వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రెండవ విడత సంయుక్త కౌన్సిలింగ్‌

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు పి.వి. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల (సెప్టెంబర్‌) 3, 4, 8, 9, 10 తేదీల్లో రెండవ విడత సంయుక్త కౌన్సిలింగ్‌ ను నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జి.ఇ.సి.హెచ్‌. విద్యాసాగర్‌ ప్రకటించారు. రాజేంద్రనగర్‌ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈనెల 3, 4, 8, 9, 10 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకి ఈ రెండవ విడత కౌన్సిలింగ్‌ జరగనుందని ఆయన తెలిపారు. ఈ కౌన్సిలింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్‌ సైట్‌ www.pjtau.edu.in ను సందర్శించవచ్చని డాక్టర్‌ విద్యాసాగర్‌ సూచించారు.

Read More

మార్కెట్‌ యార్డుల్లో వినియోగం కంటే అధిక సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్లాంట్లు

తెలంగాణా రాష్ట్రంలోని మార్కెట్‌ యార్డుల్లో సౌరవిద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సౌరవిద్యుత్‌ సంస్థ ద్వారా దీనిని అమలు చేయనుంది. తొలిథలో పైలట్‌ ప్రాజెక్టుగా వరంగల్‌, నిజామాబాద్‌, గద్వాల, సూర్యాపేట మార్కెట్‌ యార్డులను ఎంపిక చేసింది. శుక్రవారం వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థ అధికారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సంస్థ అధికారులు ఈ వారంలోనే ఆయా యార్డులను సందర్శించి ముందుగా ప్లాంటు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తిస్తారు. ఆయా యార్డుల్లో విద్యుత్‌ వినియోగాన్ని గుర్తించి దానికంటే అధిక సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. యార్డు అవసరాలు పోనూ మిగిలిన విద్యుత్‌ను విద్యుత్‌ పంపిణీ సంస్థలకు విక్రయించనున్నారు.

Read More

సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపైసర్టిఫికేషన్‌ కోర్సు

మనుషుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలను నిరోధించుకోవాలంటే సేంద్రియ సాగు విధానంపై అవగాహన పెంచుకోవాలని, సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులను తినాలని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, మైలవరం, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప ప్రిన్సిపల్‌ పి. రంగారావు పేర్కొన్నారు. కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపై సర్టిఫికేషన్‌ కోర్సును శుక్రవారం ప్రారంభించారు. పూల మొక్కల నుంచి పండ్లు, కూరగాయలను ఇళ్లల్లోనే పెంచుకోవచ్చని విభాగాధిపతి జె. రాముడు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు హరిబాబు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఉల్లి రైతులు నష్టపోకుండా వెంటనే కొనుగోలు మొదలు పెట్టాలి

ఉల్లి రైతులు నష్టపోకుండా క్వింటాలుకు రూ.1,200 చొప్పున వెంటనే కొనుగోలు చేయడం ప్రారంభించి, నష్టాన్ని మార్కెట్‌ జోక్యం పథకం కింద భరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతుబజార్ల సంఖ్యను 150 నుంచి 200కు పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉల్లి కొనుగోలుపై సచివాలయంలో గురువారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో సమీక్షించారు. ‘మహారాష్ట్రలో ఉల్లి ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చే పది రోజుల్లో 5 వేల టన్నుల పంట మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది’ అని అధికారులు సీఎంకు వివరించారు.
సీఎం సూచనలు…
కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టండి. రైతులకూ అక్కడ నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి. రైతు బజార్లను ఆధునికీకరించాలి. రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్‌ యార్డు స్థలాలను ఉపయోగించుకోవాలి. అందులోని 2-3 ఎకరాల భూమిని ఉపయోగించుకుని కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాలి. గోదాములు, కోల్డ్‌ చైన్‌ వసతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలి.

