ఔషధ మొక్క… చెంగల్వ కోస్టు

సాధారణ నామం: ఎలిగెంట్ కాస్టన్, కేవుకంద, బోగచ్చిక దుంప, బేసికదుంప
శాస్త్రీయ నామం: కోస్టస్ స్పీసియోసస్
కుటుంబం: జింజిబెరేసి

ఇది అల్లం దుంప వంటి వేరుగల మొక్క. దుంప అల్లం కంటే పెద్దగా ఉంటుంది. కొమ్మలు సాధారణంగా వర్తులాకారపు వంపు కలిగి 1-2 మీ. ఎత్తు పెరుగుతాయి. కణుపుకు ఒకటి చొప్పున సామాన్య పత్రాలు దీర్ఘచతురస్రాకారములో ఉండి మెత్తని నూగు కలిగి ఉంటాయి. పుష్పాలు తెల్లగా, పెద్దవిగా కొమ్మచివర దట్టమైన గుత్తివలె ఏర్పడతాయి. రక్షక పత్రాలు ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫలాలు కూడా ఎర్రగా ఉంటాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దుంపలకు లేదా కొమ్ములకు ఔషధ గుణాలున్నాయి. ఈ దుంపల నుండి డయోస్ జెనిన్ అనే స్టిరాయిడ్ లభిస్తుంది.
  • విరేచనకారి, క్రిమిసంహారి, జీర్ణశక్తిని అభివృద్ది చేస్తుంది. జ్వరము, చర్మవ్యాధులు, ఉబ్బు కామెర్లకు ఉపయోగపడుతుంది. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. గర్భనిరోధక మందుల తయారీలో డయోస్‌జెనిన్ స్టిరాయిడ్ ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • చెంగల్వకోస్టుని విస్తృతంగా అలంకరణ మొక్కగా పెంచుతారు. చెంగల్వకోస్టు ద్రావణాలు (2500, 5000, 10000, 20000 పిపియం) ప్లూటెల్లా క్లైలోస్టెల్లా లార్వాలపై గణనీయమైన నివారణ చర్య చూపాయి. ఇథనాల్ ద్రావణం అత్యంత సమర్ధవంతంగా ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా లార్వాలను నివారించింది. లార్వాలపై ద్రావణాల ప్రభావం ఈ క్రింది క్రమంలో ఉంది.
  • ఇథనాల్ & క్లోరోఫాం & బ్యూటనాల్ & నీరు (అశిష్ కుమార్, అతని అనుచరులు, 2016).
  • చెంగల్వకోస్టు ద్రావణం షిగెల్లా, స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, క్లెబ్సియెల్లా న్యుమోనియే, సూడోమోనాస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, సాల్మొనెల్లాపై గణనీయమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి. చెంగల్వకోస్టు ద్రావణం నుండి వేరు చేసిన అవినోకోసైడఎ, ట్రెగోజెనిన్, సపోనిన్‌బి, సపోనిన్‌సి, బోట్రైటిస్ సినరియా, ఆల్టర్నేరియా టెన్యుస్సిమా, ఫ్యుజేరియంపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (సింగ్, అతని అనుచరులు, 1992).
  • చెంగల్వకోస్టు ద్రావణం రెండు మచ్ౘ్ల ఎర్రనల్లి, టెట్రానైకస్ అర్టికె ఆడపురుగుల పునరుత్పత్తిని, పొదిగిన గుడ్ల శాతాన్ని, గుడ్లు పెద్ద పురుగుల దశకు చేరే శాతాన్ని, జీవిత చక్రంలో ప్రతిదశ సమయాన్ని సమర్ధవంతంగా అరికట్టింది. ఈ ద్రావణం 79.67% లార్వాలను అకారిసైడల్ చర్య ద్వారా చంపింది. గుడ్లు పొదిగే సమయాన్ని బాగా పెంచింది (ఇస్మాయిల్, 2017).
  • చెంగల్వ కోస్టు (కోస్టస్ స్పీసియోసా), కోస్టస్ లాసెరస్, కోస్టస్ గ్లోబోసస్ దుంపల నుండి వేరు చేసిన డయోస్‌జెనిన్ ప్లూటెల్లా క్లైలోస్టెల్లాపై తక్కువ స్పర్శ, ఓవిసైడల్ చర్యను ప్రదర్శించింది. కాని అధిక శక్తివంతమైన కీటకపెరుగుదల క్రమబద్ధీకరణ చర్య, అధిక గుడ్లు పెట్టకుండా నిరోధించే చర్యను ప్రదర్శించింది. లార్వా, ప్యూపాల రూపాలలో కూడా మార్పు తెచ్చింది. కాని ప్లూటెల్లా క్లైలోస్టెల్లా నాశించే పారసైటాయిడ్, కొటీసియా ప్లూటెల్లాకు ఎలాంటి హాని చేయలేదు (పిపిత్‌సంగ్‌చన్ అండ్ మొరాల్లోరెజెసస్, 2005).
  • చెంగల్వకోస్టు వేరు ద్రావణం డెంగ్యూ మరియు యెల్లో ఫీవర్ వాహకం ఈడెస్ ఈజిప్టిపై గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. అందువలన దీనిని డెంగ్యు మరియు యెల్లోఫీవర్ నివారణలో ఉపయోగించవచ్చు (అడెబాజొ, అతని అనుచరులు, 2012).
  • చెంగల్వకోస్టు దుంపను నలగ్గొట్టి పేస్టు చేసి దాని నుండి రసం పిండాలి. ఈ రసాన్ని నీటిలో కలిపి వరి చేలో పంటపై పిచికారి చేసి రైస్‌హిస్పా (తాటాకు తెగులు)ని నివారించవచ్చు. ఈ పద్ధతిని అస్సామ్‌లో కామ్‌రూప్ జిల్లాలోని అమ్‌టోలా గ్రామ రైతులు ఆచరిస్తున్నారు (హరేన్‌కల్టియా, 2003).
  • చెంగల్వకోస్టు ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి టెట్రానైకస్ అర్టికెని అకారిసైడల్ చర్య ద్వారా నియంత్రించింది (ఇస్మాయిల్).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… చామ

