వ్యవసాయంలో యాంత్రీకరణ పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలు, పట్టు సాగు విస్తరణకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి సూచించారు. గురువారం తన కార్యాలయంలో పంటల సాగు విస్తీర్ణం పెంపుపై కమిషన్‌ సభ్యులు, వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల్లో ఉద్యోగుల కొరతతోపాటు రైతులు యాంత్రీకరణ చేపట్టకపోవడం పంటల దిగుబడిపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వంతో చర్చించి వీటి పరిష్కారం కోసం కృషి చేస్తామని కోదండరెడ్డి తెలిపారు.

Read More

‘ఈ-పంట’ నమోదు సక్రమంగా జరగాలి

ఈ-పంట డిజిటల్‌ సర్వేలో.. విస్తీర్ణం, పంటలు సాగు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు పేర్కొన్నారు. 2025 ఖరీఫ్‌ డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన గురువారం విడుదల చేశారు. సాగుకు యోగ్యం కాని వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ భూముల్ని తొలగించి.. సాగుకు అనుకూలమైన వాటి వివరాలనే ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో జరిగే డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు అనుసంధానించామని పేర్కొన్నారు. ఈకేవైసీ తప్పనిసరి కాదని వివరించారు.

Read More

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి చేపట్టబోయే వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ దరఖాస్తు గడువు ఈ నెల 18 వరకు పొడిగింపు — రిజిస్ట్రార్ డాక్టర్. జి .ఈ .సిహెచ్. విద్యాసాగర్.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టబోయే వ్యవసాయ, వెటర్నరీ మరియు ఉద్యాన వర్సిటీల డిగ్రీ కోర్సులలో 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి ఈ సి హెచ్ విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున, ఆయా కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు వివరాల కొరకు వర్సిటీ వెబ్సైట్ www.pjtau.edu.in సందర్శించాలని సూచించారు.

Read More

రూ.150కే పెయ్య దూడ

  • నేటి నుంచి రైతులకు అందుబాటులో వీర్యం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 10 లక్షల డోసులు

గేదెలకు పెయ్యదూడలు మాత్రమే పుట్టేందుకు వీలుగా రూపొందించిన లింగ నిర్ధారిత వీర్యం రూ.150కే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయన సోమవారం గుంటూరులోని తన కార్యాలయంలో మాట్లాడారు. ‘లింగ నిర్ధారిత వీర్యం విలువ బహిరంగ మార్కెట్‌లో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులోకి తెస్తున్న వీర్యం ఒక్కో డోసు రూ.300 వరకు ఉండగా, రైతులకు రూ.150 సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వల్ల అతి తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం దక్కింది. గతంలో ఇదే లింగ నిర్ధారిత వీర్యం కోసం రైతులు రూ.550 చెల్లించాల్సి వచ్చేది. పశు యజమానులపై భారం తగ్గించేందుకు నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డుతో సంప్రదింపులు జరిపి తక్కువ ధరకు రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల డోసులు (ఒక్కో గేదెకు రెండు డోసులు) లింగ నిర్ధారిత వీర్యం గేదెలకు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ వీర్యం వేయటం వల్ల గర్భం దాల్చే ఐదు లక్షల గేదెల్లో కనీసం 90 శాతం పెయ్యదూడలు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం చేపట్టటం వలన నేరుగా 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 2030 నాటికి పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 లక్షల డోసులు లింగ నిర్ధారిత వీర్యం వేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ముర్రా గేదెలు, సంకర జాతి ఆవుల హబ్‌గా తీర్చి దిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. దానివల్ల రానున్న ఐదు సంవత్సరాల్లో పశువుల్లో స్త్రీ సంపద పెరిగి పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. లింగ నిర్ధారిత వీర్యం అతి తక్కువ ధరకే అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నాం. పునరుత్పత్తి అవకాశం ఎక్కువగా ఉన్న గేదెలను ఎంపిక చేసి వీర్యం డోసులు ఇస్తాం. ఈ అవకాశం వినియోగించుకోవాలి’ అని కోరారు.