Read More

ఆంధ్రప్రదేశ్‌కు 10,800 టన్నులు కేటాయించిన కేంద్రం

ఒడిశాలోని ధమ్రా పోర్టు నుంచి 10,800 టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిందని.. ఎవరూ అందోళన పడొద్దని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో వివరించారు. యూరియా కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాల్లోని రైతులకు వెంటనే దీన్ని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 6న గంగవరం పోర్టుకు 15,000 టన్నులు, సెప్టెంబరు రెండో వారంలో కాకినాడ పోర్టుకు 30,000 టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఎరువుల కొరత తలెత్తకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా 1.10 లక్షల టన్నుల బఫర్‌ నిల్వలు సిద్ధంగా ఉంచామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Read More

అమెరికాలో జొన్న ఉత్పత్తి హెక్టారుకు 11 టన్నులు

మన దేశంలో దాణా కొరత పశుసంపద వృద్ధికి విఘాతంగా మారిందని, విధానపరమైన సమగ్ర కార్యాచరణ లేకపోవడం వల్లే పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలు ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని భారత సమ్మిళిత పశుదాణా తయారీదారుల సంఘం (సీఎల్‌ఎఫ్‌ఎంఏ) అధ్యకక్షుడు దివ్యకుమార్‌ గులాటీ అభిప్రాయపడ్డారు. అమెరికాలో జొన్న హెక్టార్‌కు 11 టన్నులు పండుతుంటే మన దేశంలో కేవలం 3 టన్నులే ఉందని.. అక్కడ జన్యుమార్పిడి విత్తనాల వినియోగం వల్ల ఉత్పత్తి పెరుగుతోందని మనదేశంలో దానిని చేపట్టడం లేదని, దేశంలో దాణా అవసరాల దృష్ట్యా పలు పంటల ఉత్పాదకతను పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఆ రంగాలను ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగిన సంఘం 66వ వార్షిక సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పశుసంపద, దాణా ఉత్పత్తి ఇతర అంశాల గురించి వివరించారు.
దాణా అవసరాల్లో 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం.
మన దేశం పశుసంపదకు నిలయం. వ్యవసాయ జీడీపీలో మూడో వంతు వాటా పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలదే. దేశంలో ఏటా 60 మిలియన్‌ టన్నుల దాణాను వాడుతున్నాం. అందులో 22 మిలియన్‌ టన్నులు మొక్కజొన్నలే. ప్రస్తుతం దేశీయ దాణా అవసరాల్లో సగం మాత్రమే దేశం ఉత్పత్తి చేస్తున్నందున ఇతర దేశాల నుంచి 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది పాడి, పౌల్ట్రీ, మత్స్య రైతులకు, ఉత్పత్తిదారులకు భారంగా మారుతోంది.
ఉత్పాదకతనైనా పెంచాలి
వరి లాంటి పంటలు అవసరానికి మించి సాగవుతున్నాయి, కానీ దాణా అవసరాల దృష్ట్యా మొక్కజొన్న, సోయా, నూనెగింజల విస్తీర్ణం, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా ఆ మేరకు కృషి జరగడం లేదు. జొన్న, సోయా వంటి పంటలను ఎంత పండించినా కొనుగోలుకు ఆస్కారం ఉంది. విస్తీర్ణం పెంచకపోయినా ఉత్పాదకతను పెంచాలని అభ్యర్థిస్తున్నాం. అమెరికాలో మాదిరిగా జన్యుమార్పిడి వద్దనుకుంటే ఉత్పత్తిని పెంచే కొత్త వంగడాలపై భారత వ్యవసాయ పరిశోధన మండలి దృష్టి సారించాలని కోరారు.

Read More

దేశంలో తొలిసారి నారావారిపల్లెలో పాడి పశువుల్లో ఎద క్రమబద్ధీకరణ

కొన్ని పశువులు ఎదకు రాకపోకపోవడం.. లేదంటే ఒకట్రెండు ఈతలకే వట్టిపోతుండటం లాంటి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లె పరిసరాల్లో దేశంలోనే తొలిసారిగా ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కృత్రిమ గర్భధారణతో 30-40 శాతం చూలు కట్టు శాతం ఉండగా.. ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమంతో 63 శాతం పశువులు గర్భం దాల్చాయి. నారావారిపల్లె సహా చుట్టుపక్కల 29 గ్రామాల్లో వెయ్యికి పైగా ఎదకు రాని పశువుల్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. తొలి విడతగా 172 మంది రైతులకు చెందిన 250 పశువులను ఎంపిక చేసుకుని మార్చి 29న పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 30 మంది పశు వైద్యులు, సహాయకులు ఎంపిక చేసుకున్న ప్రతి పశువు పునరుత్పాదక, గర్భాశయం, అండాశయ స్థితిగతులను అధ్యయనం చేసి వాటిని ఎదకు రప్పించే ప్రక్రియను ప్రారంభించారు. పశువుకు ఆరోగ్య పరీక్షలు చేసి ఎదకు రాకపోవడానికి కారణాలను గుర్తించారు. ప్రతి పశువుకు డీవార్మింగ్‌ మాత్రలు, 20 కిలోల సమీకృత దాణా, 20 మినరల్‌ మాత్రలు, యాంటీ బయాటిక్‌ మందులతో కూడిన రూ. 1500 విలువైన కిట్‌ను రూ.400కే అందజేశారు. మే నెలలో మేలుజాతి ఆంబోతుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. దీంతో 156 వట్టి పోయిన పశువులు ఇప్పుడు చూలు కట్టాయి.

