మనుషుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలను నిరోధించుకోవాలంటే సేంద్రియ సాగు విధానంపై అవగాహన పెంచుకోవాలని, సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులను తినాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మైలవరం, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప ప్రిన్సిపల్ పి. రంగారావు పేర్కొన్నారు. కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపై సర్టిఫికేషన్ కోర్సును శుక్రవారం ప్రారంభించారు. పూల మొక్కల నుంచి పండ్లు, కూరగాయలను ఇళ్లల్లోనే పెంచుకోవచ్చని విభాగాధిపతి జె. రాముడు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు హరిబాబు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

30 Aug, 2025