Read More

తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల

  • జిల్లాల వారిగా ఉద్యానపంటల ప్రగతిని వివరించిన అధికారులు
  • రైతులకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం కావద్దని ఆదేశించిన మంత్రి
  • హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలలో పెద్దఎత్తున కూరగాయల సాగును చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
  • డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు
  • కమిషనరేట్‌ అధికారులు హైదరాబాద్‌ కే పరిమితం కాకుండా విస్తృతంగా పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు

తెలంగాణ రాష్ట్రంలో 12.96 లక్షలో ఎకరాలలో ఉద్యానపంటలు సాగులో ఉన్నాయని, 42.58 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధించడం జరుగుతుందని ఉద్యానశాఖ డైరెక్టర్‌ మంత్రికి వివరించడం జరిగింది. ఉద్యానపంటలను ప్రొత్సహించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున తుంపర మరియు బిందు సేద్య పరికరాలపై రాయితీ ఇవ్వడం జరుగుతున్నదని, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీతో, చిన్న, సన్నకారు మరియు బిసి రైతులకు 90 శాతం రాయితీతో, ఇతరులకు 80 శాతం రాయితీతో బిందు సేద్య పరికరాలు మరియు అన్ని వర్గాల రైతులకు 70 శాతం తుంపర సేద్య పరికరాలను అందించడం జరుగుతున్నదని, కేంద్రం ఇచ్చే సబ్సీడి కన్నా అదనంగా 45 శాతం సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ రైతులకు, 35 శాతం సబ్సిడీని చిన్న, సన్నకారు, బిసి రైతులు మరియు ఇతర రైతులకు ప్రభుత్వం అందచేయడం జరుగుతున్నదని మంత్రికి వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 29,821 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 81,942 ఎకరాల విస్తీర్ణంలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను అందించడం జరిగిందని, 2025-26 సంవత్సరానికి 51,328 ఎకరాల విస్తీర్ణానికి పరిపాలన అనుమతులు తీసుకోవడం జరిగిందని, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 28,147 ఎకరాల విస్తీర్ణానికి బిందు మరియు తుంపర సేద్య పరికారాలు ఏర్పాటు చేయబడ్డాయి అని డైరెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా 2024-25 సంవత్సరంలో 110.87 కోట్ల వ్యయంతో 12,054 మంది రైతులకు చెందిన 40,247 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టడం జరిగిందని, 2021-22 సంవత్సరంలో కొత్త జిల్లాలలో సాగులోకి తీసుకురాబడ్డ ఆయిల్‌ పామ్‌ తోటలు కాపుకు వచ్చాయని, ఆయా కంపెనీలు రైతుల వద్ద నుండి ఆయిల్‌ పామ్‌ గెలలను కొనుగోలు చేయడం జరుగుతున్నదని, ఆయిల్‌ పామ్‌ తోటల విస్తీర్ణానికి అనుగుణంగా ఆయిల్‌ పామ్‌ కర్మాగారాలను ఏర్పరచడం జరుగుతున్నదని తెలిపారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి 1,25,000 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ఇప్పటికే 18 వేల మంది రైతులు 66 వేల ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ నాటుటకు నమోదు చేసుకోవడం జరిగిందని, 26 వేల ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో జూన్‌ నెల నాటికి 6750 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ ను పూర్తి చేసుకోవడం జరిగిందని డైరెక్టర్‌ మంత్రికి వివరించారు.
తుమ్మల మాట్లాడుతూ.. కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నాయని, రాష్ట్రానికి అవసరమైన కూరగాయల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని, అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్దం చేసి, డిప్యూటి డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులకు జిల్లాలు కేటాయించి, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని, కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాలు అయిన రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలలో పెద్ద ఎత్తున కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా డిమాండుకు అనుకూలంగా కూరగాయల సాగును రైతులకు అందించాలని పేర్కొన్నారు. ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పురోగతి చాలా మందకోడిగా నడుస్తున్నదని, వారంవారిగా లక్ష్యాన్ని నిర్ధేశించుకొని, జిల్లాలు, కంపెనీల వారిగా పురోగతిని సమీక్షించాలని డైరెక్టర్‌ని ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో ఉన్న జాయింట్‌ డైరెక్టర్లు ఒక్కొక్కరికి 5 జిల్లాలు కేటాయించాలని, వారంలో మూడు రోజులు వారు ఆయా జిల్లాలలో ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పెంచడానికి, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్‌ పామ్‌ నర్సరీలలో ఎట్టి పరిస్థితులలో కూడా కల్లింగ్‌ మొక్కలు ఉండకూడదని, ఆయిల్‌ పామ్‌ రైతులకు ఆరోగ్యకరమైన, మంచి మొక్కలను అందించాలని ఇదివరకే నాటిన ఆయిల్‌ పామ్‌ తోటల రైతులకు, పంట యాజమాన్యం విషయంలో ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, ఆవగాహన కల్పించాలని తద్వారా అనుకున్న సమయానికి ఆయిల్‌ పామ్‌ గెలల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని మంత్రిగారు తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్‌ నెలాఖరు కల్లా ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని, తదనుగుణంగా వారంవారిగా లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, వ్యవసాయ మరియు ఉద్యానశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రిగారు ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్‌ రావు, ఉద్యానశాఖ సంచాలకులు శ్రీమతి యాస్మిన్‌ బాషా మరియు ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More

