ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది.
ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.
భారతదేశ జనాభాలో సుమారు 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, మొత్తం శ్రామిక శక్తిలో 54.6 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో కూడా సుమారు 61.12 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, దాదాపు 55 శాతం మంది వ్యవసాయ రంగంతో అనుసంధానమై ఉన్నారు. వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో 86 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ కమతాలు చిన్న మరియు సన్నకారు వర్గాలకు చెందుతాయి.
తెలంగాణ వ్యవసాయం నీటిపారుదల మరియు వర్షాధార వ్యవసాయ వ్యవస్థల సమ్మేళనంగా ఉండి, వర్షపాతం వ్యవసాయాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇటీవలి సంవత్సరాల్లో సాగునీటి వసతులు పెరిగినప్పటికీ, వాతావరణ మార్పులు రైతుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీసుకునే ప్రతి పంట నిర్ణయం కుటుంబ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షపాతం అస్థిరంగా ఉండే సంవత్సరాలలో పంటల ఎంపిక మరింత కీలకంగా మారుతుంది. ఎల్నినో (Elnino) వంటి వాతావరణ పరిస్థితులు వర్షపాతాన్ని ప్రభావితం చేసి వ్యవసాయ ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో సాధారణంగా రుతుపవనాల బలహీనత, సగటు కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 2025-26 సంవత్సరానికి కూడా వాతావరణ పరిస్థితులపై ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశాలపై వివిధ వాతావరణ సంస్థలు సూచనలు చేస్తున్నాయి.
తెలంగాణలోని ప్రధాన పంటలు మరియు వాటిపై ఎల్ నినో ప్రభావం వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2025 వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో వరి పంట 50.57 శాతం వాటాతో ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో పత్తి 34.52 శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది. ఈ గణాంకాలు రాష్ట్ర వానాకాల పంటల సరళిలో వరి మరియు పత్తి పంటల ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఎల్నినో వంటి వాతావరణ అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు కేవలం సంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైనే ఆధారపడకుండా, నీటి లభ్యత తక్కువగా అవసరం ఉన్న కందులు, పెసర వంటి పప్పుధాన్యాలు లేదా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గణాంకాల ప్రకారం, ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో (2014-15 మరియు 2015-16) తెలంగాణలో ప్రధాన పంటల నికర ఆదాయంలో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి.
2015-16 తీవ్రమైన ఎల్ నినోలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. వరి (-14007.72), మొక్కజొన్న – 11373.53), పత్తి (-10908.38), కందులు (-9818.09), పెసర (-5207.97) పంటలన్నింటిలోనూ నికర ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఇది తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పంటలు ఎంతగా దెబ్బతింటాయో సూచిస్తుంది. అదే విధంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు వర్షాభావాన్ని తట్టుకొని రైతులకు నష్టాలను తగ్గించే అవకాశాన్ని కల్పించాయి. దీనినిబట్టి ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో అన్ని పంటలు ఒకే విధంగా ప్రభావితమవలేదని గమనించవచ్చు. కొన్ని సంవత్సరాలలో వరి అత్యధిక నష్టాలను చవిచూడగా, కొన్ని ప్రత్యామ్నాయ పంటలు లాభాలను మరియు తక్కువ నష్టాలను నమోదు చేశాయి.
అదేవిధంగా పంటల ఎంపికలో కూడా ఒకే సూత్రం అందరికీ వర్తించదు. రైతు నేల స్వభావం, నీటి వనరులు, గత అనుభవం, మార్కెట్ పరిస్థితులు మరియు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా తీసుకోవడానికి వ్యవసాయ రికార్డులు ఎంతో ఉపయోగపడతాయి. గత సంవత్సరాలలో ఏ పంటకు ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ఆదాయం లభించింది, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట మెరుగ్గా నిలిచింది వంటి వివరాలు రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.
