పంటలలో తెగుళ్ల ఉధృతి నమోదు ఏవోలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంటల్లో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు వారంలో ఒకరోజు పర్యటించి, తెగుళ్ళ వివరాలను యాప్‌లో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సూచించారు. ఈ-పంట, డిజిటల్ అప్లికేషన్లపై వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ‘ఇప్పటి వరకు 4,41,167 ఎకరాల్లో 1,65,843 మంది రైతులకు సంబంధించి పంటలను ఈ- క్రాప్‌లో నమోదు చేశాం. బహువార్షిక ఉద్యాన పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని వెల్లడించారు. ఉద్యాన పంటల నమోదు సమయంలో పంటల రకాలను పేర్కొనాలని ఆ శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు వివరించారు.


