ఈ-పంట డిజిటల్ సర్వేలో.. విస్తీర్ణం, పంటలు సాగు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. 2025 ఖరీఫ్ డిజిటల్ క్రాప్ సర్వేకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన గురువారం విడుదల చేశారు. సాగుకు యోగ్యం కాని వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ భూముల్ని తొలగించి.. సాగుకు అనుకూలమైన వాటి వివరాలనే ఎన్ఐసీ ఆధ్వర్యంలో జరిగే డిజిటల్ క్రాప్ సర్వేకు అనుసంధానించామని పేర్కొన్నారు. ఈకేవైసీ తప్పనిసరి కాదని వివరించారు.

4 Jul, 2025
