బాలానగర్‌ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపునివ్వాలి!ఉద్యాన వర్సిటీ దరఖాస్తు

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాలమూరు బాలానగర్‌ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేసింది. చెన్నైలోని జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ (జీఐఆర్‌) కార్యాలయంలో మూడు రైతు ఉత్పత్తి సంస్థల పేరిట విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త, ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త పిడిగం సైదయ్య, జీఐ ప్రాక్టీషనర్‌ సుభాజిత్‌ సాహాతో కలిసి దరఖాస్తును సమర్పించారు. దీనిపై త్వరలో జీఐఆర్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరతారు. అభ్యంతరాలేమీ రాని పక్షంలో బాలానగర్‌ సీతాఫలానికి జీఐ గుర్తింపును మంజూరు చేస్తారు.

Read More

ఉద్యాన ప్రదర్శనలో ‘నార్మ్‌’కు ప్రథమ బహుమతి

దిల్లీలోని ప్రగతిమైదాన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ వ్యవసాయ, ఉద్యాన, ఆర్గానిక్‌ ప్రదర్శనలో జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ(నార్మ్‌) కు ప్రథమ బహుమతి లభించింది. వందకు పైగా సంస్థలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో శిక్షణ, అభ్యాసం, పరిశోధన, సామర్థ్య నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన సంస్థలను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేటు వ్యవహారాల శాఖ సహాయమంత్రి హర్ష్‌ మల్హోత్రా చేతుల మీదుగా సోమవారం నార్మ్‌ విస్తరణ నిర్వహణ విభాగం వెంకటకుమార్‌, ముఖ్యశాస్త్రవేత్త శివకుమార్‌లు ఈ పురస్కారం పొందారు.

Read More

రేపటితో రైతు భరోసా పూర్తి చేస్తాం

సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతుభరోసా నిధులు జమ చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.8284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు, ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న మిగతా భూములకు కూడా రైతుభరోసా నిధుల ప్రక్రియను రేపటి వరకు పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. ఇంతకుముందు రైతు రుణమాఫి కూడా చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోగా పూర్తి చేశామని ఈ సందర్భంగా మంత్రిగారు గుర్తుచేశారు. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా సన్నాలకు మద్ధతు ధరపై 500/-లు బోనస్‌ ప్రకటించడం జరిగిందని, తద్వారా అదనంగా 2 వేల కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారన్నారు. మార్క్‌ ఫెడ్‌ ద్వారా పండిన ప్రతి పంటను తమ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. రైతు భరోసా ద్వారా అందుకున్న నిధులను రైతులు పంట పెట్టుబడులకు వాడుకొని, మంచి పంటలు పండించుకోవాలని ఈ సందర్భంగా మంత్రిగారు ఆకాంక్షించారు. రైతుల సంక్షేమమే మాకు తొలి ప్రాధాన్యమని, అందుకనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం పట్ల మా ప్రభుత్వ వైఖరి చిత్తశుద్ధి ఏ మాత్రం మారదని మంత్రిగారు తెలియజేశారు.

Read More

ప్రతికూలతల్లోనూ ఫలప్రదం

‘అనంత’ ఉద్యాన రైతులకు కలిసొస్తున్న ప్రత్యేక వాతావరణం
లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలతో పండ్లకు రుచి, నాణ్యత

