‘రాజముద్ర’తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు ఎవరి చిత్రాలూ లేకుండా కేవలం రాజముద్రతో భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం ముద్రించింది. పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో 10 వేల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15న వీటిని పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More

గోల్డ్‌ లైన్డ్‌ సీబ్రీమ్‌ రకం చేప జన్యువుల విశ్లేషణ

చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్‌వాటర్‌ ఆక్వా కల్చర్‌ (సీఐబీఏ) పరిశోధకులు చేపల ఉత్పత్తి సామర్థ్యం, వాటి పెంపక విధానాలను మెరుగుపరచడానికి గోల్డ్‌లైన్డ్‌ సీబ్రీమ్‌ అనే చేప జన్యువులను విశ్లేషించారు. ఉప్పు, మంచి నీటి వనరుల్లో పెరగగలిగే ఈ చేపను తమిళంలో ‘మత్తివాయన్‌’ అని అంటారు. ఇది మంచి రుచి, ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది. చేపల్లో సంతానోత్పత్తి, పర్యావరణ మార్పులకు వాటి స్పందనలు తెలుసుకునేందుకు ఈ జన్యు విశ్లేషణ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్య శాస్త్రవేత్త ఎం.ఎస్‌. శేఖర్‌ నాయకత్వంలో వినయ్‌ కుమార్‌, అశోక్‌ కుమార్‌ జంగం, రేమండ్‌, కుల్దీప్‌ కె. లాల్‌ పరిశోధనలో పాలుపంచుకున్నారు.

Read More

ఆయిల్‌పామ్‌ ధరలు గత రెండేళ్లకు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌కు సంబంధించి ప్రభుత్వం గత రెండేళ్లకు ధరలు నిర్ణయించింది. 2023-24 సంవత్సరానికి 2023 నవంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 వరకు ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో పర్సంటేజి(ఓఈఆర్‌) 19.17%, గింజలకు 10. 25% చొప్పున ఇవ్వనున్నారు. 2024-25 సంవత్సరంలో ఇదే కాలానికి (ఓఈఆర్‌)19.42%, గింజలకు 10.15% చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ, సహకారశాఖ ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

తెలంగాణ రాష్ట్రంలో రాయితీలతో ఉద్యాన పంటలకు ఊతం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాయి. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌-ఆయిల్‌ పామ్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన తదితర పథకాలను అమలు చేస్తూ రాయితీలను అందజేస్తున్నాయి.
సమీకృత ఉద్యాన అభివృద్ధి.. పథకం ద్వారా పండ్ల తోటలు, నీటి కుంటలు, కూరగాయల సాగును ప్రోత్సహిసున్నారు. రాయితీతో కూరగాయల నారును అందించడంతోపాటు, ప్రస్తుత సంవత్సరం డ్రాగన్‌ ఫ్రూట్‌, బొప్పాయి, మామిడి, జామ, కూరగాయలు, తదితర పంటల సాగుకు సైతం రాయితీని కల్పిస్తున్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు బిందు, తుంపర సేద్యంపై రాయితీ ఇస్తున్నారు. ఎకరాకు రూ.4,200 ల చొప్పున నాలుగేళ్లపాటు రాయితీ అందుతుంది.

రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన
20 గుంటల విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి రూ.50 వేల సబ్సిడీ అందిస్తున్నారు. గరిష్టంగా 2.20 ఎకరాల వరకు రాయితీ అందుతుంది. సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకొని కూరగాయలు సాగు చేపట్టొచ్చు. రైతులకు అవగాహన కల్పిస్తూ వీటిపై మొగ్గు చూపేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

జాతీయ వెదురు పథకం
సాగుకు యోగ్యం కాని భూముల్లో, పొలం గట్లపైన, వెదురు మొక్కలు నాటే రైతులకు ప్రభుత్వం రెండేళ్ల వరకు నిర్వహణ ఖర్చు కింద మొదటి సంవత్సరం రూ. 75 రెండో సంవత్సరం రూ. 45 చొప్పున అందజేస్తారు.

