ఔషధ మొక్క…. కొత్తిమీర
కొతిమీర 50 సెం.మీ. ఎత్తు పెరిగే మెత్తని మొక్క. ఆకులు అనేక ఆకారాలలో ఉంటాయి. మొక్క మొదలు వద్ద ఆకులు వెడల్పుగా ఉండి అనేక భాగాలుగా ఉంటాయి. పూత వచ్చే కాండాలపై ఆకులు సన్నగా ఈకలులా ఉంటాయి. పూలు చిన్న అంబెల్‌పై ఏర్పడతాయి. తెలుపు లేదా లేత పింకు రంగులో ఉంటాయి. కాయ గుండ్రంగా 2-6 మి.మీ. పొడవు, 3-5 మి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.
సాధారణ నామం : కోరియాండర్ శాస్త్రీయ నామం : కోరియాండ్రం సెటైవం కుటుంబం: ఎపియేసి (అంబెల్లిఫెరే)
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- కొతిమీర బహుళ ఆరోగ్య ప్రయోజనాలు గల మొక్క. ఇది అద్భుతమైన ఆకలిని కలిగిస్తుంది. కడుపులో జీర్ణాశయంలో అనేక ఎంజైములు, జీర్ణ రసాలు స్రవించడానికి సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి విరేచనం సాఫీగా అయేలా చేస్తుంది. ఇది ఆహారంలో పీచు పదార్థం అందిస్తుంది. జీర్ణకోశంలో వాయువులను విడుదల చేస్తుంది. మలబద్దకం, మొల్లలు, కడుపునొప్పికి ప్రయోజనకారి. దగ్గు తగ్గించడానికి, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక అద్భుత యాంటిసెప్టిక్. కఫాన్ని తగ్గించి, జ్వరాన్ని పోగొట్టి చల్లదనాన్ని ఇస్తుంది.
- కొతిమీరలో అనేక పోషక విలువలుండటం వలన దీనిని “ప్రపంచ అద్భుత హెర్బల్ మొక్క”గా పరిగణిస్తారు. ఇది అనేక పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటిసెప్టిక్, బాధనాశక, ఉత్తేజిత, శిలీంద్రనాశక లక్షణాలు కలిగి ఉంటుంది.
- కొతిమీర విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఎసెన్షియల్ ఆయిల్స్, ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఆకులలో కాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, సోడియం ఉంటాయి.
- 100 గ్రా. కొతిమీరలో 3.67 గ్రా. పిండిపదార్థాలు, 2.13 గ్రా. ప్రోటీన్లు, 0.52 గ్రా. కొవ్వు, 2.80 గ్రా. పీచు, 23 కి. క్యాలరీల శక్తి, 62 మైక్రోగ్రాముల ఫోలియేట్స్, 1.11 మి.గ్రా. నియాసిన్, 0.55 మి.గ్రా. పాంటోథీనిక్ యాసిడ్, 0.14 మి.గ్రా. పైరిడాక్సిన్, 0.16 మి.గ్రా. రైబోఫ్లేవిన్, 0.067 మి.గ్రా. థయామిన్, 6748 ఐయు విటమిన్ ఎ, 27 మి.గ్రా. విటమిన్ సి, 2.50 మి.గ్రా. విటమిన్ ఇ12, 310 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటాయి.
- కొతిమీర కొలెస్టరాల్‌ని తగ్గిస్తుంది. జీర్ణకోశ కదలికలు సాఫీగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్‌కి మంచిది. అల్ౙీమర్ వ్యాధిని తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మూత్రనాళ వ్యాధులను నివారించి మూత్రం సాఫీగా పారేలా చేస్తుంది. మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
- కొతిమీరలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ కీళ్ళ నొప్పుల వల్ల కలిగే శరీర వాపుని తగ్గిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. కండ్ల కలక చకిత్సకు అద్భుత ఔషధం కొతిమీరలో ఉండే బీటాకెరోటిన్, యాంటిఆక్పిడెంట్లు కంటి సంబంధిత సమస్యలను నివారిస్తాయి. నోటి పుండ్ల నివారణకు ఇంటిమందు. ఎముకలను బలపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది. రుతు సమస్యలకు మహిళలు 5 గ్రా. కొత్తిమీర, ఒక చెంచా పంచదార అర లీటరు నీటిలో కలిపి మరగించిన కషాయాన్ని వడపోసి రోజుకి 3 సార్లు సేవించాలి. కేశ నష్టాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కోలన్ క్యాన్సర్‌ని నివారిస్తుంది.
