సాధారణ నామం : సంబరేణి మొక్క /నీర్ బ్రహ్మి శాస్త్రీయ నామం : బాకోపా మాన్నియెరి కుటుంబం: స్క్రోఫులేరియేసి
ఇది నేలబారుగా పెరిగే ఒక బహువార్షిక మొక్క. నీటి ఆధారం బాగా ఉన్న చోట ఎక్కువగా కనబడుతుంది. కణుపుల వద్ద అనేక వేర్లు తొడుగుతుంది. ఆకులు ఒక్కో కణుపు వద్ద రెండు చొప్పున వస్తాయి. ఆకులు మొదట సన్నగా ఉండి పోను పోను వెడల్పుగా మారతాయి. ఆకులు మందంగా ఉండి కనపడని ఈనెలతో ఉంటాయి. పూవులు లేత నీలం రంగు లేదా తెలుపు వర్ణంలో ఉండి ఆకుల మొదళ్ళ నుండి ఒక్కొక్కటిగా వస్తాయి. కాయలు చిన్నగా గుండ్రంగా లేదా అండాకారంలో ఉండి రెండు గదులు కలిగి ఉంటాయి. కాయలలో అనేక గింజలు సూక్ష్మంగా ఉంటాయి.
ఉపయోగాలు : ఔషధ రంగంలో
మొక్క సమూలంగా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది.
దీనిలో బ్రాహ్మైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది.
ఈ మొక్క నుండి బి1 ఆక్టలేట్, బి2 ఆక్టలేట్ మరియు బి3 క్లోరోప్లాటినేట్ లభిస్తాయి. అంతేకాక హెర్పిస్టెన్, సాపోనిన్, బాకోసైడ్ ‘ఎ’ మరియు బాకోసైడ్ ‘బి’, మొన్నియరిన్ మొదలైన ఆల్కలాయిడ్స్ కూడా లభిస్తాయి.
జలబ్రహ్మి వాతం, కఫరోగం నివారణకు, నరాల వ్యాధులకు, నొప్పి, మూర్ఛవ్యాధి, పిచ్చి, కణుతులు, పుండ్లు, అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బసం, బ్రాంకైటిస్, కుష్టు, ల్యూకోడెర్మా, బోదకాలు, నపుంసకత్వం, జ్వరం, సాధారణ బలహీనత మొదలగు వాటి చికిత్సలో ఉపయోగపడుతుంది.
ఇది జ్ఞాపకశక్తి పెంచుటకు కూడా ఉపయోగపడుతుంది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
కదంబం మధ్యస్థం నుండి పెద్దగా పెరిగే ఆకురాల్చే వృక్షం. దీని మాను స్థూపాకారంలో ఉంటుంది. శాఖలు సమాంతరంగా ఉండి శిఖర భాగం గుండ్రంగా ఉంటుంది. బెరడు చిక్కటి గోధుమ రంగులో ఉండి నిలువుగా పగుళ్ళు కలిగి పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు అండాకారం లేదా దీర్ఘ అండాకారంలో ఉండి ఎదురెదురుగా ఏర్పడతాయి. ఆకుల అడుగు భాగంలో నూగు ఉంటుంది. పూలు సువాసన కలిగి పసుపు లేదా నారింజ రంగులో గుండ్రంగా ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి పండితే పసుపు రంగులోకి మారతాయి.
సాధారణ నామం : వైల్డ్ సింఖోన / రుద్రాక్షాంబ శాస్త్రీయ నామం : ఆంతోసిఫాలస్ కైనెన్సిస్, ఆంతోసిఫాలిస్ కదంబం కుటుంబం: రూబియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
కదంబం బెరడు, ఆకులు, పండ్లు ఔషధగుణములు కలిగి ఉంటాయి. వాటిలో కాడంబైన్, ఆకడమైన్, బీటాసైటోస్టిరాల్ మొదలగు ఆల్కలాయిడ్లు మరియు కాదంబజెనిక్ ఆమ్లం ఉంటాయి.