చామ పంటను కూర వండుకు తినే దుంపల కోసం సాగు చేస్తారు. చామ మొక్క వివిధ ఆకారాలు, పరిమాణాలు గల దుంపలను ఉత్పత్తి చేస్తుంది. దీని ఆకులు 40þ24.8 సెం.మీ. పరిమాణంలో ఉంటాయి. దుంపల నుండి వచ్చే ఆకులు పైవైపు ముదురు ఆకుపచ్చ రంగులో, క్రింది వైపు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. త్రికోణాకారంలో కోడిగుడ్డు పరిమాణంలో ఉంటాయి. ఆకు కాడ 0.8-1.2 మీ. ఎత్తులో ఉంటుంది.

సాధారణ నామం : టారో శాస్త్రీయ నామం : కోలకేసియా ఎస్కులెంట కుటుంబం: ఆరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • చామ దుంపలో అనేక పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
  • 104 గ్రా. చామ దుంప తింటే 0.294 మి.గ్రా. విటమిన్ బి6, 27.52 గ్రా. కార్బోహైడ్రేట్లు, 0.179 మి.గ్రా. కాపర్, 0.398 మి.గ్రా. మాంగనీస్, 2.48 మి.గ్రా. విటమిన్ ఇ, 615 మి.గ్రా. పొటాషియం లభిస్తాయి. అంతేగాక 0.024 గ్రా. ట్రిప్టొఫాన్, 0.072 గ్రా. థ్రియొనైన్, 0.056 గ్రా. ఐసోల్యూసిన్, 0.115 గ్రా. ల్యూసిన్, 0.07 గ్రా. లైసిన్ వంటి అమినోయాసిడ్లు కూడా లభిస్తాయి.
  • చామ దుంపలో కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఇ, బి విటమిన్లు ఉన్నాయి. చామ ఆకులలో విటమిన్లు ఎ మరియు సి, పీచు పదార్థం, అదిక పరిమాణంలో ప్రోటీన్లు ఉంటాయి. చామ దుంప క్యాన్సర్‌ని నివారిస్తుంది.
  • రుమాటాయిడ్ ఆర్థ్రెåటిస్ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తపోటుని నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
    జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. కంటిచూపుని మెరుగు పరుస్తుంది.
  • దంత ఆరోగ్య నిర్వహణకు సహాయపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తలలో వెంట్రుకలు దట్టంగా పెరగడానికి దోహదపడుతుంది.
  • రక్త ప్రసరణను పెంచుతుంది. ఎముకల నష్టాన్ని తగ్గిస్తుంది.శరీర చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