తక్కువ వర్షపాతం, అంతంతమాత్రంగా భూగర్భ జలం, అధిక ఉష్ణోగత్రల వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన పంటల సాగులో అద్భుతాలు సాధిస్తున్నారు. ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పండించే పండ్లు ఎక్కువ రుచి, నాణ్యతగా ఉండడంతో వాటికి దేశంతో పాటు విదేశాల్లోనూ డిమాండ్‌ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో అరటి, చీనీ, దానిమ్మ, మామిడి, సపోటా, రేగు, జామ, నేరేడు, ద్రాక్ష, పుచ్చకాయ, దిల్లీ దోస, బొప్పాయి, డ్రాగన్‌ తదితర రకాలు సాగుచేస్తున్నారు. జిల్లాలో ఏటా 50 లక్షల టన్నుల మేర పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని 2047 నాటికి రెండింతలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. పండ్లరసంలో చక్కెర మోతాదును రిఫ్రాక్టోమీటరు ద్వారా బ్రిక్స్‌లో కొలుస్తారు. 1% చక్కెరను ఒక డిగ్రీ బ్రిక్స్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక పండులో 10 డిగ్రీల బ్రిక్స్‌ విలువ ఉందంటే.. 100 గ్రాములకు 10 గ్రాముల చక్కెర ఉన్నట్లు అర్థం. బ్రిక్స్‌ విలువ అధికంగా ఉండే పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అవి ఎగుమతులకు అనుకూలం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండించే అరటి, మామిడి, దానిమ్మ పండ్లలో బ్రిక్స్‌ విలువ 13 నుంచి 17 వరకు ఉంటోందని అధికారులు చెబుతున్నారు. దీంతో దేశీయ వినియోగంతోపాటు ఎగుమతుల పరంగానూ జిల్లాలో పండే పండ్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.

వాతావరణం ప్రత్యేకం

  • రాష్ట్రంలోనే అత్యల్పంగా అనంతపురం జిల్లాలో ఏటా 511 మి.మీ., శ్రీసత్యసాయి జిల్లాలో 611 మి.మీ. వర్షపాతం నమోదవుతోంది. ఈ ప్రాంతంలో అధికంగా ఎర్రనేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి నీటిని ఎక్కువగా నిల్వ చేసుకోవు. ఫలితంగా పండ్ల మొక్కల వేరు వ్యవస్థ పటిష్ఠంగా మారడానికి దోహదపడుతోంది. వేరు కుళ్లు తెగులు తక్కువగా కనిపిస్తుంది.
  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో గాలిలో తేమ శాతం ఉదయం 73, మధ్యాహ్న సమయాల్లో 38గా ఉంటోంది. రాష్ట్రంలో ఇదే అత్యల్పం. ఏటా సగటున 34 డిగ్రీల నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజులో 8-9 గంటలు సూర్యరశ్మి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ తేమశాతం కారణంగా పండ్ల తోటలకు తెగుళ్లు ఆశించడం తక్కువ. మొక్కల్లో ఎదుగుదల బాగుంటుంది. సహజ బెట్ట పరిస్థితి పూత ఎక్కువగా రావడానికి దోహదపడుతుంది.

విదేశాలకు అరటి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 13,700 హెక్టార్లలో అరటి పండిస్తుండగా, ఎకరాకు 65 టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా ముంబయి పోర్టుకు, అక్కడి నుంచి ఇరాన్‌, ఇరాక్‌, సౌదీ అరేబియా, దుబాయ్‌, బహ్రెయిన్‌ తదితర అరబ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1.05 లక్షల టన్నుల అరటిని ఎగుమతి చేశారు. గరిష్ఠంగా కిలోకు రూ.30ల ధర లభించడంతో అధిక లాభాలు పొందినట్లు రైతులు చెబుతున్నారు.

పండ్ల తోటల పెంపకానికి అనుకూలం

  • సుబ్రహ్మణ్యం, చీఫ్‌ సైంటిస్ట్‌, ఉద్యాన పరిశోధన స్థానం, రేకులకుంట
    ఉమ్మడి అనంతపురం జిల్లా వాతావరణం.. పండ్ల తోటల పెంపకానికి అనుకూలం. తక్కువ వర్షపాతం కారణంగా నేలలో తేమశాతం తక్కువ. ఫలితంగా వేరువ్యవస్థ పటిష్ఠంగా మారి మొక్క జీవితకాలం పెరుగుతుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పూత, పిందె రాలడం తక్కువ. గాలిలో తేమ అనుకూలంగా ఉండటంతో తెగుళ్ల బెడద పెద్దగా ఉండదు. ఫలితంగా దిగుబడి పెరగడంతో పాటు పండ్ల నాణ్యత బాగుంటుంది.