దీనికోసం రైతు పొలంలో జరిగే వివిధ కార్యకలాపాలకు వేర్వేరు రికార్డులు అవసరం. రైతు నిర్వహించుకోదలచిన ముఖ్యమైన రికార్డు రకాలు ఇవి:
వ్యవసాయ దినచర్య రికార్డు
పంటల వారీ ఖర్చు-ఆదాయ రికార్డు
ఎరువుల వినియోగ రికార్డు
పురుగుమందుల వినియోగ రికార్డు
కార్మికుల వినియోగ రికార్డు
యంత్రాల వినియోగ రికార్డు
నీటి వినియోగ రికార్డు
దిగుబడి రికార్డు
పశుసంవర్ధక రికార్డు
నిల్వ మరియు విక్రయాల రికార్డు
ప్రస్తుతం తెలంగాణలోని అభ్యుదయ రైతులు కొంతమంది ప్రధానంగా కాగితపు రికార్డుల ద్వారానే వ్యవసాయ సమాచారాన్ని నమోదు చేసి భద్రపరుస్తున్నారు. అయితే, కాలానుగుణంగా అందుబాటులోకి వచ్చిన వివిధ ఆధునిక పద్ధతులను కూడా వినియోగించి వ్యవసాయ రికార్డులను మరింత సమర్థవంతంగా భద్రపరచుకోవచ్చు. వీటిలో సంప్రదాయ కాగితపు పద్ధతులతో పాటు డిజిటల్ రికార్డు పద్ధతులు, స్మార్ట్ఫోన్ ఆధారిత పద్ధతులు మరియు ప్రభుత్వ డిజిటల్ వేదికలు ముఖ్యమైనవి. ఈ పద్ధతుల వివరాలు క్రింది చిత్రంలో చూపించబడ్డాయి.
వివిధ వ్యవసాయ రికార్డుల పద్ధతులు ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం గల అనుకూల పంటలను ఎంపిక చేసి సాగు చేయడం రైతుల ఆదాయ స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వాతావరణ మార్పులు మరియు వర్షాభావ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడంలో ముఖ్యమైన వ్యూహంగా నిలుస్తుంది. అదే సమయంలో, పంటల ఎంపిక, ఖర్చులు, దిగుబడులు, ఆదాయం మరియు వనరుల వినియోగానికి సంబంధించిన వ్యవసాయ రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచడం ద్వారా రైతులు గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ సాగు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా మరియు సమర్థవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల, అనుకూల పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ రికార్డుల నిర్వహణ కూడా వాతావరణ అనిశ్చితులను ఎదుర్కొంటూ స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయాభివృద్ధికి కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.
డా. డి. ఎ. రజిని దేవి, సహాయ ప్రొఫెసర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ కళాశాల,రాజేంద్రనగర్ డా. కె. శేఖర్, సహాయ ప్రొఫెసర్, సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ఫోన్: 9032128184
ఆదికాలంలోనే భారతీయ వ్యవసాయ శా¢స్తం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రసిద్ధ ప్రాచీన వ్యవసాయ శా¢స్తవేత్తలు ప్రాచీన రుషులు, పరాశరుడు, సురపాలుడు తదితరులు అతద్భుతమైన పరిశోధనలు జరిపి గ్రంథస్థం చేశారు. సురపాల మహర్షి రాసిన వృక్షాయుర్వేదంలో కునపజలం అనే ద్రావణ ఎరువుని ప్రస్తావించారు. సంస్కృతంలో కునప అంటే మృత కళేబరం. జలం అంటే నీరు. అంటే శవం కంపుకొట్టే నీరని అర్థం. ఇది మొక్కలకు పోషక ద్రావణంగానూ ఉపయోగపడుతుంది. దీన్ని చేపల వ్యర్థాలతోనూ, కోడిమాంసం వ్యర్థాలతోనూ, పంది, జింక, ఇతర అడవి జంతువుల మాంసంతోనూ తయారుచేసేవారు. అడవులు అంతరించి జంతువులు కనుమరుగవుతున్న కాలంలోనే ప్రస్తుతం చేపల వ్యర్థాలు, కోడి మాంసం వ్యర్థాలతోనూ తయారు చేసుకోవచ్చు. కోడి మాంసపు వ్యర్థాలతో చేసేదాన్ని కుక్కుట కునప అంటారు.
