ఔషధ మొక్క…. గారచెట్టు / ఇంగుడి / రింగ్రి

గారచెట్టు సాధారణంగా వెడల్పులేని ఆకారంలో 10 మీ. ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు సుడివలే చుట్టుముట్టి పైకి పోయే పొడవైన, సూటి ఆకుపచ్చ రంగు ముళ్ళు కలిగి వుంటాయి. ముళ్ళ మొదళ్ళ నుండి ముదురు ఆకు పచ్చ రంగు ఆకులు ఏర్పడతాయి. ఒక్కొక్క ఆకు రెండు చిన్న ఆకులు కలిగి వుంటుంది. కాండం కొంచెం నెరిసిన గోధుమ రంగులో చిరిగిన బెరడు కలిగి వుంటుంది. పూగుచ్ఛం కొన్ని పూలగుత్తులను కలిగి వుంటుంది..

సాధారణ నామం : అడవి ఖర్జూర / ముళ్ళచెట్టు శాస్త్రీయ నామం : బలనైటెస్ ఈజిప్టియాకా కుటుంబం: జైగోఫిల్లేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఇంగుడి బెరడు, కాయగుజ్జు, గింజలు, గింజల నూనెని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇంగుడి తిక్తరసం, లఘుగుణం, ఉష్ణ, కటు, కఫ, వాత హరం గుణాలను కలిగి వుంటుంది.
  • దీనిని లేపనంగా, లోపలికి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. లేపనంగా మంటలలో కాలిన శరీరభాగాలకు, గాయాలకు, శిరో రోగాలకు, జుట్టు సమస్యలకు, మానని గాయాలకు, ఎలుక కరిచినపుడు ఉపయోగిస్తారు. కడుపులో నులిపురుగులు, మలబద్ధకం, ఆకలి మందగించడం, పొత్తికడుపునొప్పి, రక్త సంబంధ వ్యాధులు, విపరీతమైన దగ్గు, ఆస్త్మా, బ్రోంకైటిస్, డైసూరియా, ల్యూకోడెర్మా, చర్మ వ్యాధులు, ఎలుకకరిస్తే విష నివారణకు లోపలికి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. దీని మోతాదు కషాయం (50-100 మి.లీ.), పొడి (3-6 గ్రా), గింజల నూనె (5-10 చుక్కలు), కాయగుజ్జు (500-1000 మి.గ్రా.) గింజలపొడి (500-1000 మి.గ్రా.)
  • అధిక సపోనిన్స్ కలిగిన కాయగుజ్జు డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమల లార్వాలను చంపుతుంది.

వ్యవసాయరంగంలో …

  • ఇంగుడి ద్రావణం పంట కాలువలలో నత్తల గుంపులు, నిల్వ వుంచిన అలసంద గింజలను నష్టపరిచే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారిస్తుంది (రావు, అతని అనుచరులు, 1997, న్వవోగు, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే కాప్రాబీటల్, ట్రోగోడెర్మా గ్రానేరం ని అరికట్టింది (మొల్మాద;, 2003), ఇంగుడి గింజల హెక్సేన్ ద్రావణం ట్రోగో డెరా గ్రానేరియం మూడవ దశ లార్వాలను సమర్థవంతంగా చంపింది (మొహ్మద్ అండ్ సత్తి, 2013)
  • ఇంగుడి ద్రావణం అతి తక్కువ (10%) మోతాదులో అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే 85% కాల్లనో బ్రూకస్ మాక్యులేటస్ పురుగులను చంపింది (కేబాల, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి గింజల ఎపికార్ప్, మీసోకార్ప్ ద్రావణాలు యాంటిఫీడెంట్ చర్యతో అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని అరికట్టింది.
  • ఇంగుడి ద్రావణంలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, సపోనిన్స్, కార్బో హైడ్రేట్స్, టెర్పెనాయిడ్స్ వంటి రసాయనాలున్నాయి (ఉమర్ ముహ్ద్‌గుని, 2016)
  • ఇంగుడి కాయ మీసోకార్ప్ ద్రావణంలో వున్న సపానిన్స్ డెంగ్యూ వాహకం ఈడెస్ ఈజిప్టి దోమ లార్వాలను నాశనం చేశాయి (బిష్ణుచాపగన్ అండ్ జీవ్ వీస్మన్, బెన్‌గురియన్ యూనివర్సిటి, ఇజ్రాయెల్)
  • ఇంగుడి + చింతకాయల ద్రావణాన్ని ఉపయోగించి ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్‌ల విషపూరిత పదార్థాల వల్ల ఆహారం కలుషితమవకుండా కాపాడవచ్చు (ఎల్. నగర్ బి, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి పచ్చి కాయ ద్రావణం పిచికారి చేసిన 3వ రోజు తర్వాత పిండినల్లి ఫెరిస్టా విర్గేటా నివారించబడింది. పిచికారి చేసిన 7వ రోజు పిండి నల్లులు కనిపించలేదు (వబలె, అతని అనుచరులు, 2010).
  • ఇంగుడి ద్రావణం గొర్రెల నాశించే ఈగ ల్యూసిలియా సెరికేటా మూడు దశల లార్వాలను నివారించింది (మొహ్మద్, అతని అనుచరులు, 2016)
  • ఇంగుడి ద్రావణం రైజోక్టోనియా సొలాని శిలీంద్రం పెరుగుదలను గరిష్టంగాను, ఫిథియం అఫానిడెర్మేటం శిలీంద్రాన్ని కనిష్టంగాను అరికట్టింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. వేప

వేప జన్మ స్థానం భారతదేశం. ఈ చెట్టు సుమారుగా 50 అడుగుల దాకా ఎత్తు పెరుగుతుంది. ఫిబ్రవరి, మార్చిలలో పూలు పూస్తాయి. పూలు తెలుపు రంగులో గుత్తులుగుత్తులుగా ఉండి మంచి సువాసన కలిగి ఉంటాయి. ఏప్రిల్ మాసం చివరికి కాయలు వస్తాయి. వేప చెట్టులోని బెరడు, ఆకులు, కాయలు, పండ్లు, గింజలు, ఆకులు, కలప సమస్తం ఉపయోగపడుతాయి. వేప, మన నిత్య జీవితంలో ఆరోగ్య సమస్యలకు ఔషధముగా, సౌందర్య సాధనాలుగా, వ్యవసాయంలో క్రిమిసంహారిణిగా, ఎరువుగా, కలపగా ఉపయోగపడుతుంది. వేప పువ్వుని సేకరించి ఎండబెట్టి చూర్ణం చేసి ఎన్నో జీర్ణశక్తిని పెంచే ఔషధాలలో వాడుతారు. వేప కలపకు దీర్ఘకాలం మన్నే గుణం ఉంది. అందుకే ఈ కలపను నిర్మాణ రంగంలో విరివిగా ఉపయోగిస్తారు. వ్యవసాయ పనిముట్ల తయారీకి కూడా వాడతారు. వేప బెరడును చర్మవ్యాధులకు, జ్వరాలకు, అంటువ్యాధులకు సంబంధించిన ఔషధాలలో వాడుతారు.