వ్యవసాయరంగంలో

  • చామ దుంప అగ్లూటినిన్ (సిఇఎ) శక్తివంతమైన కీటకనాశనిగా గుర్తించబడింది (రాయ్, అతని అనుచరులు, 2002, మజుందార్, అతని అనుచరులు, 2004).
  • కోలకేసియా ఎస్క్యులెంటా ఎగ్లూటినిన్ (సిఇఎ) ప్రత్తి పంటనాశించే పేనుబంక, ఎఫిస్ గాసిపిని అత్యంత సమర్ధవంతంగా చంపింది. అలసంద పేనుబంక, ఎఫిస్ క్రాక్సివోరాని సిఇఎ సమర్థవంతంగా ఆరమ్ మాక్యులేటం దుంప లెక్టిన్ (ఎటితుల్)తో సమానంగా నివారించింది. సిఇఎ రెడ్ కాటన్ బగ్‌ని అల్లియం సెటైవం (వెల్లుల్లి) లీప్ అగ్లూటిన్ (ఎయసఎయల్) కన్నా అదిక సమర్థవంతంగా నివారించింది (దాస్, అతని అనుచరులు, 2013).
  • పండుఈగ, బాక్ట్రోసెరా కుకుర్బిటె దోసజాతి పంటలపై విపరీత నష్టం కలిగించే పురుగు. ఈ పురుగు నివారణ అతి కష్టం. చామ దుంప లెక్టిన్ (సిఇఎ) పండుఈగ లార్వాల పెరుగుదల, వృద్ధి నరికట్టింది. కనుక ఈ లెక్టిన్‌ని సమగ్ర పురుగు యాజమాన్య పథకంలో ఒక భాగంగా ఉపయోగించవచ్చు. (ఈ ఠాకూర్, అతని అనుచరులు, 2012).
  • చామ దుంప లెక్టిన్ (సిఇఎ) తెల్లదోమ, బెమిసియా టబాసి పెరుగుదలను, పునరుత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టింది (అమిత్‌రాయ్, అతని అనుచరులు, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. జ్యోతిష్మతి

ఇది బహువార్షిక పొద. కొమ్మలు తీగలవలె సాగి 4-5 మీ. పొడవు వరకు పెరుగుతాయి. ఆకులు దళసరిగా, దంతాల వంటి పళ్లు కలిగి, ఒంటరిగా అమిరి ఉంటాయి. పూలు లేత ఆకుపచ్చ, పసుపు రంగులో కొమ్మల చివర క్రిందకు వేలాడుతూ ఉంటాయి. ఒక్కొక్క కాయలో 4-5 గింజలుండి, నారింజ ఎరుపు రంగు పొరతో కప్పబడి ఉంటాయి. గింజలు గోధుమ రంగులో ఉంటాయి. బాగా ఎండిన ఫలాలు చివరలో మూడుగా చీలి గింజలు వెదజల్లుతాయి. ఫిబ్రవరి-సెప్టెంబర్ మధ్యలో పుష్పించి ఫలిస్తుంది.

సాధారణ నామం : క్లయింబింగ్ స్టాఫ్‌ప్లాంట్ / మాల్‌కంగని / ఇంటలెక్స్ ట్రీ శాస్త్రీయ నామం : సెలాస్ట్రస్ పానిక్యులేటస్ కుటుంబం: సెలాస్ట్రేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, గింజలు, నూనె, చెక్క ఔషధగుణాలు కలిగి ఉంటాయి. గింజలలో చేదైన రెసిస్, టానిన్లు, సెలాస్ట్రిన్, పానిక్యులేటన్ అనే ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఎరుపు – పసుపు రంగు గల సుగంధ తైలం లభిస్తుంది.
  • ఆకులు, బెరడు, గింజల నుండి లభించే తైలాన్ని జ్యోతిష్మతి తైలం అంటారు. దీనిని మతిస్థిమితం లేని వారికి బ్రెయిన్‌టానిక్ లాగా ఉపయోగిస్తారు. ఇది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. బెరిబెరి వ్యాధిని నయం చేస్తుంది.
  • గింజల నూనెను శరీరానికి రాసుకుంటే దోమలు కుట్టవు. గింజలను ఆవుమూత్రంలో కలిపి దంచి లేపనం చేస్తే పుండ్లు, గజ్జి, తామర, వాపులు హరిస్తాయి. ఆకులు స్త్రీలలో ఋతుస్రావాన్ని నియంత్రిస్తాయి.