కదంబం బెరడు టానిక్‌లా పనిచేస్తుంది. జ్వరాలను తగ్గిస్తుంది.
ఆకుల కషాయం పుండ్లు, గాయాలు మొదలైన వాటిని తగ్గిస్తుంది. పండ్లు కడుపులో వికారం మరియు జ్వరాలను తగ్గిస్తాయి.
కదంబం కాయలు మరియు పండ్లు ఆల్కహాలిక్ మరియు నీటి ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసాపై గణనీయమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి.
కదంబం మిథనాల్ ఆకుద్రావణం మరియు బయోసింథసిస్ చేసిన నిమ్మగడ్డి గోల్డ్ నానోపార్టికల్స్ క్యూలెక్స్ క్వింక్వెఫాసియేటస్ మొదటిదశ లార్వాలు ప్యూపాలు, పెద్దపురుగుల జీవితకాలాన్ని పెంచాయి. ఈ మొక్కలో ఉన్న చురుకైన రసాయనాలు లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా అరికట్టాయి. (జయలలిత, ఆమె అనుచరులు, 2016)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
అనాస ఒక మీటరు వరకు ఎత్తు పెరిగే బహువార్షిక మొక్క. కాండం దృఢంగా ఉండి, ఆకులు పొడవుగా, ముళ్ళు కలిగి ఉంటాయి. పండ్లు ఎరుపు, పసుపు మిశ్రమ రంగు కలిగి, రసంతో నిండి ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిని పిలకమొక్కలు, క్రౌన్స్ మరియు స్లిప్స్ ద్వారా వ్యాప్తి చేస్తారు.
సాధారణ నామం : పైనాపిల్ శాస్త్రీయ నామం : అనానాస్ కామోసస్ కుటుంబం: అనోనేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
అనాస పండ్లు మరియు ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. అనాస పండులో “బ్రోమోలిన” అనే ప్రోటీన్‌ని విడగొట్టే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని బాగా పెంపొందిస్తుంది.
అనాస పండ్లలో ఎక్కువగా విటమిన్ ‘ఎ’ మరియు ‘సి’ లభిస్తాయి.
సాధారణ నామం : చల్ చల్ శాస్త్రీయ నామం : అల్లోఫిల్లస్ ఎడులిస్ కుటుంబం: సాపిండేసి
గాజు చెట్టు ఒత్తెåన, గుండ్రని క్యానపి కలిగిన ఒక సగం ఆకులు రాల్చే చెట్టు. ఇది 6-10 మీ. పొడవు పెరుగుతుంది. కాండం సాధారణంగా మెలికలు తిరిగి ఉంటుంది. 20-30 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది. ఆకులు 3 చిన్న ఆకులు కలిగి ఉంటాయి. ఆకు కాడలు 24 సెం.మీ. పొడవుండి, నునుపుగా లేదా నూగు కలిగి ఉంటాయి. చిన్న ఆకులు అండాకారంలో ఉంటాయి. అంచులు రంపం పళ్ళవలె ఉంటాయి. 3 పూలు ఒక గుత్తిలో కాడ లేకుండా ఏర్పడతాయి. కాయ 5-8 మి.మీ. పొడవుండి ఒకే గింజ కలిగి ఉంటుంది.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
గాజు చెట్టు ఆకులలో ఉన్న రుటిన్ అనేక జీవ చర్యలను కలిగి ఉంది. ఇది యాంటిబాక్టీరియల్, యాంటి ఆక్సిడెంట్, యాంటిక్యాన్సర్, యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.