ఆవు పేడ, పంచితం, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలతో తయారుచేసే ‘కునపజలం’ పంటలు ఏపుగా పెరగడానికి.. పురుగులు, తెగుళ్ల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, మాంసం, వరిపొట్టు కూడా కలిపి కునపజలం తయారుచేస్తే, మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజిస్ట్) ఇక్రిశాట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన డా॥ వై.ఎల్.నెనె. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ కునపజలం కన్నా ఈ కునపజలం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని డా॥ నెనె అంటున్నారు.
తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కిలోలు, పంచితం 4 లీటర్లు, పాలు 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, నెయ్యి కిలో, మాంసం (గొడ్డు మాంసం తప్ప ఏదైనా) 3 కిలోలు, వరిపొట్టు 2 కిలోలు, చెరకు రసం 3 లీటర్లు లేదా నల్లబెల్లం కిలో, లేత కొబ్బరినీరు 2 లీటర్లు, బాగా మగ్గిన అరటిపండ్లు 12, కల్లు 3 లీటర్లు.
తయారుచేసే పద్ధతి: మాంసాన్ని, వరిపొట్టును ఉడకబెట్టిన తర్వాత మాత్రమే కునపజలం తయారీలో వాడాలి. మాంసంలో అధిక పోషకాలుంటాయి. వరిపొట్టులో సిలికా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను తట్టుకునే శక్తిని సిలికా పెంపొందిస్తుంది. ఉడకబెట్టిన మాంసం, వరిపొట్టుతో పాటు పేడ, పంచితాలను వెడల్పాటి మూతిగల మట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి లేదా డ్రమ్ములో కలిపి, పాత్రపై పలుచని వస్త్రాన్ని కప్పి, నీడగా ఉండే ప్రాంతంలో రెండు వారాలు పులియనివ్వాలి. ప్రతి ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కొద్దిసేపు కర్రతో కలపాలి. 2 వారాల తర్వాత మిగతా వాటిని కూడా కలిపి మరో వారం రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.
ఉపయోగించే విధానం: ఎకరానికి 100-150 లీటర్ల నీటిలో 3 లీటర్ల కునపజలాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4సార్లు పంటలపై పిచికారీ చేయాలి. ఈ మధ్యలో వర్షం కురిస్తే 1 లేదా 2 సార్లు అదనంగా పిచికారీ చేయాలి.
ఉపయోగాలు: ముఖ్యంగా పత్తి, మిరప, వరి, కూరగాయలు, పండ్ల తోటలపై బాగా పనిచేస్తుంది. దీనివల్ల పంట గింజల బరువు పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు పంటలను ఆశించవు. పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల నాణ్యత పెరిగి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన వస్తుంది. కూరగాయ పంటల నాణ్యత పెరిగి మంచి మెరుపు వస్తుంది.
దిగుబడిని పెంచే కునపజలం కావలసిన పదార్థాలు : మాంసం-1 కిలో; మినప పప్పుపొడి -1/4 కి.; నువ్వులు- 1/4 కి.; నల్లబెల్లం- 1/4 కి.; ఆవుపాలు – 1 లీటరు; ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె – 50 గ్రాములు; మంచి నీరు – 5 లీటర్లు
తయారు చేసే విధానం : మాంసాన్ని నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్ళీ మరగించాలి. పొంగువచ్చిన తర్వాత మినపపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ ఉండాలి. పొంగు వచ్చిన వెంటనే పాత్రను దించి, చల్లార్చి, మట్టికుండలో పోయాలి. అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసిన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంతలో పాతి పెట్టాలి. 11వ రోజు బయటకు తీసి కషాయాన్ని వడపోయాలి. ఈ కషాయాన్ని వేరొక కుండలో పోసి దానికి నెయ్యి లేక నూనె కలిపి పాత్రపై మూకుడు పెట్టి ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి గట్టిగా తాడుతో కట్టి 10 రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు. 3 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పంటపైనన్నా పిచికారి చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారి చేయవచ్చు. ఇది ప్రభావశీల ఔషధం. పంట దిగుబడి 20% పెరుగుతుంది.