Read More

పంటల ఉత్పత్తిలో ప్రైవేట్‌ భాగస్వామ్యం పెరగాలి

వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ ఛైర్మన్‌
హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల సమావేశం

వ్యవసాయ పంటల ఉత్పత్తిలో ప్రస్తుతం 2 శాతం మాత్రమే ప్రైవేటు భాగస్వామ్యం ఉందని, దానిని మరింత పెంచే దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాలని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సీఏసీపీ) చైర్మన్‌ విజయ్‌పాల్‌ శర్మ సూచించారు. సాంకేతికత సహాయంతో పంట ఉత్పత్తులను పెంచుకోవాలన్నారు. 2024-26 మార్కెటింగ్‌ సీజన్‌కు మద్దతు ధరల విధానం ఖరారుపై శుక్రవారం హైదరాబాద్‌లో దక్షిణ భారత రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంత అధికారులు, రైతు ప్రతినిధులతో కమిషన్‌ సమావేశం నిర్వహించింది. కమిషన్‌ సభ్యులు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌ రావు, సంచాలకుడు గోపి, మార్కెటింగ్‌ సంచాలకుడు సురేంద్రమోహన్‌, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌పాల్‌ మాట్లాడుతూ ”స్థానిక అవసరాల మేరకు పంట నిల్వలకు సరిపడా గోదాములు నిర్మించడం ద్వారా రైతులకు పెట్టుబడి, వినియోగదారులకు కొనుగోలు భారాన్ని తగ్గించవచ్చు. తద్వారా సరసమైన కనీస మద్దతు ధరలు నిర్ధారణ సులభతరం అవుతుంది. దక్షిణ రాష్ట్రాల్లో నేలలు, వాతావరణ అనుకూలతలతో పాటు తక్కువ నీటితో పండే శనగలు, కుసుమలకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. ఆ పంటలను

Read More

కర్నూలులో రూ.500 కోట్లతో ‘ఎంకాడ్‌

పొలాలకు పైపులతో సాగునీటి సరఫరా ప్రతిపాదనలు రూపొందిస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో సుమారు 25 వేల హెక్టార్లకు నీటిని అందించేలా ఎంకాడ్‌ (మోడ్రనైజేషన్‌ ఆఫ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌) పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కర్నూలు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎర్రనేలల్లో గణనీయంగా పంటలు పండించడానికి వీలుగా ఎంకాడ్‌ పథకాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఎర్రనేలలకు పైపుల ద్వారా నీటిని అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఐదు చోట్ల ఎర్రనేలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో బ్లాక్‌గా నిర్ణయించారు. ఒక్కో బ్లాక్‌ పరిధిలో సుమారు ఐదు వేల హెక్టార్ల ఎర్రనేలలున్నాయి. ఐదు బ్లాకుల్లో కలిపి మొత్తం 25 వేల హెక్టార్లకు నీరు అందించడానికి అవకాశం ఉంది. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) కాలువ నుంచి నీటిని తీసుకునేలా ఎంకాడ్‌ పథకానికి రూపకల్పన చేశారు. ఒక్కో బ్లాక్‌ దగ్గర ఒక్కో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. దీనికి సుమారుగా రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వ్యయాన్ని భరిస్తుంది. నందికొట్కూరు, కృష్ణగిరి, పత్తికొండ, వెల్దుర్తి మండలాల పరిధిలో నీటిని అందించనున్నారు.*ప్రయోజనాలెన్నో..*- పీపీడబ్ల్యూఎస్‌ (ప్రెజరైజ్డ్‌ పైప్డ్‌ వాటర్‌ సప్లై) విధానంలో సాగునీటిని రైతులు పొలం దగ్గరికి పైపుల ద్వారా పంపుతారు. ఫలితంగా సాగునీటి వృథాకు అడ్డుకట్ట పడుతుంది. 90 శాతం నీరు సద్వినియోగం అవుతుంది.- పొలం దగ్గరికి పైపులైను వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి డ్రిప్‌లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ‘ప్రెజరైజ్డ్‌ పైప్‌ ఇరిగేషన్‌ నెట్‌వర్క్‌’ (పీపీఐఎన్‌) పేరుతో ఒక్కో బ్లాక్‌ పరిధిలో ఉండే రైతులందరినీ ఇందులోకి తెచ్చి.. ప్రతి ఒక్కరికి తగిన పరిమాణంలో నీరు అందేలా చర్యలు తీసుకుంటారు. – ఈ విధానంలో ప్రత్యేకంగా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదు.- మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంకాడ్‌ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. – మోటార్లు ఉపయోగించి పైపుల్లో నీటిని పంపుతున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు రైతులకు నీరందదనే సమస్య ఉండదు.

