ఔషధ మొక్క…. కొత్తిమీర

కొతిమీర 50 సెం.మీ. ఎత్తు పెరిగే మెత్తని మొక్క. ఆకులు అనేక ఆకారాలలో ఉంటాయి. మొక్క మొదలు వద్ద ఆకులు వెడల్పుగా ఉండి అనేక భాగాలుగా ఉంటాయి. పూత వచ్చే కాండాలపై ఆకులు సన్నగా ఈకలులా ఉంటాయి. పూలు చిన్న అంబెల్‌పై ఏర్పడతాయి. తెలుపు లేదా లేత పింకు రంగులో ఉంటాయి. కాయ గుండ్రంగా 2-6 మి.మీ. పొడవు, 3-5 మి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : కోరియాండర్ శాస్త్రీయ నామం : కోరియాండ్రం సెటైవం కుటుంబం: ఎపియేసి (అంబెల్లిఫెరే)

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కొతిమీర బహుళ ఆరోగ్య ప్రయోజనాలు గల మొక్క. ఇది అద్భుతమైన ఆకలిని కలిగిస్తుంది. కడుపులో జీర్ణాశయంలో అనేక ఎంజైములు, జీర్ణ రసాలు స్రవించడానికి సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి విరేచనం సాఫీగా అయేలా చేస్తుంది. ఇది ఆహారంలో పీచు పదార్థం అందిస్తుంది. జీర్ణకోశంలో వాయువులను విడుదల చేస్తుంది. మలబద్దకం, మొల్లలు, కడుపునొప్పికి ప్రయోజనకారి. దగ్గు తగ్గించడానికి, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక అద్భుత యాంటిసెప్టిక్. కఫాన్ని తగ్గించి, జ్వరాన్ని పోగొట్టి చల్లదనాన్ని ఇస్తుంది.
  • కొతిమీరలో అనేక పోషక విలువలుండటం వలన దీనిని “ప్రపంచ అద్భుత హెర్బల్ మొక్క”గా పరిగణిస్తారు. ఇది అనేక పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటిసెప్టిక్, బాధనాశక, ఉత్తేజిత, శిలీంద్రనాశక లక్షణాలు కలిగి ఉంటుంది.
  • కొతిమీర విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఎసెన్షియల్ ఆయిల్స్, ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఆకులలో కాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, సోడియం ఉంటాయి.
  • 100 గ్రా. కొతిమీరలో 3.67 గ్రా. పిండిపదార్థాలు, 2.13 గ్రా. ప్రోటీన్లు, 0.52 గ్రా. కొవ్వు, 2.80 గ్రా. పీచు, 23 కి. క్యాలరీల శక్తి, 62 మైక్రోగ్రాముల ఫోలియేట్స్, 1.11 మి.గ్రా. నియాసిన్, 0.55 మి.గ్రా. పాంటోథీనిక్ యాసిడ్, 0.14 మి.గ్రా. పైరిడాక్సిన్, 0.16 మి.గ్రా. రైబోఫ్లేవిన్, 0.067 మి.గ్రా. థయామిన్, 6748 ఐయు విటమిన్ ఎ, 27 మి.గ్రా. విటమిన్ సి, 2.50 మి.గ్రా. విటమిన్ ఇ12, 310 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటాయి.
  • కొతిమీర కొలెస్టరాల్‌ని తగ్గిస్తుంది. జీర్ణకోశ కదలికలు సాఫీగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్‌కి మంచిది. అల్ౙీమర్ వ్యాధిని తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మూత్రనాళ వ్యాధులను నివారించి మూత్రం సాఫీగా పారేలా చేస్తుంది. మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
  • కొతిమీరలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ కీళ్ళ నొప్పుల వల్ల కలిగే శరీర వాపుని తగ్గిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. కండ్ల కలక చకిత్సకు అద్భుత ఔషధం కొతిమీరలో ఉండే బీటాకెరోటిన్, యాంటిఆక్పిడెంట్లు కంటి సంబంధిత సమస్యలను నివారిస్తాయి. నోటి పుండ్ల నివారణకు ఇంటిమందు. ఎముకలను బలపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది. రుతు సమస్యలకు మహిళలు 5 గ్రా. కొత్తిమీర, ఒక చెంచా పంచదార అర లీటరు నీటిలో కలిపి మరగించిన కషాయాన్ని వడపోసి రోజుకి 3 సార్లు సేవించాలి. కేశ నష్టాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కోలన్ క్యాన్సర్‌ని నివారిస్తుంది.
  • కొతిమీర చట్నీ తయారు చేసి వడ్డించవచ్చు. పొడి చేసిన గింజలను కేకుల తయారీలో ఉపయోగించవచ్చు. గ్రైప్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. కొతిమీర యాంటిసెప్టిక్, అనాల్ౙెసిక్, అఫ్రోడియాసిక్, యాంటిస్పాస్మోడిక్, డియోడరెంట్, ఫంగిసైడల్, స్టిమ్యుటెంట్, స్టమకిక్, యాంటి బయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొతిమీరలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. యాంటిక్యాన్సర్, యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

వ్యవసాయరంగంలో

  • కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్‌లో లినలూల్ (57.57%), జిరానిల్ అసిటేట్ (15.09) ఎక్కువగా ఉంటాయి. ఈ రసాయనాలు ట్రైబోలియం కాస్టానియం కంటే కొల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించాయి. (ఖని, రహ్‌దారి, 2012).
  • టమాట పంటలో కొతిమీరని అంతరపంటగానే వేయడం వల్ల వివిధ రసం పీల్చే పురుగులు, తెల్లదోమ (బెమిసియా టబాసి), పేనుబంక (ఎఫిస్‌గాసిపి), జాసిడ్స్ (ఎంపోవాస్కాస్పీసీస్), తామర పురుగులు (త్రిప్స్ టబాసి), రెండు మచ్ౘ్ల ఎర్రనల్లి (టెట్రానైకస్ అర్టికె) సమర్ధవంతంగా, గణనీయంగా నివారించబడ్డాయి. ఈ పరిశోధనా ఫలితాలు ఆర్థిక పంటలతో ఆకర్షక మొక్కలను పెంచే పద్ధతిని సమగ్ర సస్యరక్షణ పథకాలలో ఒక భాగంగా సిఫారసు చేసి ఆర్థిక పంటలను పురుగుల బారి నుండి రక్షించవచ్చని వెల్లడించాయి (అబోషనాబ్, అతని అనుచరులు, 2017).
  • సహజ సుగంధపంటలైన పైపర్‌నైగ్రం, క్యూమినం సిమ్నియం, సిన్నమోమం వెరం, అల్లియం సెటైవం, కోరియాండ్రం సెటైనం, కర్కుమ, ఫీనిక్యులం వుల్గేర్, ట్రైగొనెల్లా ఫీనం గ్రీకం, సైజిగియం ఆరోమాటికం, క్యాప్సికం, జింజిబర్ అఫిసినాలిస్, మురయూ కోయినిగీ, బ్రాసికా నైగ్రా, సోడియం క్లోరైడ్‌లను కలిపిన మిశ్రమాన్ని పాటింగ్ మట్టితో కలిపి మొక్కలకు వేయాలి. ఈ జీవ పురుగు మందు వికర్షక చర్య, జీర్ణాశయంలో నిలిచిపోవడం, పక్షవాతం, ఊపిరాడకుండా చేయడం ద్వారా పురుగులను నివారిస్తాయి. ఈ జీవమందుని పొడిరూపంలో లేదా ద్రవరూపంలో పంటపై పిచికారి చేసి పురుగులను 48-72 గంటలలో నివారించవచ్చు. (గండిఐషాడోటి, 2012). ఈ జీవ పురుగు మందుని చ.మీ.కి. 100-500 గ్రా. చొప్పున వేయాలి.

జీవపురుగుమందులోని పదార్థాలు
మొక్క శాతం
పైపర్ నైగ్రమ్ 25.75
క్యుమినం సైమినం 15.45
సిన్నమోమం వెరమ్ 11.05 కోరియాండ్రం సెటైవం 12.80
కర్కుమ 7.44
ఫీనిక్యులం వుల్గేర్ 2.37
ట్రైగోనెల్లా ఫీనంగ్రీకం 3.65
సైజిగియం ఆరోమాటికం 2.58
క్యాప్సికం 1.38
జింజబర్ అఫిసినానిస్ 3.36
మురయా కోయినిగీ 1.60
బ్రాసికా నైగ్రా 0.03
సోడియం క్లోరైడ్ 0.17

  • కొతిమీర ఎసెన్షియల్ ఆయిల్ ఆల్టర్నేరియా టెన్యుయిస్, ఆస్పర్ౙిల్లస్ ఒరైజె, పెనిసిలియంక్రైసోజినం శిలీంద్రాలనరికట్టాయి (డోవిగిచ్, 1971)
  • జాన్‌కౌస్కా & జైట్కా (2016) క్యారట్ పంటలో కొతిమీర (కోరియాండ్రం సెటైవం), సమ్మర్ సావొరి (సాటురేజ హార్టెన్సిస్) అంతర పంటలప్రభావంపై అధ్యయనం చేశారు. అంతర పంటలు క్యారట్‌రస్ట్‌ఫ్లెå (సైలారోజే) వలన వేర్లకు కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించాయి. అంతర పంటలు వేసిన క్యారట్ క్షేత్రంలో ఆకులపై సిల్లిడ్ (ట్రైయజా విరిడ్యులా), పేనుబంక, వేర్లపై నులిపురుగుల నష్టం గణనీయంగా తక్కువగా ఉంది. కొతిమీర, సావరి అంతర పంటలుగా వేయడం వలన క్యారట్ పంటలో ప్రయోజనకర కీటకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయోగాలు జరిపిన అన్ని సంవత్సరాలలో కొతిమీరని అంతర పంటగా వేసిన క్యారట్ క్షేత్రంలో బదనికలు అక్షింతల పురుగులు, సిర్పిడ్ ఈగల సంఖ్య అధికంగా ఉంది.
  • కొతిమీరలో ఉన్న లిమలూల్ (68.2%), పైనీన్ (5.5%), టెర్పినిన్ (5.5%) అనే ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే అకాంతోసెరిడస్ ఒబ్టెక్షన్‌పై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించాయి (రిగ్నాల్ట్‌రోగర్, 1997).
  • కొతిమీర మొక్కలు పురుగుల సహజశత్రువులైన అల్లిక రెక్కల పురుగు (క్రైసోవా), అక్షింతల పురుగులు (కాక్సినెల్లిడ్స్), హోవర్ ఈగలు, పరాన్నజీవులైన చిన్న కందిరీగలను ఆకర్షిస్తాయి.
  • కాలీఫ్లవర్ పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాకెå్ౙలోసెల్లా సమగ్ర సస్యరక్షణ పథకంలో కొతిమీరని కాలీఫ్లవర్‌లో అంతర పంటగా వేయడం ఒక పద్ధతి.