సాధారణ నామం : వేప శాస్త్రీయ నామం : అజాడిరిక్టా ఇండికా కుటుంబం: మీలియేసి

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • వేప గింజలతో తీసిన నూనెను సౌందర్య సాధనాల తయారీకి, ఔషధాల తయారీలో, వ్యవసాయ రంగంలో క్రిమిసంహారిణిగా వాడుతారు.
  • వేప గింజల నుండి తయారైన వేప పిండిని ఎరువులలో, క్రిమిసంహారక మందులలో వాడుతారు.
  • వేపపిండి, వేపాకులు భూమిలో వేసి కలియదున్నట వలన కొన్ని రకాల శిలీంద్ర తెగుళ్ళను నివారించవచ్చు.
  • వేపనూనె పిచికారి చేయటం వలన, జామ, కాలీఫ్లవర్, సపోటా, అరటి వంటి పండ్ల మొక్కలను ఆశించే నులి పురుగులను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చు.
  • వేప గింజల పొడిని వరి, గోధుమ, జొన్న, పప్పుధాన్యాల వంటి గింజలలో కలిపి నిలువ చేస్తే కీటకాల బారి నుంచి అరికట్టవచ్చు. వందకిలోల ధాన్యానికి ఒక కిలో వేప గింజల పిండి సరిపోతుంది. దీని వలన ధాన్యం రంగు, రుచి, వాసనల్లో ఎలాంటి మార్పులు రావు. అంతేకాదు. సుమారు 9 నెలలు సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. ధాన్యం నిల్వ కాలాన్ని పొడిగించాలంటే, మళ్ళీ ఇంకొక కిలో వేప గింజల పొడి చేర్చి నిల్వ చేసుకోవచ్చు.
  • టమాట నారు నాటే ముందు వేప నూనె ద్రావణంలో గాని, వేప గింజల కషాయంలో గాని ముంచి నాటినట్లయితే ఎండుతెగులును అరికట్టవచ్చు.
  • మిరపలో వేరు పురుగుల బెడదను నివారించటానికి 250 కిలోల వేపపిండిని ప్రతి హెక్టారు విస్తీర్ణంలో ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.
  • వేప నూనె మందుల్ని ఉదయం లేదా సాయంత్రం పూట చల్లని వాతావరణంలో పిచికారి చేయవలసి ఉంటుంది. అంతేకాని, మిట్ట మధ్యాహ్నపు ఎండలో పిచికారీ చేసినట్లయితే సూర్యరశ్మి వలన దీని ప్రభావం త్వరగా తగ్గిపోతుంది. – రాంబాబు, ఆహార్ కుటీర్

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

దశపత్ర కషాయం తయారీ ఎలా?

కావలసిన ఆకులు, పదార్థాలు: పిచ్చి తులసి - 250 గ్రా., తులసి - 250 గ్రా., పాలకొడిశ - 250గ్రా., తుత్తురుబెండ - 250 గ్రా., పొగాకు- 250 గ్రా., కాగితంపూల ఆకులు - 250 గ్రా., వేపాకులు - 250 గ్రా. టేకుఆకులు - 250 గ్రా., కలబంద - 250 గ్రా., బొప్పాయి ఆకులు - 250 గ్రా.

పైన సూచించిన ఆకులను మెత్తగా నూరి ముద్ద చేయాలి. దీనిని ఒక పెద్ద కుండలోగానీ లేదా ప్లాస్టిక్ డ్రమ్ములో గానీ వేసి దానికి 5 లీ. ఆవుమూత్రాన్ని, 5 లీ. నీరు కలపాలి. ఈ ద్రావణం ఉంచిన కుండపై మూతపెట్టి 10 రోజుల పాటు ప్రతిరోజు ద్రావణాన్ని సవ్య, అపసవ్య దిశలలో బాగా కర్రతో కలుపుతూ ఉండాలి. తరువాత ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి. ఈ ద్రావణానికి 150 లీ. నీరు కలిపి ఒక ఎకరా పొలంలో సాయంత్రం వేళ పంటపై పిచికారీ చేయాలి.
Read More

ఔషధ మొక్క…. పనస

పనస 20 మీ. ఎత్తు పెరిగే వృక్షం. బెరడు నలుపు రంగులో లేదా ఆకుపచ్చ మచ్చలతో నునుపుగా ఉంటుంది. మానులోపల పసుపు రంగులో ఉంటుంది. దీని ఆడ, మగ పూలు లేత ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటాయి. పూలు మానుపైనే ఏర్పడతాయి. ఆడ కంకులలోని పూలన్నీ ఫలదీకరణం చెంది ఒకే పెద్ద పండు తయారవుతుంది. పండ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇది విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : జాక్‌ఫ్రూట్ ట్రీ శాస్త్రీయ నామం : ఆర్టోకార్పస్ హిటరోఫిల్లస్ కుటుంబం: మోరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పనస ఆకులు, వేర్లు, పండ్లు, గింజలు, చెక్క, పాలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. పండ్లలో పిండిపదార్థాలు, అమైనోఆమ్లాలు, బీటాకెరోటిన్ ఉంటాయి. పండులోపల గల జిగురులాంటి పదార్థంలో ల్యూసిన్, ఐసోల్యూసిన్, టైరోసిన్, వాలైన్ ఉంటాయి.
  • మానులోపలి కర్రభాగంలో మోరిన్, ఆర్టోకార్పిన్ మొదలగు రసాయనాలుంటాయి. లేత ఆకులను వాపులకి, గాయాలకు కాపుపెట్టడానికి ఉపయోగిస్తారు.
  • లేత పనస కాయకూర మేధస్సును వృద్ధి చేస్తుంది. బలం, వీర్యపుష్టినిస్తుంది.
  • గింజల పొడిని గిరిజనులు ఆహారంగా ఉపయోగిస్తారు. పనస చెట్టు చెక్క మరియు కొద్దిగా మిరియాలు కలిపిన పొడి మందు గజ్ౙి, తామర, దురదలను పోగొడుతుంది. దీనిని విరేచనాలు అరికట్టడానికి, కడుపులో పుండ్ల నివారణకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • పనస ఆకుద్రావణం పర్యావరణహిత లార్విసైడ్‌గా పనిచేస్తుంది. ఇది బ్రూకస్‌పైసోరం, ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ ఒరైజెపై కీటకనాశక చర్యను కూడా ప్రదర్శించింది (నాయిర్ అండ్ కర్వేకర్, 2017).
  • పనస గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఎస్కరిచియాకోలి, సూడోమోనాసఈరూజినోసా, స్టెఫైలోకోకస్ ఆరియస్‌లపై అత్యంత సమర్ధవంతమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (జా అండ్ శ్రీవాస్తవ, 2013).
  • పనస లేటెక్స్ హెక్సనాయిక్, మిథనాలిక్, పెట్రోలియం ఈదర్, క్లోరోఫాం ద్రావణాలు స్పోడోప్టెరాలిటూర లార్వాలను 90-95% చంపాయి. ఇవి లార్వాల బరువును గణనీయంగా తగ్గించాయి (ఉపాధ్యాయమ్, 2013).
  • పనస వేర్లు, కాండాలు, ఆకులు, గింజలలో ఉండే అసిటోజెనిన్స్ శక్తివంతమైన పురుగు మందు లక్షణాలు కలిగి ఉంటాయి (నజ్‌ముల్‌హక్, 2006).
  • పనస పచ్చి ఆకులను మేకలకు మేతగా వేస్తారు.
  • ఎండిన ఆకులను వంటచెరకుగాను, కంపోస్టు తయారీకి, ఆచ్ఛాదన చేయడానికి ఉపయోగిస్తారు (ప్రాక్టికల్ మాన్యువల్, 2006).
  • పనస కాండం, వేరుబెరడు, కాండం, వేరుహార్ట్‌వుడ్, ఆకులు, కాయలు, గింజల మిథనాల్ ద్రావణాలు అనేక బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (ఖాన్, అతని అనుచరులు, 2003)
  • పనస డైక్లోరోమిథేన్ ద్రావణం పల్స్ బీటిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ గుడ్లు పెట్టకుండా, పెద్ద పురుగులు విడుదలవకుండా నిరోధించాయి (జయకుమార్, అతని అనుచరులు, 2005)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. దవనం

