ఔషధ మొక్క…. రెడ్‌బడ్
ఇది ఒక చిన్న అలంకరణ చెట్టు. 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. 10 మీ. వెడల్పు ఉంటుంది. ఒక సంవత్సరం లేదా ఎక్కువ వయసున్న చెట్టు, కాండంతో సహా ముదరు పింకు రంగు పూలను ఉత్పత్తి చేస్తుంది. పూలు ఏర్పడిన కొద్ది సమయం తర్వాత ఆకులు ఏర్పడతాయి. ఈ చెట్టు పొడవైన బల్లపరుపు కాయలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చెట్టు నుండి వ్రేలాడుతుంటాయి. పూలను తినవచ్ౘ్ు. ఇవి తీయని ఆమ్ల రుచి కలిగి ఉంటాయి.
సాధారణ నామం : జుడాస్ ట్రీ
శాస్త్రీయ నామం : సెర్సిస్ సిలిక్వాస్ట్రం
కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- రెడ్‌బడ్‌ని అనీమియా, నిస్సత్తువ చికిత్సలో ఉపయోగిస్తారు. శతాబ్దాల నుండి దీనిని మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, శ్వాసకోశ సమస్యలు, గర్భవతుల్లో కాళ్ళ వాపుల చికిత్సలో ఉపయోగిస్త్తున్నారు. మూత్ర వర్ధకంగా పనిచేస్తుంది.
- పూలలో కెరోటిన్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని పార్ల్సేతో కలిపి రక్తం, లివర్‌లోని కొవ్వు డిపాజిట్లను కరిగించడానికి ఉపయోగిస్తారు. మెత్తని క్రీం చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తుంది. 1 కప్పు పూలను 1 కప్పు నీరు కలిపిన క్రీంలో కలిపి 20 ని. ఉడికించాలి. వడపోసి పూలను తొలగించి 3 చెంచాల విటమిన్ ఇ నూనెని క్రీమ్‌కి కలిపి, బాగా కలియత్రిప్పి స్టెరిలైజ్ చేసిన జాడీలో పోయాలి. ఈ క్రీంని గోళ్ళు లేదా చర్మంపై సమస్య వున్న చోట పూసి మసాజ్ చేయాలి.
- హెల్త్ టీ తయారు చేయడానికి పావుకప్పు తాజాపూలను ఒక పాత్రలో తీసుకుని వాటిపై ఒక కప్పు వేడి నీటిని పోసి 5 ని. నిల్వ ఉంచి వడపోయాలి. దీనికి కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. అమెరికన్ ఇండియన్స్, రెడ్‌బడ్‌ని పంటి నొప్పి నుండి బ్లాడర్ ఇన్‌ఫెక్షన్ వరకు, చర్మ మచ్ౘ్ల నుండి చీలిన కాలి గోర్ల వరకు అనేక సమస్యలకు పూలను నలగ్గొట్టి కట్టు కట్టడానికి లేదా లోషన్‌గా పూయడానికి, పూలను హెల్త్‌టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
- యూరోపియా ఖండంలో ప్రస్తుతం రెడ్‌బడ్ కషాయాన్ని విరేచనకారిగా ఉపయోగిస్తున్నారు. (రాబర్ట్స్, 2000)
వ్యవసాయరంగంలో
- రెడ్‌బడ్ ఇథనాల్ ద్రావణం (30 మైక్రో లీటర్లు / మి.లీ.) లోని రసాయనాలు 12 రోజుల తామర పురుగులు, త్రిప్స్ టబాసి పై అత్యధిక విష ప్రభావాన్ని చూపాయి (నజ్‌మిజాడె, అతని అనుచరులు, 2013).
- రెడ్‌బడ్ ద్రావణం { బదనికనల్లి, ఓరియస్ హోర్వాతి విడుదల వెస్టర్న్ ఫ్లవర్ త్రిప్స్, ప్రాంక్లినియెల్లా ఆక్సిడెంటాలిస్ పిల్ల పురుగులపై మంచి ప్రభావాన్ని చూపాయి. రెడ్‌బడ్ ద్రావణం పిల్ల తామర పురుగులను చంపింది (రజావి అండ్ అహ్మరి, 2016). తామర పురుగులు సమర్ధవంతంగా నివారించబడ్డాయి.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.


