తయారుచేయు విధానం: తెల్ల నువ్వులు శుభ్రం చేసుకుని, ఎండలో పెట్టి, కొంచం సేపు ఎండగానే, తెచ్చి పక్కన పెట్టుకోవాలి, (ఎక్కువ సేపు ఎండలో పెడితే నూనె వస్తుంది) నువ్వులతోపాటు మిర్చి, జీలకర్ర కూడా ఎండబెట్టుకోవాలి. తరువాత అన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ పట్టకూడదు.. నూనె వస్తుంది… అలానే రోట్లో దంచుకోవచ్చు కూడా.. తరువాత ఉప్పు కలిపి వాడుకోవడమే… నువ్వుల కారపు పిండిని నేరుగా అన్నంలో వేసుకుని, పచ్చి నూనె వేసుకొని తినవచ్చు. లేదా కూరలు, పులుసులో కూడా కలిపి వాడుకోవచ్చు.
రచన: సంధ్య శశికాంత్, వాకలపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
సాధారణ నామం: వైట్‌జ్యూట్ శాస్త్రీయ నామం : కార్కోరస్ కాప్సులారిస్ కుటుంబం: మాల్వేసి
నరువల్లి మొక్కలు పొడవుగా పెరిగే వార్షిక మొక్కలు. ఇవి 2-3 మీ. ఎత్తు పెరుగుతాయి. ఈ మొక్కలు కొమ్మలు లేకుండా లేదా కొన్ని ప్రక్క కొమ్మలు కలిగి ఉంటాయి. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఇవి సాధారణంగా, బల్లెం ఆకారంలో ఉండి 5-15 సెం.మీ. పొడవుంటాయి. ఆకుల అంచులు సన్నని నొక్కులు కలిగి ఉంటాయి. పూలు చిన్నవిగా 2-3 సెం.మీ. వ్యాసం కలిగి పసుపు రంగులో ఉంటాయి. కాయ అనేక విత్తనాలు కలిగి ఉంటుంది.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
ఈ ఆకుపచ్చ ఆకుకూరలో మంచి కంటి చూపుకవసరమైన బీటాకెరోటిన్, ఆరోగ్యవంతమైన ఎర్రరక్తణాలు, దృఢమైన ఎముకలు, పళ్ళకవసరమైన కాల్షియం, నున్నని, పరిశుభ్రమైన చర్మం, బలమైన రోగ నిరోధక శక్తి, త్వరగా గాయం నయమవడానికి అవసరమైన విటమిన్ సి అధికంగా ఉన్నాయి.
జ్యూట్ ఆకులలో విటమిన్ ఎ, సి, ఇ ఉంటాయి. జ్యూట్ ఆకు కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి క్రానిక్ వ్యాధుల నుండి రక్షిస్తాయి.
ఆయుర్వేదంలో జ్యూట్ ఆకులను నొప్పులు, మొలలు, ట్యూమర్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఆకులను జ్వరం, గనోరియా చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
జ్యూట్ గింజల ద్రావణం నుండి వేరు చేసిన భాగాలు, మిశ్రమాలు వ్యాధికారక బాక్టీరియా విబ్రియో కలరా, సాల్మొనెల్లా స్పీసీస్, షిగెల్లా స్పీ., ఎస్కెరిచియా కోలి మరియు నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు ట్రైబోలియం కాస్టానియంపై యాంటిమైక్రోబియల్ మరియు కీటక నాశక చర్యలను ప్రదర్శించింది. క్రూడ్ మిథనాల్ ద్రావణం బాక్టీరియాపై అధిక యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. పెట్రోలియం ఈథర్ అత్యధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది (రహ్మాన్, అతని అనుచరులు, 2015).
జ్యూట్ ఆకు ద్రావణాలు బంగాళ దుంప మెత్తని కుళ్ళు కలిగించే బాక్టీరియం, ఎర్వినియా కరటవొర సబ్‌స్పీ, కరటవొర (ఇసిసి) పి138 పెరుగుదలను ప్రయోగశాలలో మరియు నిల్వగదులలో జరిపిన ప్రయోగాలలో సమర్ధవంతంగా అరికట్టాయి (రహ్మాన్, అతని అనుచరులు, 2012).