దవనం ఒక వార్షిక, నిలువుగా పెరిగే, కొమ్మలు కలిగిన సువాసన గల మొక్క. ఇది 40-60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు నీలిఆకుపచ్చ రంగులో, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఆకులు కాడ కలిగి ఉంటాయి. పూలు పసుపు రంగులో ఉంటాయి. దీనిని దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా పెంచుతారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ‘దవననూనె’ అని పిలుస్తారు..

సాధారణ నామం : దవన శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా పాల్లెన్స్ కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దవనం ఎసెన్షియల్ ఆయిల్ అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉంది.
  • వైరల్ రోగాలకి సమర్ధవంతమైన రక్షణ కవచం నిర్మిస్తుంది. శరీర అంతర, బాహ్య గాయాలను మాన్పుతుంది.
  • దవనం యొక్క శక్తివంతమైన ఎసెన్షియల్ ఆయిల్ ఇన్ఫెక్షన్స్ కలిగించే బాక్టీరియా, సూక్ష్మజీవులు, శిలీంద్రాలు, వైరస్‌లతో పోరాడి అవి కల్గించే వ్యాధులను నయం చేస్తుంది.
  • మహిళలలో రుతుచక్రాలను క్రమబద్ధీకరిస్తుంది. శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
  • దవనం ఎసెన్షియల్ ఆయిల్ శరీరంలోని కండరాలు, రక్తనాళాలను వదులు చేసి మెదడు, నరాల వ్యవస్థకు కూడా విశ్రాంతినిస్తుంది. తద్వారా ఆందోళన, వత్తిడి, డిప్రెషన్, కోపాన్ని అదుపులో ఉంచుతుంది. దీనివలన మంచి నిద్రపోవచ్చు. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది.

వ్యవసాయరంగంలో :

  • దవనం (ఆర్టెమిసియా జొడైకా) ఎసెన్షియల్ ఆయిల్ (50%, 40%)తో శుద్ధి చేసిన 72 గంటల తర్వాత కాల్లొసోబ్రూకస్ మాక్యులేటస్ (అలసంద వీవిల్) పెద్ద పురుగులను అతి సమర్ధవంతంగా అరికట్టింది. ఎసెన్షియల్ ఆయిల్‌లోని పైపర్టోన్ (32.4%), కాంఫర్ (20.6%), (ఇ) ఇథైల్‌సిన్నమేట్ కీటకనాశక లక్షణాలు కలిగి ఉన్నాయి. (అబ్డఎలక్షహాడి, 2012).
  • దవనం వేర్లలో అనేక ఎలిమెంట్స్ ఉంటాయి.
  • దవనం ఎసెన్షియల్ ఆయిల్‌లని పెస్టాసోలైడ్ ‘ఎ’, స్పైరో అజఫిలోన్‌డెరివేటివ్ క్యాండిడా ఆల్బికాన్స్, జియోట్రైకం కాండిడం, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్‌పై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.
  • దవనం (ఆర్టెమిసియా హెర్బా ఆల్బా) ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, ప్రత్యేకంగా రైజోపెర్తా డామినిక పురుగులను నివారించే శక్తి కలిగి ఉంది (పరిషియాన్, అతని అనుచరులు, 2012).
  • దవనం (ఆర్టెమిసియా వుల్గారిస్) కాండంలోని ఎసెన్షియల్ ఆయిల్ ఈడెన్ ఈజిప్టి దోమ లార్వాలపై లార్వానాశక చర్యను ప్రదర్శించింది. సహజ పురుగు మందులనుపయోగించి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. (సుజాత అండ్ రంచితకుమారి, 2012).
  • బ్రిటిష్ కొలంబియాలో కుందేళ్ళు, కోళ్ళనాశించే పరాన్నజీవుల చికిత్సకు దవనం మొక్కనుపయోగిస్తారు (లాన్స్ అండ్ టర్నర్, 2011)
  • దవనం (ఆర్టెమిసియా యాన్యువ) ఎండిన ఆకులు (2% పొడి / 250 గ్రా. అలసంద గింజలకు) బ్రూచిడ్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (బ్రిసిబె, అతని అనుచరులు, 2011).
  • దవనం మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల పొడి కుళ్ళు కల్గించే ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టి దుంపలను పొడికుళ్ళు ఆశించకుండా కాపాడింది. (జాకర్, 2014).
  • దవనం (ఆర్టెమిసియా పార్విఫ్లోరా) క్రూడ్ ద్రావణం సజ్ౙలో వెర్రికంకి తెగులు కల్గించే స్ల్కీరోస్పోరా గ్రామినికోలా శిలీంద్ర బీజాలుండే స్పొరాంజియా ఏర్పడకుండా పూర్తిగా నివారించింది (దీపక్, అతని అనుచరులు, 2007).

దవనం ఎసెన్షియల్ ఆయిల్స్ నివారించే ధాన్యంలో ఆశించే పురుగులు

Read More

ఔషధ మొక్క… మోషపత్రి

మోషపత్రి ఒక వార్షిక మొక్క. దీని కాండం నిటారుగా ఉండి గోధుమ రంగు లేదా ఊదా గోధుమ రంగుతో ఉంటుంది. మొక్క నూగు లేకుండా సహజంగా 30 నుండి 100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 3-5 సెం.మీ. పొడవుండి 2 లేదా 3 చిన్న ఆకులుగా విడిపోతాయి. ఆకులు అధిక సువాసన కలిగి ఉంటాయి. ఎండిన ఆకులలో 0 నుండి 1.5% వరకు ఆర్టెమిసినిన్ రసాయనముంటుంది. పూలు 2-2.5 మి.మీ. వ్యాసంతో వదులుగా ఉన్న కంకులతో ఏర్పడతాయి. వాటి రంగు ఆకుపచ్ౘ్పసుపు రంగులో ఉంటుంది. గింజలు గోధుమ రంగులో 0.6-0.8 మి.మీ. వ్యాసంలో ఉంటాయి. సగటు 1000 గింజల బరువు 0.03 గ్రా.