వ్యవసాయరంగంలో

  • సెలాస్ట్రేసి కుటుంబానికి చెందిన మొక్కలు బీటాడైహూడ్రోఅగారోఫ్యురాన్ సెస్క్విటెర్పిన్ పాలియెస్టర్స్ మరియు పిరిడిన్ ఆల్కలాయిడ్స్ కలిగి ఉంటాయి. వీటిలో కొన్ని యాంటి ఫీడెంట్, కీటకనాశక చర్యలను ప్రదర్శిస్తాయి(బ్రూనింగ్ అండ్ వాగ్నర్, 1978; యమాడ, అతని అనుచరులు, 1978, టు, 1991).
  • సెలాస్టస్ జీనస్‌కి చెందిన అనేక జాతులు యాంటిఫీడెంట్ మరియు కీటకనాశక లక్షణాలను కలిగి ఉంటాయి. సెలాస్టస్ యాన్‌గ్యులేటస్ ద్రావణాలు యాంటి ఫీడెంట్ మరియు గణనీయమైన కీటకనాశక చర్యలు కలిగి ఉంటాయి. సంప్రదాయకంగా వేరుబెరడు పొడిని చైనాలో మొక్కలను పురుగుల నష్టాల నుండి కాపాడటానికి ఉపయోగిస్తారు. ఈ వేరుపొడి కుకుంబర్ బీటిల్, ఆలకోఫొరా ఫెమొరాలిస్‌కైనెన్సిస్, క్రూసిఫెరస్ లీఫ్‌బీటిల్, కొలాఫెల్లస్ బేరింగి, విల్లో లీఫ్‌బీటిల్, ప్లాగియోడెరా వెర్సిక…ర్, క్యాబేజి సాఫ్లెå, అతాలియా ఫ్లాక్, హమవాయిమన్ బీట్‌వెబ్ వర్మ్, హైమెనియా రీకర్వాలిస్, ఇంపోర్టెడ్ క్యాబేజివర్మ్, పిమెరిస్ రాపే, టెంట్ క్యాటర్‌పిల్లర్, మలకోసోమ న్యూస్ట్రియాటేస్టేసియా, మైగ్రేటరిలోకస్ట్‌లు, లోకస్టా మైగ్రటోరియా, లోకస్టామైగ్రటోరియా మానిలెన్సిస్‌లపై చర్యలను ప్రదర్శించాయి. ఈ ద్రావణాలలో ఉన్న ఆంగ్యులాటిన్ ఎ, సెలాంగ్యులిన్స్ మరియు సెస్విటెర్పిన్స్ వల్ల జీవ చర్యలు సంభవిస్తాయి. సెలాంగ్యులిన్ వేరు బెరడు, గింజల నూనెలోని అతిముఖ్యమైన సమర్ధవంతమైన రసాయనం (చిము, 1989).
  • జికాయ్, అతని అనుచరులు సెలియాస్ట్రస్ యాన్‌గ్యులేటస్ నుండి 7 బలహీన ఆల్కలాయిడ్లను వేరు చేసి పియెరిస్ రాపే, ఆస్ట్రినా ఫర్మకాలిస్‌పై పరీక్షించి బలమైన యాంటిఫీడెంట్స్‌గా గుర్తించారు. వారు సెలాస్ట్రస్ యాంగ్యులేటస్ వేరు బెరడు నుండి వేరు చేసిన 4 సెస్క్విటెర్పిన్ ఆల్కలాయిడ్స్ నిర్మాణాన్ని రిపోర్టు చేశారు. ఇవి అనేక పురుగులపై బలమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి.
  • మాఓటియన్, అతని అనుచరులు (1991) సెలాస్ట్రస్ యాంగ్యులేటస్ వేరు బెరడు నుండి కీటకనాశక సెస్క్విటెర్పిన్‌పోలియెస్టర;్ ఆంగ్యులాటిన్ ఎ ని వేరు చేశారు. ఈ సెస్క్విటెర్పిన్ ఆల్కలాయిడ్ మిశ్రమం ఆంగ్యులాటిన్ ఎ ని కలిగి ఉండి ఎఫిస్ గాసిపి, పియెరిస్ రాపేలపై కీటకనాశక మరియు యాంటిఫీడెంట్ ప్రభావాలను చూపాయి.
  • డగాంగ్, అతని అనుచరులు (1992) సెలాస్ట్రస్ యాంగ్యులేటస్ గింజల నుండి రెండు సెస్క్విటెర్పిన్స్ ఆంగ్యువాల్యుమాయిడ్ జి మరియు హెచ్‌ని వేరు చేశారు. వీటిలో యాంగ్యులాట్యుయాయిడ్ జి (100 పిపియం) ఆలకోఫొరా ఫెమొరాలిస్ మరియు ఫ్లూటెలా ్లక్ౙెåలోస్టెల్లా లపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
  • సెలాస్ట్రస్ ఫ్లాజెల్లారిన్ నుంచి సెలాస్ట్రియన్ ఎ మరియు బి అనే రెండు క్రొత్త సెస్క్విటెర్పిన్ పాలిమర్ ఎస్టర్స్‌ని గుర్తించారు. వీటిలో సెలాస్ట్రిన్ ఎ (500 మి.గ్రా) మితిమా ఉపినె పై యాంటిఫీడెంట్ (93%) చర్యను ప్రదర్శించింది (దీప అండ్ బాయ్, 2010)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… కసివింద

