గాజరగడ్డ ఒక హెర్బల్ మొక్క. ఇది 30-60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. గరుకు నూగు కలిగి బిగుతైన కాండం కలిగి ఉంటుంది. ఆకులు 3 చిన్న ఆకులు కలిగి ఉంటాయి. ముక్కోణాకారంలో ఉంటాయి. పూలు చిన్నవిగా, పాలిపోయిన తెలుపు రంగులో గుత్తులలో ఉంటాయి. పూలగుత్తి 3-4 అం. వెడల్పు కలిగి ఉంటుంది. మొగ్గ పింకు రంగులో, పూలు ఎరుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. కాయలు గుడ్డు ఆకారంలో చదునుగా ఉంటాయి. కాయ చిన్నదిగా రక్షక నూగుతో కప్పబడి ఎండిపోయి ఉంటుంది. వన్యక్యారెట్ రోడ్డు ప్రక్కన, సాగు చేయని భూముల్లో ఉంటుంది.

సాధారణ నామం : వన్యక్యారెట్ శాస్త్రీయ నామం : డాకస్ కరోట కుటుంబం: ఎపియేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో …
- గాజరగడ్డని ఆహారంగా, ఔషధంగా ఉపయోగించవచ్చు. గాజరగడ్డని ఉడికించి లేదా తాజాగా తినవచ్చు. పూల గుత్తులను ఫ్రెంచిఫ్రైస్ తయారీలో ఉపయోగించవచ్చు. వాసన కలిగిన గింజలను సూపులు, స్ట్రూల తయారీలో ఉపయోగించవచ్చు.
- శతాబ్దాల తరబడి దీనిని ప్రత్యామ్నాయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఎసిటోన్, ఎసిటైల్కోలిన్, ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్, ఆల్ఫాపైసెన్, ఆల్పాటోకోఫెరాల్, ఎపిజెనిన్, అరాకిడోనిక్ యాసిడ్, ఆర్ౙినైన్, అసరోన్, యాస్కార్బిక్ యాసిడ్, బెర్లాప్టెన్, బీటాకెరోటిన్, బీటాసైటోస్టిరాల్, కెఫీక్యాసిడ్, క్యామ్ఫిర్, క్లోరోజెనిక్ యాసిడ్, క్లోరోఫిల్, క్రైసిన్, సిట్రాల్, సిట్రిక్ యాసిడ్, కౌమారిన్, ఎలెమిసిన్, ఎస్క్యులెటిన్, ఇథీనాల్, యూజెనాల్, ఫాల్కరినాల్, ఫెరూలిక్ యాసిడ్, ఫోలాసిన్, ఫార్మిక్ యాసిడ్, ఫ్రక్టోస్, గామాలినోలెనిక్ యాసిడ్, జిరానియాల్, గ్లూటామిన్, గ్లెåసిన్, హైడ్రోజన్ సయనైడ్, మిస్టిడిన్, కీంప్ఫెరాల్, లెసిథిన్, లియోనెన్, లినోలిక్ యాసిడ్, లిథియం, లూపియాల్, లూటిన్, లూటెయోరిన్, లైకోపెన్, మెగ్నీషియం, మాంగనీస్, మిథియోనైన్, మ్యూఫా, మైర్సెన్, మైరిసెటిన్, మిరిస్టిసిన్, నియాసిన్, ఓలిక్యాసిడ్, పాంటోథనిక్ యాసిడ్, పెక్టిన్, ఫినైల్ అలనైన్, పొటాషియం, సొరాలెన్, క్వెర్సెటిన్, స్కోపోలెటిన్, స్టిగ్మాస్టెరాల్, సుక్రోస్, థయామిన్, ట్రిప్టోఫాన్, ట్రైరోసిన్, అంబెల్లిఫెరోన్, క్ౙాంతోటాక్సిన్, అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ఈ క్రింది చర్యలను కలిగి ఉంటాయి. అనాల్ౙెసిక్, యాంటిఆర్థ్రెåటిక్, యాంటిడిప్రెసెంట్, యాంటిసైకోటిక్, యాంటిస్కైజోఫ్రినిక్, యాంటిడోట్, యాంటిఇన్ఫ్లమేటరి, యాంటీబాక్టీరియల్, యాంటికన్వల్సెంట్, యాంటిడయాబెటిక్, యాంటిఈస్ట్రోజెనిక్, యాంటిఫ్లూ, యాంటిహిస్టామినిన్, యాంటి ఆక్సిడెంట్, యాంటిసెప్టిక్, యాంటి స్పాస్మోడిక్, యాంటిఎపిలెప్టిక్, యాంటియాంక్ౙె åటి, యాంటిస్ట్రెస్, యాంటిహ్యాంగఓవర్, యాంటివైరల్, క్యాన్సర్ప్రివెంటివ్, ఎక్స్పెక్టొరెంట్, ఫంగిస్టాట్, ఇమ్యునోస్టిమ్యులెంట్, సెడెటిన్, ట్రాంక్విలైజర్, ఎఫ్రోడిసియాక్, స్వీటెనర్, పిట్యుటరిస్టిమ్యులెంట్.