కాలీఫ్లవర్ పంటలో డైమండ్ బ్యాక్ మాత్ యాజమాన్యానికి సిఫారసు చేసిన సమగ్ర సస్యరక్షణ పథకం
క్ర.సం. ట్రీట్‌మెంట్ మోతాదు/ప్లాట్ ఎన్నిసార్లు ఉపయోగించాలి
1. కొతిమీరని అంతర పంటగా సాగు చేయడం అర కిలో విత్తనం ఒకసారి
2. రసాయన పురుగుమందు లోర్స్‌బాన్ (2%) పిచికారి 16 మి.లీ/8 లీ. 3 సార్లు
3. 2% వేపగింజల కషాయం పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు
4. 2% వేపనూనె పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు
5. జీవనియంత్రణట్రైకోగ్రామాకిలోనిస్ (పారసైటాయిడ్) ప్యూపాల కార్డు
(పర్వీన్, ఖాన్)

  • కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్ 3వ దశ లార్వాలపై అత్యధిక ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది. (సౌగ్విర్, అతని అనుచరులు, 2013).
  • కూరగాయల సాగులో కొతిమీరను సహవాస పంటగా వేస్తే పేనుబంకను వికర్షిస్తుంది. ఎర్రనల్లి, పొటాటో బీటిల్స్ ఆశించకుండా చేస్తుంది.
    కొతిమీర సహజ శత్రువుల జీవిత కాలాన్ని పెంచుతుంది. అల్లిక రెక్కల పురుగు, హోవర్ ఈగ, ట్రైకోగ్రామా కిలోనిస్ పారసైటాయిడ్‌ని ఆకర్షిస్తుంది (టినాకా, 2014).
  • ఇర్వింగ్, అతని అనుచరులు (2014) కొత్తిమీర డాలికోగెనిడియా టస్మానికా సహజ శత్రువు జీవిత కాలాన్ని పెంచుతుందని నిరూపించారు.
  • కొతిమీర నుండి సృష్టించిన కొత్త సస్యరక్షణ ఎసెన్షియల్ ఆయిల్ ఉత్పత్తులు మూడు పేనుబంక జాతులు మాక్రోసైఫం రోజే, ఎఫిస్ నెరీ, ఎఫిస్ పోమి లపై గట్టి కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అటనసోప, 2017).
  • బెల్‌పెప్పర్‌లో అధిక నష్టం కలిగించే యూరోపియన్ కార్న్‌బోరర్, ఆస్ట్రినియా న్యూబిలాలిస్ సంరక్షణ జీవనియంత్రణకు అధ్యయనం జరిపారు. కొతిమీర, డిల్, బక్‌వీట్ అంతర పంటలను 3 బదనికలు చిన్నపైరేట్‌నల్లి (ఓరియస్ ఇన్సిడియోసస్), పింక్ మచ్చల అక్షింతల పురుగు (కోలియోయెగిల్లా మాక్యులేటస్), ఆకుపచ్చ అల్లిక రెక్కల పురుగు (క్రైసోపాస్పీ.)ని ఆకర్షించడానికి ఎంచుకున్నారు. వీటిని బెల్ పెప్పర్ ప్లాట్ల దక్షిణహద్దులో ఒకదాని తర్వాత ఒకటి 5వరుసల్లో నాటారు. బెల్ పెప్పర్ పంటలో కొతిమీర, డిల్‌ని కలిపి రెండు వరుసల్లో నాటారు. బక్ వీట్‌ని పంటలేని భూమిలో ఒక వరుసలో నాటారు.
  • పరిశోధనా ఫలితాలు అంతర పంటలు బెల్‌పెప్పర్‌ని తీవ్రంగా ఆశించే యూరోపియన్ కార్న్‌బోరర్‌ని సమర్ధవంతంగా నివారించాయని వెల్లడించాయి. అంతర పంటలు చిన్నపైరేట్ నల్లి, పింక్ మచ్చల అక్షింతల పురుగులు అధికంగా యూరోపియన్ కార్న్‌బోరర్ గుడ్లను తినడాన్ని ప్రోత్సహించాయి. (బికర్‌టన్, హోమిల్టన్, 2017).
  • ఫాబా చిక్కుడు రకాలలో కొతిమీరని అంతరపంటగా వేయడం వలన పేనుబంక పురుగులు, ఎఫిస్ క్రాక్సివొర గణనీయంగా తగ్గిపోయాయి. బదనికలు, గింజ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ప్లాట్ చుట్టూ కొతిమీర స్ట్రిప్ వేసిన 843 రకం ఫాబి చిక్కుడు ప్లాటులో అతి తక్కువ పేను బంక పురుగుల సంఖ్య నమోదైంది (రిజ్క్, 2011).
  • గ్రీన్‌హౌస్ టమాట సాగులో తెల్లదోమ, ట్రైఎల్యురాడెస్ వేపొరేరియంపై వికర్షక పంటలు తులసి, పుదిన, డిల్, వెల్లుల్లి, ఉల్లి, పార్ల్సీ, కొతిమీర ప్రభావంపై అధ్యయనం చేపట్టారు. ముందుగా వికర్షక పంటల విత్తనాలను చల్లి తర్వాత టమాట నారు మొక్కలను నాటారు. కొతిమీరపై అతి తక్కువ తెల్లదోమలు నమోదవడం వలన దీనిని అత్యుత్తమ వికర్షక మొక్కగా సిఫారసు చేశారు (తస్లి, అతని అనుచరులు, 2017).
  • కొతిమీర పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది. కొతిమీర కషాయం తయారు చేయడానికి 200 గ్రా. ధనియాలను దంచి 1 లీ. నీటిలో కలిపి 10ని. మరిగించాలి. తర్వాత ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలపాలి. ఉదయంవేళ ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలిపి పురుగాశించిన మొక్క భాగాలపై పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు. (పట్నాయక్, 2017).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… వడిసె / కడిసె

వడిసె కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ మరల పుట్టించు ఒక చిన్న చెట్టు. బెరడు ముదురు గోధుమ రంగు, ఎరుపు రంగుతో కూడిన నలుపు రంగులో గరుకుగా ఉండి, నలుచదరపు కొయ్య పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడి, రబ్బరులాగా, గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో 1.53 అం. పొడవు, రంగుతో ఆకు మొదలులో గుత్తులుగా ఏర్పడతాయి. క్యాప్సూల్ కొయ్యలాగా తొడిమ లేకుండా, గుండ్రంగా, 3 లేదా 4 చీలిన భాగాలు కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో దీని విషపూరిత స్వభావం ఒక సమస్య.

సాధారణ నామం : గరారి శాస్త్రీయ నామం : క్లిస్టాంతస్ కోల్లినస్ కుటుంబం: ఫిల్లాంతేసి

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • వడిసాకు డికాక్షన్ (50%) వరి నాశించే తాటాకు తెగులు (హిస్పా), ఆకుచుట్టు పురుగు, కాండంతొలుచు పురుగులను నివారించింది. ప్రత్యేకంగా గొట్టం పురుగు (నిమ్‌ఫ్యులా డిపంక్టాలిస్)ని సమర్ధవంతంగా నివారించింది. ఈ ద్రావణాన్ని ఒకసారి పిచికారి చేస్తే అన్ని పురుగులు 12 గంటలలో సంహరించబడ్డాయి.. పంటకోత వరకు పురుగులు ఆశించలేదు (భారతి అహిర్వార్, ఆమె అనుచరులు, 2011).
  • జార్ఖండ్‌లోని రాంచి జిల్లాకి చెందిన రైతులు వరిలో ఉల్లికోడు నివారణకు వడిసాకులను సేకరించి ఎకరానికి 40 కి. చొప్పున వేస్తారు.
  • 100 చ.మీ.కి 5 కి. వడిసె తాజా ఆకులను చల్లి గొట్టం పురుగుని నివారించవచ్చు. (శ్రీవాస్తవ, అతని అనుచరులు, 2009)
  • వడిసె ఆకులోని రసాయనాలు నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులను, పిండినల్లులను, లద్దె పురుగులు / లార్వాలను సమర్ధవంతంగా నివారిస్తాయి. దీనిని జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు.(నమ్రతాకుమారి, ఆమె అనుచరులు, 2016).
  • వడిసె మొక్కలోని పాలిఫినాలిక్ పదార్థం పల్స్ బీటిల్, చెదలు, ప్రత్తి ఆకు తినే ఆర్మివర్మ్‌పై కీటకనాశక చర్య ప్రదర్శించింది. అనేక నిల్వ ధాన్యాలనాశించే పురుగుల లార్వాలను సంహరించే శక్తిని ప్రదర్శించింది (పరితోష్ భట్టాచార్య, 2016).
  • తోటకూర పంటపై వడిసె ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి తోటకూర ఆకులను తినే లార్వా (హైమెనియా రికర్వాలిస్)ల సంఖ్యను తగ్గించవచ్చు. (అరివుడైనంబి, అతని అనుచరులు, 2010)
  • వడిసె ఆకు ద్రావణం ప్రయోగశాలలో ప్రత్తికాయతొలుచు పురుగు, హెలికోవర్ప ఆర్మిజరాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (దేశ్‌ముఖ్, అతని అనుచరులు, 2013).
  • వడిసె లేత కొమ్మలను, పొడి ఆకుపొడిని వరి పొలంలో పురుగుల నివారణకు, నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు. (సౌమిత్‌బెహరా, అతని అనుచరులు, 2006).
  • వడిసె ఆకులనుపయోగించి హెర్బల్ ద్రావణం తయారు చేసి అనేక పురుగులను నివారించవచ్చు.