సాధారణ నామం : స్వీట్ వార్మ్‌వుడ్/స్వీట్ అన్నీ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా యాన్యువా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మోషపత్రిని సంప్రదాయకంగా మలేరియా అనుబంధ జ్వరాలతో సహా జ్వరాల చికిత్సకుపయోగిస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మోషపత్రిలో ఉండే ఆర్టెమిసినిన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
  • మోషపత్రి రసంలో ఉండే ఆర్టెమిసినిన్, ఆర్టెసునేట్‌లు క్యాన్సర్ చికిత్సలో అధ్యయనం చేయబడుతున్నాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇవి ముఖ్యంగా డీసెంట్రి, సాధారణ జలుబు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారణలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆకలి లేకపోవడం, ఇతర జీర్ణ సంబంధ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. సోరియాసిస్, ఎక్ౙిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • మోషపత్రి ఆకు ద్రావణం అధిక నష్టం కలిగించే లెస్సర్ మల్బరి పైరాలిడ్, గ్లెåఫోడెస్ పైలోయాలిస్ గుడ్లు పొదగడాన్ని అరికట్టింది (రోయాకోస్రలి, అతని అనుచరులు, 2010).
  • మోషపత్రి ఆకు ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగుల నివారణలో అనేక విధాలుగా బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి వికర్షక, ఫూమిగెంట్, యాంటిఫీడెంట్, ఎంజైమ్‌ల చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పులు తెచ్చే పురుగులను నివారించాయి (సెండి, కోస్రలి, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా ఎర్ర చీమలను నివారించాయి (లియాంగ్ టాంగ్, అతని అనుచరులు, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ మరియు ద్రావణాలు వికర్షక, ఫ్యూమిగెంట్, యాంటీ పీడెంట్ చర్యలు, ఎంజైమ్ చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పు చర్యల ద్వారా పురుగులను సమర్ధవంతంగా నివారించాయి.
  • మోషపత్రి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్ ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా నివారించింది (జులాటి సెండి, అతని అనుచరులు, 2003)
  • మోషపత్రి వేరులోని ఎసెన్షియల్ ఆయిల్ 80% ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులను నివారించింది (గోయెల్, అతని అనుచరులు, 2007)
  • మోషపత్రి { మిరప ద్రావణాల మిశ్రమం ప్రత్తి పంటలో గులాబి రంగు కాయతొలుచు పురుగు (పెక్టినోఫొరా గాస్సిపియెల్లా)ను సమర్థవంతంగా నివారించింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు ట్రెబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లపై విషపూరిత మరియు వికర్షణ ప్రభావాలను చూపించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2000).
  • మోషపత్రి ద్రావణం (500 పిపియం మరియు 250 పిపియం) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట, రోటివెంక్యులస్ రెనిఫార్మిస్ నెమటోడ్లను నివారించింది (షకీల్, అతని అనుచరులు, 2004).
  • మోషపత్రి ఆల్కహాల్ ద్రావణం (32.69%) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట గుడ్లను అత్యంత సమర్థవంతంగా పొదగకుండా చేశాయి (కటారి, అతని అనుచరులు, 2011).
  • మోషపత్రి 15, 10, మరియు 5% మిథనాల్ ద్రావణాలు పొటాటో పొడి కుళ్లు కల్గించే శిలీంద్రం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టడం, శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా చేయడంలో అత్యుత్తమ ప్రభావం చూపాయి. మోషపత్రి15% మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల నిల్వ సమయంలో వేరుకుళ్ళు (డ్రైరూట్ రాట్) తెగులు ఆశించకుండా కాపాడింది (మసౌద్ జాకర్, 2014).
  • మోషపత్రి ద్రావణం క్యూలెక్స్ లార్వాలను నివారించింది (శర్మ, శ్రీవాస్తవ, 1998).
  • మోషపత్రి ద్రావణం కాలీఫ్లవర్ నాశించే డైమండ్ బ్యాక్‌మాత్ ప్లూటెల్లాక్ౙెలోస్టెల్లా గుడ్లను 77.7% చంపింది (రాకేష్‌కుమార్, అతని అనుచరులు, 2009).
  • మోషపత్రి ద్రావణం ప్రత్తి పంటనాశించే గులాబి రంగు కాయతొలుచు పురుగు లార్వాలు, జీవిత చక్రం, జీవిత కాలం, గుడ్లు పెట్టే సామర్థ్యం, గుడ్లు పొదిగే శాతంపై ప్రతికూల ప్రభావం చూపింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎండుఆకులు కలుపు మొక్క రెడ్‌రూట్ పిగ్ వీడ్‌పై అల్లెలోపతి ప్రభావం చూపాయి. (లైడాన్, అతని అనుచరులు, 1997).
  • మోషపత్రిలో ఉండే అర్టెమిసినస్ అనే రసాయనం స్ట్రెåగా విత్తనాలు మొలకెత్తడాన్ని నివారించింది. కాని చిక్కుడు, మొక్కజొన్న విత్తనాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (గోమెజ్, 2011).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారించడానికి ఉపయోగించవచ్చు. (మొటాగి, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి తాజా ఆకులు, ఎండిన పదార్థం నుండి తయారు చేసిన ద్రావణాలు బఠాణి పేనుబంక (ఆక్రితోసైఫం పైసమ్) రెక్కలు లేని ఆడపురుగులు, లార్వాలను చంపాయి. అంతేగాక, ఎండు పదార్థం కొలరాడో బీటిల్ పెద్ద పురుగులు తినడాన్ని అరికట్టాయి. ఎండు పదార్థం ద్రావణాలు (5%, 10%), తాజా ఆకుల ద్రావణం (30%) లీఫ్ బీటిల్ లార్వాల నష్టాన్ని తగ్గించాయి (మిలెనారూసిన్, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా హెర్బాఆల్పా ఎథిరిక్ ద్రావణం గ్రీన్‌పీచ్ ఎపిడ్, మైజస్ పెర్సికెని 100% నివారించింది (బిలాల్‌నియ, అతని అనుచరులు, 2015)
  • ఆర్టెమిసియా వుల్గారిస్ అద్భుతమైన యాంటిఫీడెంట్ లక్షణాలు కలిగి ఉంది (గురుసుబ్రమణ్యం, అతని అనుచరులు, 2008). ఈ మొక్కను పూత రాక ముందు సేకరించి ఆకులను, కాండాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక కిలో కత్తిరించిన ఆకులు, కొమ్మల ముక్కలను ఒక బకెట్‌లో తీసుకుని 10 లీ. నీరు పోసి 16-24 గంటలుంచాలి. తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసి తేయాకు పంటనాశించే పురుగుల నివారణకు పిచికారి చేయాలి. 10% ద్రావణం పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు.
  • మోషపత్రి అగ్రో మరియు డిస్టిలేషన్ వ్యర్థాలనుపయోగించి తయారు చేసిన వర్మికంపోస్టు టమాట రూట్‌నాట్ నెమటోడ్‌ని సమర్థవంతంగా నివారించింది (పాండె & కల్రా, 2010).
  • ఆర్టెమిసియా స్పీసీస్‌ని టమాట రూట్‌నాట్ నెమటోడ్ యాజమాన్యంలో జీవ సేంద్రియ వ్యర్థంగాను, ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం గాను ఉపయోగిస్తారు (బావ, అతని అనుచరులు, 2014, పాండె, 2005).
  • మెలాయిడోగైన్ ఇన్ కాగ్నిట (నెమటోడ్) యాజమాన్యంలో మోషపత్రి భూమి క్రింది భాగం (వేరువ్యవస్థ) వికర్షక చర్య ప్రదర్శిస్తుంది. మాషపత్రి వోలటైల్ రసాయనాలలో మోనోటెర్పిన్స్, సెస్క్యిటెర్పిన్స్ అధికంగా ఉంటాయి. అందువలన దీనిని \మాటలో అంతర పం\గా వేసి రూట్‌నాట్ నెమటోడ్‌ని నివారించవచ్చు. (సిడ్ని మ్వాంబ, 2016).
  • మోషపత్రి ద్రావణాన్ని ఉపయోగించి పొగాకు పంటనాశించే పేనుబంకను నివారించవచ్చు. ద్రావణం తయారీకి తాజా ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టి, ఆల్కహాల్‌లో రాత్రంతా నానబెట్టాలి. ఈ ద్రావణం పొగాకు పేనుబంకను సమర్ధవంతంగా చంపుతుంది. పొగాకు మొగ్గతొలిచే పురుగుని ఇథనాల్ ద్రావణం సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • మోషపత్రి మిథనాల్ ద్రావణం లెస్సర్ మల్బరి పై రాలిడ్ (గ్లెåసోడెస్ పైలాలిస్)ని పంటనాశించకుండా ఆటంక పరచింది (రోయాకోసార్వి, అతని అనుచరులు, 2010).
  • ప్రత్తి మరియు ఇతర ముఖ్య పంటలనాశించే శనగపచ్చ పురుగు (హెలివకోర్సా ఆర్మిజెరా) నివారణకు మాషపత్రి ఎసెన్షియల్ ఆయిల్‌ని సిఫారసు చేశారు (మహ్‌బేబ్‌కర్, అతని అనుచరులు, 2015).
  • మోషపత్రి ఎసెన్షియర్ ఆయిల్ మరియు ఆకు ద్రావణాలను హెలికోవర్మా ఆర్మిజరాలార్వాల ఆహారంలో కలిపితే లార్వాల బరువు 69.71% మరియు 60.21% తగ్గింది (నీలిమ అన్షుల్, ఆమె అనుచరులు, 2014)
  • గుమ్మడి నారు మొక్కలలో పురుగుల నివారణకు మాషపత్రి ద్రావణం పురుగులను తట్టుకునే చర్య కలిగి ఉంది (యుయు, 2017)
  • మాషపత్రి ఆకులు, కాండం, పూల నుండి తయారు చేసిన ద్రావణాన్ని గుమ్మడి ఆకు కణాలపై ఒక చదరపు సెంటీమీటరుకి 1.5 మి.గ్రా. చొప్పున పిచికారి చేస్తే 100% ఎపిలాక్నా పీన్సులేటా లార్వాలు 87% స్పోడోప్టెరా ఎరిడానియా లార్వాలు తినకుండా ఆటంక పరచబడ్డాయి (డిటర్రెంట్ చర్య). (మాగి, ఆమె అనుచరులు, 2005)
  • మోషపత్రి ద్రావణం పొటాటో సిస్ట్ నెమటోడ్ (గ్లోబోడెరా రోస్టోకైనెన్సిస్) చిన్న పురుగులను అతి సమర్ధవంతంగా నివారించింది. కాని మెలాయి డోగైన్ ఇన్‌కాగ్నిట చిన్న పురుగులు (జువైనైల్స్) ఎక్కువ కాలం బయలుపరిచితేనే చనిపోయాయి. దీనికి విరుద్ధంగా ఈ ద్రావణం ప్రభావం మెలాయిడోగైన్ గుడ్లు పొదగడాన్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది కాని గ్లోబొడెరాపై అత్యంత తక్కువ ప్రభావం చూపింది. సేంద్రియ వ్యవసాయంలో సుస్థిర నులిపురుగుల యాజమాన్యంలో మోషపత్రి ద్రావణం ముఖ్య పాత్రపోషిస్తుంది. (అడ్డాబ్బో, అతని అనుచరులు, 2013)
  • 15% మోషపత్రి ద్రావణం బంగాళాదుంపలలో ఫ్యుజేరియం సొలాని కలిగించే పొడి వేరుకుళ్ళుని సమర్ధవంతంగా నివారించింది (మసాద్‌జాకర్, 2014).
  • టెట్రానికస్ సిన్నబారినస్ (నల్లి)ని మోషపత్రి 5 మి.గ్రా./మి.లీ. అసిటోన్ ద్రావణం 100% నివారించింది (జాంగ్‌యోంగ్ క్వియాంగ్, అతని అనుచరులు, 2008).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. అడవి సీతాఫలం