నేలతల్లి నోట ‘యూరియా’ కొడుతున్న రైతులు జొన్న, మొక్కజొన్నకు విచ్చలవిడిగా వాడకంకృష్ణా పశ్చిమ డెల్టాలో వైపరీత్యం

అధిక దిగుబడుల కోసం కొందరు రైతులు పరిమితికి మించి యూరియా (నత్రజని) వాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.. ఎంత యూరియా పోస్తే అంత పంట దిగుబడి అనే ధోరణి నెలకొంది. ముఖ్యంగా జొన్న పంటకు ఎకరానికి 96 కిలోలు వేయాలని వ్యవసాయశాఖ సిఫారసు చేస్తే.. రైతులు ఏకంగా 400 కిలోల నుంచి 800 కిలోల వరకు చల్లుతుండటం గమనార్హం. దీంతో నేల ఆరోగ్యం దెబ్బ తింటుందని, చౌడుగా మారుతుందని గుర్తించలేకపోతున్నారు. అధికశాతం కౌలు రైతులే కావడంతో.. ఈ ఏడాది దిగుబడి బాగా వస్తే చాలని ఆలోచించడమే దీనికి ప్రధాన కారణం.

ఎకరాకు 8 – 16 బస్తాలు
కృష్ణా పశ్చిమడెల్టాలో ఖరీఫ్‌లో వరి పూర్తయ్యాక గతంలో మినుము, పెసర వేసేవారు. దీంతో నేల ఆరోగ్యం స్థిరంగా ఉండేది. రెండు థాబ్దాలుగా తెగుళ్లు ఆశించి నష్టాలు వస్తుండటంతో రైతులు జొన్న, మొక్కజొన్న వైపు మళ్లారు. ఇదేక్రమంలో దిగుబడులు, ఆదాయం పెంచుకోవడానికి ఎరువుల వాడకాన్ని పెంచారు. ఈ పంటల్లో ఎకరాకు 96 కిలోల నత్రజని, 32 కిలోల డీఏపీ, 32 కిలోల పొటాష్‌ ఎరువులను శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందుకు భిన్నంగా రెండు రెట్లకు పైగా వాడుతున్నారు. వరి కోత తర్వాత జీరో టిల్లేజ్‌లో విత్తనం నాటడం, నదీతీర డెల్టా భూములు సారవంతమైనవి కావడంతో అధిక దిగుబడులు సాధించాలన్న యోచనతో రైతులు విచక్షణరహితంగా యూరియా వినియోగిస్తున్నారు. ఎకరాకు 8 నుంచి 16 బస్తాల యూరియా, 2 బస్తాల డీఏపీ, ఒక బస్తా పొటాష్‌ వేస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతానికి దిగుబడులు బాగున్నా భూమి ఆరోగ్యం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.tft