హెర్బల్ ద్రావణం తయారు చేసే పద్ధతి :
కావలసిన పదార్థాలు :
వడిసె ఆకులు – 1కి.
ఉమ్మెత్త కాయలు – 1 కి.
మధుక లాంగిఫోలియాపిండి – 1 కి.
గన్నేరు పప్పు – 1 కి.
పొగాకు రద్దు – 500 గ్రా.
సున్నం – 250 గ్రా.
ఆవుమూత్రం – 5 లీ.
మట్టికుండ – 1

తయారు చేసే పద్దతి :

  • ఒక మట్టి కుండలో వడిసె మొక్క ఆకులు, సన్నగా తరిగిన ఉమ్మెత్త కాయల ముక్కలు, గన్నేరు గింజలు అన్నింటినీ నూరి, మధుకలాంగి ఫోలియాపిండి, పొగాకు రద్దు, సున్నం కలిపి 5 లీ. ఆవు మూత్రం పోయాలి.
  • మట్టి పాత్రను మూతతో కప్పి ఎరువు గుంత / మట్టిలో 7 రోజులు పూడ్చి ఉంచాలి.
  • పై మిశ్రమాన్ని వడపోసి 1:10 నిష్పత్తిలో నీటితో కలిపి పిచికారి చేసి అన్ని పురుగులను నివారించవచ్చు.
  • వడిసె ఆకులు వికర్షక చర్యతో చెదలను అరికడతాయి.
  • వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగు నివారణకు ఎకరానికి 80 కి. వడిసె ఆకులను వేయాలి.
  • పశ్చిమ బెంగాల్‌కి చెందిన పురులియా గ్రామ రైతులు వరి చేలో ఎకరానికి 150 కి. వడిసె ఆకులను వేసి పసుపుపచ్చ కాండంతొలుచు పురుగు, గొట్టపు పురుగు, హిస్పాలను సమర్ధవంతంగా నివారించడమేగాక 20-40% అధిక దిగుబడులను పొందారు (కళ్యాణ్ కెవికె, పశ్చిమబెంగాల్, 2017)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. బిళ్ల గన్నేరు

సాధారణ నామం : మడగాస్కర్ పెరివింకిల్ / రోజ్‌పెరివింకిల్ శాస్త్రీయ నామం : కాథరాంథస్ రోసియస్ కుటుంబం: అపొసైనేసి²

బిళ్లగన్నేరు దీర్ఘకాలం జీవించే చిన్న పొద లేదా హెర్బల్ మొక్క. ఇది నిలువుగా 30-100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. మొక్క మొదలు చెక్కలాగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాకుతుంది. తెల్లని పాలు కలిగి ఉంటుంది. కాండం గుండ్రంగా నిలువు బోదెలు కలిగి ఉంటుంది. ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఆకులు ఎదురెదురుగా చిన్న ఆకు కాడపై ఏర్పడతాయి. ఆకు కాడలు 2.5 నుండి 9.0 సెం.మీ. పొడవుంటాయి. ఆకులు గుడ్డు ఆకారంలో ఉంటాయి కాని మొదలువైపు సన్నగా ఉంటుంది. ఆకులు ఆకుపచ్చ రంగులో పాలిపోయిన ఈనెలు కలిగి ఉంటాయి. ఆకు చివర గుండ్రంగా ఉంటుంది. కాండం, ఆకులు నూగు కలిగి ఉంటాయి. కొన్నిసార్లు నూగు ఉండదు. పూలు ఆకు మొదలులో ఏర్పడతాయి. ఇవి ఒకటిగా లేదా జంటలుగా అతి చిన్న కాడలపై ఏర్పడతాయి. కాయ 2.0 నుండి 4.7 సెం.మీ. పొడవుండి అనేక గింజలు కలిగి ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మొక్క సమూలంగా ఔషధగుణాలు కలిగి ఉంటుంది. దీని ఆకులు క్యాన్సర్‌ని తగ్గించే విన్‌క్రిస్టిన్, విన్‌బ్లాస్టిన్ అనే ఆల్కలాయిడ్లను కలిగి ఉంటాయి. దీనిలో 70 రకాల ఇండోల్ ఆల్కలాయిడ్లు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి అజ్మొలిన్, విన్‌బ్లాస్టిన్, విన్‌క్రిస్టిన్, ఆల్‌స్టోనైన్, అజ్మాలినిన్, రెసెర్పిన్. దీనిని కడుపు నొప్పికి, కందిరీగ, తేనెటీగల కాట్లకి, స్త్రీలలో ఋతుసంబంధ నొప్పులకి, నిద్రకలిగించడానికి కూడా ఉపయోగిస్తారు.
  • బిళ్ల గన్నేరు మొక్కని చిరకాలంగా ఆయుర్వేద, యునాని వైద్యంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో ఆల్కలాయిడ్స్, టానిన్స్ అనే రెండు రిసెర్పిన్ రకాల చురుకైన రసాయన మిశ్రమాలు ఉన్నాయి. ఈ మొక్కలో రెసెర్పిన్ ఉంది. బిళ్ల గన్నేరు రక్తపోటుని తగ్గిస్తుంది. రక్తపోటు తగ్గడానికి అర్ౙున్ క్యాప్సూల్స్ వాడాలి.
  • ఈ మొక్క యాంటిడయాబెటిక్ అని రుజువైంది. హెల్త్‌విట్ జామున్ రసం తీసుకుంటే డయాబెటిస్ బాగవుతుంది. ఈ మొక్క యాంటిక్యాన్సర్ ఏజెంట్‌గా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో అతి సమర్ధవంతమైనది.
  • దీనిని ల్యుకేమియా చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది యాంటి బాక్టీరియల్, యాంటివైరల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ మొక్క ద్రావణం డీసెంట్రి, డయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు.
  • దీనికి సహజంగా వాపు, నొప్పి తగ్గించే గుణముంది. బిళ్లగన్నేరు మొక్కలోని ఆల్కలాయిడ్ నుండి తయారు చేసిన ఔషధం పిల్ల…లో హోడ్గ్‌కిన్ లింఫోయా చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ పూవు పుష్పదళాలు, గింజలు యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి
  • ఇది ముఖం మీద చిన్న మొటిమలు, ఎక్ౙిమ, డెర్మటైటిస్ వంటి అనేక చర్మ వ్యాధులను నయం చేస్తుంది. దీనిని ముక్కు నుండి రక్త స్రావం, చిగుళ్ళ నుండి రక్తస్రావం, రక్తం స్రవించే మూల వ్యాధి చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • ఈ మొక్క కషాయం కంటి ఇన్‌ఫెక్షన్, కళ్ల ఇర్రిటేషన్‌కి కూడా ఉపయోగిస్తుంది. మహిళలలో రక్తస్రావ సమస్యను క్రమబద్ధీకరిస్తుంది.
  • ఈ మొక్కని నోటిలో అల్సర్ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. డిప్రెషన్, తొలనొప్పి, నాసియా, అలుపు సమయంలో ఈ మొక్క ద్రావణం ఊరడింపునిస్తుంది. బిళ్లగన్నేరు మలేరియా చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది.
  • ఆస్త్మా చికిత్సలో కూడా ఈ మొక్క చాలా ఉపయోగకరం. గాయం నుండి నేరుగా రక్తస్రావాన్ని కూడా ఆపుతుంది. బిళ్లగన్నేరు ఇన్ఫెక్షన్, వాపు నుండి కూడా ఊరడింపు కల్గిస్తుంది. పురుగు కాట్లకు కూడా ఈ మొక్కని ఉపయోగిస్తారు. బిళ్ల గన్నేరు సహజంగా మూత్రవర్థకం, మూత్రాన్ని పెంచుతుంది

