తంగేడు లెగ్యూమ్ జాతికి చెందిన పూలు పూసే మొక్క. పెద్ద ఆకులో 16-24 చిన్న ఆకులుంటాయి. చిన్న ఆకుల కాడలు 2.2-2.5 సెం.మీ. పొడవు, 1þ1.3 సెం.మీ. వెడల్పు, రెండు చివరలు కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పూలు క్రమాకారం లేకుండా, కాంతివంతమైన పసుపు రంగులో పెద్దవిగా 2.5 సెం.మీ. పొడవు కలిగి ఉంటాయి. కాయలు 7.5 సెం.మీ. పొడవు, 1.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కాయలో 12-20 విత్తనాలుంటాయి..
సాధారణ నామం : ట్యానర్స్ క్యాసియా శాస్త్రీయ నామం : క్యాసియా ఆరిక్యులేటా కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- తంగేడు పూలను ఆరబెట్టి, మెత్తని పొడి చేసి ఫేస్ పౌడర్, పెరుగుతో కలిపి అనేక మంది భారతీయ మహిళలు గరుకు చర్మం, నల్ల మచ్ౘ్లు పోగొట్టుకోవడానికి ఉపయోగిస్తారు.
- డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రిస్తుంది. తంగేడు పానీయం పసిపిల్లలు, చిన్న పిల్లలలో జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తంగేడు పూల రసం మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. తంగేడు విత్తనాలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి గనోరియా, కళ్ళకలక చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని ఆయుర్వేద మందు…లÕ టానిక్‌గా, డయాబెటిస్ మందుగా ఉపయోగిస్తారు.
- తంగేడు పూలు, ఆకులు, కాండం, వేరు, పచ్చి కాయలు ఆయుర్వేదంలో కీళ్ళు, కండరాల నొప్పులు, మలబద్ధకం, పచ్ౘ్కామెర్లు, మూత్రకోశ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
- తంగేడు ఆకు ద్రావణం (1%) వంగ పంట నాశించే అక్షింతల పురుగు (హెనోసెపిలాక్న లిగ్నింటియో పంక్టేట, స్పోడోప్టెరా లిటూర, 2వ, 4వ దశ లార్వాలపై ఆకులు తినడాన్ని ఆటంక పరిచే చర్య (యాంటీఫీడెంట్), కీటకనాశక చర్యలను ప్రదర్శించింది (చిత్ర, 1991).
- తాజా తంగేడు ఆకులను సేకరించి నీటిలో బాగా కడిగి తర్వాత డిస్టిల్డ్ వాటర్‌లో కడిగి నీడలో ఆరబెట్టి, పొడి చేయాలి. 5 గ్రా. పొడిని 100 మి.లీ. నీటికి చొప్పున కలిపి 5 గంటలుంచాలి. తర్వాత వాట్‌మన్ నెం.1 ఫిల్టర్ పేపర్ ద్వారా వడపోయాలి. దీనికి 0.05% సర్ప్ పొడి కలిపి పిచికారి చేసి టీ పంటనాశించే ఎర్రనల్లి (ఓలిగోనైకస్ కాఫియే)ని సమర్ధవంతంగా నివారించవచ్చు. ఇది ఎర్రనల్లిని నివారించడానికి సులభమైన, ప్రత్యామ్నాయ, పర్యావరణహిత పద్ధతి (కుమార్, అతని అనుచరులు, 2016).
- తంగేడు, గన్నేరు, ఉమ్మెత్త, అడవి ఆముదం, వేప, జిల్లేడు, ఈశ్వరవేరు, తుమ్మ, పెద్దమాను, మొక్కలన్నింటినీ ఆరబెట్టి పొడి చేసి ఆవుపేడ, ఆవు మూత్రంలో కలిపి 20 రోజులు పులియబెట్టాలి. తర్వాత దీనిని వడపోసి 1 లీ. ద్రావణాన్ని 20 లీ. నీటికి చొప్పున కలిపి పిచికారి చేసి పంటల్లో పురుగులు, తెగుళ్ళును సమర్ధవంతంగా నివారించవచ్చు. దీనినుపయోగించడం వలన మొక్కలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