భూమి చౌడుగా మారిపోతుంది
యూరియా అవసరానికి మించి వాడితే భూమి చౌడు బారిపోతుంది. ప్రధాన మూలకాలు లోపించి నేల గట్టి పడిపోతుంది. మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించి పోషకాలు అందని పరిస్థితి ఏర్పడుతుంది. మొక్కజొన్న, జొన్నల్లో చీడపీడల ఉద్ధృతి నివారణకు రసాయనాలు పిచికారి వల్ల రైతుకు ఖర్చు పెరుగుతుంది.

సేంద్రియ కర్బనం పెంచాలి
యూరియా అధికంగా వాడటం వల్ల భూభౌతిక స్థితిలో మార్పు వచ్చి నీటి నిల్వ సామర్థ్యం, ఎరువులను కరిగించుకుని మొక్కకు అందించే గుణం తగ్గిపోతుంది. పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. రైతులు దిద్దుబాటు చర్యలు చేపట్టి నేలలో సేంద్రియ కర్బనం పెంచుకోవాలి. వరిని యంత్రంతో కోసిన తర్వాత మిగిలిన మోడును కాల్చకుండా రోటోవేటర్‌తో భూమిలోకి కలిసేలా చేయాలి. జీవ ఎరువులు వాడటం, పచ్చిరొట్ట సాగుచేసి భూమిలో కలియదున్నడం, పశువులు, కోళ్ల ఎరువు వాడటం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. మొక్కకు పోషకాలు సక్రమంగా అంది అధిక దిగుబడులు సాధ్యమవుతాయి.
– చంద్రమోహన్‌రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

Read More

భద్రాద్రి మిల్లెట్‌ మ్యాజిక్‌ అభినందనీయం గిరిజన మహిళలను మెచ్చుకున్న ప్రధాని మోదీ

ఈ మహిళలు ఒకప్పుడు పొలాల్లో కూలీలుగా పనిచేసేవారు. ఇప్పుడు చిరుధాన్యాలతో బిస్కెట్లను తయారు చేస్తున్నారు. వీరి విజయం గురించి తెలుసుకుంటే మీరూ సంతోషిస్తారు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రాచలం గిరిజన మహిళలను అభినందించారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌, జిల్లా జాబ్స్‌ మేనేజర్‌ హరికృష్ణల సహకారంతో రాగి, సజ్జ, జొన్న, సామలతో భద్రాద్రి శ్రీరామ స్వయం సహాయక సంఘం నిర్వాహకులు వి. వెంకటలక్ష్మి, తాటి లలిత, సోయం మంగవేణి, జజ్జర సమ్మక్కలు ఏడాది నుంచి చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ రాణిస్తున్నారు. ఆదివారం జరిగిన ‘మనీ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాన్ని ఉటంకించారు. మోదీ మాట్లాడుతూ.. ‘మన తల్లులు, సోదరీమణులు, అమ్మాయిలు సమాజానికి కొత్త దిశను సృష్టిస్తున్నారు. తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయం అలాంటిదే’ అని ప్రస్తావించారు. ‘ఇక్కడ భద్రాద్రి మిల్లెట్‌ మ్యాజిక్‌ పేరుతో తయారయ్యే చిరుధాన్యాల బిస్కెట్లను హైదరాబాద్‌కు, అక్కడ నుంచి లండన్‌ దాకా పంపిస్తున్నారు. భద్రాచలం మహిళలు స్వయం సహాయక బృందంతో అనుసంధానమై శిక్షణ పొందారు. వీరు మరో ప్రశంసనీయమైన పని కూడా చేశారు. మూడు నెలల్లోనే 40 వేల గిరి శానిటరీ ప్యాడ్లను తయారుచేసి పాఠశాలలకు, కార్యాలయాలకు పంపిణీ చేశారు’ అంటూ ప్రధాని మెచ్చుకున్నారు.