వ్యవసాయరంగంలో

  • బిళ్ళగన్నేరు ఆకుల నీటి ద్రావణాలు (1000 పిపియం) హెలికోవర్పా ఆర్మిజరా ।, ॥, ॥।, IV, V, V।వ దశ లార్వాలపై 2.60, 3.94, 7.75, 30.83, 38.53, 63.34% లార్విసైడల్ చర్యలను ప్రదర్శించాయి. బిళ్ళగన్నేరు ఆకుల ద్రావణాన్ని హెలికోవర్ప ఆర్మిజరా యాజమాన్యంలో జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (అలగుచామి అండ్ దేవేంద్రన్, 2016).
  • బిళ్ళగన్నేరు ఆకుల ఇథైల్ అసిటేట్ ద్రావణాలు హెలికోవర్పా ఆర్మిజరా ।, ॥, ॥।, ।V, V, V।వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. ఇథైల్ అసిటేట్ ఫ్రాక్షన్ ఆకు ద్రావణాన్ని హెలికోవర్పా యాజమాన్యంలో శక్తివంతమైన జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (రమ్య, ఆమె అనుచరులు, 2008).
  • పొగాకు లద్దె పురుగు, స్పోడోప్టెరా లిటూర 4వ దశ లార్వాలపై బిళ్ళగన్నేరు ద్రావణం మరియు బాసిల్లస్ తురింజెన్సిస్‌లను పర్యావరణహిత పురుగు మందులుగా ఉపయోగించవచ్చు. (పన్నీర్ సెల్వం, అతని అనుచరులు, 2013).
  • బిళ్ళగన్నేరు ద్రావణం (0.5%) స్పోడోప్టెరా లిటూర లార్వాలపై పెరుగుదల క్రమబద్దీకరణ ప్రభావం అధికంగా చూపింది (సమ్మర్‌వార్ అండ్ పాండె, 2018).
  • బిళ్ళగన్నేరు, ఆముదం, బొప్పాయి, సీతాఫలం సేంద్రియ పురుగుమందుల ఆకు ద్రావణాలు తెగులు కారక శిలీంద్రాలయిన ఆస్పర్ౙిల్లస్ నైగర్, ట్రైకోడెర్మా రీసీ, పెనిసిలియం ఫ్యూమిక్సులోసమ్‌లను సమర్ధవంతంగా అరికట్టాయి. కాని వీటిలో బిళ్ళగన్నేరు ద్రావణం గణనీయమైన యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది (కునావత్, అతని అనుచరులు, 2016).
  • బిళ్ళగన్నేరు నీటి ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్, ఈడెన్ ఈజిప్టిలార్వాలను పర్యావరణహిత పద్ధతిలో నివారించే సామర్థ్యం కలిగి ఉంది (కామాచి, అతని అనుచరులు, 2016).
  • బిళ్ళగన్నేరు వేరు మరియు ఆకు ద్రావణాలు అనేక లార్వాలపై కీటకనాశక, యాంటిఫీడెంట్ మరియు పెరుగుదలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ ద్రావణాలు వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగును, ప్రత్తి పంటలో నల్లి (బగ్) పురుగులను చంపాయి (రిచర్డ్ విలియం హేప్లూక్, 1999).
  • బిళ్ళగన్నేరు ఆకుల ద్రావణం (2.0%) స్పోడోప్టెరా లిటూర 6వ దశ లార్వాల ప్యూపాలను 73.33% చంపింది (శాండీ అండ్ సమ్మర్‌వార్, 2016).
  • సమగ్ర సస్యరక్షణ పథకంలో మొక్క నుండి వేరుచేసిన ఇన్‌సెక్ట్ గ్రోత్ రెగ్యులేటర్ (ఐజిఆర్) మానవులకు, పర్యావరణానికి సురక్షితం. స్సోడోప్టెరా లిటూర లార్వాలపై బిళ్ళగన్నేరు అసిటోన్ ద్రావణం 84.21% ఐజిఆర్ చర్యను ప్రదర్శించింది. అదే ద్రావణం హెలికోవర్పా ఆర్మిజరాపై 57.14% ఐజిఆర్ చర్యను ప్రదర్శించింది (నెమోలియా, అతని అనుచరులు, 2003).
  • బిళ్ళగన్నేరు నుండి వేరు చేసిన రెండు సిస్టాటిన్స్ ఎస్కెరిచియా కోలి, స్టెఫైలోకోకస్ ఆరియస్‌పై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (శర్మ, అతని అనుచరులు, 2011).
  • బిళ్ళగన్నేరు ద్రావణం హిస్పిన్‌బీటిల్, బ్రోంటిస్పా లాంగిస్సిమాపై ప్రయోగశాలలో అధిక యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. సెమీఫీల్డ్‌ట్రయల్‌లో ఈ ద్రావణం పురుగుల సంఖ్యను తగ్గించింది (చాయోజున్, అతని అనుచరులు, 2012).
  • బిళ్ళ గన్నేరు ద్రావణం కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై 50% కి పైగా తక్కువ గాఢత వద్ద గుడ్లు పెట్టడాన్ని నిరోధించే చర్యను ప్రదర్శించింది (వన్మతి, ఆమె అనుచరులు, 2010)
  • బిళ్ళగన్నేరు, తులసి ద్రావణాలు డిస్టెర్కస్ కోయెనిగీపై కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (కాయెస్థ్ అండ్ గుప్తా, 2015).
  • బిళ్ళగన్నేరు పూల మిథనాల్, నీటి ద్రావణాలు సెంటెల్లా మొక్కలలో బాక్టీరియా ఆకుమచ్చ కల్గించే జాంతోమోనాస్ క్యాంపెస్ట్రిస్ పాథోవర్ సెంటెల్లే పెరుగుదలను గణనీయంగా అరికట్టాయి (గ్రాసెలిన్, అతని అనుచరులు, 2011).
  • బిళ్ళ గన్నేరు మిథనాల్ (92.33%), ఇథైల్ అసిటేట్ (91.33%), బెంజీన్ (98.33%), అసిటోన్ (0.44%), క్లోరోఫాం (92.33%) ద్రావణాలు టమాట ఎండుతెగులు శిలీంద్రకారకం, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం పెరుగుదల నరికట్టాయి. (చౌగులె అండ్ అండోజి, 2016).
  • బిళ్ల గన్నేరు, తులసి ఆకు ద్రావణాలు పొగాకు లద్దె పురుగు, స్పోడోప్టెరా లిటూర 4వ దశ లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి. తులసి ఆకు ద్రావణం బిళ్లగన్నేరు ఆకు ద్రావణం కన్నా అధిక యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (సుధ సమ్మర్ వార్ అండ్ జ్యోత్స్న పాండె, 2015).
  • బిళ్ల గన్నేరు ఆకుల క్రూడ్ ద్రావణం బెండకాండం, కాయతొలుచు పురుగు, ఈరియాస్ విట్టెల్లాపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. దీనిని జీవపురుగు మందుగా ఉపయోగించవచ్చు. (పవన్‌రాజ్, అతని అనుచరులు, 2016).
  • బిళ్ల గన్నేరు ఆకుల నీటి, మిథనాల్ ద్రావణాలు మలేరియా వాహకం అనాఫెలిస్ స్టెఫిన్సి, బోదకాలు వాహకం, క్యులెక్స్ క్వింక్విఫాసియేటస్‌లను లార్విసైడల్, ప్యూపిసైడల్ చర్యల ద్వారా నియంత్రించే అద్భుత శక్తి కలిగి ఉన్నాయి (సెల్లాదురై సుబారాణి, ఆమె అనుచరులు, 2013).
  • బిళ్లగన్నేరు సేంద్రియ ద్రావణం ట్రైకోడెర్మా రీసీ, పెనిసిలియం ఫ్యూమిక్యులోసం శిలీంద్రాలపై గణనీయమైన యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది (కుమవట్, అతని అనుచరులు, 2016).
  • బిళ్లగన్నేరు పెట్రోలియం ఈదర్ ద్రావణం, బాసిల్లస్ తురింజన్సిస్, అనోఫెలస్ స్టెఫెన్సి వాహకాల నియంత్రణ కార్యక్రమంలో పర్యావరణహిత కారకాలుగా ఉపయోగించడానికి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని కలిపిన మిశ్రమం అనోఫెలిస్‌స్టెఫెన్సిపై అద్భుత లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (పన్నీర్ సెల్వం, అతని అనుచరులు, 2013).
  • బిళ్ల గన్నేరు, బంతి, క్లీరోడెండ్రాన్ ఫిల్లోమెడిస్ ద్రావణాల మిశ్రమం డెంగ్యు వాహకం స్టెగోమియ ఈజిప్టీని సమర్ధవంతంగా నివారించింది. (కోకిల, ఆమె అనుచరులు, 2016).
  • బిళ్ల గన్నేరు పూల ద్రావణం అనోఫెలిస్‌స్టెఫెన్సి (మలేరియా వాహకం) లార్వాలను సమర్ధవంతంగా చంపాయి. బిళ్లగన్నేరు పూల ద్రావణాన్ని సమగ్ర పురుగు యాజమాన్య కార్యక్రమంలో ఉపయోగించవచ్ౘ్ు (ప్రసాద్, అతని అనుచరులు, 2014).
  • బిళ్లగన్నేరు కాండం ద్రావణం జీవ సేంద్రియ శిలీంద్రనాశినిగా మిరప నారు మొక్కల నాశించే ఫ్యుజేరియం ఆక్సిస్పోరమ్ పెరుగుదల నరికట్టింది. ఈ ద్రావణం గ్రీన్‌హౌస్‌లో మిరపనారు మొక్కలను ఫ్యుజేరియం ఆక్సిస్పరం ఆశించి నష్టపరచకుండా కాపాడింది. ఇది పర్యావరణ హిత పద్ధతి (జహారి అండ్ హలిమూన్, 2014).
  • బిళ్లగన్నేరు వేరు, ఆకు ద్రావణాలు అనేక లార్వాలపై కీటకనాశక, యాంటిఫీడెంట్, పెరుగుదల నరికట్టే లక్షణాలను ప్రదర్శించాయి. ఈ ద్రావణాలు వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగుని, ప్రత్తినాశించే నల్లి పురుగులను చంపుతుంది (ఫ్లూక్, అతని అనుచరులు, 2001).
  • బిళ్లగన్నేరు, తులసి, లాంటానా ఇథనాల్ ద్రావణాల ప్రభావాన్ని ప్రత్తి పంటనాశించు రెడ్ కాటన్ బగ్, డిస్టెర్కస్ కోయినిగిపై “సీడ్‌డిప్ పద్ధతి” ద్వారా పరీక్షించారు. తులసి, లాంటానా ద్రావణాలు బిళ్లగన్నేరు ద్రావణం కంటే అధిక యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి. 5వ దశ పురుగులను తులసి, లాంటానా ద్రావణాల కన్నా బిళ్లగన్నేరు ద్రావణం ఎక్కువగా చంపింది (కాయెస్థ్ అండ్ గుప్తా, 2016).
  • బిళ్లగన్నేరు మొక్కని “సేంద్రియ సాధారణ బహుళ పంటల వ్యవసాయ పురుగుమందు” తయారీలో ఉపయోగిస్తారు.

కావలసిన పదార్థాలు :

  • పసుపు, వేప, మిరప, అల్లం, వెల్లుల్లి, జిల్లేడు (కెలాట్రోపిస్ జైగాంటియా), జిల్లేడు (కెలోట్రాపిస్‌ప్రోసెర), బొప్పాయి, దానిమ్మ, తులసి, పొగాకు, లాంటానా, ఉమ్మెత్త, నిమ్మగడ్డి, అకలైఫా ఇండిక, ఆముదం, బిళ్లగన్నేరు, గన్నేరు, వావిలాకు, ఉల్లి, నల్ల మిరియాలు, సీతాఫలం, టేకు, వస, నీలగిరి, జట్రోఫా, పుదీన, గరిక, గోమూత్రం, గోమయం.

ప్రయోజనాలు :

  • అన్ని రకాల పంటలకు అతి శక్తివంతమైన పురుగుమందు / కీటకనాశినిగా పనిచేస్తుంది. మొక్కలకు బాక్టీరియా, శిలీంద్రాలు, వైరస్‌లను తట్టుకునే శక్తినిస్తుంది. హానికర సూక్ష్మ జీవులను నాశనం చేస్తుంది. అనేక పురుగులను వికర్షిస్తుంది. ఫంగిసైడ్, లార్విసైడ్, జెర్మిసైడ్, వర్మిసైడ్, బాక్టీరిసైడ్, నెమటిసైడ్, మొల్లస్కిసైడ్‌గా పని చేస్తుంది. ఇది అన్ని పంటలలో సంపూర్ణ పురుగు మందు. దీనినుపయోగిస్తే ఏ ఇతర పురుగు మందును వాడనవసరం లేదు.
    మోతాదు : 3% (30 మి.లీ. / 1 లీ. నీటిలో) ద్రావణం పిచికారి చేయాలి. ఒక ఎకరంలోని పంటపై ఒకసారి పిచికారి చేయడానికి 35 లీ. అవసరం.
    నిల్వ : 36 నెలలు (శ్రీగోమాత గాయత్రి ఆర్గానిక్స్).
  • బిళ్లగన్నేరు ఆకు ద్రావణం (0.5%) 44.16% స్పోడోప్టెరా లిటూర రెండవ దశ లార్వాలను చంపింది (సుధ సుమ్మర్వార్ అండ్ జ్యోత్స్న పాండె, 2015).
  • బిళ్లగన్నేరు ఆకు ద్రావణం కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడిస్ (72.5), ఫ్యుజేరియం మొనిలిఫార్మె (70.1), ఆల్టర్నేరియా ఆల్టర్నేట (73.0) లపై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… తగిరిస్ / తగరిష చెట్టు

ఇది నిటారుగా పెరిగే ఏకవార్షిక మొక్క. సుమారు 80-90 సెం.మీ. ఎత్తులో వ్యాపించే కొమ్మలు కలిగి ఉంటుంది. సంయుక్త పత్రాలు కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకులు 3 జతలుగా ఏర్పడతాయి. ఇవి కోలగా ఉంటాయి. ఇవి 3-4.5 సెం.మీ. పొడవుంటాయి. పూవులు లేత పసుపు రంగులో ఆకుల మొదళ్ళలో జంటలుగా ఏర్పడతాయి. కాయలు తప్పడిగా లేదా 4 కోణాలు కలిగి ఉంటాయి. కాయలు కొడవలి ఆకారంలో 10-15 సెం.మీ. పొడవుండి లోపల 30-50 గింజలు ఉంటాయి. తప్పడిగా ఉండి నల్లగా మెరుస్తుంటాయి. ఇది మెట్ట భూములలో కలుపు లాగా పెరుగుతుంది.