కసివింద ఎక్కువగా ఎర్రనేలలు, గరువు భూములు, రోడ్ల ప్రక్కన, కొండల దిగువ భాగంలో గట్ల మీద ఉంటుంది. సుమారు 60-90 సెం.మీ. ఎత్తు పెరిగి బలమైన వేర్లతో పొదవలే వ్యాపించి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కలు విపరీతంగా వ్యాప్తి చెంది ఇతర మొక్కలను రాకుండా చేస్తాయి. ఆకులు బలిష్టంగా చింతాకుల వలె ఉంటాయి. పూవులు పసుపు పచ్ౘ్రంగులో కొమ్మల సందులలో గుచ్ఛాలు వలె ఉంటాయి. వీటి విత్తనాలకు మొలకెత్తే శక్తి చాలా కాలం వరకు ఉంటుంది. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : కాఫీసెన్న శాస్త్రీయ నామం : క్యాసియా ఆక్సిడెంటాలిస్ కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, వేర్లు, గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో సెన్నోసైడ్లు, నాఫ్తలిన్ గ్లెåకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఆవిరయ్యే నూనె, క్రైసోఫినాల్, ఎమోడిన్, క్రూడ్‌ఫైబర్, కాల్షియం, ఇనుము, నియోసిన్ మొదలగునవి ఉంటాయి.
  • ఈ మొక్క వేరును మిరియాలతో కలిపి పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. దీని వేర్ల కషాయం కుష్టువ్యాధి చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.
  • మొక్క సమూలంగా కోరింత దగ్గు, వ్రణాలు, బొల్లి, మూత్రకోశ వ్యాధులు, మూర్ఛవ్యాధి, హిస్టీరియా వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • కసివింద పెట్రోలియం ఈదర్ మరియు ఎన్‌బ్యుటనాల్ ద్రావణాలు (200 మరియు 300 పిపియం) క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను 100% చంపాయి. దీనిని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దీపక్ కుమార్, అతని అనుచరులు, 2014).
  • కసివింద ఆకుల క్రూడ్ ఇథనాలిక్ ద్రావణం 80 మైక్రోగ్రాములు / మి.లీ. మోతాదుకు పైన రైపిసిఫాలస్ మాన్యులేటస్ గుడ్లు పొదగడాన్ని అకారిసైడల్ చర్య ద్వారా పూర్తిగా నివారించింది. (సునీల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద జీవపురుగుమందు మొక్కజొన్న పంటలో అత్యధిక పెరుగుదలనిచ్చింది. (పంగ్నాకోర్న్, అతని అనుచరులు, 1999). అదనంగా కసివింద మొక్కజొన్న పంటనాశించే పేనుబంక, రొఫాలోసైఫం మెయిడిస్, మొక్కజొన్న తొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫ్యూమకాలిస్, ఆర్మివర్మ్, మితిమ్న సపరేటస్‌లను అత్యంత సమర్ధవంతంగా నివారించింది.
  • కసివింద ఎసెన్షియల్ ఆయిల్ రైజోపెర్తా డామినిక, ట్రైబోలియం కాస్టానియం, క్రిప్టోలెస్టెస్ ఫెర్రుజినియస్, లైపోసెలిస్ పీటాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (వాకిల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద ఆకుల నీటి ద్రావణం పునరుత్పత్తి చర్యను, చన్న పంక్టేటస్ చేపలలో యాంటిఇన్‌ఫ్లమేటరి చర్యను ప్రదర్శిస్తుంది. (మనె, అతని అనుచరులు, 2012).
  • కసివింద ద్రావణం గోధుమ గింజలనాశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగు చావు మరియు పెద్ద పురుగుల సంతతిపై అధిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది (దెర్బాలా, 2012).
  • మొక్క రక్షణ వ్యవస్థలో ప్లాంట్ ప్రోటియేజ్ ఇన్హిబిటర్ (పిపిఐ) ఒక ముఖ్యభాగం. పిపిఐ మొక్కలనాశించే పురుగులు, సూక్ష్మజీవులపై చురుకుగా పనిచేస్తుంది. క్యాసియా స్పీసీస్ యాంటి ఇన్‌సెక్టిసైడల్ మరియు యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కసివింద ఆకుల నుండి ఫిస్టులన్ అనే పిపిఐని వేరు చేశారు. ఈ పిపిఐ స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియాకోలి, బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లా న్యుమోనియాలను స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్‌కి సమానంగా అరికట్టింది (అరుల్ పాండి అండ్ సంగీత, 2012).
  • కసివింద పూల ఇథైల్ అసిటేట్ ద్రావణం నుండి వేరు చేసిన రీన్ (1,8డైహైడ్రాక్సిఆంత్రాక్వినోన3కార్బాక్సిలిక్ యాసిడ్) 1000 పిపియం హెలికోవర్పా ఆర్మిజెరాపై 76.13% యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. రీన్ హెలికోవర్పా ఆర్మిజెరా (67.5%), స్పోడోప్టెరా లిటోర (36.25)లపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. బ్రతికిన లార్వాలు రూపం మారిన పెద్ద పురుగులనుత్పత్తి చేశాయి (దురైపాండియన్, అతని అనుచరులు, 2010).
  • క్యాసియాపెన్నా ద్రావణం అత్యంత సమర్ధవంతంగా గోధుమ గింజల నాశించే ట్రోగోడెర్మా గ్రానేరియంని అరికట్టింది. ఈ ద్రావణంలో కీటకనాశక చర్యగల వివిధ జీవ చర్యలు గల కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ ద్రావణాన్ని గోధుమగింజలను ఈ పురుగు నుండి కాపాడటానికి రసాయన పురుగుమందులకు ఒక సురక్షిత ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దెర్బలా, 2017).
  • చక్రపాణి మిశ్రా విశ్వవల్లభ (అధ్యాయం 8, శ్లోకం 39)లో పురుగుల నివారణకు కసివింద, శాపిండస్ ఎమార్ౙినేటస్, కానుగ, ఆల్‌స్టోనియా స్కాలరిస్, ఎంబెలియా రైబ్స్ బెరడు పొడిని ఆవుమూత్రంలో రాత్రంతా నానబెట్టి చెట్లలో ఆశించిన భాగాలపై పేస్టుగా పూయాలని సిఫారసు చేశారు (సాథేల్, 2004)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… బుడ్డకాకర