అడవి సీతాఫలం అనోనేసి కుటుంబంలోని ఒక పూల మొక్క. ఈ మొక్కని సెనెగల్ నుండి సేకరించారు. ఇది ఒక పొద లేదా చిన్న చెట్టు. ఈ మొక్క 2 నుండి 6 మీ. ఎత్తు పెరుగుతుంది. బెరడు నున్నగా లేదా గరుకుగా గ్రే సిల్వర్ లేదా గ్రే బ్రౌన్ రంగులో ఉంటుంది. కొత్త కొమ్మలు మందమైన గ్రే, గోధుమ రంగు లేదా పసుపు రంగుతొడుగు కలిగి ఉంటుంది. తర్వాత వయసుతో పాటు ఊడిపోతుంది. ఆకులు ఆకుపచ్చ లేదా నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపై వైపున నూగు ఉండదు. అడుగువైపున నూగు ఉంటుంది. పూవ్వు 3 సెం.మీ. వ్యాసం కలిగి ఉండి 2 సెం.మీ. కాడపై ఏర్పడతాయి. కాయలు అనేక కలిసిపోయిన మెత్తని, ఉబ్బెత్తు 2.5-5.0 సెం.మీ. అండాకారం లేదా గుండ్రని పుష్పపు గర్భకోశాలు కలిగి ఉంటాయి.