సాధారణ నామం : సికిల్‌పాడ్ / టోర సికిల్‌సెన్న / చాకుండ శాస్త్రీయ నామం : క్యాసియాటోరా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వేర్లు, ఆకులు మరియు గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఆకులను కూరగా ఉపయోగిస్తారు. ఉదర సమస్యలు, రక్త సమస్యలు, మలబద్ధకం, ఊబకాయం, వాపులు, సుఖవ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి. ఆకులు కణుతులు, రక్తలేమి, ఉబ్బసం, వెక్కిళ్ళు నివారణకుపయోగిస్తాయి.
  • గింజలు కంటి జబ్బులు, చర్మవ్యాధుల చికిత్సకు మరియు విరేచనకారిగా కూడా ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో …

  • తగిరిస్ (క్యాసియాటోరా) విత్తనాలను భారతదేశంలో సేంద్రియ క్షేత్రాలలో సహజ పురుగు మందుగా ఉపయోగిస్తారు. తగిరిస్ అనేక పంటలనాశించే పురుగులపై కీటక నాశక లక్షణాలను కలిగి ఉంది. తగిరిస్ గింజల ద్రావణం, దానిలో అధికంగా ఉండే ఆంత్రాక్వీనోన్స్ ఆఫ్రికన్ మలేరియా వెక్టర్ అనోఫెలెస్ గాంబియేలార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. (ఎమ్‌బాచౌ, అతని అనుచరులు, 2017).
  • క్యాసియానైగ్రికాన్స్ ఆకులలోని ఎమోడిన్ యాంటీమైక్రోబియల్ (అమో, అతనిఅనుచరులు, 2007), తెల్లదోమపెద్ద పురుగులపై కీటకనాశక చర్య, అనోఫెలెస్ గాంబియే పై లార్విసైడల్ చర్య (జార్ౙెస్, అతని అనుచరులు, 2008), సిట్రియోరోసిన్, ఎమోడిక్‌యాసిడ్ అనోఫెలెస్ గాంబియేలార్వాలపై మస్క్విటోసైడల్ చర్య (జార్ౙెస్, అతని అనుచరులు, 2008) లను ప్రదర్శించాయి.
  • క్యాసియాటోరా మిథనాల్ ఆకుద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సిపై అత్యధిక అడల్టిసైడల్ చర్యను ప్రదర్శించింది. హెక్సేన్, క్లోరోఫాం, బెంజీన్, అసిటోన్, మిథనాల్ ద్రావణాలను మనిషి ముంజేతిపై రాసినపుడు ఇవి వికర్షణ చర్య ద్వారా దోమల కాట్ల నుండి రక్షణనిచ్చాయి. (అమరేశన్, అతని అనుచరులు, 2012).
  • క్యాసియాటోరా జీవనియంత్రణ చర్య ద్వారా పార్థినియం మిస్టిరోఫోరస్‌ని అరికట్టింది. ఆకు, కాండం నీటి ద్రావణాలు పార్థినియం విత్తనాల మొలకశాతం, లేత మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపింది. 20% ఆకుల ద్రావణం, 30% కాండం ద్రావణం 100% పార్థినియం విత్తనాలు మొలకెత్తడాన్ని అరికట్టాయి (సింగ్ అండ్ దేవి, 2017). క్యాసియాటోరా మొక్కలు స్రవించిన రసాయనాలు పార్థినియంపై ఎల్లెలోపతి ప్రభావాన్ని చూపాయి.
  • క్యాసియాటోరా (25%) ఆకుల నీటి ద్రావణం సోయాబీన్ పంటనాశించే ఆకుమచ్చ తెగులు కారకం, ఆల్టర్నేరియా ఆల్టర్నేటని పర్యావరణహిత పద్ధతిలో అత్యంత సమర్థవంతంగా నివారించింది (ఖందారె, 2015)
  • క్యాసియాటోర హెక్సేన్ ద్రావణం గోధుమగింజల నిల్వ ధాన్యంలో ఆశించే లెస్సర్ గ్రెయిన్‌బోరర్, రైజోపెర్తా డామినికా నుండి కాపాడింది (అహద్, అతని అనుచరులు, 2016).
  • క్యాసియాటోరా మరియు అరిస్టోలోకియా బ్రాక్టియేట నీటి ద్రావణం మరియు ఇథనాల్ ద్రావణం స్టెఫైలోకోకస్ ఆరియస్, స్టెఫైలోకోకస్ ఆల్బస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, స్ట్రెప్టోకోకస్ ఫీకాలిస్, ఎస్కెరిచియాకోలి, క్లెబ్సియెల్లాఈరోజినెస్, ప్రోటియస్ వుల్గారిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, కాండిడా ఆల్బికాన్స్, ఆస్పర్ౙిల్లస్‌నైగర్‌లపై యాంటీమైక్రోబియల్ చర్యలను ప్రదర్శించాయి. నీటి ద్రావణాలు, ఇథనాల్ ద్రావణాలలో ఇథనాల్ ద్రావణం బాక్టీరియాపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది (జయసుధ, ఆమె అనుచరులు, 2011).
  • క్యాసియాటోరా, గ్లెåరిసిడియా, కానుగ ఆకులను పచ్చిఆకు ఎరువుగా ఉపయోగించవచ్చు. (మురళి, కెవికె, డిడియస్, జహీరాబాద్)
  • క్యాసియా టోరా జీవ పురుగు మందు వెల్లుల్లి పంటనాశించే తామర పురుగులు, త్రిప్స్ టబాసిని నివారించింది. వెల్లుల్లి దిగుబడులను కూడా గణనీయంగా పెంచింది (సింగ్, అతని అనుచరులు, 2014)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… కసివింద

కసివింద ఎక్కువగా ఎర్రనేలలు, గరువు భూములు, రోడ్ల ప్రక్కన, కొండల దిగువ భాగంలో గట్ల మీద ఉంటుంది. సుమారు 60-90 సెం.మీ. ఎత్తు పెరిగి బలమైన వేర్లతో పొదవలే వ్యాపించి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కలు విపరీతంగా వ్యాప్తి చెంది ఇతర మొక్కలను రాకుండా చేస్తాయి. ఆకులు బలిష్టంగా చింతాకుల వలె ఉంటాయి. పూవులు పసుపు పచ్ౘ్రంగులో కొమ్మల సందులలో గుచ్ఛాలు వలె ఉంటాయి. వీటి విత్తనాలకు మొలకెత్తే శక్తి చాలా కాలం వరకు ఉంటుంది. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : కాఫీసెన్న శాస్త్రీయ నామం : క్యాసియా ఆక్సిడెంటాలిస్ కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, వేర్లు, గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో సెన్నోసైడ్లు, నాఫ్తలిన్ గ్లెåకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఆవిరయ్యే నూనె, క్రైసోఫినాల్, ఎమోడిన్, క్రూడ్‌ఫైబర్, కాల్షియం, ఇనుము, నియోసిన్ మొదలగునవి ఉంటాయి.
  • ఈ మొక్క వేరును మిరియాలతో కలిపి పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. దీని వేర్ల కషాయం కుష్టువ్యాధి చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.
  • మొక్క సమూలంగా కోరింత దగ్గు, వ్రణాలు, బొల్లి, మూత్రకోశ వ్యాధులు, మూర్ఛవ్యాధి, హిస్టీరియా వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • కసివింద పెట్రోలియం ఈదర్ మరియు ఎన్‌బ్యుటనాల్ ద్రావణాలు (200 మరియు 300 పిపియం) క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను 100% చంపాయి. దీనిని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దీపక్ కుమార్, అతని అనుచరులు, 2014).
  • కసివింద ఆకుల క్రూడ్ ఇథనాలిక్ ద్రావణం 80 మైక్రోగ్రాములు / మి.లీ. మోతాదుకు పైన రైపిసిఫాలస్ మాన్యులేటస్ గుడ్లు పొదగడాన్ని అకారిసైడల్ చర్య ద్వారా పూర్తిగా నివారించింది. (సునీల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద జీవపురుగుమందు మొక్కజొన్న పంటలో అత్యధిక పెరుగుదలనిచ్చింది. (పంగ్నాకోర్న్, అతని అనుచరులు, 1999). అదనంగా కసివింద మొక్కజొన్న పంటనాశించే పేనుబంక, రొఫాలోసైఫం మెయిడిస్, మొక్కజొన్న తొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫ్యూమకాలిస్, ఆర్మివర్మ్, మితిమ్న సపరేటస్‌లను అత్యంత సమర్ధవంతంగా నివారించింది.
  • కసివింద ఎసెన్షియల్ ఆయిల్ రైజోపెర్తా డామినిక, ట్రైబోలియం కాస్టానియం, క్రిప్టోలెస్టెస్ ఫెర్రుజినియస్, లైపోసెలిస్ పీటాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (వాకిల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద ఆకుల నీటి ద్రావణం పునరుత్పత్తి చర్యను, చన్న పంక్టేటస్ చేపలలో యాంటిఇన్‌ఫ్లమేటరి చర్యను ప్రదర్శిస్తుంది. (మనె, అతని అనుచరులు, 2012).
  • కసివింద ద్రావణం గోధుమ గింజలనాశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగు చావు మరియు పెద్ద పురుగుల సంతతిపై అధిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది (దెర్బాలా, 2012).
  • మొక్క రక్షణ వ్యవస్థలో ప్లాంట్ ప్రోటియేజ్ ఇన్హిబిటర్ (పిపిఐ) ఒక ముఖ్యభాగం. పిపిఐ మొక్కలనాశించే పురుగులు, సూక్ష్మజీవులపై చురుకుగా పనిచేస్తుంది. క్యాసియా స్పీసీస్ యాంటి ఇన్‌సెక్టిసైడల్ మరియు యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కసివింద ఆకుల నుండి ఫిస్టులన్ అనే పిపిఐని వేరు చేశారు. ఈ పిపిఐ స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియాకోలి, బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లా న్యుమోనియాలను స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్‌కి సమానంగా అరికట్టింది (అరుల్ పాండి అండ్ సంగీత, 2012).
  • కసివింద పూల ఇథైల్ అసిటేట్ ద్రావణం నుండి వేరు చేసిన రీన్ (1,8డైహైడ్రాక్సిఆంత్రాక్వినోన3కార్బాక్సిలిక్ యాసిడ్) 1000 పిపియం హెలికోవర్పా ఆర్మిజెరాపై 76.13% యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. రీన్ హెలికోవర్పా ఆర్మిజెరా (67.5%), స్పోడోప్టెరా లిటోర (36.25)లపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. బ్రతికిన లార్వాలు రూపం మారిన పెద్ద పురుగులనుత్పత్తి చేశాయి (దురైపాండియన్, అతని అనుచరులు, 2010).
  • క్యాసియాపెన్నా ద్రావణం అత్యంత సమర్ధవంతంగా గోధుమ గింజల నాశించే ట్రోగోడెర్మా గ్రానేరియంని అరికట్టింది. ఈ ద్రావణంలో కీటకనాశక చర్యగల వివిధ జీవ చర్యలు గల కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ ద్రావణాన్ని గోధుమగింజలను ఈ పురుగు నుండి కాపాడటానికి రసాయన పురుగుమందులకు ఒక సురక్షిత ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దెర్బలా, 2017).
  • చక్రపాణి మిశ్రా విశ్వవల్లభ (అధ్యాయం 8, శ్లోకం 39)లో పురుగుల నివారణకు కసివింద, శాపిండస్ ఎమార్ౙినేటస్, కానుగ, ఆల్‌స్టోనియా స్కాలరిస్, ఎంబెలియా రైబ్స్ బెరడు పొడిని ఆవుమూత్రంలో రాత్రంతా నానబెట్టి చెట్లలో ఆశించిన భాగాలపై పేస్టుగా పూయాలని సిఫారసు చేశారు (సాథేల్, 2004)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… రేల చెట్టు