Read More

ఆయిల్‌పామ్‌కు ప్రోత్సాహం.. రైతుల్లో ఉత్సాహం

వంద శాతం రాయితీపై మొక్కల పంపిణీ ప్రత్యేక దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆయిల్‌పామ్‌ సాగుకు మంచి రోజులు వచ్చాయి. గతంలో కర్షకులకు ఎటువంటి రాయితీలు ఇవ్వకపోవడంతో రైతులు ఈ సాగు చేపట్టేందుకు పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఇప్పుడు వంద శాతం రాయితీతో ఉద్యాన శాఖ ద్వారా ఈ మొక్కలు పంపిణీ చేస్తోంది. నీటి వసతి ఉన్న మెట్ట రైతులు ఈ పంట సాగుచేసుకుంటే లాభాలు పొందొచ్చని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇప్పటికే ఆయిల్‌పామ్‌ 4 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పూర్తి ఉచితంగా రైతులకు మొక్కలు ఇచ్చి 2600 హెక్టార్లలో పంట సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇంతవరకు 1253 ఎకరాల్లో సాగుకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కలెక్టర్‌ అనుమతి తీసుకుంటున్నారు. ఒక్కో ఎకరానికి 57 మొక్కలు నాటిస్తారు. వీటి కొనుగోలుకు ఎకరానికి రూ. 10,500 ఇస్తారు. నాలుగేళ్ల పాటు ఎరువుల కోసం ఏటా రూ.2100, అంతర పాటల సాగుకు రూ.2100 వంతున ఇస్తారు. మొదటి ఏడాది మొక్కలు, ఎరువులకు రూ.15,200 మంజూరు చేస్తారు. ఒక రైతు ఎన్ని ఎకరాల్లో అయినా సాగుచేసుకునే వీలుంది. మొదటి మూడు సంవత్సరాలు తోటలను పెంచాలి. నాలుగో ఏడాది నుంచి ఆయిల్‌పామ్‌ గెలలు చేతికొస్తాయి. నాలుగో ఏడాది ఎకరానికి రెండు టన్నులు దిగుబడి వస్తుంది. ఆరో ఏడాది నుంచి సంవత్సరానికి పది టన్నుల దిగుబడి వస్తుంది. ఇలా 30 ఏళ్ల వరకు ఈ పంట దిగుబడి పొందొచ్చు.

*మార్కెట్‌ సదుపాయం*

మార్కెట్లో ఉన్న ఆయిల్‌పామ్‌ ధర రూ. 18,700 ఉంది. వంట నూనెల స్వయం సమృద్ధికి ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చందర్లపాడు, నందిగామ, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట తదితర మండలాల్లో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద పతంజలి ఫుడ్స్‌ సంస్థ ప్రభుత్వ మద్దతు ధరకు రైతుల నుంచి ఆయిల్‌పామ్‌ గెలలు కొనుగోలు చేస్తోంది. రైతులకు ఇలా మార్కెట్‌ సదుపాయం ఉంది.*ఆర్‌ఎస్‌కేల్లో దరఖాస్తులు స్వీకరణ* ఈ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో(ఆర్‌ఎస్‌కే) దరఖాస్తులు ఇవ్వాలి. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్‌లను వీఏఏలకు అందజేయాలి. రైతులు సమీపంలోని ఆర్‌ఎస్‌ కేలు, ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలి.

*నీటివసతి ఉన్న కర్షకులకు లాభసాటి*

నీటి వసతి ఉన్న మెట్ట రైతులకు ఈ సాగు లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వం రైతులకు ఉచితంగా మొక్కలు ఇస్తుంది. నాలుగేళ్ల పాటు ఎరువులు, అంతర పంటల సాగుకు నిధులు ఇస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు ఈ పంట సాగు చేస్తే ఏటా ఎకరానికి రూ. లక్ష ఆదాయం పొందొచ్చు.- పి. బాలాజీకుమార్‌, ఎన్టీఆర్‌ జిల్లా ఉద్యాన అధికారి

Read More

కృత్రిమ మేథ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో మానవ రహిత వ్యవసాయమే లక్ష్యం ….ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధునాతన ప్రయోగశాల త్వరలో ప్రారంభం.

వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ వారి సహకారంతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం త్వరలో ప్రారంభించనున్న ఏఆర్‌ఐఎస్‌ఏ ల్యాబ్‌ అత్యవసరమైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్‌ రావు అభిప్రాయపడ్డారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇలాంటి సృజనాత్మకమైన ఆలోచన చేసి కృత్రిమ మేదస్సుతో కూడిన ప్రయోగశాలను నెలకొల్పుతున్నందుకు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యను మరియు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. పిజెటిఏయూ లోని సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ అగ్రికల్చర్‌ ఆవరణలో ఎస్‌బీఐ సహకారంతో పీజెటిఏయూ అగ్రిహబ్‌ ఏర్పాటు చేయనున్న ఎస్‌బీఐ-ఏఆర్‌ఐఎస్‌ఏ ప్రయోగశాల ప్రీ లాంచ్‌ కార్యక్రమంలో రఘునందన్‌ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఏఆర్‌ఐఎస్‌ఏ ల్యాబ్‌లో వ్యవసాయ విద్యను అభ్యసించే విద్యార్థులతో పాటు, ఇతర సాంకేతిక కోర్సులను అభ్యసించే విద్యార్థులని విస్తృతంగా భాగస్వాములను చేయాలని సూచించారు. అదే విధంగా విశ్వవిద్యాలయం చేపడుతున్న పరిశోధన, విద్య మరియు విస్తరణ కార్యక్రమాల రికార్డులను డిజిటలైజేషన్‌ చేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన సూచించారు.
రానున్న 20 ఏళ్లలో వ్యవసాయం చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని తద్వారా ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం రెండు సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అందులో మొదటిది అతివేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన వచ్చే మార్పు మరియు రెండవది వ్యవసాయ రంగంపై యువత మక్కువ చూపకపోవడం ద్వారా వ్యవసాయ రంగం నుంచి నానాటికి బయటికి రావటం. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉండాలంటే మానవ రహిత వ్యవసాయమే శరణ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. దీనికోసం కృత్రిమ మేధస్సుతో కూడిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి అందించినప్పుడే వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయ రంగంలో విస్తృతంగా డ్రోన్లు, రోబోలను అందుబాటులోకి తేవడం, నేలలోని పోషక పదార్థాలను అంచనా వేయటం మరియు వివిధ పంటలలో పోషకాల వినియోగానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులను కృత్రిమ మేధస్సుతో కూడిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి అందించటం మరియు వివిధ పంటల్లో తరచుగా వచ్చే తెగుళ్లు మరియు కీటకాల యాజమాన్యంలో కృత్రిమ మేధస్సుతో కూడిన యాజమాన్య పద్ధతులను అభివృద్ధి చేసి అందించడమే ఈ నూతన ప్రయోగశాల ప్రధాన లక్ష్యమని ఉపకులపతి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులుచెట్టి ఈ ప్రయోగశాల ఏర్పాటుకు సహకారం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, అగ్రి హబ్‌, సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ అగ్రికల్చర్‌ అధికారులు పాల్గొన్నారు.

Read More

నల్ల బర్లీ రైతులకు ప్రభుత్వం అండ!

నల్ల బర్లీ పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. మద్దతు ధర కల్పిస్తూ.. మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సాగుదారులు తమ వివరాలను సీఎం యాప్‌లో నమోదు చేసుకొని, ఉత్పత్తిని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ మార్క్‌ ఫెడ్‌ సిబ్బంది రైతు, సరకు ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేసి… నాణ్యతను బట్టి ధర నిర్ణయించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ మొత్తం రైతు ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను చిత్రాల్లో చూడొచ్చు.

Read More