సాధారణ నామం : వన్యసీతాఫలం / ఆఫ్రికన్ సీతాఫలం శాస్త్రీయ నామం : అనోనాసెనెగలెన్సిస్ కుటుంబం: అనోనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పండులోని తెల్లని గుజ్జు ఆహ్లాదకరమైన అనాస పండు వాసనలో ఆప్రికాట్ రుచి కలిగి ఉంటుంది.
  • ఆకులను కొన్నిసార్లు కూరగా వండుకుని తింటారు. పూలను సుగంధద్రవ్యంగా ఉపయోగిస్తారు.
  • విచ్చుకోని పూల మొగ్గలను సూపులో ఉపయోగించుతారు.
  • మొక్క బెరడుని డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, పాముకాటు, పళ్ళనొప్పి, శ్వాసకోశ అంటువ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • బెరడుని కొరికి గాయలపై లేపనంగా పూస్తారు. బెరడు, వేర్లను కలిపి నూరి పాము కాటు గాట్లపై పూస్తారు.
  • బెరడు నుండి కారే బంకను తెగిన చోట, గాయాలపై పూస్తారు.
  • ఆకులను న్యుమోనియా చికిత్సలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి టానిక్‌గా ఉపయోగిస్తారు.
  • వేర్లను కడుపునొప్పి, సుఖవ్యాధులు, రొమ్ము జలుబు చికిత్సలో ఉపయోగిస్తారు.
  • కాయలను డయేరియా, డిసెంట్రి, వాంతుల నివారణకుపయోగిస్తారు.
  • అనేక మొక్క భాగాలను కలిపి చర్మ వ్యాధులు, క్షయ వల్ల కలిగే సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • అడవి సీతాఫలం గింజలు, బెరడుని పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.
  • రిపబ్లిక్ ఆఫ్ బెనిన్‌లో వన్య సీతాఫలం తాజా ఆకులను కోళ్ళగూళ్ళలో పరచి అవి ఎండే వరకు ఉంచుతారు. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేసి ఫ్లీస్, నల్లులను నివారిస్తారు.
  • వన్యసీతాఫలంలో టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, సపానిన్స్, ఆల్కలాయిడ్స్, గ్లెåకోసైడ్లు, స్టీరాయిడ్లు, ఆవిరైపోయే నూనెలు, యాంథోసయనిన్స్ వంటి రసాయనాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, ప్లాటినం, క్రోమియం వంటి ఖనిజాలతో పాటు ఆస్కార్బిక్ యాసిడ్, అమినో యాసిడ్లు కూడా ఉంటాయి. అందువలన అది ఒక ముఖ్య పోషక మూలం. దీని కాండం బెరడులో ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉంటుంది. కాంగో అనే శాస్త్రవేత్త ఈ మొక్క ఆకులు, కాండం బెరడు, వేరు బెరడు, ఎపికార్ప్, మీసోకార్ప్‌లో ఎసెన్షియల్ ఆయిల్‌ని కనుగొన్నారు. దీని భాగాల నుండి వేరు చేసిన రసాయనాలు యాంటి మైక్రోబియల్ లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి.
  • కాండం, బెరడు ఇథనాల్ ద్రావణం బెండ, జొన్న, టమాట గింజల నాశించి మొలక శాతాన్ని తగ్గించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్, శిలీంద్రాలను నివారించింది. (అక్పోర్, అతని అనుచరులు, 2015)
  • వన్య సీతాఫలం జీవ పురుగు మందు. అలసంద పంటలో పేనుబంక పురుగులను నివారించింది (కోలో, అడము, 2016)
  • వన్య సీతాఫలం బెరడు, ఆకు పొడి, ద్రావణం మిరియాల పంటనాశించే వేరు బుడిపె నులి పురుగు (మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట)ల సంఖ్యను తగ్గించాయి (అగాఒ, ఫావోల్, 2015).
  • వన్య సీతాఫలం ఎండు ఆకులను ధాన్యం గింజలకు కలిపి నిల్వ సమయంలో ఆశించే పురుగులను నివారించవచ్చు. (థాకర్, 2002).
  • వన్యసీతాఫలం ద్రావణం కొన్ని జీవ చర్య మిశ్రమాలను కలిగి ఉండి, కీటక నాశక మరియు యాంటీ ఫీడెంట్ చర్యలతో నిల్వ ధాన్యంలో ఆశించే రెడ్ ఫ్లోర్ బీటిల్ (ట్రైబోలియం కాస్టానియం)ని అరికట్టింది (ఒసెని, అతని అనుచరులు, 2013).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క…. నేలవేము

సాధారణ నామం : కింగ్ బిట్టర్స్ శాస్త్రీయ నామం : ఏండ్రోగ్రాఫిస్ పెనిక్యులేటా కుటుంబం: అకాన్థేసి

కొన్ని ప్రాంతాలలో ‘కాల్‌మేఘ’ అని కూడా పిలువబడే మొక్క సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే మందు మొక్క. అనేక శాఖలున్న ఈ మొక్కల ఆకులు కణుపుకి రెండు చొప్పున ఏర్పడి కోలాకారంలో ఉంటాయి. పూలు జనవరి-అక్టోబర్ మాసాలలో ఎక్కువగా పూస్తాయి. ఈ మొక్క రబీ సీజన్‌లో (నవంబర్-జనవరి) ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువగా అడవులకు దగ్గరగా ఉన్న భూములలోను, తేలికపాటి నేలల్లోను అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత కాలంలో ఈ మొక్కను వైద్యం కోసం గృహాలలో కూడా పెంచుకోవడం జరుగుతుంది..

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • నేలవేము మొక్కల్లో ఉన్న ‘ఆండ్రోగ్రాఫోలిడ’ అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, భక్షక నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. అందువల్ల ఆకులను సస్యరక్షణలో “కషాయం”గా కానీ, “పంచపత్ర కషాయం (వివిధ ఆకుల ద్రావణం)”లో గానీ రైతులు ఉపయోగించుకోవచ్చు.
  • నేల వేము కషాయంలో ఉన్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి, ఈ కషాయాన్ని పంటలనాశించే రసం పీల్చే పురుగులు, ఆకులను తినే గొంగళి పురుగులు, కాండం తొలిచే పురుగులపైన వాడి, సమర్ధవంతంగా నివారించవచ్చని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

నేలవేము కషాయం తయారీ విధానం

  • ఒక ఎకరం పొలంలోని పంటకవసరమయే కషాయం తయారు చేయడానికి సుమారు 5 కిలోల నేలవేము ఆకులవసరమవుతాయి. ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో ఒక గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీటర్ల వరకు ఉంటుంది. ఈ కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన కషాయానికి 100 గ్రా. సబ్బుపొడిని లేదా 50 గ్రా. కుంకుడు కాయరసాన్ని కలపాలి. ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి ఒక ఎకరం పొలంలో సాయంత్రం వేళ పిచికారి చేయాలి. కషాయం బాగా ఉడుకుతున్నపుడు ద్రావణాన్ని మధ్యమధ్యలో ఒక కర్రతో బాగా కలుపుతూ ఉండాలి. నేల వేము కషాయాన్ని కనీసం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఉపయోగించి వరిలో కాండం తొలుచు పురుగు (తెల్లకంకి)ని నివారించవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… దుంపరాష్ట్రకం

సాధారణ నామం : శ్నాప్ జింజర్/కార్డమం జింజల్ / ఇండియన్ జింజర్ / గులంగాల్ శాస్త్రీయ నామం : ఆల్పినియా కాల్కరేట / ఆల్పినియా గాలంగ కుటుంబం: ఆజింజిబెరేసి.

