ఇది 4-5 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక చిన్న చెట్టు. కొమ్మలు నిటారుగా చెట్టు అగ్రభాగంలో వస్తాయి. కాయలు నక్షత్రం ఆకారంలో ఉండి పుల్లగా ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు. సంవత్సరంలో రెండుసార్లు (ఏప్రిల్-మే మరియు ఆగస్టు-సెప్టెంబరు) కాపు తీసుకోవచ్చు.
సాధారణ నామం : కంట్రిగూస్‌బెర్రి / స్టార్‌గూస్‌బెర్రి శాస్త్రీయ నామం : సిక్కా అసిడ కుటుంబం: యూఫర్బియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- దీనిలో కాయలు ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది.
- ఇవి కామెర్లు మరియు జీర్ణకోశ వ్యాధులకు ఉపయోగపడతాయి.
వ్యవసాయరంగంలో
- రాచ ఉసిరిలో గ్లెåకోసైడ్, టానిన్, రెసిన్ వంటి రసాయనాలుంటాయి. దీని ద్రావణం బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ మెగాథీరియం, స్టెపైలోకోకస్‌టైఫి, స్టెఫైలోకోకస్ డీసెంటిరియేలపై యాంటి మైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (రెహ్మాన్, అతని అనుచరులు, 2011).
- రాచ ఉసిరి ద్రావణం పైన్ వుడ్ నెమటోడ్, బర్సాఫెలెంకస్ క్ౙెåలోఫిలస్‌లపై బలమైన యాంటినెమటోడల్ చర్యను ప్రదర్శించింది (మకీన్, అతని అనుచరులు, 1997).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