బిందు సేద్యం
ఉద్యాన పంటలు సాగు చేయడానికి డ్రిప్‌, స్ప్రింకర్లను సబ్సిడీపై అందించనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీతో పరికరాలను అందిస్తున్నారు. బీసీ రైతులకు 90 శాతం, అయిదెకరాల్లోపు ఉన్న ఓసీ రైతులకు 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. తుంపర సేద్యం పరికరాలకు అందరికీ 75 రాయితీని అందిస్తున్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు పొందేందుకు రైతులు పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోతో సంబంధిత ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు అందజేయాలి. గరిష్ఠంగా అయిదెకరాల భూమి కలిగిన రైతులు అర్హులు.
-కేఆర్‌ లత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారిణి

Read More

చీడపీడల నివారణలో ఐఐసీటీ కీలక పురోగతి6 మాలిక్యూల్స్‌ ఫార్ములేషన్‌ థలో పరిశోధనలు

పంటల సాగుకు ఉపయోగపడే రసాయనాల అభివృద్ధిలో హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కీలక పురోగతి సాధించింది. కలుపు నివారణ, కీటకాలు, శిలీంధ్రాల నుంచి పంటలను కాపాడటంలో మెరుగైన గుణం కలిగిన 6 మాలిక్యూల్స్‌ను ఆవిష్కరించింది. పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు సోకే పలు తెగుళ్లు. కత్తెర, గులాబీ పురుగు వంటివాటి నివారణకు ఇవి దోహదపడతాయని ప్రాథమిక పరిశోధనల్లో గుర్తించారు. ప్రస్తుతం ఇవి సమర్థత (ఎఫికసీ) పరీక్షల థలో ఉన్నాయని.. అక్కడ విజయవంతమైతే వ్యవసాయరంగంలో కీలకంగా మారుతాయని ఐఐసీటీ పరిశోధకులు తెలిపారు. భారత్‌లో వ్యవసాయానికి సంబంధించి ఎరువులు, పురుగుమందులను అధికంగా చేసుకుంటున్నాం. ఈ పరిస్థితులను అధిగమించేందుకు దేశీయంగా రసాయనాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే దృష్టి పెట్టింది. ఈ దిశగా కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) కు చెందిన పరిశోధన సంస్థలు కృషి చేస్తున్నాయి.

  • సీఎస్‌ఐఆర్‌కు చెందిన ‘హెడా క్వార్టర్‌ కోఆర్డినేషన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆగ్రో మిషన్‌-1, 2లను చేపట్టింది. మొదటి మిషన్‌లో 12 మాలిక్యూల్స్‌కు సంబంధించి ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ చేపట్టారు. మన దేశంలో వ్యవసాయ పరిశ్రమలకు సాంకేతిక మద్దతు ఇచ్చేందుకు దేశీయంగా వీటిని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా పేటెంట్‌ పూర్తయిన మాలిక్యూల్స్‌కు సంబంధించి ఈ ప్రక్రియను చేపట్టారు.
  • ఆగ్రో మిషన్‌-2లో.. ఐఐసీటీతోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 8 సీఎస్‌ఐఆర్‌ పరిశోధన సంస్థలతో కలిసి 20 మాలిక్యూల్స్‌పై దృష్టిపెట్టారు. ఇందులో ఐఐసీటీ ఒక్కటే 10 మాలిక్యూల్స్‌ ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ పై పరిశోధనలు చేపట్టింది. ఇవికాకుండా న్యూ కెమికల్‌ ఎంటిటీస్‌ (ఎన్‌సీఎస్‌) పరిశోధనలు చేపట్టారు. మొత్తం 250 మాలిక్యూల్స్‌పై కొత్తగా సంశ్లేషణ ప్రక్రియ (సింథసిస్‌) జరిపి అందులో 6 లీడ్‌ (మరింత కచ్చితమైన) మాలిక్యూల్స్‌ను గుర్తించారు. వీటికి సంబంధించి 10, 20 గ్రాముల పరిమాణాల్లో అభివృద్ధిచేసి దిల్లీలోని ఐపీఎఫ్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెస్టిసైడ్‌ ఫార్ములేషన్‌ టెక్నాలజీ)కి పంపించారు. అక్కడ ఫార్ములేషన్‌ ప్రక్రియ పూర్తయి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పనితీరును పరీక్షిస్తారు. ఆ ఫలితాలను బట్టి తదుపరి కిలో స్థాయిలో ఉత్పత్తి చేపడతారు. తర్వాత సెంట్రల్‌ ఇన్సెక్టిసైడ్స్‌ బోర్డ్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిటీ (సీఐబీఆర్‌సీ) అనుమతి తీసుకుని పరిశ్రమలతకొన్ని రకాల చీడపీడల బారి నుంచి కాపాడవచ్చని చెబుతున్నారు.
Read More

