పంటల సాగుకు ఉపయోగపడే రసాయనాల అభివృద్ధిలో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) కీలక పురోగతి సాధించింది. కలుపు నివారణ, కీటకాలు, శిలీంధ్రాల నుంచి పంటలను కాపాడటంలో మెరుగైన గుణం కలిగిన 6 మాలిక్యూల్స్‌ను ఆవిష్కరించింది. పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు సోకే పలు తెగుళ్లు. కత్తెర, గులాబీ పురుగు వంటివాటి నివారణకు ఇవి దోహదపడతాయని ప్రాథమిక పరిశోధనల్లో గుర్తించారు. ప్రస్తుతం ఇవి సమర్థత (ఎఫికసీ) పరీక్షల థలో ఉన్నాయని.. అక్కడ విజయవంతమైతే వ్యవసాయరంగంలో కీలకంగా మారుతాయని ఐఐసీటీ పరిశోధకులు తెలిపారు. భారత్‌లో వ్యవసాయానికి సంబంధించి ఎరువులు, పురుగుమందులను అధికంగా చేసుకుంటున్నాం. ఈ పరిస్థితులను అధిగమించేందుకు దేశీయంగా రసాయనాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే దృష్టి పెట్టింది. ఈ దిశగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) కు చెందిన పరిశోధన సంస్థలు కృషి చేస్తున్నాయి.
- సీఎస్ఐఆర్కు చెందిన ‘హెడా క్వార్టర్ కోఆర్డినేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆగ్రో మిషన్-1, 2లను చేపట్టింది. మొదటి మిషన్‌లో 12 మాలిక్యూల్స్‌కు సంబంధించి ప్రాసెస్ డెవలప్మెంట్ చేపట్టారు. మన దేశంలో వ్యవసాయ పరిశ్రమలకు సాంకేతిక మద్దతు ఇచ్చేందుకు దేశీయంగా వీటిని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా పేటెంట్ పూర్తయిన మాలిక్యూల్స్‌కు సంబంధించి ఈ ప్రక్రియను చేపట్టారు.
- ఆగ్రో మిషన్-2లో.. ఐఐసీటీతోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 8 సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థలతో కలిసి 20 మాలిక్యూల్స్‌పై దృష్టిపెట్టారు. ఇందులో ఐఐసీటీ ఒక్కటే 10 మాలిక్యూల్స్ ప్రాసెస్ డెవలప్మెంట్ పై పరిశోధనలు చేపట్టింది. ఇవికాకుండా న్యూ కెమికల్ ఎంటిటీస్ (ఎన్సీఎస్) పరిశోధనలు చేపట్టారు. మొత్తం 250 మాలిక్యూల్స్‌పై కొత్తగా సంశ్లేషణ ప్రక్రియ (సింథసిస్) జరిపి అందులో 6 లీడ్ (మరింత కచ్చితమైన) మాలిక్యూల్స్‌ను గుర్తించారు. వీటికి సంబంధించి 10, 20 గ్రాముల పరిమాణాల్లో అభివృద్ధిచేసి దిల్లీలోని ఐపీఎఫ్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ)కి పంపించారు. అక్కడ ఫార్ములేషన్ ప్రక్రియ పూర్తయి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పనితీరును పరీక్షిస్తారు. ఆ ఫలితాలను బట్టి తదుపరి కిలో స్థాయిలో ఉత్పత్తి చేపడతారు. తర్వాత సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (సీఐబీఆర్‌సీ) అనుమతి తీసుకుని పరిశ్రమలతకొన్ని రకాల చీడపీడల బారి నుంచి కాపాడవచ్చని చెబుతున్నారు.

