పలు పంటల్లో సస్యరక్షణకు… వామింట కషాయం

వామింట ఆకుల కషాయం క్యాబేజి, కాలీ ఫ్లవర్‌ను ఆశించే డైమండ్ బ్యాక్ మాత్ పురుగులను నివారిస్తుంది. వంగ పంటనాశించే పొగాకు లద్దె పురుగు, పేనుబంకను నివారించే గుణం వామింట కషాయానికి వుంది. వామింట ఆకులను “పంచపత్ర కషాయం” తయారీలో కూడా ఉపయోగించుకోవచ్చు. పంచపత్ర కషాయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయ రైతులు అనేక పంటల్లో సస్యరక్షణకు వినియోగిస్తున్నారు.

శిలీంద్ర తెగుళ్ళ నివారణ కషాయం

కావలసిన పదార్థాలు: కలబంద ఆకులు (అలోవిర) 1 కిలో; బోగన్‌విల్లియా ఆకులు 1 కిలో; బొప్పాయి ఆకులు 1 కిలో; పసుపు పొడి: 200 గ్రాములు.

తయారు చేసే విధానం : పైన తెలిపిన అకులను సూచించిన మోతాదులో తీసుకుని మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రాముల పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి సన్నని సెగపై ఉడకబెట్టాలి. నాలుగయిదు పొంగులు వచ్చే వరకు బాగా కర్రతో తిప్పుతూ ఉడకబెట్టాలి. ద్రావణాన్ని బాగా చల్లారనిచ్చి, వడగట్టి ఒక ప్లాస్టిక్ డ్రమ్‌లో పోయాలి. దీనికి 100 లీటర్ల నీరు కలిపి సాయంత్రంవేళల్లో పంటపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం ఒక ఎకరం పంటకు సరిపోతుంది.

గమనిక :

  • కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డకట్టుకోవాలి.
  • పంటదశను, తెగులు ఉధృతిని బట్టి రెండుసార్ల వరకు పిచికారి చేసుకోవచ్చు.
  • ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
  • ఈ కషాయాన్ని పంటలలో వచ్చు ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు ఉపయోగించవచ్చు.
Read More

ఇ.యం. టెక్నాలజీ

  1. బొకాషి : కావలసిన పదార్థాలు : 100 కి. వరి లేక గోధుమ తవుడు – 10 కి. ఎండిన ఆవుపేడ పాడి – 10 కి. వేరుశనగ పిండి – 5 కి. ఎండు చేప పొడి – 2 కి. బెల్లం – 12-14 లీ. నీరు – 1 లీ. ఎ.ఇ.యం. – 200 లీ. ప్లాస్టిక్ క్యాన్.

తయారీ విధానం : పైన పేర్కొన్న పదార్థాలను బాగా కలిపి ప్లాస్టిక్ క్యాన్‌లో వేసి గాలి చొరబడకుండా మూత బిగించి 8-10 రోజులు చల్లని, చీకటి ప్రదేశాలలో పులియ బెట్టాలి. చల్లగా ఉన్న సమయంలో ఒక చ.మీ. కి 100 గ్రా. చొప్పున బొకషి ఎరువుని ఇతర సేంద్రియ ఎరువులతో కలిపి భూమిపై చల్లాలి. ఒక ఎకరానికి 400 కి. బొకాషి అవసరం.

  1. ఇ.యం. 5
    కావలసిన పదార్థాలు : 600 మి.లీ. నీరు; 100 మి.లీ. బెల్లం ద్రావణం; 100 మి.లీ. యాక్టివేటెడ్ ఇ.యం.; 100 మి.లీ. బ్రాంది / రమ్ 100 మి.లీ. సహజ వినెగర్.

తయారీ విధానం : పై పదార్థాలన్నింటినీ 1 లీ. సిసాలో నింపి బాగా కలిపి చల్లని, చీకటి ప్రదేశంలో 8-10 రోజులు పులియబెట్టాలి. బాగా తయారయిన ఇ.యం.-5 తీయని, పుల్లని వాసన వస్తుంది. గ్యాస్ ఉత్పత్తి ఆగినపుడు ఇ.యం. ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. శిలీంద్రం తెగుళ్ళు, వైరస్ తెగుళ్ళు, పురుగుల నివారణకు 1 మి.లీ. ఇ.యం. 5ని 1 లీ. నీటిలో కలిపి పంటపై 3-4 సార్లు పిచికారి చేయాలి.

Read More