తీగ జాతి హెర్బల్ మొక్క. టెండ్రిల్స్ ద్వారా పైకి ప్రాకుతూ 1.5-2 మీ. పొడవు పెరుగుతుంది. కాండం 5 నిలువు ఉబ్బుచారలు కలిగి ఉంటుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. చిన్న ఆకులు నూగు కలిగి ఉంటాయి. చిట్టచివరి ఆకు బల్లెం ఆకారంలో ఉండి 2-3.5 సెం.మీ. పొడవుంటుంది. చిన్న ఆకు అండాకారంలో 1-2.5 సెం.మీ. పొడవు కలిగి ఉంటుంది. ఆకు కాడ 2-3 సెం.మీ. పొడవుంటుంది. టెండ్రిల్స్ జంటలలో ఉంటాయి. ఆడ, మగ పూలు విడివిడిగా ఏర్పడతాయి. కాప్సూల్ గోధుమ రంగులో 1.53 x 2.4 సెం.మీ. పరిమాణంలో ఉండి 5 మి.మీ. వ్యాసం కలిగి ఉంటాయి.

సాధారణ నామం : బెలూన్‌వైన్ శాస్త్రీయ నామం : కార్డియోస్పెర్మం హోలికకబమ్ కుటుంబం : సాపిండేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మొత్తం మొక్క డయాఫోరెటిన్, మూత్రవర్థకం, విరేచనకారి లక్షణాలు కలిగి ఉంది. దీనిని కీళ్ళనొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, కాళ్ళు, చేతులు బిగుసుకు పోవడం, పాముకాటు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఆకులను కీళ్ళ నొప్పుల చికిత్సలో పట్టీగా వేస్తారు. ఆకుల టీని చర్మ దురదల చికిత్సలో ఉపయోగిస్తారు. వాపులపై ఉప్పుతో కూడిన ఆకులతో కట్టుకడతారు. ఆకు రసాన్ని చెవి నొప్పి చికిత్సలో ఉపయోగిస్తారు.
  • వేరుని మూత్రవర్థకం, విరేచనకారిగా ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పులు, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • మొక్క క్రూడ్ ద్రావణాలు దోమకాటుకు రక్షణ నిస్తాయి (గోవిందరాజన్ అండ్ శివకుమార్, 2012).
  • బుడ్డ కాకర ఆకు ద్రావణాలను జొన్న, మొక్కజొన్న, వరి విత్తనాల నుండి వేరు చేసిన ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కర్వులేరియా లునేట, డ్రెష్లరా హాలోడెస్, ఫ్యుజేరియం మొనిలిపార్మె, ఫ్యుజేరియం సొలాని, ఫ్యుజేరియం ఆక్సిస్పోరంపై పరీక్షించారు. ఆకుల నీటి ద్రావణం ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్ పెరుగుదలను గణనీయంగా అరికట్టింది. ఆకుల నీటి ద్రావణం ఆకుల కాలస్ ద్రావణం కన్నా సమర్ధవంతంగా పని చేసింది (గిరీష్, అతని అనుచరులు, 2011).
  • మదురై, దిండిగల్, తెని జిల్లాల్లోని మారుమూల గ్రామాలలోని గ్రామస్థులు వేప, బుడ్డకాకర, బూడిద చెట్టు, గ్లోరియోసా సుపర్పా, జట్రోపా, మునగ, ఫిల్లాంథస్ అమరస్, అవిశ, చింత, వావిలాకు, ట్రైడాక్స్ పొకంబెన్స్‌లను దైనందిన జీవితంలో పురుగుల నివారణలో ఉపయోగిస్తారు (రాజేంద్రన్, అతని అనుచరులు, 2008).
  • బుడ్డకాకర ఆకుల నీటి ద్రావణం శనగ పచ్చ పురుగు, హెలికోవర్పా ఆర్మిజరా లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (రమ్య అండ్ జయకుమార్ రాజ్, 2009).
  • బుడ్డకాకర ఆకుల ఇథనాల్ ద్రావణం ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (శ్రీనివాసన్, అతని అనుచరులు, 2014)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఇ.యం. టెక్నాలజీ

