బత్తాయి ఒక చిన్న, ముళ్ల చెట్టు. ఇది 7.5 మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు తోలు లాగా నిత్యహరితంగా ఉండి 6.5 నుండి 15 సెం.మీ. పొడవు, 2.5-9.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. ఇవి సన్నని రెక్కలతో ఆకుకాడమీద ఏర్పడతాయి. సువాసన గల తెల్లని పూలు ఒకటిగా లేదా 6 పూలున్న గుత్తులుగా ఏర్పడతాయి. పూవు సుమారు 5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటుంది. కాయగుండ్రంగా 6.5 నుండి 9.5 సెం.మీ. వెడల్పు కలిగి, పండినపుడు నారింజ లేదా పసుపు రంగులో ఉంటుంది. కాయ తోలు అనేక చిన్న గ్రంథులను కలిగి ఉంటుంది. పండు గుజ్ౙు తియ్యని రసం కలిగి ఉంటుంది. పండులో 10 నుండి 14 తొనలుంటాయి.

సాధారణ నామం : సిట్రస్ శాస్త్రీయ నామం : సిట్రస్ సైనెన్సిస్ కుటుంబం: రూటేసి
ఉపయోగాలు : ఔషధరంగలో …
- బత్తాయి పండ్లను ఆహారంగా తీసుకుంటారు. పూల నుండి టీ తయారు చేయవచ్చు. పండు తొక్క, పూలు, ఆకుల నుండి ఎసెన్షియల్ ఆయిల్ తీస్తారు. ఎసెన్షియల్ ఆయిల్‌ని హెర్బల్ ఔషధంగా ఉపయోగిస్తారు. ఎసెన్షియల్ ఆయిల్లో డిలిమోనీన్ అనే మోనోటెర్పిన్ 90% ఉంటుంది. సిట్రాల్, సిట్రొనెల్లాల్, డెకనాల్, ఆక్టనాల్ అనే ఆల్డిహైడ్స్, నెరైల్ ఎసిటేట్, ఇథైల్ ఎసిటేట్ ఎస్టర్స్ ఉంటాయి.
- ఎసెన్షియల్ ఆయిల్లో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్ లక్షణాలున్న కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పెక్టిన్ ఉంటాయి. ఎసెన్షియల్ ఆయిల్ యాంటిసెప్టిక్, యాంటిఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి మలబద్ధకం, గ్యాస్ట్రెåటస్, మోషన్సిక్నెస్, తిమ్మిర్లు, కోలిక్, ఊబకాయం, బ్రోంకైటిస్, నోటిపుండ్లు, నరాల టెన్షన్, కుంగుబాటు, వత్తిడి వంటి సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు. బత్తాయిపండ్లలో విటమిన్ ఎ, బి, సి, కాల్షియం, కాపర్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్, బయోఫ్లేవనాయిడ్స్, సహజ చక్కెర, పెక్టిన్ ఉంటాయి.
- యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జలుబులు, ఫ్లూచికిత్సలో ఉపయోగపడుతుంది. ఇది అధిక రక్తపోటుని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో
- బత్తాయి తోలు పొడి (5, 10, 15 గ్రాములు) కన్ఫ్యూజ్డ్ ఫ్లోర్ బీటిల్, ట్రైబోలియం కన్ఫ్యూజమ్ పెద్ద పురుగులను 30, 40, 43.3% చంపింది. బత్తాయి తోలు ఎసెన్షియల్ ఆయిల్ తొక్కపొడి కన్నా సమర్ధవంతంగా పని చేసింది. 10% ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం 3 రోజుల తర్వాత 100% పురుగులను చంపింది (యూనిస్, 2014).
- బత్తాయి తోలు, నిమ్మతోలు ఆవిరయ్యే ద్రావణాలు దోమ, బొద్దింక, ఈగలపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి. ఈ ద్రావణాలను పిచికారి చేసిన 30 ని. కంటే 60 ని.కి అధిక కీటకనాశిక చర్యను ప్రదర్శించాయి. బత్తాయితోలు ఆవిరయ్యే ద్రావణాలు నిమ్మ తోలు ద్రావణాలు కన్నా అధిక కీటక నాశక చర్యను చూపాయి. బొద్దింకలపై ఈ ద్రావణాలు అధికంగా పనిచేశాయి (ఎజియోను, అతని అనుచరులు, 2001).
