తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలు, పట్టు సాగు విస్తరణకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సూచించారు. గురువారం తన కార్యాలయంలో పంటల సాగు విస్తీర్ణం పెంపుపై కమిషన్ సభ్యులు, వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల్లో ఉద్యోగుల కొరతతోపాటు రైతులు యాంత్రీకరణ చేపట్టకపోవడం పంటల దిగుబడిపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వంతో చర్చించి వీటి పరిష్కారం కోసం కృషి చేస్తామని కోదండరెడ్డి తెలిపారు.

4 Jul, 2025