Read More

వ్యవసాయ రంగంలో భారీగా ఉద్యోగాలు

ఐకార్‌ మాజీ డీడీజీ ఆర్సీ అగర్వాల్‌

దేశంలో వ్యవసాయ ఉద్యోగావకాశాలు ఏటా 8 శాతానికి పైగా పెరుగుతున్నాయని 2040 నాటికి 17.7 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌(డీడీజీ) డాక్టర్‌ ఆర్సీ అగర్వాల్‌ తెలిపారు. ఈ మేరకు మానవ వనరులను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో శుక్రవారం ‘వ్యవసాయ విద్య, అవకాశాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ”భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడంలో వ్యవసాయాధారిత అంకుర పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తాయి. కృత్రిమ మేధతో భవిష్యత్తులో గ్రామీణ విప్లవం వస్తుంది. రైతుల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల ఆధారిత ఉత్పత్తులతో పరిశ్రమలు, వ్యాపారాలు పెద్దఎత్తున సాగుతాయి. వ్యవసాయ విద్యార్థులు కమ్యూనికేషన్స్‌, పారిశ్రామిక నైపుణ్యాలు సాధించాలి” అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో ఉద్యోగావకాశాలపై వివిధ ప్రచురణలను ఆవిష్కరించారు. రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్‌, శాస్త్రవేత్తలు, ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయరంగంలో ఏఐ సాంకేతికత వాడుకొనే దిశగా తెలంగాణ ప్రభుత్వం

రోజువారి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి తుమ్మల

– ఈ రోజు మరో రెండు సంస్థలతో చర్చలు

– సాగులో ఉన్న భూమి, పంటల వారి విస్తీర్ణము మరియు ముందుగానే పంట చీడల గుర్తింపు, నివారణలో ఏఐ పరిజానాన్ని వాడుకొనే యోచనలో ప్రభుత్వం

వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతను వాడుకునే దిశలో భాగంగా వివిధ ఏఐ సంస్థల ప్రతినిధులతో గత రెండు, మూడు రోజులుగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి, సీజన్ల వారిగా పంటల విస్తీర్ణము, పంట చీడ పీడల గుర్తింపులో మనుషుల వాడకాన్ని తగ్గించి ఏఐ సాంకేతికత వాడాలని రాష్ట్ర ప్రభుత్వము కృత నిశ్చయముతో ఉన్నదని, తద్వారా రైతాంగానికి సత్వర సేవలందించడానికి అవకాశాలు ఏర్పడుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో ఈ దిశగా ప్రొ. జయశంకర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయము వారు గత మూడు సంవత్సరాల నుండి చేస్తున్న పరిశోధనల ఫలితాలను ఆగ్రోనమి ప్రొ. డా. నీలిమ మంత్రికి తెలియజేశారు. ఇక్రిశాట్‌ నుండి హాజరైన ప్రతినిధులు తాము ప్రయోగిస్తున్న ఉపగ్రహ చాయాచిత్రాల వివరాలు, దాని ఆధారంగా వివిధ రాష్ట్రాలకు అందిస్తున్న సేవలను ముఖ్యంగా పంటల సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడంలో తాము అవలంబిస్తున్న పద్ధతులను మంత్రికి తెలియజేశారు. అగ్రివాస్‌ ప్రతినిధులు తాము ఉపయోగిస్తున్న ఉపగ్రహ చాయాచిత్రాలు, వాటి ద్వారా పంటలకు వచ్చే తెగుళ్లు, క్రిమికీటకాలు మరియు నీటి ఎద్దడి పరిస్థితులను ఎలా అంచనా వేయగలుగుతున్నాము, తమ పరిశోధనల ఫలితంగా రైతులు ఏ విధంగా ప్రయోజనం పొందిన విషయాలను మంత్రికి తెలియచేశారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలతో వ్యవసాయ రంగంలో కూడా ఏఐ సాంకేతికత ఉపయోగించుకొని, రైతులకు ప్రభుత్వం ద్వారా అందే సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయుటకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదన్నారు. ఈ వానాకాలం నుండి పైలట్‌ పద్ధతిలో అందుబాటులో ఉన్న అన్ని రకాల టెక్నాలజీని వాడుకొని, అన్నింటికంటే రైతులకు ప్రయోజనకరంగా ఉన్న పద్ధతులను రాష్ట్రమంతటా విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్‌ రావు, వ్యవసాయ అధికారులు, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