వరికి బదులు పామాయిల్‌, అంతర పంటలను ప్రోత్సహించాలి – మంత్రి తుమ్మల

అధికారులు, ఉద్యోగులు ఎప్పటికప్పుడు రైతులను చైతన్య పరచాలని, వరికి బదులు పామా యిల్‌ వంటి లాభదాయక, అంతర పంటలను ప్రోత్సహించేందుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం జరిగిన తెలంగాణ వ్యవసాయ అధికారుల ఆత్మీయ సమ్మేళనంలో జరిగింది. మంత్రి పాల్గొని మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పరికరాలను అందజేస్తామన్నారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యకక్షుడు చిన్నా రెడ్డి, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర చైర్మన్‌ బి. కృపాకర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. కృపాకర్రెడ్డి ఇతర అధికారులు అనురాధ, రవీందర్‌, శశిధర్‌ రెడ్డి, మానస, వీణ తదితరులు పాల్గొన్నారు. మామిడిసాగుకు ఉత్తరప్రదేశ్‌ తరహా విధానాలు మామిడిసాగులో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌ తరహా విధానాలను తెలంగాణలో అమలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. యూపీ ఉద్యాన సహకార మార్కెటింగ్‌ సమాఖ్య ఎండీ వినయ్‌ కుమార్‌ ఆదివారం మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వినయ్‌ యూపీలో మామిడి సాగు విధానాలను వివరించారు. ఆయన వెంట తెలంగాణ ఉద్యాన సంయుక్త సంచాలకుడు బి. బాబు ఉన్నారు. అంతకుముందు యూపీ ఉద్యానవన సహకార సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని ఉద్యాన శిక్షణ సంస్థలో కొనుగోలు, అమ్మకందారుల సదస్సు నిర్వహించారు. తెలంగాణ ఉద్యాన సంచాలకురాలు యాస్మీన్‌ బాషా, ఇతర అధికారులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు.

Read More

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా గుర్రపుడెక్కతో ఎరువు తయారీ

వినూత్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. పంట కాలువల్లో విపరీతంగా పెరిగే ఈ గుర్రపు డెక్కతో సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఏళ్లుగా అన్నదాతలను పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఇదొకటి. మరోవైపు, గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం ఏటా భారీగా ఖర్చు చేస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు పశ్చిమగోదావరి కలెక్టర్‌ చదలవాడ నాగరాణి వినూత్నంగా ఆలోచించారు. ‘గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీకి శ్రీకారం చుట్టారు. డీఆర్‌డిఏ పీడీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో కుండీల్లో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీని ప్రయోగాత్మంగా చేపట్టారు. ఫలితంగా అన్నదాతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు.. మహిళల ఉపాధికి అవకాశం ఏర్పడినట్లైంది. గుర్రపు డెక్క ముక్కలు, ఆవుపేడ, మైక్రోబియల్‌ కల్చర్‌తో ఇలా చేశారు. 3-9 అడుగుల కుండీల్లో కింద గడ్డిని పొరగా వేసి, ఆపైన ముక్కలుగా చేసిన గుర్రపుడెక్క, దానిపైన రెండు అంగుళాల మందంలో ఆవుపేడను ఏడు నుంచి ఎనిమిది పొరలుగా వేశారు. 21 రోజుల పాటు అలా వదిలేశారు. అనంతరం మైక్రోబయల్‌ కల్చర్‌ను వాడి త్వరగా కంపోస్టింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. ఆ మిశ్రమాన్ని ఏడు వారాల తర్వాత గుళికలుగా తయారుచేశారు. ఎరువు తయారీ ప్రాంతాన్ని క్రిమికీటకాలు ఆకర్షించే ప్రమాదం ఉండడంతో ఇళ్లకు, గోదాములకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.*నాణ్యమైన సేంద్రియ ఎరువు… తక్కువ సమయంలో…* గుర్రపుడెక్క ఎరువు సాధారణ సేంద్రియ ఎరువు కంటే రెండు నుంచి మూడు రెట్లు నాణ్యంగా ఉన్నట్లు ప్రయోగ పరీక్షల్లో తేలింది. ఈ తీగ కుళ్లడానికి తక్కువ సమయం పడుతోంది. పశువుల వ్యర్థాల కన్నా ఇందులో నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ కర్బనం, కాపర్‌, మాంగనీస్‌, జింక్‌, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఈ సేంద్రియ ఎరువు 6 నెలలపాటు నిల్వ ఉంటుంది. మిద్దె పంటలు, కొబ్బరి, మామిడి, సపోటా, కూరగాయలు, ఆయిల్‌పామ్‌, పూలమొక్కలు, కూరగాయలు, వరి, ఉద్యాన పంటలన్నింటికీ గుర్రపుడెక్కతో తయారుచేసిన ఎరువును ఉపయోగించుకోవచ్చు.*స్వయం ఉపాధి మార్గం* ఎరువు తయారీని మహిళా సమాఖ్యలకు అప్పగించడంతో ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సేంద్రియ ఎరువు దొరుకుతోంది. గుర్రపుడెక్కతో తయారుచేసిన సేంద్రియ ఎరువు ధర కిలో రూ.12 నుంచి రూ.15గా, టన్ను రూ.12 వేలుగా నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే 100 యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎరువు తయారు కావడానికి ఒక్కో యూనిట్లో 20 మందికి 50 రోజుల పాటు ఉపాధి లభిస్తుంది. దీనిని రైతులే స్వయంగా తయారు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

