలో 8-10 రోజులు పులియబెట్టాలి. బాగా తయారయిన ఇ.యం.-5 తీయని, పుల్లని వాసన వస్తుంది. గ్యాస్ ఉత్పత్తి ఆగినపుడు ఇ.యం. ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. శిలీంద్రం తెగుళ్ళు, వైరస్ తెగుళ్ళు, పురుగుల నివారణకు 1 మి.లీ. ఇ.యం. 5ని 1 లీ. నీటిలో కలిపి పంటపై 3-4 సార్లు పిచికారి చేయాలి.

