ఇది బహువార్షిక పొద. కొమ్మలు తీగలవలె సాగి 4-5 మీ. పొడవు వరకు పెరుగుతాయి. ఆకులు దళసరిగా, దంతాల వంటి పళ్లు కలిగి, ఒంటరిగా అమిరి ఉంటాయి. పూలు లేత ఆకుపచ్చ, పసుపు రంగులో కొమ్మల చివర క్రిందకు వేలాడుతూ ఉంటాయి. ఒక్కొక్క కాయలో 4-5 గింజలుండి, నారింజ ఎరుపు రంగు పొరతో కప్పబడి ఉంటాయి. గింజలు గోధుమ రంగులో ఉంటాయి. బాగా ఎండిన ఫలాలు చివరలో మూడుగా చీలి గింజలు వెదజల్లుతాయి. ఫిబ్రవరి-సెప్టెంబర్ మధ్యలో పుష్పించి ఫలిస్తుంది.
సాధారణ నామం : క్లయింబింగ్ స్టాఫ్‌ప్లాంట్ / మాల్‌కంగని / ఇంటలెక్స్ ట్రీ శాస్త్రీయ నామం : సెలాస్ట్రస్ పానిక్యులేటస్ కుటుంబం: సెలాస్ట్రేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- ఆకులు, గింజలు, నూనె, చెక్క ఔషధగుణాలు కలిగి ఉంటాయి. గింజలలో చేదైన రెసిస్, టానిన్లు, సెలాస్ట్రిన్, పానిక్యులేటన్ అనే ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఎరుపు – పసుపు రంగు గల సుగంధ తైలం లభిస్తుంది.
- ఆకులు, బెరడు, గింజల నుండి లభించే తైలాన్ని జ్యోతిష్మతి తైలం అంటారు. దీనిని మతిస్థిమితం లేని వారికి బ్రెయిన్‌టానిక్ లాగా ఉపయోగిస్తారు. ఇది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. బెరిబెరి వ్యాధిని నయం చేస్తుంది.
- గింజల నూనెను శరీరానికి రాసుకుంటే దోమలు కుట్టవు. గింజలను ఆవుమూత్రంలో కలిపి దంచి లేపనం చేస్తే పుండ్లు, గజ్జి, తామర, వాపులు హరిస్తాయి. ఆకులు స్త్రీలలో ఋతుస్రావాన్ని నియంత్రిస్తాయి.
వ్యవసాయరంగంలో
- సెలాస్ట్రేసి కుటుంబానికి చెందిన మొక్కలు బీటాడైహూడ్రోఅగారోఫ్యురాన్ సెస్క్విటెర్పిన్ పాలియెస్టర్స్ మరియు పిరిడిన్ ఆల్కలాయిడ్స్ కలిగి ఉంటాయి. వీటిలో కొన్ని యాంటి ఫీడెంట్, కీటకనాశక చర్యలను ప్రదర్శిస్తాయి(బ్రూనింగ్ అండ్ వాగ్నర్, 1978; యమాడ, అతని అనుచరులు, 1978, టు, 1991).
