గాంజా ఒక వార్షిక, 6-12 అ. ఎత్తు పెరిగే పూలు పూసే హెర్బల్ మొక్క. కాండం నిటారుగా పెరుగుతుంది. పెద్ద ఆకులు ఎగుడుదిగుడు అంచులు కల చిన్న ఆకులను కలిగి ఉంటాయి. మొదటి జత ఆకులు ఒకే చిన్న ఆకు కలిగి ఉంటాయి. క్రమంగా ఈ చిన్న ఆకుల సంఖ్య 7 లేదా 9 వరకు పెరుగుతుంది. మొక్క చివరలో ఏర్పడే ఆకులు ఒకే చిన్న ఆకు కలిగి ఉంటాయి. క్రింది జత ఆకులు ఎదురెదురుగా ఏర్పడతాయి. మొక్క చివరి భాగంలోని జంట ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ప్రతి మొక్కలో ఆడ, మగ పూలు ఏర్పడతాయి.

సాధారణ నామం : మార్జువానా / భంగ్‌మొక్క / కామన్ హెంప్ శాస్త్రీయ నామం : కెన్నాబిస్‌సెటైవా కుటుంబం: కెన్నాబేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- వేలాది సంవత్సరాలుగా ఔషధరంగంలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఆస్త్మా, డయేరియా, డిసెంట్రి, గనోరియ, ఎపిలెప్సి, గౌట్, మలేరియా, జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
- గౌట్, వ్రణాలు, వెర్రుకోస్‌వెయిన్, కీళ్ళ నొప్పులకు లేపనంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగులలో నాసియా, వామిటింగ్‌ల నుండి ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు.
వ్యవసాయరంగంలో
- గాంజా మొక్కను పురుగు వికర్షిణి, కీటకనాశినిగా అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పురుగులు, నులి పురుగులు, శిలీంద్రాలు, కలుపు మొక్కలను ఆటంక పరుచుటకు దీనిని సహచర పంటగా నాటుతారు. (లేడీస్టోన్, 2015)
- గాంజా మొక్క ఎండబెట్టిన ఆకులు, పూలు పురుగులు, నల్లులు, నులిపురుగులు కలుపు మొక్కలను వికర్షిస్తాయి లేదా చంపుతాయి. మొక్కల ద్రావణాలు పురుగులు, నులిపురుగులు, నల్లులు, శిలీంద్రాలు, కలుపు మొక్కలు, బాక్టీరియా, ప్రోటోజోవాలను వికర్షించడం లేదా చంపడం చేస్తాయి. (మెక్‌పార్ట్‌లాండ్, 1997)
- ప్రత్తి చేలకు దగ్గరలో గాంజా మొక్కలను పెంచితే ప్రత్తి నాశించే అలబామా ఆర్ౙిల్లేసియా (కాటన్ వర్మ్) నుండి రక్షించింది (రిలే, 1885).
- కూరగాయల పంటల చుట్టూ దీనిని పెంచితే క్యాబేజి లార్వా పియరిస్ బ్రాసికె క్యాబేజి పంటను ఆశించకుండా కాపాడింది (బెలింగ్, 1932).
- ఆలుగడ్డ క్షేత్రాలు పొటాటో బీటిల్ (లెప్టినొటార్సా డెసెమ్‌లినియేటా) ఆశించకుండా రక్షింపబడ్డాయి (స్టాట్టి, 1976).
- గోధుమ, వేరుశనగ లను డెలియాకోయార్ట్కేటా నుండి కాపాడతాయి. (పకోమోవ్ అండ్ పోటుషాన్ స్కీ, 1977),
- గాంజా వేరు రసాలు భూమిలోని వేర్లకు నష్టం కలిగించే యూరోపియన్ చాఫర్ బీటిల్ (మెలోలోంతా మెలోలోంతా) నుండి కాపాడతాయి (మటీవ, 1995).
- గాంజా చిక్‌వీడ్, స్టెల్లేరియా మీడియా, పెరుగుదలను అణచివేసింది (స్టుప్నికా రోడ్ౙింకీవిక్ౙ్, 1970).
- పొటాటోలేట్‌బ్లెåట్ శిలీంద్రం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్ ను అరికట్టడానికి ఆలుగడ్డ పంటలో గాంజాని అంతర పంటగా వేయాలి (ఇస్రాయెల్, 1981).
- ఆలుగడ్డ పంటని గాంజాతో పంట మార్పిడి చేసి పొటాటోసిస్ట్ నెమటోడ్, హిటరోడెరారోస్టోకైనెన్సిస్‌ని అణచి వేయవచ్చు. (కిర్‌యనోవా అండ్ క్రిల్, 1971).
- గాంజాతో పంట మార్పిడి రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ చిట్‌వుడి, సంఖ్యని కూడా అణచి వేసింది (కోక్, అతని అనుచరులు, 1994).