దీనిని డయాబెటిస్, విరిగిన ఎముకలు, ఆస్థియోపోరోసిస్, అల్సర్, గాయాలు, గుండె సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
గాజు చెట్టు నుండి అనేక సహజ ఉత్పత్తులు వేరు చేయబడ్డాయి. ఇందులో కొన్ని మొదటిసారిగా వేరు చేయబడ్డాయి. రెండు సెస్క్విటెర్పిన్స్ (6, 7 ఎపాక్సికారియో ఫిల్లీన్ మరియు స్పాతులినావ్), రెండు ఫైటోస్టిరాల్స్ (సైటోస్టెరాన్ మరియు సైటోస్టిరాల్), ఒక పెంటా అసైక్లిక్ ట్రైటెర్పిన్ (లూపియాల్) మరియు ఒక క్లీరోడేల్ డైటెర్పిన్ వేరు చేయబడ్డాయి. 6, 7ఎపాక్సికారియోఫిల్లిన్, లూపియాల్, సైటోస్టిరాల్ పేనుబంక, మైజస్ పెర్సికి, బీటిల్, ఎపిలాక్న పీన్యులేట పై డిటరెంట్ చర్య ప్రదర్శించాయి. అంతేగాక, గాజు చెట్టు కాడల క్రూడ్ ఇథనాల్ ద్రావణం ఈ రెండు పురుగులపైనే గాక వేరొక పేనుబంక రొపాలోసైఫం పాడిపై కూడా డిటరెంట్ చర్యను ప్రదర్శించింది. కాడల ద్రావణం నుండి వివిధ పురుగుల మోడల్స్‌పై పనిచేసే అనేక చురుకైన మిశ్రమాలను వేరు చేశారు. ఫలితాలు మిశ్రమంలో సినర్ౙిస్టిక్ ప్రభావాలతో పాటు యాంటి గోనిస్టిక్ ప్రభావాలను కూడా రుజువు చేశాయి. వృక్ష సంబంధ పురుగు మందులను వృద్ధి చేయడంలో పురుగులపై వివిధ రకాల చర్యలను ప్రదర్శించడమనేది ఒక కోరుకున్న లక్షణం (డయాజ్, అతని అనుచరులు, 2014).
గాజు చెట్టు లేత కొమ్మల ద్రావణం పంటపై పేనుబంక, మైజస్ పెర్సికె, స్థిరపడకుండా 70% నివారించింది (కాస్టిల్లొ, అతని అనుచరులు, 2010).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
తేనె : మొక్కల యొక్క “మకరంద గ్రంధుల” (నెక్టరీస్) ద్వారా స్రవించు మకరందం (నెక్టార్) అను తియ్యని ద్రవముతో తేనె ఉత్పత్తి అవుతుంది. తేనెపట్టులోని కూలి ఈగలు మకరందమును సేకరించుకుని తమ తేనెపొట్టలో (honey stomach) ఉంచుకునిపట్టుకువస్తాయి. పొలం నుండి ఈ కూలిఈగలు తీసుకువచ్చిన ఈ మకరందాన్ని పట్టులోని ఈగలు గదులలోకి చేర్చుతాయి. ఈ అపరిపక్వ తేనెను తేనెటీగల పొట్టలోని “ఇన్వర్టేజ్” అను ఎంజైమ్ కలుపుట ద్వారా అందులోని సంక్లిష్ట చక్కెరలు సాధారణ చక్కెరలుగా మార్చబడి పరిపక్వ తేనెగా రూపొంది పట్టులోని గదులలో నిల్వచేయబడుతుంది. ఈ ప్రక్రియలో అందులోని తేమ కూడా తగ్గించబడుతుంది.
తేనె- ఉపయోగములు
తేనెలో ఔషధ నాణ్యత, రుచి, వన్నె, రంగు మరియు సువాసన తేనె లభించిన భౌగోళిక ప్రాంతము మరియు సేకరించిన తేనెటీగల జాతిని బట్టి, ఏ రకమైన మొక్కల నుండి సేకరించినవో, దానిని బట్టి తేనెలోవ్యత్యాసముంటుంది.