Read More

4 కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. తన చిన్నాయన మల్లారెడ్డి ఇచ్చిన భూమి మరియు అందులో నిర్మించిన భవనాన్ని వ్యవసాయ శాఖకు రాసిచ్చారు. యాచారం మండల కేంద్రంలోని 2 వేల గజాల భూమిని వ్యవసాయ శాఖకు కేటాయిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావును కలిసి భూమికి సంబందించిన పత్రాలను అందించారు. ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 4 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. నెలరోజుల క్రితమే రైతు కమిషన్‌ బృందం, వ్యవసాయ అధికారులు కలిసి యాచారం మండలంలో పర్యటించారు. ఆ సమయంలో కోదండరెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్న భూమిని అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపితోపాటు మార్కెటింగ్‌ అధికారులకు చూపించారు. ప్రస్తుతం ఆ స్థలంలో రైతు మిత్ర కమ్యూనిటీ భవనం ఉంది. అందులో రైతులు వ్యవసాయ సామాగ్రి, ధాన్యం కొనుగోలు కేంద్రం, సీజన్‌ పంటలు నిలువ కోసం వాడుకుంటున్నారు. ఐతే ఇక ఆ స్థలాన్ని, ఆ స్థలంలో ఉన్న భవనాన్ని పూర్తిగా వ్యవసాయ శాఖకు రాసిస్తే.. రైతులకు మరింత మేలు జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోదండరెడ్డి తెలిపారు. ఇవాళ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపిలకు ఈ విషయం చెప్పి స్థలానికి సంబంధించి పేపర్స్‌ను అందజేశారు. అదేవిదంగా యాచారం మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటుచేయాలని రైతు కమిషన్‌ కోరింది. దానికి సంబంధించి ప్రైవేట్‌ స్థలం యాచారం బస్టాండ్‌కు అనుకొనే ఉన్నట్లు కమిషన్‌ బృందం.. మంత్రికి వివరించారు. ఆ స్థలాన్ని సేకరించి మార్కెట్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇక పలు అంశాలపై వ్యవసాయ మంత్రితో కమిషన్‌ చర్చించింది. ఈ సమావేశంలో కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్‌ రెడ్డి, భవానీ రెడ్డి, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపి, అడిషనల్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌, కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, ఏవో హరి వెంకట ప్రసాద్‌లు ఉన్నారు.

Read More

అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌లో అడ్మిషన్‌

10వ తరగతి లేదా ఇంటర్‌ పాస్‌ అయ్యి, 22సం|| లోపు వయస్సు గల విద్యార్థినీ, విద్యార్థులు అగ్రికల్చర్‌ డిప్లొమా / అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులలో చేరుటకు పాలీసెట్‌ పరీక్ష రాయకపోయినా డా|| డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో అడ్మిషన్‌ పొందుటకు అవకాశం కలదు. పరిమిత సీట్లు కలవు. 10వ తరగతి మెమో, టి.సి., బోనఫైడ్‌, కులధృవీకరణ సర్టిఫికెట్‌తో కాలేజీలో ఆగష్టు, 2025 మొదటి వారంలోపు సంప్రదించండి.డైరెక్టర్‌*డా|| డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌*(Affiliated to Professor Jayashankar Telangana Agricultural University, Rajendranagar)తునికి గ్రామం, కౌడిపల్లి మండలం, మెదక్‌ జిల్లాఫోన్‌: 9493461818, 9989147966

Read More

చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు రూ.260 కోట్ల నిధులు విడుదల

ప్రోత్సాహక ధర కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి రైతులకు రూ.260 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని ఉద్యాన శాఖ డీడీ మధుసూదనరెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తోతాపురి మామిడి టన్నుకు రూ.4 వేలు ప్రోత్సాహక నగదు చొప్పున మొత్తం 6.50 లక్షల టన్నులకు రూ.260 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో త్వరలో జమ చేయనున్నామని డీడీ పేర్కొన్నారు.

Read More