- బటన్ పుట్టగొడుగు (అగారికస్) పెంపకంలో 137 కి. కంపోస్టుకి 3 కి. గాంజా ఎండు ఆకులను కలిపి ఉపయోగిస్తే పుట్టగొడుగులను తినే నెమటోడ్, ఎఫెలెంకాయిడెస్ కాంపోస్టికోలాని అరికట్టబడింది. (గ్రెవాల్, 1989).
- గాంజా విత్తన చెక్కలను భూమిలో వేస్తే మెలాయిడోగైన్ ఇన్‌కాంగ్నిటా నులి పురుగుల సంఖ్య తగ్గుతుంది (గోస్వామి & విజయలక్ష్మి, 1986)
- ఎండు ఆకులు నిల్వ ధాన్యంలో ఆశించే ముక్కు పురుగులను వికర్షించాయి (రిలే Ê హోవార్డ్, 1892, మాకిండూ & స్టీవర్స్, 1924).
- ఆలుగడ్డ కుప్పలపై 2 సెం.మీ. మందంలో ఎండిన, పొడి చేసిన ఆకుల పొరనేర్పాటు చేస్తే పొటాటో ట్యూబర్‌మాత్ ఆశించకుండా 120 రోజుల వరకు కాపాడుకోవచ్చు. (కష్యప్, అతని అనుచరులు, 1992).
- గోధుమ గింజలకు పొడి చేసిన గాంజా ఆకులను కలిపి ముక్కు పురుగు సైటోఫిలాఒరైజే ఆశించకుండా కాపాడవచ్చు. (ఖరె, అతని అనుసచరులు, 1974).
- పూలు పూసే గాంజ మొక్కను నీటిలో వేసి మరగించి కషాయం తయారు చేసి ఆలుగడ్డ పంటపై పిచికారి చేసి పొటాటో బీటిల్, లెప్టినోటార్సాడెసెమ్ లినియేటని చంపవచ్చు. (స్ట్రాట్టి, 1976).
- 100 గ్రా. తాజా గాంజా ఆకులను 25 మి.లీ. నీటిలో కలిపి రుబ్బి, గుడ్డతో వడకట్టిన ద్రావణం 12వ దశ హిటరోడెరా కజాని నులిపురుగులను చంపాయి (మజుందార్, అతని అనుచరులు, 1989).
- 10 గ్రా. గాంజా ఆకులను 100 మి.లీ. నీటిలో రుబ్బి, పిల్టర్ పేపర్‌తో వడపోసి ద్రావణాన్ని తయారు చేశారు. 40% ద్రావణం రాగి విత్తనాల నాశించిన 25 వివిధ జాతులకు చెందిన శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది. వీటిలో ముఖ్యమైనవి ఆస్పర్ౙిల్లస్, పెనిసిలియం, క్లాడోస్పోరియం, డ్రెష్లెరా, ఫ్యుజేరియం, సెఫలోస్పోరియం, రైజోపస్, మ్యూకార్, కర్వులేరియా (పాండే, 1982).
- గాంజా ద్రావణం పైన్ నారు మొక్కలను ఫ్యుజేరియం కలిగించే తెగులు నుండి కాపాడింది (వైసోట్స్‌క్యి, 1962)
- సోవియట్ అగ్రానమిస్టులు ‘కాన్‌సాటిన్ 4” లేదా కొన్సాటిన” అనే నీటిలో కలిపిన ద్రావణాన్ని ఆలుగడ్డ పంటపై పిచికారి చేసి తెగుళ్ళు కలిగించే కొరినోబాక్టీరియం, సూడోమోనాస్, అగ్రోబాక్టీరియా స్పీసీస్‌ని నివారించారు. (జెలెపుకా, 1960, బెల్‌ట్యుకోవ, 1962).
- ఆలుగడ్డ నిల్వ సమయంలో మెత్తని కుళ్ళు కలిగించే ఎర్వినియా కెరటవోరా మరియు ఇతర బాక్టీరియాలు నివారించబడ్డాయి (విజయ్, అతని అనుచరులు, 1992)
- శ్రీవాస్తవ & దాస్ (1974) 100 గ్రా. నూరిన గాంజా ఆకులు, కాండాలను 10 మి.లీ. నీటిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరిగించి కషాయం తయారు చేశారు. ఈ కషాయం సైపరస్ రొటండస్ కలుపు మొక్క విత్తనాలను మొలకెత్తకుండా చేసింది.
- గాంజా నీటి ద్రావణాలు ఫాల్స్‌ఫామోమైల్ (మాట్రికేరియా రెకుటియేటా), లెమన్ గడ్డి (లోపిడియం సెటైవా) కలుపు మొక్కల విత్తనాలను మొలకెత్తకుండా చేసాయి (స్టుప్నికరోడ్ౙింకి విక్ౙ్, 1970).
- గాంజా ఆకు ద్రావణాలు (1,2 3, 10 మి.గ్రా/మి.లీ.) ఆపిల్ పంటలో తీవ్ర నష్టాన్ని కలిగించే కాడ్లింగ్‌మాత్ (సైడియాపోయోనెల్లా) ఆపిల్ కాయల నాశించకుండా నివారించింది. (డుర్డెన్, అతని అనుచరులు, 2011).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