- కొతిమీర చట్నీ తయారు చేసి వడ్డించవచ్చు. పొడి చేసిన గింజలను కేకుల తయారీలో ఉపయోగించవచ్చు. గ్రైప్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. కొతిమీర యాంటిసెప్టిక్, అనాల్ౙెసిక్, అఫ్రోడియాసిక్, యాంటిస్పాస్మోడిక్, డియోడరెంట్, ఫంగిసైడల్, స్టిమ్యుటెంట్, స్టమకిక్, యాంటి బయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొతిమీరలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. యాంటిక్యాన్సర్, యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
వ్యవసాయరంగంలో
- కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్లో లినలూల్ (57.57%), జిరానిల్ అసిటేట్ (15.09) ఎక్కువగా ఉంటాయి. ఈ రసాయనాలు ట్రైబోలియం కాస్టానియం కంటే కొల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించాయి. (ఖని, రహ్‌దారి, 2012).
- టమాట పంటలో కొతిమీరని అంతరపంటగానే వేయడం వల్ల వివిధ రసం పీల్చే పురుగులు, తెల్లదోమ (బెమిసియా టబాసి), పేనుబంక (ఎఫిస్‌గాసిపి), జాసిడ్స్ (ఎంపోవాస్కాస్పీసీస్), తామర పురుగులు (త్రిప్స్ టబాసి), రెండు మచ్ౘ్ల ఎర్రనల్లి (టెట్రానైకస్ అర్టికె) సమర్ధవంతంగా, గణనీయంగా నివారించబడ్డాయి. ఈ పరిశోధనా ఫలితాలు ఆర్థిక పంటలతో ఆకర్షక మొక్కలను పెంచే పద్ధతిని సమగ్ర సస్యరక్షణ పథకాలలో ఒక భాగంగా సిఫారసు చేసి ఆర్థిక పంటలను పురుగుల బారి నుండి రక్షించవచ్చని వెల్లడించాయి (అబోషనాబ్, అతని అనుచరులు, 2017).
- సహజ సుగంధపంటలైన పైపర్‌నైగ్రం, క్యూమినం సిమ్నియం, సిన్నమోమం వెరం, అల్లియం సెటైవం, కోరియాండ్రం సెటైనం, కర్కుమ, ఫీనిక్యులం వుల్గేర్, ట్రైగొనెల్లా ఫీనం గ్రీకం, సైజిగియం ఆరోమాటికం, క్యాప్సికం, జింజిబర్ అఫిసినాలిస్, మురయూ కోయినిగీ, బ్రాసికా నైగ్రా, సోడియం క్లోరైడ్లను కలిపిన మిశ్రమాన్ని పాటింగ్ మట్టితో కలిపి మొక్కలకు వేయాలి. ఈ జీవ పురుగు మందు వికర్షక చర్య, జీర్ణాశయంలో నిలిచిపోవడం, పక్షవాతం, ఊపిరాడకుండా చేయడం ద్వారా పురుగులను నివారిస్తాయి. ఈ జీవమందుని పొడిరూపంలో లేదా ద్రవరూపంలో పంటపై పిచికారి చేసి పురుగులను 48-72 గంటలలో నివారించవచ్చు. (గండిఐషాడోటి, 2012). ఈ జీవ పురుగు మందుని చ.మీ.కి. 100-500 గ్రా. చొప్పున వేయాలి.