కేంద్ర కేబినెట్ కాటన్ ప్రొడక్టివిటీ మిషన్‌కు రూ.5,659.22 కోట్ల వ్యయంతో ఆమోదం తెలపడం దేశంలోని పత్తి రైతులకు వరం లాంటిదని భాజపా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. “ఈ మిషన్ పత్తి ఉత్పాదకతను పెంచడంతో పాటు, ప్రపంచ టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పంట క్షేత్రం నుంచి విదేశాల వరకు (ఫాం టు ఫారిన్) అనే లక్ష్యానికి అనుగుణంగా రైతులు, పరిశ్రమ, సాంకేతికత ఎగుమతులను అనుసంధానిస్తుంది. సుమారు 32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా ఈ మిషన్ కొనసాగుతుంది అని రామచందర్రావు అన్నారు.
పంటల సాగుకు ఉపయోగపడే రసాయనాల అభివృద్ధిలో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) కీలక పురోగతి సాధించింది. కలుపు నివారణ, కీటకాలు, శిలీంధ్రాల నుంచి పంటలను కాపాడటంలో మెరుగైన గుణం కలిగిన 6 మాలిక్యూల్స్‌ను ఆవిష్కరించింది. పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు సోకే పలు తెగుళ్లు. కత్తెర, గులాబీ పురుగు వంటివాటి నివారణకు ఇవి దోహదపడతాయని ప్రాథమిక పరిశోధనల్లో గుర్తించారు. ప్రస్తుతం ఇవి సమర్థత (ఎఫికసీ) పరీక్షల థలో ఉన్నాయని.. అక్కడ విజయవంతమైతే వ్యవసాయరంగంలో కీలకంగా మారుతాయని ఐఐసీటీ పరిశోధకులు తెలిపారు. భారత్‌లో వ్యవసాయానికి సంబంధించి ఎరువులు, పురుగుమందులను అధికంగా చేసుకుంటున్నాం. ఈ పరిస్థితులను అధిగమించేందుకు దేశీయంగా రసాయనాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే దృష్టి పెట్టింది. ఈ దిశగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) కు చెందిన పరిశోధన సంస్థలు కృషి చేస్తున్నాయి.
సీఎస్‌ఐఆర్‌కు చెందిన ‘హెడా క్వార్టర్ కోఆర్డినేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆగ్రో మిషన్-1, 2లను చేపట్టింది. మొదటి మిషన్‌లో 12 మాలిక్యూల్స్‌కు సంబంధించి ప్రాసెస్ డెవలప్‌మెంట్ చేపట్టారు. మన దేశంలో వ్యవసాయ పరిశ్రమలకు సాంకేతిక మద్దతు ఇచ్చేందుకు దేశీయంగా వీటిని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా పేటెంట్ పూర్తయిన మాలిక్యూల్స్‌కు సంబంధించి ఈ ప్రక్రియను చేపట్టారు.
ఆగ్రో మిషన్-2లో.. ఐఐసీటీతోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 8 సీఎస్‌ఐఆర్ పరిశోధన సంస్థలతో కలిసి 20 మాలిక్యూల్స్‌పై దృష్టిపెట్టారు. ఇందులో ఐఐసీటీ ఒక్కటే 10 మాలిక్యూల్స్ ప్రాసెస్ డెవలప్‌మెంట్ పై పరిశోధనలు చేపట్టింది. ఇవికాకుండా న్యూ కెమికల్ ఎంటిటీస్ (ఎన్‌సీఎస్) పరిశోధనలు చేపట్టారు. మొత్తం 250 మాలిక్యూల్స్‌పై కొత్తగా సంశ్లేషణ ప్రక్రియ (సింథసిస్) జరిపి అందులో 6 లీడ్ (మరింత కచ్చితమైన) మాలిక్యూల్స్‌ను గుర్తించారు. వీటికి సంబంధించి 10, 20 గ్రాముల పరిమాణాల్లో అభివృద్ధిచేసి దిల్లీలోని ఐపీఎఫ్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ)కి పంపించారు. అక్కడ ఫార్ములేషన్ ప్రక్రియ పూర్తయి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పనితీరును పరీక్షిస్తారు. ఆ ఫలితాలను బట్టి తదుపరి కిలో స్థాయిలో ఉత్పత్తి చేపడతారు. తర్వాత సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (సీఐబీఆర్‌సీ) అనుమతి తీసుకుని పరిశ్రమలతకొన్ని రకాల చీడపీడల బారి నుంచి కాపాడవచ్చని చెబుతున్నారు.