దుంపరాష్ట్రకం సుమారు 30-50 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పసుపు ఆకుల కంటే తక్కువ వెడల్పు గలిగి ఉంటాయి. బల్లెం ఆకారంలో సన్నగా ఉంటాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేరు దుంపలను ఔషధంగా ఉపయోగిస్తారు. దుంపలలో సినియోల్, మిథైల్ సిన్నమేట్, కెంపెఫెరిన్ అనే రసాయనాలు ఉంటాయి.
  • దుంపలు చేదుగా, కారంగా ఉంటాయి. వీటిని వాతం, నొప్పులు, కడుపులో ఉబ్బరం, మలబద్ధకం నివారణకు ఉపయోగిస్తారు.
  • వీర్యపుష్టి, నడుములకు సత్తువ కలుగజేస్తుంది.
  • దుంప పొడి (13 గ్రా.)ని శ్వాసకోశసంబంధిత, హృదయ సంబంధిత వ్యాధుల నివారణకుపయోగిస్తారు.
  • దుంపపొడి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.

వ్యవసాయరంగంలో

  • దుంపరాష్ట్రకం క్రూడ్ ఇథనాల్ ద్రావణం మరియు నీటిలో కరిగే కారకం నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు ట్రైబోలియం కాస్టానియంపై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (పర్వీన్, అతని అనుచరులు, 2016).
  • ఆల్పినియా గాలంగ ద్రావణం బీన్‌వీవిల్, మాత్‌పై యాంటిఫీడెంట్ చర్యను, నల్లిపై అకారిసైడల్ చర్యను ప్రదర్శించింది (రియాంటో అండ్ అఫాప, 1998; యమహర, 1998).
  • దుంపరాష్ట్రకం ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ వరి నిల్వధాన్యంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెపై వికర్షక, విషచర్యలను ప్రదర్శించింది (పరనగమ, అతని అనుచరులు, 2004).
  • ఆల్పినియా గాలంగ ఎసెన్షియల్ ఆయిల్ ఆసియన్ సబ్‌టెర్రీనియన్ చెదలు, కోప్టోటెర్మస్ గెస్ట్రాయ్, కోప్టోటెర్మస్ కర్విగ్నాస్ పై యాంటీ ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (అబ్దుల్లా, అతని అనుచరులు, 2015).
  • ఆల్పినియా గాలంగ దుంపల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ సిగరెట్ బీటిల్, లాసియోడెర్మా సెర్రికోర్నె పెద్ద పురుగులపై స్పర్శ విషచర్య, ఫ్యూమిగెంట్ విష చర్యను ప్రదర్శించింది (వు, అతని అనుచరులు, 2014).
  • దుంపరాష్ట్రకం సహజ ఉత్పత్తులు ఎస్కెరిచియా కోలి, స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియె, సూడోమోనాస్ ఈరోజినోసా, ఎంటరోబాక్టర్ ఈరోజినెస్, సాల్మొనెల్ల పారట్రెఫి, విబ్రియో కలరా, బాసిల్లస్ సబ్‌టైలిస్‌పై గణనీయమైన యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి (రాబిన్‌సన్, అతని అనుచరులు, 2009).
  • ఆల్పినియా గాలంగ హెక్సేన్ క్రూడ్ ద్రావణం బ్రాక్టోసిరా డోర్సాలిస్ పెద్ద పురుగులను అత్యంత సమర్ధవంతంగా నివారించింది (సుకిరన్, అతని అనుచరులు, 2010).
  • ఆల్పినియా గాలంగ క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా మరియు నిల్వ దాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ (రియాంటో, అతని అనుచరులు, 1998) మరియు సైటోఫిలస్ జియామెయిస్, ట్రైబోలియం కాస్టానియం (సుతిసట్, అతని అనుచరులు, 2011) నివారణలో ఉపయోగపడుతుంది.
  • ఆల్పినియా గాలంగ గింజల ద్రావణాలు టైరోఫోగస్ ప్యూట్రెసింషియె, డెర్మటోఫాగాయిడెస్ టెరోనిస్సినస్ అనే నల్లులను చంపాయి (యమహర, 1998).
  • ఆల్పినియా గాలంగ ఇథనాల్ మరియు పెట్రోలియం ద్రావణాలు 95-100% చెదలను (ఒడొంటెటెర్మెస్) చంపాయి (సౌమ్య, ఆమె అనుచరులు, 2016).
  • దుంపరాష్ట్రకం ఎసెన్షియల్ ఆయిల్ మరియు దానిలోని రసాయనం 1,8 సినియెల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై ఫ్యూమిగెంట్ చర్యను, ఫ్యూమిగెంట్ మరియు స్పర్శ విషచర్యను ప్రదర్శించాయి (అబెయ్‌విక్రమ, అతని అనుచరులు, 2006).
  • ఆల్పినియా గాలంగ దుంపద్రావణం డైమండ్ బ్యాక్‌మాత్, ఫ్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా, లార్వాలు మరియు అడ్ౙుకి బీన్ వీవిల్, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ పై కీటకనాశక చర్య ప్రదర్శించింది (డండాంగ్, అతని అనుచరులు, 1998).
  • ఆల్పినియా కంక్లూగెర మొక్కజొన్న నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్ మరియు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై స్పర్శ మరియు యాంటీఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది (సుత్తిసుట్, అతని అనుచరులు, 2011).
  • ఆల్పినియా గాలంగ దుంప హెక్సేన్ మరియు ఇథనాల్ ద్రావణాలు బాక్ట్రోసిరా డోర్సాలిస్‌ని అత్యంత సమర్ధవంతంగా అరికట్టాయి (సుఖిరన్, అతని అనుచరులు, 2011).
  • ఆల్పినియా గాలంగ దుంప ద్రావణం క్యాబేజి మాత్, క్రోసిడోలోమియా పవోనాని సమర్ధవంతంగా అరికట్టింది (రస్సామి, అతని అనుచరులు, 2016).
  • ఆల్పినియా గాలంగ మిథనాల్ క్రూడ్‌ద్రావణం, క్లోరోపాం క్రూడ్ ద్రావణం కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్ శిలీంద్ర పెరుగుదలను అత్యంత సమర్ధవంతంగా అరికట్టింది (జానీ, అతని అనుచరులు, 2010).
  • ఆల్పినియా గాలంగ దుంప ద్రావణాలు ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్, ఆప్సర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం సొలాని శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది (మిశ్రా అండ్ డుబె, 1990; జాన్సన్ అండ్ ఫెషర్, 1985; అమిర్, 1990). ఈ ద్రావణం స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, ఎస్కెరిచియా కోలి, లిబ్రియో కలరా, డిప్లొకోకస్ న్యుమోనియే, మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ పై యాంటి బాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (చోప్రా, అతని అనుచరులు, 1957, స్ౙాపియుద్దిన్, 1981). దీని గింజల ద్రావణం టైరోఫాగస్ ప్రూట్రిసెంటయే, డెర్మటోఫాగాయిడెస్ టెరోనిస్సినస్‌పై అకారిసైడల్ చర్యను ప్రదర్శించింది (యమహర, 1998).
  • ఆల్పినియా గాలంగ దుంపలపొడి పెసరగింజల నాశించే కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ ఆశించకుండా రక్షించింది (అస్మానిజర్, అతని అను,రులు, 2016).
  • ఆల్పినియా గాలంగ ఎసెన్షియల్ ఆయిల్ కోకోపాడ్‌బోరర్, కొనొపొమార్ఫ క్రామరెల్లాని అత్యంత సమర్ధవంతంగా నివారించింది (బకార్, అతని అనుచరులు, 2017).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

‘మీనామృతం’తో మునగకు రక్ష!

సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక క్రిమిసంహారకాలకు దీటైన లేదా పోల్చదగిన ప్రత్యామ్నాయాలు లభించకపోవటం ఒక ప్రధాన సమస్య. అయితే, చేప ద్రావణాలతో ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించవచ్చని డా॥ గున్నంరెడ్డి శ్యామసుందర్‌రెడ్డి పరిశోధనలో తేలింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో ‘సస్యశ్యామల కృషివనం’ ప్రకృతి సేద్య పరిశోధనా క్షేత్రంలో ఆయన స్థిరపరచిన ‘మీనామృతం’, ‘మత్స్య సంజీవని’ మునగ పంటపై అద్భుతమైన ఫలితాలనిచ్చింది. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు, చేప కునప జలం వంటివి కూడా వివిధ ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోను, పోషకాలను, వృద్ధి కారకాలను అందించడంలోను, భూసారాన్ని పెంపొందించడంలోను ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి.

మునగ పంటకు ఆకుచుట్టు పురుగు ఒక ప్రధానమైన సమస్య. సేంద్రియ పద్ధతిలో మునగ పండించే రైతులకు, మరీ ముఖ్యంగా ఎగుమతి కోసం మునగ ఆకు పండించే రైతులకు ఈ పురుగు సింహ స్వప్నంగా మారింది. తల్లి పురుగులు (సీతాకోకచిలుకల వంటివి) పెట్టిన గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులపైన, లేత రెమ్మలపైన ఉన్న పత్రహరితాన్ని గోకి తినటం మొదలుపెడతాయి. లార్వాలు పెరుగుతున్న కొలదీ ఇతర భాగాలకు పాకుతూ ఆకులను, లేత చిగుళ్లను, పూమొగ్గలను తింటూ బతుకుతాయి. లేత పిందెలు, పెరుగుతున్న కాయల మీద ఉన్న పత్రహరితాన్ని కూడా గోకి తింటాయి. లార్వాలు మొక్క పైకి, కిందకీ చురుకుగా కదులుతూ కొత్తగా వస్తున్న చిగుళ్లను ఎప్పటికప్పుడు తినేస్తూ ఉండటం వలన మొక్క మోడులా మారిపోతుంది. లేత మునగ మొక్కలకు ఇది ఆశిస్తే ఆ మొక్కలను పూర్తిగా నాశనం చేస్తుంది. మీనామృతాన్ని ఐదు రోజులకొకసారి మూడుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది.

మీనామృతం తయారీకి కావాల్సిన వస్తువులు: తాజా చేప ముక్కలు: 1 కిలో; దేశీ ఆవు మూత్రం : 5 లీటర్లు; నల్ల బెల్లం : 1 కిలో; తాటికల్లు : 1 లీటరు; దేశీ ఆవు నెయ్యి : 50 గ్రాములు; తేనె : 50 గ్రాములు

తయారీ పద్ధతి: మీనామృతం రెండు దశల్లో తయారవుతుంది. ఇందుకు మొత్తం 20 రోజులు పడుతుంది. సిద్ధమైన మీనామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఒక కిలో తాజా చేపలను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. కిలో బెల్లాన్ని పొడి చేయాలి. ఈ రెంటినీ కలిపి అరగంట సేపు ఉంచాలి. చేపను ముక్కలు చేయక ముందే శుభ్రంగా కడగాలి. చేప ముక్కలను కడగకూడదు. చేప తోక, రెక్కలు, మొప్పలు వంటి సులభంగా కుళ్లని భాగాలను తీసివేయాలి. ఒక మట్టికుండలో 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని తీసుకొని చేప ముక్కలు, బెల్లం మిశ్రమాన్ని అందులో వేయాలి. తరువాత కుండపై మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో మూతి బిగించి కట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈగలు, ఇతర కీటకాలు లోనికి వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక పరిశుభ్రమైన తడి లేని కర్రతో ద్రావణాన్ని నిమిషం పాటు కలియబెడుతూ ఉండాలి. పది రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని పింగాణీ జాడీ లేదా ప్లాస్టిక్ క్యానులోకి వడకట్టుకోవాలి.

అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె వేసి మూతపెట్టి గుడ్డతో బిగుతుగా కట్టాలి. ఈ మిశ్రమాన్ని మరో పదిరోజుల పాటు ఉంచాలి. ఈసారి కలియబెట్టనవసరం లేదు. పది రోజుల తర్వాత ‘మీనామృతం’ పిచికారీకి సిద్ధమవుతుంది. మీనామృతాన్ని 6 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. కొద్ది లీటర్లయితే పింగాణి జాడీలలో నిల్వ ఉంచుకోవచ్చు. చాలా ఎక్కువ లీటర్లయితే ప్లాస్టిక్ క్యానులు లేదా డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకోవచ్చు. గాలి చొరబడని క్యానుల్లో ఉంచినప్పుడు తరచుగా మూతను లేదా బిరడాను తీసి గాలిని బయటకు వదులుతూ ఉండాలి.

‘మీనామృతం’ 3సార్లు పిచికారీ చేయాలి
మునగ చెట్టుపై పురుగును గమనించిన వెంటనే మీనామృతాన్ని పిచికారీ చేయడం ఉత్తమం. వంద లీటర్ల నీటికి 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల చొప్పున మీనామృతాన్ని కలిపి, చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధితో మరో రెండుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం మీనామృతంతో పాటు వేపనూనె (1500 పీపీఎం) లీటరు నీటికి 3 మిల్లీ లీటర్లు చొప్పున లేదా 10 శాతం లొట్టపీచు’ (తూటాకు) కషాయం లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయవచ్చు.

‘మీనామృతం’ వల్ల ఇతర ప్రయోజనాలివే…
మీనామృతం స్థూల, సూక్ష్మ ధాతు లోపాలను సమర్థవంతంగా నివారిస్తుంది. పందిరి కూరగాయలు, పచ్చ, దోస, దానిమ్మ వంటి ఉద్యాన పంటల్లో ఆడపూల నిష్పత్తిని గణనీయంగా పెంచుతుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని వృద్ధిపరచి, ఆకుమచ్చ, కాయకుళ్లు తెగుళ్లను నిరోధిస్తుంది. రసం పీల్చే పురుగులు, లార్వాల తొలి దశలను నాశనం చేస్తుంది. కూరగాయలు, పండ్ల నాణ్యతను, పోషక విలువలను పెంచుతుంది.

Read More