Read More

ఈ రోజు 7 ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ

  • మరో 905.89 కోట్లు విడుదల – మంత్రి తుమ్మల

9 రోజుల్లో వానాకాలం రైతుభరోసా సహాయానికి పూర్తి నిధులు విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా 5 వ రోజు 7 ఎకరాల వరకు రైతుభరోసా నిధులను విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ రోజు మరో 905.89 కోట్లు రైతుభరోసా కోసం విడుదల చేసామని, దీని ద్వారా 2.64 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి పేర్కొన్నారు. కేవలం 5 రోజుల లోనే 7310.59 కోట్లు విడుదల చేసామని, ఇప్పటివరకు 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని అన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు కూడా రైతుభరోసా సహాయాన్ని అందచేస్తామని ఈ సందర్భముగా మంత్రి తెలిపారు.

Read More

పొగాకు, మామిడి, కోకో కొనుగోలులో వేగం పెంచండి

రైతులకు ఎక్కువ ధర వచ్చేలా చూడాలిఅధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

హెచ్‌డీ బర్లీ పొగాకు, తోతాపురి మామిడి, కోకో కొనుగోలులో వేగం పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మామిడికి ప్రాసెసింగ్‌ యూనిట్లు కిలోకు రూ.8 తగ్గకుండా చెల్లించేలా చూడాలని.. మరో రూ.4 ప్రభుత్వం చెల్లిస్తోందని స్పష్టం చేశారు. వీలైనంత వరకు రైతులకు అధిక ధరలు వచ్చేలా చూడాలని చెప్పారు. బుధవారం ఆయన సచివాలయంలో పొగాకు, మామిడి, కోకో కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. మామిడి పల్ప్‌ (గుజ్జు) పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించే విషయమై కేంద్రంతో మాట్లాడామని వివరించారు. దీనిపై కేంద్రప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడికి మార్కెట్‌ డిమాండ్‌పై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని.. సాగు ప్రణాళికపై అవగాహన కల్పించాలని నిర్దేశించారు.

*53 మిలియన్‌ కిలోల పొగాకును త్వరగా కొనాలి*

రాష్ట్రంలో ఈ ఏడాది 80 మిలియన్‌ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకు ఉత్పత్తి వచ్చిందని.. ఇప్పటి వరకు 27 మిలియన్‌ కిలోల విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో 33 మిలియన్‌ కిలోల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. మరో 20 మిలియన్‌ కిలోలను మార్క్‌ఫెడ్‌ ద్వారా సేకరిస్తున్నామని తెలిపారు. బాపట్లలో 3, గుంటూరులో 2, పల్నాడులో 1, ప్రకాశంలో 1 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశామని.. గురువారం నుంచి కొనుగోలు మొదలవుతుందని చెప్పారు. రైతుల వద్ద ఉన్న 53 మిలియన్‌ కిలోల పొగాకు త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వివరాలను రైతులకు తెలియజేయాలన్నారు.

*జులై మొదటి వారానికి కోకో మొత్తం కొనాలి*

ఈ ఏడాది 12 వేల టన్నుల కోకో ఉత్పత్తి వచ్చిందని.. ఇందులో 10వేల టన్నుల విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రోజూ 80 నుంచి 100 టన్నులు సేకరిస్తున్నారని తెలిపారు. జులై మొదటి వారానికి రైతుల వద్ద మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్‌ విధానాలు అమలు చేయాలని సూచించారు

Read More