మన జీర్ణ వ్యవస్థ త్వరగా తేనెలోని చక్కెరలను పీల్చుకొనుటను బట్టి త్వరగా శరీరానికి శక్తిని సమకూర్చును కాబట్టి త్వరిత గతిన శక్తినిచ్చే పదార్ధముగా తేనెను వాడవచ్చును.
తేనె ప్రకృతి సిద్ధమైన భద్రపరిచే గుణము మరియు తీపి నిచ్చే పదార్ధములు కల్గియున్నది.
తేనె-శిలింద్ర మరియు బాక్టీరియానాశిని గాను, చర్మం నుండి మలినములను బయటకు పంపి వాపును తగ్గించి, కందిపోయిన చర్మాన్నిపగలకుండా నిరోధిస్తుంది.
తేనె వాపును తగ్గించే లక్షణాన్ని బట్టి శరీరంలోని వాపును, మచ్చలను నిరోధించి అదనపు గాయాలు ఏర్పడకుండా కాపాడుతుంది.
ఆరోగ్యకరమైన కణజాల వృద్ధికి తోడ్పడుతుంది.
తేనె మంచి యాంటి ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను మరియు కేన్సర్ ను నిరోధిస్తుంది.
కణుతులు ఏర్పడకుండా చేయు గుణము తేనెలో ఉన్నది.
అల్సర్లను స్వస్థపరచుటలో చాలా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల ఆస్త్మాను, దగ్గును, వికారమును, వాంతులను బాగుచేస్తుంది.
మూత్రపిండాల ఇన్ఫెక్షన్ ను తేనె సాధారణస్థాయికి తీసుకొనివచ్చును. మూత్రనాళ రుగ్మతలను తగ్గించుటలో ఉపయెగపడుతుంది.
విరేచనకారిగా పనిచేస్తుంది మరియు పక్కతడుపు రుగ్మతలను తొలగించుటలో చాలా వుపయోగపడుతుంది.
తేనె- చిగుళ్లను ఆరోగ్యoగా వుంచి రక్త ప్రసరణను బాగా జరుగునట్లు చేయును. ఆకలిని పుట్టిస్తుంది.
అధిక మధ్యపాన సేవన ద్వారా పాడైన కాలేయాన్ని పునరుద్ధరించి కాపాడుతుంది.
రక్తాన్నిశుద్ధి చేసి హిమోగ్లోబిన్లను మరియు ఎర్ర రక్త కణాల సమతుల్యస్థితి ని కాపాడుతుంది.
కీటకముల కాట్లు మరియు విషపూరిత మైన మొక్కల విషాన్ని హరించి దురదను ఆపుచేస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచి శరీర చురుకుదనాన్ని అధికం చేస్తుంది.
ఒత్తిడి మరియు నిస్సత్తువ కు ఖచ్చితమైన విరుగుడు తేనె మాత్రమే.
తేనెతో కొన్నిగృహచిట్కాలు
క్యారెట్ ర సానికి 2 చెంచాల తేనెను కలిపి ఉదయ కాలపు అల్పాహారానికి ముందుగా రోజూ తీసుకున్నట్లయితే కను దృష్టిని వృద్ధి చేయుటలో సహాయపడుతుంది. ఎక్కువ సమయాన్ని కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
జింజివైటిస్ అనే చిగుళ్ళ వ్యాధితో బాధపడువారికి తేనె కలిపిన నీళ్లతో పుక్కిలించిన యెడల చాలా లాభదాయకంగా ఉంటుంది.
రెండు టీ చెంచాల తేనెకు అంతే మోతాదులో అల్లం రసం కలిపి సేవించిన యెడల జలుబు, దగ్గు, గుండె పట్టేసి నట్లుగా ఉన్న స్థితిని నివారిస్తుంది. ఈ మిశ్రమం ఊపిరితిత్తులలోని మ్యూకస్ ను బయటకు తెచ్చి జలుబు నుండి, దగ్గు నుండి మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగజేస్తుంది.