జీవపురుగుమందులోని పదార్థాలు
మొక్క శాతం
పైపర్ నైగ్రమ్ 25.75
క్యుమినం సైమినం 15.45
సిన్నమోమం వెరమ్ 11.05 కోరియాండ్రం సెటైవం 12.80
కర్కుమ 7.44
ఫీనిక్యులం వుల్గేర్ 2.37
ట్రైగోనెల్లా ఫీనంగ్రీకం 3.65
సైజిగియం ఆరోమాటికం 2.58
క్యాప్సికం 1.38
జింజబర్ అఫిసినానిస్ 3.36
మురయా కోయినిగీ 1.60
బ్రాసికా నైగ్రా 0.03
సోడియం క్లోరైడ్ 0.17
- కొతిమీర ఎసెన్షియల్ ఆయిల్ ఆల్టర్నేరియా టెన్యుయిస్, ఆస్పర్ౙిల్లస్ ఒరైజె, పెనిసిలియంక్రైసోజినం శిలీంద్రాలనరికట్టాయి (డోవిగిచ్, 1971)
- జాన్‌కౌస్కా & జైట్కా (2016) క్యారట్ పంటలో కొతిమీర (కోరియాండ్రం సెటైవం), సమ్మర్ సావొరి (సాటురేజ హార్టెన్సిస్) అంతర పంటలప్రభావంపై అధ్యయనం చేశారు. అంతర పంటలు క్యారట్‌రస్ట్‌ఫ్లెå (సైలారోజే) వలన వేర్లకు కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించాయి. అంతర పంటలు వేసిన క్యారట్ క్షేత్రంలో ఆకులపై సిల్లిడ్ (ట్రైయజా విరిడ్యులా), పేనుబంక, వేర్లపై నులిపురుగుల నష్టం గణనీయంగా తక్కువగా ఉంది. కొతిమీర, సావరి అంతర పంటలుగా వేయడం వలన క్యారట్ పంటలో ప్రయోజనకర కీటకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయోగాలు జరిపిన అన్ని సంవత్సరాలలో కొతిమీరని అంతర పంటగా వేసిన క్యారట్ క్షేత్రంలో బదనికలు అక్షింతల పురుగులు, సిర్పిడ్ ఈగల సంఖ్య అధికంగా ఉంది.
- కొతిమీరలో ఉన్న లిమలూల్ (68.2%), పైనీన్ (5.5%), టెర్పినిన్ (5.5%) అనే ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే అకాంతోసెరిడస్ ఒబ్టెక్షన్‌పై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించాయి (రిగ్నాల్ట్‌రోగర్, 1997).
- కొతిమీర మొక్కలు పురుగుల సహజశత్రువులైన అల్లిక రెక్కల పురుగు (క్రైసోవా), అక్షింతల పురుగులు (కాక్సినెల్లిడ్స్), హోవర్ ఈగలు, పరాన్నజీవులైన చిన్న కందిరీగలను ఆకర్షిస్తాయి.
- కాలీఫ్లవర్ పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాకెå్ౙలోసెల్లా సమగ్ర సస్యరక్షణ పథకంలో కొతిమీరని కాలీఫ్లవర్‌లో అంతర పంటగా వేయడం ఒక పద్ధతి.
కాలీఫ్లవర్ పంటలో డైమండ్ బ్యాక్ మాత్ యాజమాన్యానికి సిఫారసు చేసిన సమగ్ర సస్యరక్షణ పథకం
క్ర.సం. ట్రీట్మెంట్ మోతాదు/ప్లాట్ ఎన్నిసార్లు ఉపయోగించాలి
1. కొతిమీరని అంతర పంటగా సాగు చేయడం అర కిలో విత్తనం ఒకసారి
2. రసాయన పురుగుమందు లోర్స్‌బాన్ (2%) పిచికారి 16 మి.లీ/8 లీ. 3 సార్లు
3. 2% వేపగింజల కషాయం పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు
4. 2% వేపనూనె పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు
5. జీవనియంత్రణట్రైకోగ్రామాకిలోనిస్ (పారసైటాయిడ్) ప్యూపాల కార్డు
(పర్వీన్, ఖాన్)
- కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్ 3వ దశ లార్వాలపై అత్యధిక ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది. (సౌగ్విర్, అతని అనుచరులు, 2013).
- కూరగాయల సాగులో కొతిమీరను సహవాస పంటగా వేస్తే పేనుబంకను వికర్షిస్తుంది. ఎర్రనల్లి, పొటాటో బీటిల్స్ ఆశించకుండా చేస్తుంది.
కొతిమీర సహజ శత్రువుల జీవిత కాలాన్ని పెంచుతుంది. అల్లిక రెక్కల పురుగు, హోవర్ ఈగ, ట్రైకోగ్రామా కిలోనిస్ పారసైటాయిడ్‌ని ఆకర్షిస్తుంది (టినాకా, 2014). - ఇర్వింగ్, అతని అనుచరులు (2014) కొత్తిమీర డాలికోగెనిడియా టస్మానికా సహజ శత్రువు జీవిత కాలాన్ని పెంచుతుందని నిరూపించారు.
