ఇ.ఎం. ఉత్పత్తులు
- హరియాలి : దీనిని కంపోస్టు తయారీలో ఉపయోగిస్తారు. క్షేత్ర వ్యర్థాలు, ఆవుపేడ, పందిపెంట, కోళ్ళ చెత్త, వ్యర్థాలు, కొబ్బరిపీచు, ఘనసేంద్రియ వ్యర్థాలనుపయోగించి 45-50 రోజుల్లో కంపోస్టు తయారు చేయవచ్చు. అన్ని రకాల ఆహార పంటలు, కూరగాయల సాగులో ఉపయోగించవచ్చు.
- బొకాషి: బొకాషి అంటే పులిసిన ఎరువు. దీనిని భూమిలో వేస్తే పంట అవశేషాలు, దుబ్బులు చివికిపోవడానికి సహాయపడుతుంది.
మోతాదు : ఎకరానికి 15-20 కిలోలు అన్ని రకాల ఆహార పంటలు, కూరగాయల సాగులో ఉపయోగించవచ్చు.
- టెర్మిన్ : దీనిని సేంద్రియ పురుగు వికర్షిణిగా ఉపయోగించవచ్చు. 3-4 మి.లీ. టెర్మిన్ లీటరు నీటికి కలిపి పంటలపై 10-12 రోజుల వ్యవధిలో పిచికారి చేసి రసం పీల్చే పురుగులు, శిలీంద్ర తెగుళ్ళు, బాక్టీరియా తెగుళ్ళను నివారించవచ్చు.
- ప్రైమో :
- దీనిని మొక్కల పెరుగుదల వృద్ధి చేయడానికుపయోగిస్తారు.
- కూరగాయల పంటలలో 3-5 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి 7-10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
- ఉత్పత్తుల దిగుబడి, నాణ్యత పెరుగుతాయి.
- పూత, పిందె రాలుట తగ్గుతుంది.
- ఇ.యం. రిచ్ : సేంద్రియ ఎరువు, భూసారవృద్ధికి తోడ్పడుతుంది.
- ఇ.యం. పవర్ : సేంద్రియ ఎరువు.