- బత్తాయి తోలు ఎసెన్షియల్ ఆయిల్ (2.5, 3.0 మైక్రోగ్రాములు) ఆస్పర్ౙిల్లస్ నైగర్ పెరుగుదలను అరికట్టింది (శర్మ, త్రిపాఠి, 2008).
- బత్తాయి ఎసెన్షియల్ ఆయిల్ ఈగ (మస్కాడొమెస్టికా)పై అత్యధిక కీటకనాశక ప్రభావం చూపింది. దీనిని సహజ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (పలాసియోస్, అతని అనుచరులు, 2009).
- గ్రేప్‌ఫ్రూట్ (సిట్రస్ పారడైసి), బత్తాయి (సిట్రస్ సైనెన్సిస్), నిమ్మ (సిట్రస్ ఆరాంటిఫోలియా) ఎసెన్షియల్ ఆయిల్ దోమ (క్యూలెక్స్ క్వింక్విఫేసియెన్స్)పై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. ఇవి లార్వాలపైనేగాక ప్యూపా, పెద్ద పురుగుల విడుదలపై కూడా ప్రభావాన్ని చూపాయి (అబ్డెలతీఫ్, 2004).
- బత్తాయి తోలు ఎసెన్షియల్ ఆయిల్ మొక్కజొన్న వీవిల్, సైటోఫిలస్ జియామెయిస్‌పై ఫ్యూమిగేషన్ చర్యను ప్రదర్శించి 100% పురుగులను చంపింది. కాని 36% వికర్షక చర్యను మాత్రమే చూపింది(డావిట్కిడేన్, 2013).
- బత్తాయితోలు ఎసెన్షియల్ ఆయిల్ చిక్కుడు గింజల నిల్వ సమయంలో ఆశించే జబ్రోటెస్ సబ్ఫాసియాటస్ పురుగులను 24 గంటల తర్వాత 100% చంపింది. చిక్కుడు గింజలను 15 గ్రా. ఎండబెట్టిన బత్తాయి తోలు పొడి 750 మి.గ్రా. ఎసెన్షియల్ ఆయిల్‌తో శుద్ధిచేసినపుడు 65% మరియు 67% పురుగులు చంపబడ్డాయి. తోలు పొడి పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా తగ్గించింది. ఎసెన్షియల్ ఆయిల్ తక్కువ మోతాదు (30 మిగ్రా.)లో వాడినా ఒక పెద్ద పురుగు కూడా విడుదల అవలేదు. పొడి, ఎసెన్షియల్ అత్యధిక ఫ్యూమిగేషన్ చర్యను ప్రదర్శించింది (జెవ్డి, జెంబెరె, 2010).
- కిన్నో మరియు బత్తాయి తోలు, గింజల నుండి వేరు చేసిన ఆవిరయ్యే ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు ట్రైబోలియం కాస్టానియంపై విషప్రభావం చూపాయి. కమల తోలు, గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్ పురుగుపై బత్తాయి తోలు, గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్ కన్నా అధిక విష ప్రభావాన్ని చూపాయి (సలీం, అతని అనుచరులు, 2013).
- అలసంద గింజలు, నిల్వ సమయంలో అధిక నష్టం కలిగించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పురుగులను బత్తాయి తోలు ద్రావణం అత్యధికంగా మొదటి రోజే చంపింది. ఈ ద్రావణం గుడ్లు పొదగడాన్ని కూడా నివారించింది (ఒజెబొడె, అతని అనుచరులు, 2016).