రేలచెట్టు ఒక మధ్యమ పరిమాణం గల చెట్టు. ఇది వేగంగా పెరిగే 10-20 మీ. ఎత్తు పెరగే చెట్టు. ఆకులు 15-60 సెం.మీ. పొడవుంటాయి. ప్రతి పెద్ద ఆకులో 3-8 జతల చిన్న ఆకులుంటాయి. ప్రతి చిన్న ఆకు 7-21 సెం.మీ. పొడవు, 4-9 సెం.మీ. వెడల్పు వుంటుంది. పూలు 20-40 సెం.మీ. రెసిమ్‌లో ఏర్పడతాయి. ప్రతి పూవు 4-7 సెం.మీ. వ్యాసము ఉండి 5 పసుపు రంగు ఆకర్షక పత్రాలుంటాయి. కాయ 30-60 సెం.మీ. పొడవు, 1.5-3.5 సెం.మీ. వెడల్పు వుంటుంది. కాయలో గింజలుంటాయి. చెట్టు కొయ్య బలంగా వుండి, దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది.

సాధారణ నామం : గోల్డెన్ షవర్ శాస్త్రీయ నామం : క్యాసియా ఫిస్ట్యులా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • చెట్టు యొక్క అన్ని భాగాలు ఔషద గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో సెన్నోసైడ్స్, రీన్ గ్లూకోసైడ్స్, బార్సలాయిన్, ఎలోయిన్, ఫార్మిక్ ఆమ్లం, టానిన్లు, ఆక్సిఆంధ్రాక్వినోన్లు ఉంటాయి.
  • మొక్క భాగాలన్నీ ముఖ్యంగా పండులోని గుజ్ౙు మలబద్ధకాన్ని పోగొట్టి మూలవ్యాధి చికిత్సకు ఉపయోగపడతాయి.
    వేర్లు చర్మవ్యాధులు, సిఫిలిస్ చికిత్సకు ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో

  • రేల చెట్టు నీటి ద్రావణం (0.25%) రైజోపెర్తా డామినికపై బలమైన యాంటిఫీడెంట్ ప్రభావాన్ని చూపింది (రాజారామ్ శైలజ్, ఆమె అనుచరులు, 2013).
  • రేల చెట్టు ఆకు ద్రావణం సైటోఫిలస్ ఒరైజెపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
  • క్యాసియాటోరా ఇథైల్ ఎసిటేట్ ద్రావణం హెలికోవర్పా ఆర్మిజరాపై 65% కన్నా ఎక్కువ యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (రాజి, ఆమె అనుచరులు, 2016).
  • రేల చెట్టు ఇథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర 3వ దశ లార్వాలపై అధిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి (చౌహాన్, అతని అనుచరులు, 2011).
  • రేల చెట్టు ద్రావణం పీచ్ పండుఈగ, బాక్ట్రోసిరా జోనేట గణనీయమైన గుడ్లు పెట్టడాన్ని నిరోధించే చర్యను ప్రదర్శించింది. దీనిని పీచ్ పండుఈగ యాజమాన్యంలో ఉపయోగించవచ్చు. (ఇలియాస్, అతని అనుచరులు, 2017).
  • రేల చెట్టు ద్రావణం రైస్ వీవిల్, సైటోఫిలస్ ఒరైజె చావు, పెద్ద పురుగుల విడుదలను తగ్గించడంపై అధిక ప్రభావాన్ని చూపింది (డెర్బలా, అతని అనుచరులు, 2012).
  • వీవర్ అండ్ సుబ్రమణ్యం (2000) నిల్వధాన్యంలో ఆశించే పురుగులను నివారించే లక్షణాలు గల 200 మొక్కలను గుర్తించారు. అందులో రేల చెట్టు కూడా ఒకటి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… వాము

వాము భారతదేశంలో ఉద్భవించింది. వాము ఒక బహువార్షిక హెర్బల్ మొక్క. ఇది ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది. ఇది చిన్న, నిలువుగా పెరిగే, పుష్పించే పొద. ఇది బిగుతుగా, కొయ్యలా ఉండే కాండంతో మెరుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కాండం చిన్న నూగు కలిగి ఉంటుంది. కాండాలు అనేక కొమ్మలు కలిగి ఉంటాయి. పలుచని ఆకులు ఒకదాని కొకటి దూరంగా ఉంటాయి. ఆకులు 1 సెం.మీ. నుండి 2.5 సెం.మీ. పొడవు కలిగి ఉంటాయి. చిన్న, తెల్లటి పూలు ఏర్పడతాయి. పూలు గుత్తులుగా 4 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. కాయలోని చిన్న గింజలు మంచి వాసన కలిగి లేత గోధుమ రంగు కాయలలో ఏర్పడతాయి. కాయలోని చిన్న గింజలు ముదురు గోధుమ రంగులో 2 మి.మీ. వ్యాసం కలిగి ఉంటాయి.