  1. బొకాషి : కావలసిన పదార్థాలు : 100 కి. వరి లేక గోధుమ తవుడు – 10 కి. ఎండిన ఆవుపేడ పాడి – 10 కి. వేరుశనగ పిండి – 5 కి. ఎండు చేప పొడి – 2 కి. బెల్లం – 12-14 లీ. నీరు – 1 లీ. ఎ.ఇ.యం. – 200 లీ. ప్లాస్టిక్ క్యాన్.

తయారీ విధానం : పైన పేర్కొన్న పదార్థాలను బాగా కలిపి ప్లాస్టిక్ క్యాన్‌లో వేసి గాలి చొరబడకుండా మూత బిగించి 8-10 రోజులు చల్లని, చీకటి ప్రదేశాలలో పులియ బెట్టాలి. చల్లగా ఉన్న సమయంలో ఒక చ.మీ. కి 100 గ్రా. చొప్పున బొకషి ఎరువుని ఇతర సేంద్రియ ఎరువులతో కలిపి భూమిపై చల్లాలి. ఒక ఎకరానికి 400 కి. బొకాషి అవసరం.

  1. ఇ.యం. 5
    కావలసిన పదార్థాలు : 600 మి.లీ. నీరు; 100 మి.లీ. బెల్లం ద్రావణం; 100 మి.లీ. యాక్టివేటెడ్ ఇ.యం.; 100 మి.లీ. బ్రాంది / రమ్ 100 మి.లీ. సహజ వినెగర్.

తయారీ విధానం : పై పదార్థాలన్నింటినీ 1 లీ. సిసాలో నింపి బాగా కలిపి చల్లని, చీకటి ప్రదేశంలో 8-10 రోజులు పులియబెట్టాలి. బాగా తయారయిన ఇ.యం.-5 తీయని, పుల్లని వాసన వస్తుంది. గ్యాస్ ఉత్పత్తి ఆగినపుడు ఇ.యం. ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. శిలీంద్రం తెగుళ్ళు, వైరస్ తెగుళ్ళు, పురుగుల నివారణకు 1 మి.లీ. ఇ.యం. 5ని 1 లీ. నీటిలో కలిపి పంటపై 3-4 సార్లు పిచికారి చేయాలి.