వెక్కిళ్ళ ను ఆపు చేయడానికి ఒక టీ చెంచా తేనెకు అంతే మోతాదులో ఆముదాన్ని ఒక పాత్రలో కలపాలి ఈ మిశ్రమంలోనికి చూపుడు వ్రేలును ముంచి చప్పరించాలి. వెక్కిళ్ళు పూర్తిగా ఆగిపోయే వరకు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఈ విధంగా చేయాలి.
ఒక గ్లాసు గోరు వెచ్చని నీటికి ఒక టీ చెంచా తేనెను మరియు ఒక టీ చెంచా నిమ్మరసాన్ని కలిపి సేవించినట్లయితే కొవ్వును తగ్గించి రక్తాన్నిశుద్ధిచేస్తుంది.
ప్రతిరోజు ఒక చెంచా తేనెను సేవించి ఆరోగ్యకరమైన జీవితాన్నిగడపవచ్చును.
చిన్నచిన్నపైనాపిల్ ము క్కలను అర చెంచాడు తేనెలో కలిపి నమిలినట్లయిన సిగరెట్ తాగాలనే ఆలోచన తగ్గుతుంది.
ఊపిరి సలప నివ్వని దగ్గు మరియు తెమడతో బాధపడుతున్న వారు ఒక చిటికెడు నల్ల మిరియాల పొడిని తేనెను కలిపి భోజనంతరువాత తాగిన యెడల దగ్గు తగ్గుతుంది.
బేఆకును (Bay Leaf) నూరగా వచ్చిన పొడిని పావుచెంచా అజువాన్ విత్తనములను (వాము) మరియు ఒక చెంచా తేనెను కలిపి ప్రతి దినం మధ్యాహ్నం మరియు రాత్రి భోజనానికి ముందు తీసుకొన్న యెడల పొట్టలో వచ్చే నొప్పి నుండి నివారణ పొందవచ్చును.
క్రమం తప్పకుండా ప్రతిరోజు కండ్లను బయట మరియు లోపల తేనెను వేసికొన్నయెడల ప్రారంభదశలో ఉన్న గ్లుకోమావ్యాధిని నివారించవచ్చు.
దీర్ఘకాలంగా జ్వరము బాధించేటప్పుడు ఒక చెంచా తులసి ఆకుల కషాయాన్నిఒక కప్పువేడి నీళ్లు పావు టీచెంచా మిరియాల పొడి మరియు ఒకటీ చెంచా తేనెను కలిపి రోజుకు రెండు మూడుసార్లు తీసుకొనవలను.
ఒక చెంచాడు తేనెకు సగం నిమ్మకాయ నుండి తీసిన రసాన్ని ఒక కప్పు గోరు వెచ్చని నీటికి కలిపి సేవించిన యెడల టానిక్ గా పని చేసి శరీరంలో ని మలినాలు తొలగించబడతాయి.
శరీరంలో ని శక్తి కోల్పోకుండా బరువును తగ్గించవచ్చును. తేనెను నిమ్మరసాన్ని తీసుకొనిన ఉపవాసంతో ఉన్న వారికి ఉపశమనంలభించును.
తేనె, లవంగ పోడి లేదా నూనెను ఉపయోగించి పేస్టులాగ ఉపయోగించి పంటి నొప్పిని నివారించవచ్చును.
రోజూ2,3సార్లు ఈ పేస్టును పంటి నొప్పి లాగే వరకు వ్రాసుకొన్నయెడల ఉపశమనం కలుగుతుంది.
రెండు గ్రాముల ఉల్లి రసానికి అంతే మోతాదులో తేనెను బాగా కలిపి గాజు కడ్డీతో కళ్ళకు రాసుకొనిన అపరిపక్వ కంటి శుక్లాలను నివారించవచ్చు.