- కొతిమీర నుండి సృష్టించిన కొత్త సస్యరక్షణ ఎసెన్షియల్ ఆయిల్ ఉత్పత్తులు మూడు పేనుబంక జాతులు మాక్రోసైఫం రోజే, ఎఫిస్ నెరీ, ఎఫిస్ పోమి లపై గట్టి కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అటనసోప, 2017).
- బెల్‌పెప్పర్‌లో అధిక నష్టం కలిగించే యూరోపియన్ కార్న్‌బోరర్, ఆస్ట్రినియా న్యూబిలాలిస్ సంరక్షణ జీవనియంత్రణకు అధ్యయనం జరిపారు. కొతిమీర, డిల్, బక్వీట్ అంతర పంటలను 3 బదనికలు చిన్నపైరేట్‌నల్లి (ఓరియస్ ఇన్సిడియోసస్), పింక్ మచ్చల అక్షింతల పురుగు (కోలియోయెగిల్లా మాక్యులేటస్), ఆకుపచ్చ అల్లిక రెక్కల పురుగు (క్రైసోపాస్పీ.)ని ఆకర్షించడానికి ఎంచుకున్నారు. వీటిని బెల్ పెప్పర్ ప్లాట్ల దక్షిణహద్దులో ఒకదాని తర్వాత ఒకటి 5వరుసల్లో నాటారు. బెల్ పెప్పర్ పంటలో కొతిమీర, డిల్ని కలిపి రెండు వరుసల్లో నాటారు. బక్ వీట్ని పంటలేని భూమిలో ఒక వరుసలో నాటారు.
- పరిశోధనా ఫలితాలు అంతర పంటలు బెల్‌పెప్పర్‌ని తీవ్రంగా ఆశించే యూరోపియన్ కార్న్‌బోరర్‌ని సమర్ధవంతంగా నివారించాయని వెల్లడించాయి. అంతర పంటలు చిన్నపైరేట్ నల్లి, పింక్ మచ్చల అక్షింతల పురుగులు అధికంగా యూరోపియన్ కార్న్‌బోరర్ గుడ్లను తినడాన్ని ప్రోత్సహించాయి. (బికర్టన్, హోమిల్టన్, 2017).
- ఫాబా చిక్కుడు రకాలలో కొతిమీరని అంతరపంటగా వేయడం వలన పేనుబంక పురుగులు, ఎఫిస్ క్రాక్సివొర గణనీయంగా తగ్గిపోయాయి. బదనికలు, గింజ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ప్లాట్ చుట్టూ కొతిమీర స్ట్రిప్ వేసిన 843 రకం ఫాబి చిక్కుడు ప్లాటులో అతి తక్కువ పేను బంక పురుగుల సంఖ్య నమోదైంది (రిజ్క్, 2011).
- గ్రీన్హౌస్ టమాట సాగులో తెల్లదోమ, ట్రైఎల్యురాడెస్ వేపొరేరియంపై వికర్షక పంటలు తులసి, పుదిన, డిల్, వెల్లుల్లి, ఉల్లి, పార్ల్సీ, కొతిమీర ప్రభావంపై అధ్యయనం చేపట్టారు. ముందుగా వికర్షక పంటల విత్తనాలను చల్లి తర్వాత టమాట నారు మొక్కలను నాటారు. కొతిమీరపై అతి తక్కువ తెల్లదోమలు నమోదవడం వలన దీనిని అత్యుత్తమ వికర్షక మొక్కగా సిఫారసు చేశారు (తస్లి, అతని అనుచరులు, 2017).
- కొతిమీర పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది. కొతిమీర కషాయం తయారు చేయడానికి 200 గ్రా. ధనియాలను దంచి 1 లీ. నీటిలో కలిపి 10ని. మరిగించాలి. తర్వాత ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలపాలి. ఉదయంవేళ ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలిపి పురుగాశించిన మొక్క భాగాలపై పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు. (పట్నాయక్, 2017).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

