75 శాతం ఫలవంతం చేయడమే లక్ష్యం
ఎదకు రాని పాడి పశువు విలువ రూ. 15 వేలు మాత్రమే. అదే పశువు ఎదకు వచ్చి గర్భం దాల్చితే రూ.60-70 వేలు. ఆరు నెలల తర్వాత నారావారిపల్లెలోని 172 మంది రైతుల ఇళ్లలో పాల వెల్లువ ప్రారంభమవుతుంది. మంచి ఆదాయం లభించనుంది.
-ఎ. రవికుమార్‌, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి

Read More

వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉజ్వల భవిత

వికసిత భారత్‌ కింద ఉజ్వల భవిష్యత్‌ ఉన్న పశుసంవర్థక, మత్స్య, పౌల్ట్రీ రంగాలను ప్రోత్సహిస్తామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్‌ శాఖల సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సీఎల్‌ఎఫ్‌ఎంఏ 58వ జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాణా ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం’ అని బఘేల్‌ హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్‌, కేంద్ర సంయుక్త కార్యదర్శి ముత్తుకుమారస్వామి, స్లిఫ్మా చైర్మన్‌ దివ్యకుమార్‌ గులాటీ, పౌల్ట్రీ ఇండియా అధ్యకక్షుడు ఉదయ్సింగ్‌ పాల్గొన్నారు.వికసిత భారత్‌ కింద ఉజ్వల భవిష్యత్‌ ఉన్న పశుసంవర్థక, మత్స్య, పౌల్ట్రీ రంగాలను ప్రోత్సహిస్తామని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్‌ శాఖల సహాయమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సీఎల్‌ఎఫ్‌ఎంఏ 58వ జాతీయ సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాడి, పౌల్ట్రీ, మత్స్య రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దాణా ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం’ అని బఘేల్‌ హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్‌, కేంద్ర సంయుక్త కార్యదర్శి ముత్తుకుమారస్వామి, స్లిఫ్మా చైర్మన్‌ దివ్యకుమార్‌ గులాటీ, పౌల్ట్రీ ఇండియా అధ్యకక్షుడు ఉదయ్సింగ్‌ పాల్గొన్నారు.

Read More

నెల రోజులపాటు పాలేకర్‌ సాగు విధానంపై అవగాహన

సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్పీకే) విధానంలో పంటలు సాగు చేయాలనే ఔత్సాహికులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేయనున్నట్లు సేవ్‌ సంస్థ ప్రతినిధి విజయరామ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రతి జిల్లా నుంచి నలుగురు ప్రతి నిధులు సెప్టెంబరు 2న హైదరాబాద్‌ దోమలగూడలోని శ్రీరామచంద్రమిషన్‌లో ఉదయం 9.30 నుంచి 1 గంట వరకు జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఎంపికైన వారికి ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు గ్రామంలో అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, కొత్తగా వ్యవసాయం చేయాలనుకునే స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాల ప్రతినిధులు, యోగా గురువులు, విశ్రాంత ఉద్యోగులు వంటి వారు ఎవరైనా పాల్గొనవచ్చని సూచించారు.

Read More

26న విజయవాడలో ప్రపంచ రికార్డు లక్ష్యంగా.. మట్టి గణపతుల తయారీ

ఈ నెల 26న విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మైదానం, పలు పాఠశాలల వేదికగా పర్యావరణహిత గణపతి విగ్రహాలను వేల సంఖ్యలో ఒకేసారి తయారుచేసి ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు ఎన్టీఆర్‌ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణహితంగా వేడుకలు నిర్వహించుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ వెల్లడించారు. దీనికి సంబంధించిన గోడపత్రికలను గురువారం ఆవిష్కరించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఇళ్ల వద్దే పర్యావరణహితంగా ప్రతిమలను తయారుచేసి వాటి ఫొటోలను 9154970454 నంబరుకు వాట్సప్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Read More