సాధారణ నామం : అజ్వైన్ శాస్త్రీయ నామం : కారం కాప్టికం కుటుంబం: ఎపియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వాము మొక్కలో ఉపయోగించే భాగాలు కాయ / గింజలు. ఈ మొక్కలో ఔషధ భాగం గింజ లాంటి కాయ. దీనిని పొరపాటుగా అనేక ఇతర గింజలు, సెలరి, కారవెగింజలుగా పొరబడతారు.
  • వాముని ముఖ్యంగా సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. దీనికి కీళ్ళనొప్పులను తగ్గించే ప్రభావముంది. జీర్ణశక్తిని పెంచే సామర్థ్యం కలిగి ఉంది. వాత, కఫదోషాలను నివారిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • వాము ఎసెన్షియల్ ఆయిల్ ధాన్యం గింజల నిల్వలో ఆశించే ట్రైబోలియం కాస్టానియంపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (సహాఫ్ అండ్ మొహర్రమిపోర్, 2009).
  • వాము ఎసెన్షియల్ ఆయిల్ ధాన్యం నిల్వలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులు గుడ్లుపెట్టకుండా అరికట్టింది (సహాఫ్ అండ్ మొహర్రమిపోర్, 2007).
  • వాము ఎసెన్షియల్ ఆయిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ గుడ్లు, లార్వా, పెద్ద పురుగులపై ఫ్యూమిగెంట్ విష ప్రబావం చూపింది (సహాప్ అండ్ మొహర్రిమిసోర్, 2008).
  • వాము గింజల మిథనాల్, ఇథనాల్ ద్రావణాలు పంటలలో తెగులు కలిగించే క్ౙాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ వెసికటోరియా, క్ౙాంతోమోనాస్ ఆక్సొనోపోడిస్ మాల్వేసియారం, క్ౙాంతోమోనాస్ ఒరైజె ఒరైజె, ఎర్వినియా కెరటొవోర బాక్టీరియాల పెరుగుదలను గణనీయంగా అరికట్టాయి. (కవిత మరియు సతీష్, 2011).
  • వాము ఎసెన్షియల్ ఆయిల్‌తో నింపిన నానోజెల్స్ కంట్రోల్ కన్నా 8.9 రెట్లు అధిక విషపూరిత ప్రభావాన్ని, ఎసెన్షియల్ ఆయిల్ 3.7 రెట్లు విషపూరిత ప్రభావాన్ని సైటోఫైలస్ గ్రానేరియస్ మరియు ట్రైబోలియం కాస్టానియం పురుగులపై ప్రదర్శించాయి. ఆయిల్ నింపిన నానోజెల్స్ విషపూరిత ప్రభావాన్ని సైటోఫిలస్ గ్రానేరియస్‌పై 21 రోజుల వరకు, ట్రైబోలియం కాస్టానియంపై 33 రోజుల వరకు కొనసాగించింది (జియాయీ, అతని అనుచరులు, 2013).
  • వాము ఎసెన్షియల్ ఆయిల్ కుటుమ్ చేప (రూటిలస్ ఫ్రిసీకుటుం) నాశించే బాక్టీరియా లిస్టరియామోనో సైటోజెనెస్ సంఖ్యను నిల్వ చేసిన 12 రోజుల తర్వాత పూర్తిగా తగ్గించింది (సోగ్రారాబీమ్, అతని అనుచరులు, 2014)
  • వాము ఎసెన్షియల్ ఆయిల్ మరియు ద్రావణం వరి ధాన్యం నిల్వ సమయంలో ఆశించే వరి ముక్కు పురుగు సైటోఫిలస్ ఒరైజె పురుగుల మరణ శాతాన్ని పెంచి వరి ధాన్యాన్ని కాపాడాయి.
  • వాము ఎసెన్షియల్ ఆయిల్ ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు ట్రైబోలియం కన్‌ఫ్యూసం, రైజోపెర్తా డామినిక, ఒరైజోఫిలస్ సురినామెన్సిస్‌లను ఫ్యూమిగెంట్ విషచర్య ద్వారా నివారించాయి. రైజొపెర్తా డామినిక పురుగులకన్నా ఒరైజాఫిలస్ సురినామెన్సిస్ పురుగులు అధికంగా చనిపోయాయి (హబాషి, అతని అనుచరులు, 2011).
  • వాము ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్ పెరుగుదలను అదుపుచేసి అఫ్లాటాక్సిన్ ఉత్పత్తిని అరికడుతుంది (రెజారెజీల్‌కక్కా, అతని అనుచరులు, 2014).
  • సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో వాము ఎసెన్షియల్ ఆయిల్‌ని డయాటమేసియస్ ఎర్త్‌తో కలిపితే దాని కీటకనాశక చర్య బాగా పెరుగుతుంది. కనుక వాము ఎసెన్షియల్ ఆయిల్{డయాటమెసియస్ ఎర్త్ ట్రైబోలియం కన్ఫ్యూసం, సైటోపిలస్ గ్రానేరియస్‌లను సమర్ధవంతంగా అరికడుతుంది (మసుమేజియాఈ, అతని అనుచరులు, 2014).
  • వాము గింజల ద్రావణం క్యూమిన్ ఎండుతెగులు కారక శిలీంద్రం పెరుగుదలను, శిలీంద్ర బీజాల మొలక శాతాన్ని సమర్ధవంతంగా నివారించింది. కుండీలలో, క్షేత్రంలో జరిపిన ప్రయోగాలలో కూడా వాము గింజల ద్రావణం ఎండు తెగులు ఆశించడాన్ని తగ్గించింది. (గోర్బని, అతని అనుచరులు, 2010).
  • వాము ఎసెన్షియల్ ఆయిల్ ప్రత్తి పేనుబంక, ఎఫిస్‌గాసిపిపై ఫ్యూమిగెంట్ విష చర్య ద్వారా కీటకనాశక చర్యను ప్రదర్శించింది. ఎసెన్షియల్ ఆయిల్‌కి బయలుపడిన 24 గంటలలో పేనుబంక పురుగులు గణనీయ శాతంలో మరణించాయి. వాము ఎసెన్షియల్ ఆయిల్‌ని సమగ్ర సస్యరక్షణ పథకాలలో పురుగుల నివారణకుపయోగించవచ్చు. (లైలామహమారి, ఆమె అనుచరులు, 2015).
  • వాము (టెట్రాకైస్పెర్మం) ఎసెన్షియల్ ఆయిల్ { డయాటమేసియస్ ఎర్త్ సమగ్ర సస్యరక్షణ పథకం నిల్వగింజలనాశించే అలసంద వీవిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్)ని అత్యంత సమర్ధవంతంగా అరికట్టింది (కొర్రామి అండ్ సోలిమాన్‌జేడ్ 2015).
  • వాము ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఒరైజే, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్, ఫ్యుజేరియం మొనిలిఫార్మె, ఫ్యుజేరియం గ్రామినియేరం, పెనిసిల్లియం సిట్రియం, పెనిసిలియం విరిడి కేటం, పెనిసిలియం మాడ్రిటి, కర్వులేరియా ల్యునేటలపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (సింగ్, అతని అనుచరులు, 2004, శ్రీధర్, అతని అనుచరులు, 2003).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… బంగ్లా ఆకు / గాంజా

గాంజా ఒక వార్షిక, 6-12 అ. ఎత్తు పెరిగే పూలు పూసే హెర్బల్ మొక్క. కాండం నిటారుగా పెరుగుతుంది. పెద్ద ఆకులు ఎగుడుదిగుడు అంచులు కల చిన్న ఆకులను కలిగి ఉంటాయి. మొదటి జత ఆకులు ఒకే చిన్న ఆకు కలిగి ఉంటాయి. క్రమంగా ఈ చిన్న ఆకుల సంఖ్య 7 లేదా 9 వరకు పెరుగుతుంది. మొక్క చివరలో ఏర్పడే ఆకులు ఒకే చిన్న ఆకు కలిగి ఉంటాయి. క్రింది జత ఆకులు ఎదురెదురుగా ఏర్పడతాయి. మొక్క చివరి భాగంలోని జంట ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ప్రతి మొక్కలో ఆడ, మగ పూలు ఏర్పడతాయి.

సాధారణ నామం : మార్జువానా / భంగ్‌మొక్క / కామన్ హెంప్ శాస్త్రీయ నామం : కెన్నాబిస్‌సెటైవా కుటుంబం: కెన్నాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేలాది సంవత్సరాలుగా ఔషధరంగంలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఆస్త్మా, డయేరియా, డిసెంట్రి, గనోరియ, ఎపిలెప్సి, గౌట్, మలేరియా, జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • గౌట్, వ్రణాలు, వెర్రుకోస్‌వెయిన్, కీళ్ళ నొప్పులకు లేపనంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగులలో నాసియా, వామిటింగ్‌ల నుండి ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు.

వ్యవసాయరంగంలో

  • గాంజా మొక్కను పురుగు వికర్షిణి, కీటకనాశినిగా అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పురుగులు, నులి పురుగులు, శిలీంద్రాలు, కలుపు మొక్కలను ఆటంక పరుచుటకు దీనిని సహచర పంటగా నాటుతారు. (లేడీస్టోన్, 2015)
  • గాంజా మొక్క ఎండబెట్టిన ఆకులు, పూలు పురుగులు, నల్లులు, నులిపురుగులు కలుపు మొక్కలను వికర్షిస్తాయి లేదా చంపుతాయి. మొక్కల ద్రావణాలు పురుగులు, నులిపురుగులు, నల్లులు, శిలీంద్రాలు, కలుపు మొక్కలు, బాక్టీరియా, ప్రోటోజోవాలను వికర్షించడం లేదా చంపడం చేస్తాయి. (మెక్‌పార్ట్‌లాండ్, 1997)
  • ప్రత్తి చేలకు దగ్గరలో గాంజా మొక్కలను పెంచితే ప్రత్తి నాశించే అలబామా ఆర్ౙిల్లేసియా (కాటన్ వర్మ్) నుండి రక్షించింది (రిలే, 1885).
  • కూరగాయల పంటల చుట్టూ దీనిని పెంచితే క్యాబేజి లార్వా పియరిస్ బ్రాసికె క్యాబేజి పంటను ఆశించకుండా కాపాడింది (బెలింగ్, 1932).
  • ఆలుగడ్డ క్షేత్రాలు పొటాటో బీటిల్ (లెప్టినొటార్సా డెసెమ్‌లినియేటా) ఆశించకుండా రక్షింపబడ్డాయి (స్టాట్టి, 1976).
  • గోధుమ, వేరుశనగ లను డెలియాకోయార్ట్కేటా నుండి కాపాడతాయి. (పకోమోవ్ అండ్ పోటుషాన్ స్కీ, 1977),
  • గాంజా వేరు రసాలు భూమిలోని వేర్లకు నష్టం కలిగించే యూరోపియన్ చాఫర్ బీటిల్ (మెలోలోంతా మెలోలోంతా) నుండి కాపాడతాయి (మటీవ, 1995).
  • గాంజా చిక్‌వీడ్, స్టెల్లేరియా మీడియా, పెరుగుదలను అణచివేసింది (స్టుప్నికా రోడ్ౙింకీవిక్ౙ్, 1970).
  • పొటాటోలేట్‌బ్లెåట్ శిలీంద్రం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్ ను అరికట్టడానికి ఆలుగడ్డ పంటలో గాంజాని అంతర పంటగా వేయాలి (ఇస్రాయెల్, 1981).
  • ఆలుగడ్డ పంటని గాంజాతో పంట మార్పిడి చేసి పొటాటోసిస్ట్ నెమటోడ్, హిటరోడెరారోస్టోకైనెన్సిస్‌ని అణచి వేయవచ్చు. (కిర్‌యనోవా అండ్ క్రిల్, 1971).
  • గాంజాతో పంట మార్పిడి రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ చిట్‌వుడి, సంఖ్యని కూడా అణచి వేసింది (కోక్, అతని అనుచరులు, 1994).
  • బటన్ పుట్టగొడుగు (అగారికస్) పెంపకంలో 137 కి. కంపోస్టుకి 3 కి. గాంజా ఎండు ఆకులను కలిపి ఉపయోగిస్తే పుట్టగొడుగులను తినే నెమటోడ్, ఎఫెలెంకాయిడెస్ కాంపోస్టికోలాని అరికట్టబడింది. (గ్రెవాల్, 1989).
  • గాంజా విత్తన చెక్కలను భూమిలో వేస్తే మెలాయిడోగైన్ ఇన్‌కాంగ్నిటా నులి పురుగుల సంఖ్య తగ్గుతుంది (గోస్వామి & విజయలక్ష్మి, 1986)
  • ఎండు ఆకులు నిల్వ ధాన్యంలో ఆశించే ముక్కు పురుగులను వికర్షించాయి (రిలే Ê హోవార్డ్, 1892, మాకిండూ & స్టీవర్స్, 1924).
  • ఆలుగడ్డ కుప్పలపై 2 సెం.మీ. మందంలో ఎండిన, పొడి చేసిన ఆకుల పొరనేర్పాటు చేస్తే పొటాటో ట్యూబర్‌మాత్ ఆశించకుండా 120 రోజుల వరకు కాపాడుకోవచ్చు. (కష్యప్, అతని అనుచరులు, 1992).
  • గోధుమ గింజలకు పొడి చేసిన గాంజా ఆకులను కలిపి ముక్కు పురుగు సైటోఫిలాఒరైజే ఆశించకుండా కాపాడవచ్చు. (ఖరె, అతని అనుసచరులు, 1974).
  • పూలు పూసే గాంజ మొక్కను నీటిలో వేసి మరగించి కషాయం తయారు చేసి ఆలుగడ్డ పంటపై పిచికారి చేసి పొటాటో బీటిల్, లెప్టినోటార్సాడెసెమ్ లినియేటని చంపవచ్చు. (స్ట్రాట్టి, 1976).
  • 100 గ్రా. తాజా గాంజా ఆకులను 25 మి.లీ. నీటిలో కలిపి రుబ్బి, గుడ్డతో వడకట్టిన ద్రావణం 12వ దశ హిటరోడెరా కజాని నులిపురుగులను చంపాయి (మజుందార్, అతని అనుచరులు, 1989).
  • 10 గ్రా. గాంజా ఆకులను 100 మి.లీ. నీటిలో రుబ్బి, పిల్టర్ పేపర్‌తో వడపోసి ద్రావణాన్ని తయారు చేశారు. 40% ద్రావణం రాగి విత్తనాల నాశించిన 25 వివిధ జాతులకు చెందిన శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది. వీటిలో ముఖ్యమైనవి ఆస్పర్ౙిల్లస్, పెనిసిలియం, క్లాడోస్పోరియం, డ్రెష్లెరా, ఫ్యుజేరియం, సెఫలోస్పోరియం, రైజోపస్, మ్యూకార్, కర్వులేరియా (పాండే, 1982).
  • గాంజా ద్రావణం పైన్ నారు మొక్కలను ఫ్యుజేరియం కలిగించే తెగులు నుండి కాపాడింది (వైసోట్స్‌క్యి, 1962)
  • సోవియట్ అగ్రానమిస్టులు ‘కాన్‌సాటిన్ 4” లేదా కొన్సాటిన” అనే నీటిలో కలిపిన ద్రావణాన్ని ఆలుగడ్డ పంటపై పిచికారి చేసి తెగుళ్ళు కలిగించే కొరినోబాక్టీరియం, సూడోమోనాస్, అగ్రోబాక్టీరియా స్పీసీస్‌ని నివారించారు. (జెలెపుకా, 1960, బెల్‌ట్యుకోవ, 1962).
  • ఆలుగడ్డ నిల్వ సమయంలో మెత్తని కుళ్ళు కలిగించే ఎర్వినియా కెరటవోరా మరియు ఇతర బాక్టీరియాలు నివారించబడ్డాయి (విజయ్, అతని అనుచరులు, 1992)
  • శ్రీవాస్తవ & దాస్ (1974) 100 గ్రా. నూరిన గాంజా ఆకులు, కాండాలను 10 మి.లీ. నీటిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరిగించి కషాయం తయారు చేశారు. ఈ కషాయం సైపరస్ రొటండస్ కలుపు మొక్క విత్తనాలను మొలకెత్తకుండా చేసింది.
  • గాంజా నీటి ద్రావణాలు ఫాల్స్‌ఫామోమైల్ (మాట్రికేరియా రెకుటియేటా), లెమన్ గడ్డి (లోపిడియం సెటైవా) కలుపు మొక్కల విత్తనాలను మొలకెత్తకుండా చేసాయి (స్టుప్నికరోడ్ౙింకి విక్ౙ్, 1970).
  • గాంజా ఆకు ద్రావణాలు (1,2 3, 10 మి.గ్రా/మి.లీ.) ఆపిల్ పంటలో తీవ్ర నష్టాన్ని కలిగించే కాడ్లింగ్‌మాత్ (సైడియాపోయోనెల్లా) ఆపిల్ కాయల నాశించకుండా నివారించింది. (డుర్డెన్, అతని అనుచరులు, 2011).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… జాఫ్రా