Read More

ఔషధ మొక్క…చిన్న తురాయి

చిన్న తురాయి సుమారు 4-5 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక పొద లేదా చిన్న చెట్టు. కొమ్మలపై అక్కడక్కడ కొద్ది సంఖ్యలో ముళ్ళు ఉంటాయి. ఎరుపు రంగు, పసుపు రంగు పూలతో దూరం నుండే చూపరులను ఆకర్షిస్తాయి. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : రత్నగంధి/పమిడి తంగేడు / పీకాక్ ఫ్లవర్ / బార్బడోస్‌ప్రైడ్ శాస్త్రీయ నామం : సీనాల్పినియాపల్చెరైమా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, పూలు, గింజలు, బెరడు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో టానిన్లు, గాలిక్ ఆమ్లం, బెంజాయిక్ ఆమ్లం, రెసిన్లు వంటి రసాయనాలు ఉంటాయి. ఆకుల కషాయం లివర్‌వ్యాధి, నీటి పుండ్లు, ఉబ్బసం, శ్వాసకోశవ్యాధులు, మలేరియా నివారణకు ఉపయోగిస్తారు.
  • ఆకులు మరియు బెరడు స్త్రీలలో ఋతుస్రావాన్ని క్రమబద్ధం చేస్తాయి. వేరుకషాయం జ్వరం నివారణకు ఉపయోగిస్తుంది. కాండం బెరడు గర్భస్రావమునకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • చిన్నతురాయి హెక్సేన్ ద్రావణం అలసంద వీవిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై గణనీయమైన కీటకనాశక చర్యను ప్రదర్శించింది. వికర్షక మరియు మరణ శాతాన్ని పెంచింది. గుడ్లు పెట్టకుండా నిరోధించడం, పునరుత్పత్తి సామర్థ్యం, పెద్ద పురుగులు విడుదల కావడం, గింజల నష్టాన్ని గణనీయంగా తగ్గించింది (మొఫునాన్స అండ్ ఎన్‌ట, 2016).
  • చిన్న తురాయి ఆకుల ద్రావణం స్నేక్ ఫ్రూట్ (సలాక ఎడ్యులిస్) కాయకుళ్ళు తెగులు కలిగించే సెరటోసిస్టిస్‌పై 89.7% అరికట్టే చర్యను ప్రదర్శించింది. ఆల్పినియా గలంగ (దుంప) ద్రావణం 92.5%, బొప్పాయి ఆకు ద్రావణం 73.3% అరికట్టే చర్యను ప్రదర్శించాయి (సుప్రాప్త, 2016).
  • చిన్న తురాయి ఆకుల క్రూడ్ ద్రావణం 375, 300, 225 పి.పి.యం. వద్ద క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సిలను 100% చంపింది. ఎర్వటోమయకొరొనేరియా మిథనాల్ ద్రావణం పై మూడు దోమలపై చిన్న తురాయి ద్రావణం కన్నా అధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (గోవింద రాజన్, అతని అనుచరులు, 2011).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

మొక్కకు పోషకాలనందించే సస్యామృతం

వివిధ రకాల ఔషధ మొక్కలు, ఆవు పేడ ఆవు మూత్రంలో పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు : ఇది మొక్కకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళను నివారిస్తుంది.

 తయారీకి కావలసిన పదార్థాలు : ఆవు పేడ - 30-40 కి.; ఆవు మూత్రం - 5 లీ.; పాలుకారే మొక్కల (పాలకొడిశ, జిల్లేడు, జట్రోఫా, బొప్పాయి మొదలైనవి) ఆకులు - 5 కి.; ఘాటైన వాసనగల మొక్కల (వయ్యారిభామ, అత్తాకోడలు, తంగేడు తదితరాలు) ఆకులు - 5 కి.; నూనె గింజల చెక్క (వేరుశనగ, ఆముదం, కానుగ, నువ్వులు, వేప) చెక్కలో ఏదైనా - 2 కి.; బెల్లం - 1కి.; నువ్వులు, కంది లేదా పొగాకు కట్టెలు కాల్చిన  బొగ్గు లేదా పిడకబూడిద; నీరు - 100 లీ.; పై పదార్థాలన్నీ పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా తొట్టి. 

తయారీ విధానం :

  • ముందుగా సేకరించిన ఆకులను తరిగి పెట్టుకోవాలి.
  • వీటిని ఆవుపేడ, మూత్రాలతో కలిపి డ్రమ్ములో వేసుకోవాలి.
  • దీనికి నూనె చెక్క బూడిద, బెల్లం కలపాలి.
  • డ్రమ్ములో వేసిన ఈ పదార్థాలను రోజు కలుపుతూ ఉండాలి.
  • తొట్టి లేదా డ్రమ్ము పై గోనె పట్టా కప్పి వుంచాలి.
  • వారం రోజుల్లో పూర్తిగా పులిసిపోయిన తర్వాత తయారైన ద్రావణాన్ని వడపోయాలి. ఆకులు, ఇతర పదార్థాల పిప్పి ఏదైనా మిగిలి వుంటే మొక్కలకు మల్చింగ్గా ఉపయోగించాలి.
  • తయారైన ద్రావణాన్ని ఎకరాకు 200 లీటర్లు డ్రిప్పు ద్వారా లేదా కాలువ ద్వారా పారించాలి.
  • మొక్కల పూత, కాత, గింజకట్టే దశల్లో 5 శాతం ద్రావణాన్ని పిచికారి చేయాలి.
Read More