ఒక గ్లాసు వేడిపాలకు ఒక చెంచా తేనెను కలిపి త్రాగినట్లయితే పొట్టలోని అధిక ఆమ్లాన్ని తటస్థపరచును.
ఒక మోస్తరు అల్లం తేనీటికి తేనెను కలిపి తీసికొనిన వాంతులకు మరియు వికారమునకు మంచి విరుగుడుగా పనిచేయును.
కీళ్ళవాతము, కీళ్ళనొప్పులు, అపరిపక్వ ముసలితనము, అధికబరువు, అధిక వేడికలిగిన నిస్సత్తువ, విరిగిపోయేగోళ్లు, నోటి దుర్వాసన అధిక రక్తపోటు మరియు అధిక కొలస్ట్రాల్ మోతాదులకు యాపిల్ రసంతో చేసిన వెనిగర్ తేనె మిశ్రమ చికిత్సకు సమర్ధవంతమైన విరుగుడు.
30 మి.లీ కొబ్బరి వెనిగర్ కు అంతే మోతాదులో తేనె 100 మి.లీ నీటికి కలిపి రోజుకు రెండు సార్లు ఇచ్చినట్లయితే కీళ్లకు సంబంధించిన రోగాలు తగ్గించును.
15 మి.లీ తేనెను సేవించినట్లయితే మంచి సుఖ నిద్రకు మార్గము.
25 గ్రాముల నల్ల మిరియాల పొడి, 5 మి.లి. తేనె మరియు అంతే మోతాదులో అల్లం రసం రోజుకు మూడుసార్లు సేవించినట్లయితే ఆస్త్మాకు విరుగుడుగా పనిచేయును.
ఒక టీ చెంచా తేనెను అంతే మోతాదు అల్లం రసమునకు కలిపి ప్రతి ఉదయం సాయంత్రం తీసుకొనిన యెడల అధిక రక్తపోటును నివారించవచ్చును.
తేనె- సౌందర్య సాధనము
తేనెను కొన్ని బాదం పప్పులను మరియు నిమ్మరసాన్ని కలిపి నూరి ఫేషియల్ స్క్రబ్ ఇంటిలోనే తయారుచేసుకొవచ్చు.
మెరిసే మరియు కాంతి వంతమైన కురులకు ఒక టి చెంచా తేనెను వెంట్రుకలకు పట్టించుకొనవలెను
పెదవులకు వాడే క్రీము కొరకు బాదంనూనె,తేనెటీగల మైనము మరియు తేనెల మిశ్రమాన్నిమనకు నచ్చిన పాళ్ళల్లో అయింట్మెంట్ గా తయారు చేసికొని క్రీముగా వాడుకొనవచ్చును.
నాలుగు చెంచాల తేనెను, 3 కోడి గుడ్ల తెల సొన మరియు పిండి కలిపి చేతులకు మరియు శరీరమునకు పట్టించుకొన్న యెడల లోషన్ గా గాని మాయిశ్చరైజర్ గా వాడినట్లయితే పొడి చర్మ ప్రభావాన్నితొలగిస్తుంది.
తేనె మరియు ఆల్కహాలు మిశ్రమము కేశాల వృద్ధికి తోడ్పడుతుందనే నమ్మకము గలదు.
తేనెను సేవించుటకు ముందుగా తీసికొనవలసిన జాగ్రత్తలు:
ఆయుర్వేదం ప్రకారం తేనెను ఎప్పుడుపడితే అప్పుడు సేవించరాదు.
వేడివాతావరణంలో పని చేయుచున్నప్పుడు తేనెను తినరాదు.
తేనెను ఎన్నడూ వేడిగా ఉన్నమషాలాలతో నిండిన, ఆల్కాహాలుతోగాని, నూనెతో గాని కలుపరాదు. ఎందువలన అనగా ఈ పదార్ధములలో తేనె కలిపినప్పుడు విషప్రభావం ఎక్కువగుతుంది.