- బత్తాయి (సిట్రస్ సైనెన్సిస్), నిమ్మ (సిట్రస్ ఆరాంటిఫోలియా), గజనిమ్మ (సిట్రస్ లిమన్) తోళ్ళ నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రభావాన్ని వడ్రంగి చీమల (కాంపొనేటస్నియార్ట్కికస్)పై అధ్యయనం చేశారు. అన్ని ద్రావణాలు వడ్రంగి చీమలపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. మూడింటిలో బత్తాయి తోలు ద్రావణం అత్యల్ప (82.5%) చర్యను, గజనిమ్మ తోలు ద్రావణం అత్యధిక (95%) చర్యను ప్రదర్శించాయి. నిమ్మతోలు ద్రావణం అత్యధిక మరణ చర్యను ప్రదర్శించగా, బత్తాయి తోలు ద్రావణం అత్యల్ప మరణ చర్యను ప్రదర్శించింది (అడుసెమెన్సా, అతని అనుచరులు, 2014).
- బత్తాయి ఆకుల ద్రావణం చెద పురుగుల (మాక్రోటెర్మస్ స్పీసీస్)పై 86.67% చావు చర్యను, 26.67% వికర్షక చర్యను ప్రదర్శించింది (ఒసిపిటన్, ఇసెమెమి, 2012).
- బత్తాయి (ఆకులు/తోలు) ఇథనాల్ ద్రావణం కాప్రా బీటిల్ ట్రోగోడెర్మా గ్రానేరియం 4వ దశ లార్వాలు, పెద్ద పురుగులపై లార్విసైడల్ మరియు అడల్టిసైడల్ చర్యలను ప్రదర్శించింది. బత్తాయి ద్రావణంలోని సపోనిన్స్, ఆల్కలాయిడ్స్, స్టీరాయిడ్స్, టానిన్స్, కార్డియక్ గ్లెåకోసైడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినాల్స్ వంటి సెకండరీ మెటబొలైట్స్ ఉండటం వలన కొంత కీటకనాశక చర్యను కూడా కలిగి ఉందని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి (మూసా, అతని అనుచరులు, 2016).
- కిన్నో (తోలు, ఆకులు) ఇథనాల్ ద్రావణం పొడి రూపంకన్నా నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగు, ట్రైబోలియం కాస్టానియంపై అధిక ప్రభావాన్ని చూపింది. అంతేగాక కిన్నో తోలు ద్రావణం, ఆకు ద్రావణం ఒకే రీతిలో ప్రభావం చూపాయి. ఈ ద్రావణం రసాయన పురుగు మందు, మిథోప్రెన్ తో సమానంగా పురుగుపై చర్య చూపింది (ఇరామ్, అతని అనుచరులు, 2013).
- సిట్రస్ పారడైసి, పుల్ల నారింజ, గజనిమ్మ, బత్తాయి పండ్ల తోలు నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ వోలటైల్ కాంపౌండ్స్ అలసంద బ్రూచిడ్ పెద్ద పురుగుల (కొల్లసోబ్రూకస్ మాక్యులేటస్) పై అధిక ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించాయి. సిట్రస్ పారడైసి ఆయిల్ సిట్రస్ ఆరాంటియం, సిట్రస్ లిమోనియం ఆయిల్స్ కన్నా అధిక సామర్థ్యాన్ని చూపింది. సిట్రస్ పండ్ల తోలు ద్రావణాలు అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే బీటిల్స్ నివారణలో సమర్ధవంతంగా ఉపయోగించవచ్చు అని ఫలితాలు వెల్లడించాయి (మొరావ్వెజ్, అబ్బార్, 2008).
- దీర్ఘకాలం నుండి సిట్రస్ జాతి మొక్కలు పురుగు నియంత్రణ కారకాలుగా గుర్తించబడ్డాయి. పండ్ల తోలులోని ఆయిల్స్ మెడిటోరియన్ పండుఈగ, సెరాటిటిస్, గుడ్లు, లార్వాలను చంపుతాయి (బాక్, పెంబర్టన్, 1915). పండ్ల తోలులోని వోలటైల్ కాంపౌండ్స్ కారిబ్బియన్ పండుఈగ, అనాస్ట్రెఫా సస్పెన్స్ గుడ్లను, లార్వాలను చంపుతాయి (గ్రీని, అతని అనుచరులు, 1983). వీటిలో సిట్రాల్, లిమోనెన్ కన్నా అధిక విషపూరితం. లిమోనెస్ అనేక పురుగులపై స్పర్శ మరియు ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది (టేలర్ & వికరి, 1974)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