- సెలాస్టస్ జీనస్‌కి చెందిన అనేక జాతులు యాంటిఫీడెంట్ మరియు కీటకనాశక లక్షణాలను కలిగి ఉంటాయి. సెలాస్టస్ యాన్‌గ్యులేటస్ ద్రావణాలు యాంటి ఫీడెంట్ మరియు గణనీయమైన కీటకనాశక చర్యలు కలిగి ఉంటాయి. సంప్రదాయకంగా వేరుబెరడు పొడిని చైనాలో మొక్కలను పురుగుల నష్టాల నుండి కాపాడటానికి ఉపయోగిస్తారు. ఈ వేరుపొడి కుకుంబర్ బీటిల్, ఆలకోఫొరా ఫెమొరాలిస్‌కైనెన్సిస్, క్రూసిఫెరస్ లీఫ్‌బీటిల్, కొలాఫెల్లస్ బేరింగి, విల్లో లీఫ్‌బీటిల్, ప్లాగియోడెరా వెర్సిక…ర్, క్యాబేజి సాఫ్లెå, అతాలియా ఫ్లాక్, హమవాయిమన్ బీట్‌వెబ్ వర్మ్, హైమెనియా రీకర్వాలిస్, ఇంపోర్టెడ్ క్యాబేజివర్మ్, పిమెరిస్ రాపే, టెంట్ క్యాటర్‌పిల్లర్, మలకోసోమ న్యూస్ట్రియాటేస్టేసియా, మైగ్రేటరిలోకస్ట్‌లు, లోకస్టా మైగ్రటోరియా, లోకస్టామైగ్రటోరియా మానిలెన్సిస్‌లపై చర్యలను ప్రదర్శించాయి. ఈ ద్రావణాలలో ఉన్న ఆంగ్యులాటిన్ ఎ, సెలాంగ్యులిన్స్ మరియు సెస్విటెర్పిన్స్ వల్ల జీవ చర్యలు సంభవిస్తాయి. సెలాంగ్యులిన్ వేరు బెరడు, గింజల నూనెలోని అతిముఖ్యమైన సమర్ధవంతమైన రసాయనం (చిము, 1989).
- జికాయ్, అతని అనుచరులు సెలియాస్ట్రస్ యాన్‌గ్యులేటస్ నుండి 7 బలహీన ఆల్కలాయిడ్లను వేరు చేసి పియెరిస్ రాపే, ఆస్ట్రినా ఫర్మకాలిస్‌పై పరీక్షించి బలమైన యాంటిఫీడెంట్స్‌గా గుర్తించారు. వారు సెలాస్ట్రస్ యాంగ్యులేటస్ వేరు బెరడు నుండి వేరు చేసిన 4 సెస్క్విటెర్పిన్ ఆల్కలాయిడ్స్ నిర్మాణాన్ని రిపోర్టు చేశారు. ఇవి అనేక పురుగులపై బలమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి.
- మాఓటియన్, అతని అనుచరులు (1991) సెలాస్ట్రస్ యాంగ్యులేటస్ వేరు బెరడు నుండి కీటకనాశక సెస్క్విటెర్పిన్‌పోలియెస్టర;్ ఆంగ్యులాటిన్ ఎ ని వేరు చేశారు. ఈ సెస్క్విటెర్పిన్ ఆల్కలాయిడ్ మిశ్రమం ఆంగ్యులాటిన్ ఎ ని కలిగి ఉండి ఎఫిస్ గాసిపి, పియెరిస్ రాపేలపై కీటకనాశక మరియు యాంటిఫీడెంట్ ప్రభావాలను చూపాయి.
- డగాంగ్, అతని అనుచరులు (1992) సెలాస్ట్రస్ యాంగ్యులేటస్ గింజల నుండి రెండు సెస్క్విటెర్పిన్స్ ఆంగ్యువాల్యుమాయిడ్ జి మరియు హెచ్‌ని వేరు చేశారు. వీటిలో యాంగ్యులాట్యుయాయిడ్ జి (100 పిపియం) ఆలకోఫొరా ఫెమొరాలిస్ మరియు ఫ్లూటెలా ్లక్ౙెåలోస్టెల్లా లపై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
- సెలాస్ట్రస్ ఫ్లాజెల్లారిన్ నుంచి సెలాస్ట్రియన్ ఎ మరియు బి అనే రెండు క్రొత్త సెస్క్విటెర్పిన్ పాలిమర్ ఎస్టర్స్‌ని గుర్తించారు. వీటిలో సెలాస్ట్రిన్ ఎ (500 మి.గ్రా) మితిమా ఉపినె పై యాంటిఫీడెంట్ (93%) చర్యను ప్రదర్శించింది (దీప అండ్ బాయ్, 2010)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.