జాఫ్రా 4-5 మీ. ఎత్తు పెరిగే చిన్న చెట్టు. గులాబి రంగు పూలు కొమ్మల చివర్లో గుత్తులుగా ఏర్పడతాయి. ముదురు ఎరుపు రంగులో పండ్లు ముళ్ళతో నిండి, అండాకారంలో కొంచెం నొక్కినట్లు ఉంటాయి. గింజలు ముక్కోణాకారంతో ముదురు నారింజ రంగులో 3-4 మి.మీ. పరిమాణం కలిగి ఉంటాయి. ఇవి సామాన్యంగా ఫిబ్రవరి – మే మాసాల్లో లభిస్తాయి. దాదాపు 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు ఫలసాయం పొందవచ్చు.

సాధారణ నామం : అనాటో / సింధూర శాస్త్రీయ నామం : బిక్సా ఒరెల్లానా కుటుంబం: బిక్సేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • బెరడు, విత్తనాలు, గుజ్జు, ఆకులు, వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి.
  • గింజలలో “బిక్సిన్” అనే రసాయనముంటుంది.
  • గింజల గుజ్జులో రంగును కలుగచేసే కెరోటినాయిడ్ ఉంటుంది.
  • దీని బెరడును గనేరియా వ్యాధి, తరచూ వచ్చే జ్వరాల నివారణకు పయోగిస్తారు.
  • గింజల గుజ్జును బంక విరేచనాల నివారణకు ఉపయోగిస్తారు.
  • ఆకులను కామెర్ల వ్యాధి నివారణకు, పాముకాటుకు ఉపయోగిస్తారు.
  • వైద్యపరంగానే గాక గింజల నుండి తీసిన సహజ రంగును ఆహార పదార్థాలలో విరివిగా వాడతారు.

వ్యవసాయరంగంలో …

  • జాఫ్రా గింజల ద్రావణం శాండ్ ఫ్లై, లుట్జోమియా లాంగిపాల్పిస్ చావు శాతాన్ని పెంచింది. బలమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. (డిఆరియాస్, అతని అనుచరులు, 1992).
  • జాఫ్రా ఆకులు జీవపురుగు మందు సామర్థ్యం కలిగి ఉన్నాయి (కేల్, అతని అనుచరులు, 2012).
  • జాఫ్రా ఇథనాల్ ఆకు ద్రావణం గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్య ప్రదర్శించింది.
  • జాఫ్రా గింజల ద్రావణం టిక్స్‌పై పురుగు వికర్షక, పారసైట్ నాశక, దోమవికర్షక చర్యలను ప్రదర్శించింది (డి బోయిర్, అతని అనుచరులు, 2010)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… దేవ కాంచనం

దేవ కాంచనం ఒక చిన్న పరిమాణం నుండి మధ్య పరిమాణం కలిగి కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ, వేగంగా పెరిగే పొద లేదా చెట్టు. ఈ చెట్టు గుండ్రని, వత్తయిన గుబురులాంటి క్యానపి, 10 మీ. ఎత్తు కలిగి, లేత కొమ్మలు మెత్తగా, నునుపుగా ఉంటాయి. పొడి వాతావరణం గల ప్రాంతాలలో చెట్టు పరిమాణం అతి చిన్నదిగా ఉంటుంది. బెరడు తెల్లబారిన బూడిద గోధుమ వర్ణంలో, నున్నగా, కొద్దిగా బీటలు వారిన పొలుసులు కలిగి ఉంటుంది. రెమ్మపుల్లలు సన్నని, లేత ఆకుపచ్చ రంగులో, కొంచెం నూగుతో, కోణాలు కలిగి గోధుమ బూడిద రంగులో ఉంటాయి. హార్ట్‌వుడ్ గోధుమరంగులో గట్టిగా మన్నిక కలిగి ఉంటుంది. ఆకులు సామాన్యంగా, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఆకు ఆధారం గుండ్రంగా ఉండి 12 సెం.మీ. x 12 సెం.మీ. పరిమాణం, చివరి భాగం లోతుగా రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఆకుపైభాగం, అడుగు భాగం నున్నగా, 9-12 ఈనెలు కలిగి ఉంటాయి. ఆకు కాడలు 2.5 – 3.5 సెం.మీ. పొడవుంటాయి. పూరెమ్మ 6-10 ఎరుపు, నీలం కలిసిన రంగు గల పూలను కలిగి ఉంటుంది. పూమొగ్గలు గద ఆకారంలో ఉంటాయి. కాయలు గోధుమ రంగులో 15-30 సెం.మీ. పొడవు, 1.5-2.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కాయలో 10-15 మెరిసే గోధుమ రంగు గింజలు ఏర్పడతాయి..

సాధారణ నామం : పర్పుల్ బాహినియా/ఆర్కిడ్ ట్రీ / బటర్‌ఫ్లెå ట్రీ శాస్త్రీయ నామం : బాహినియా పర్పురియా కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దేవకాంచనం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దీని కషాయం అల్సర్లను నివారిస్తుంది. గాయాలు, దెబ్బలను నయం చేస్తుంది. బొబ్బలు, వ్రణాలను నయం చేయడానికి ఆకులను నూరి తయారు చేసిన పేస్టుని పూస్తారు.
  • కీళ్ళనొప్పులు, వాపులు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఆస్త్మా, జలుబు, దగ్గులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. వ్యాధులు, జలోదరం వంటి జబ్బులను నయం చేయడానికి సహాయ పడుతుంది. యాంటిక్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంది. దేవకాంచనం బెరడుని డయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. పూమొగ్గలను డిసెంట్రి, మొలల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇది మహిళలకు మంచి ఔషధం. బహిష్టు సమయంలో అధిక రక్త స్రావాన్ని ఆపుతుంది. జంతువుల గాట్లకు మంచి మందు. వాయు రోగాన్ని తగ్గించడానికి రోజుకి రెండుసార్లు 10 మి.లీ. వేరు కషాయాన్ని త్రాగాలి. డయేరియా నివారణకు రోజుకి రెండు సార్లు వేరు కషాయం త్రాగాలి.
  • అల్సర్ల నివారణకు బెరడు కషాయంతో కడగాలి. 5 మి.లీ పూల కషాయం రోజుకి రెండు సార్లు త్రాగితే విరేచనాలవుతాయి.

వ్యవసాయరంగంలో

  • దేవకాంచనం ఆకు మిథనాల్ ద్రావణం వరి ధాన్యం నిల్వలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెని 75% చంపింది దీనిని రసాయన పురుగు మందుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు (డెర్బాలా, అతని అనుచరులు, 2012).
  • దేవకాంచనం మిథనాల్ ద్రావణం గోధుమ ధాన్యం నిల్వలో ఆశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగులను చంపడంలో అధిక సామర్థ్యతను ప్రదర్శించింది (డెర్బాలా, 2012).
  • దేవకాంచనం వేడి నీటి ద్రావణం మామిడి పండ్ల నిల్వ సమయంలో ఆశించే ఆంత్రాక్నోస్ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (విచమ్ కోర్ప్రాడిట్‌స్కల్, 1991).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More