తేనెను అధిక మోతాదులో తిన్నట్లయితే“మధుజీర్ణ” అనే స్థితికి దారితీస్తుంది. (తేనెఅజీర్ణము)
తేనెను 18 నెలల కన్నా తక్కువ వయస్సు గల బిడ్డలకు ఎన్నడూ తినిపించకూడదు. ఎందుకనగా తేనెలో సహజసిద్ధంగా తేనెటీగలు పుష్పాల నుంచి మకరందరమును సేకరించేటప్పుడు మకరందంతో పాటు కొన్ని బాక్టీరియా బొటులినమ్ (Bacterium botulinum) స్పోరులుంటాయి. ఇవి తేనెలో వుండి ఇన్ఫాంట్ బొటులిజం (Infant botulism) అనే ప్రమాదకరమైన స్థితి చిన్న పిల్లలలో దారి తీయవచ్చును.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము(ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము), విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము (ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము) విజయరాయి-534475, ఏలూరు జిల్లా.
చండ్ర / సండ్ర ఒక అతి ప్రసిద్ధి చెందిన చిన్న ఆకులు, ముళ్ళు కలిగిన ప్రయోజనకర ఆయుర్వేద ఔషధ మొక్క. ఈ చెట్టు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కనబడుతుంది. దీని హార్ట్ ఉడ్ నుండి తీసిన రసాన్ని కదిరసారమంటారు. దీనిని లవంగడవటి వంటి అనేక ఔషధాల్లో ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు. దీని రసం ఎరుపు రంగులో వుంటుంది. దీనిని దంత ధావనంలో టూత్ బ్రష్‌గా ఉపయోగిస్తారు. ఈ చెట్టు కొయ్యని యజ్ఞాలు, హోమాలు వంటి ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంధనంగా వాడతారు.
సాధారణ నామం : బ్లాక్ కెటచు / ఖదిర శాస్త్రీయ నామం : అకేసియా కెటచు కుటుంబం: మైమోసేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద చర్మ టానిక్ ఖదిరారిష్టను ఈ మొక్కను ప్రధాన పదార్థంగా ఉపయోగించి తయారు చేస్తారు. ఇది రోగాన్ని తగ్గించి శరీరానికి స్థిరత్వమిస్తుంది.
చండ్ర ఔషధ గుణాలు : గుణం : లఘు,రూష్ట రసం: వగరు, కషాయం రుచి : కారంగా శక్తి : చల్లదనం కలిగిస్తుంది
చర్మ వ్యాధులను నయం చేసే ఔషధ మొక్కలన్నింటిలో చండ్ర అతి గొప్పది. చండ్ర కషాయాన్ని స్నానం చేయడానికి, త్రాగడానికి ఉపయోగిస్తారు. ఖదిర కషాయాన్ని డయాబెటిస్, మూత్రాశయ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు.
కత్తాని తమలపాకు, పాన్ తయారీలో ఒక భాగంగా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
కెటచిన్ ఆధారిత పురుగు మందు ఉత్పత్తి నిల్వ ధాన్యంలో ఆశించే ట్రైబోలియం కన్‌ఫ్యూసం, ట్రైబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ కైనెన్పిస్, సైటోఫిలస్ ఒరైజే పురుగులను అరికట్టింది (ఖటున్, అతని అనుచరులు, 2011)
బ్లాక్ కెటచు నుండి వేరు చేసిన ఎపికెటచిన్ లెపిడోప్టెరా లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యని ప్రదర్శించింది (శ్రీమన్నారాయణ్ అండ్ రావు, 1985).
చండ్రచెదలను నివారించే గుణం కలిగి వుంది (హెచ్‌డిఆరఎది ఆర్గానిక్ ఆర్గనైజేషన్, సెలిమ్‌సేన్, అతని అనుచరులు, 2017)