- ఇది అతి విలువైన మొక్క. అల్ౙీమర్స్, పార్కిన్సన్వ్యాధి, క్రోన్స్వ్యాధి, ఇన్ఫెర్టిలిటి, ఆస్త్మాప్రివెంటివ్, అనేక రకాల క్యాన్సర్, డయాబెటిస్, ల్యుకేమియా, ఎయిడ్స్, స్పైనాబిఫిడ, మైగ్రెయిన్హెడఏక్, ఒబేసిటి, సాధారణ జలుబు వ్యాధుల నివారణకుపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో
- క్యారట్ ద్రావణం (1 మి.లీ.) ట్రైబోలియం కాస్టానియంపై అత్యుత్తమ కీటకనాశక చర్యను ప్రదర్శించింది. క్యారట్ ద్రావణం (1మి.లీ.) { లెవిస్టికం అఫిసినేల్ (2 మి.లీ.) ద్రావణం అత్యంత సమర్ధవంతంగా ట్రైబోలియం కాస్టానియంని అరికట్టాయి. (హ్రుడోవ, అతని అనుచరులు, 2006)
- క్యారట్ గింజల నుండి వేరుచేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్పై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. (దివేరి, డుబె, 1995). క్యారట్ వేర్ల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తిని నివారించింది. (జస్సికామిసియాన్, అతని అనుచరులు, 2004; బెండియాడెల్లా, అతని అనుచరులు, 2014). క్యారట్ ఆయిల్లోని కెరటాల్ ఆల్టర్నేరియా ఆల్టర్నేట శిలీంద్ర పెరుగుదల నరికట్టింది (జాస్సికా మిసియాన్, అతని అనుచరులు, 2004).
- క్యారట్ గింజల నూనె ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్ పెరుగుదలనరికట్టి అఫ్లాటాక్సిన్ ఉత్పత్తవకుండా చేసింది (భట్, అతని అనుచరులు, 1983).
- క్యారట్ గింజల నుండి వేరు చేసిన రెండు పెప్టెåడ్లు వర్టిసిల్లియం డాలియే పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టాయి (ఇల్లి, అతని అనుచరులు, 2006).
- క్యారట్ పూల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ స్పోడోప్టెరా లిట్టోరాలిన్ 3వ దశ లార్వాలపై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది (సలాహెడ్ౙిన్, అతని అనుచరులు, 2013).
- క్యారట్ ఎసెన్షియల్ ఆయిల్ క్యూలెక్స్ పిపియెన్స్పాల్లెన్స్, డి. మాగ్న దోమలపై లార్విసైడల్ ప్రభావాన్ని చూపింది (పార్క్, పార్క్, 2012).
- క్యారట్ పూల నుండి వేరు చేసిన ఆవిరయ్యే నూనె స్పోడోప్టెరా లిట్టొరాలిస్ 3వ దశ లార్వాలపై విషప్రభావాన్ని చూపింది. (సౌగ్విర్, అతని అనుచరులు, 2013).
- క్యారట్ ఆయిల్ బాసిల్లస్ సబ్టైలస్, సాల్మొనెల్లా టైఫిన్యూరియం బాక్టీరియా పెరుగుదలనరికట్టింది (గ్రోవర్, రావు, 1976, 1978, 1979).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