జ్యూట్ మొక్క పురుగు మందు లక్షణాలను కలిగిఉంది. కాండం పొడి లేదా కాండం ద్రావణాన్ని భూమికి కలిపినా లేదా పంటపై పిచికారి చేసినా గోధుమలో గోధుమ రంగు తుప్పుతెగులుని నివారిస్తుంది. వరి, గోధుమ, ఇతర పంటలలో పురుగులను వికర్షిస్తుంది (ఘోష్, 2000)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
విశిష్టమైన సువాసన, అద్భుతమైన రుచి, అపరిమితమైన పోషక విలువలు కలగలిసిన పండు జామ. తక్కువ ధరకే లభించే ఈ పండును సామాన్యుడి ఆరోగ్యాన్ని కాపాడే “పేదవారి ఆపిల్” గా అభివర్ణిస్తారు. అన్ని వయసుల వారికీ ఎంతో మేలు చేసే సహజ పోషకాహార గని.
జామ పోషకాల సమృద్ధి : జామపండులో విటమిన్లు, ఖనిజాలు, ఆహారపు పీచు, ప్రోటీన్ మరియు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ‘C’కి ఇది అత్యుత్తమ సహజ వనరు. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
జామపండులోని పీచు జీర్ణక్రియను సులభతరం చేయడంతో పాటు పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని పొటాషియం, కాల్షియం, భాస్వరం మరియు ఇతర ఖనిజాలు శరీరంలోని వివిధ జీవక్రియలకు సహకరిస్తాయి.
జామపండులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన స్వేచ్ఛా రాడికల్స్‌తో పోరాడి కణాల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. అందువల్ల, జామపండును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చు.
జామపండును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు సులభంగా లభిస్తాయి. జామపండు శరీరానికి అవసరమైన అనేక పోషకాల సమాహారం. ఇందులో విటమిన్ ‘C’ అత్యధిక పరిమాణంలో ఉంటుంది; ఇది ఆపిల్ మరియు నారింజ వంటి పండ్ల కంటే కూడా అనేక రెట్లు అధికంగా లభిస్తుంది. అలాగే, ఇందులోని ఆహారపు పీచు (Dietary Fiber) జీర్ణ వ్యవస్థ సరైన రీతిలో పనిచేయడానికి ఒక అత్యుత్తమ ఇంధనంగా తోడ్పడుతుంది. వీటితో పాటు పొటాషియం, కాల్షియం, భాస్వరం మరియు ఇనుము (Iron) వంటి అవసరమైన ఖనిజ లవణాలు జామపండులో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీర కణాల క్షీణతను అడ్డుకోవడంలో మరియు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
జామపండుతో లభించే 6 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు
శక్తివంతమైన సహజ రోగనిరోధక కవచం జామపండులోని విటమిన్ C రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జామపండు బ్యాక్టీరియా మరియు వైరస్‌ల దాడి నుంచి శరీరాన్ని సమర్థవంతంగా రక్షిస్తుంది. ఇది జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అందువల్ల, పిల్లల సరైన ఎదుగుదలకు మరియు వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది ఒక అద్భుతమైన సహజ రక్షణ కవచంగా తోడ్పడుతుంది.
జీర్ణక్రియ సమర్థవంతం – మలబద్ధకానికి చెక్ అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామపండు పేగుల కదలికలను క్రమబద్ధీకరించి, మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్తి మరియు గ్యాస్ట్రిక్ వంటి జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించడంలో విశేషంగా సహాయపడుతుంది. అంతేకాకుండా, పేగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా (Probiotics) వృద్ధి చెందడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.
మధుమేహ (డయాబెటిస్) నియంత్రణ జామపండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI) కలిగిన పండు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది. జామపండులోని పీచు పదార్థం వల్ల చక్కెర శరీరంలోకి శోషించబడే వేగం గణనీయంగా తగ్గుతుంది. అందుకే, డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారు తమ పోషకాహార లేదా ఆరోగ్య నిపుణుల సలహాతో దీనిని మితమైన పరిమాణంలో తీసుకోవడం చాలా శ్రేయస్కరం.
గుండె ఆరోగ్యం & కొలెస్ట్రాల్ నియంత్రణ జామపండులో ఉండే పొటాషియం మరియు కరిగే పీచు (Soluble Fiber) గుండెకు కొండంత అండ. జామపండులోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేసి, రక్తపోటును (BP) నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇందులోని పీచు పదార్థం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, రక్తప్రసరణను సులభతరం చేస్తుంది. ఫలితంగా, గుండెపోటు మరియు పక్షవాతం (Stroke) వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు తగ్గుతాయి.
నిత్య యవ్వన చర్మ సౌందర్యం జామపండులోని యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C చర్మంలో కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తిని పెంచడానికి దోహదపడతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని సమర్థవంతంగా అడ్డుకుని, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నిరోధిస్తూ చర్మాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
రక్తహీనత (అనీమియా) నివారణకు సహకారం జామపండులోని విటమిన్ C, మనం తీసుకునే ఇతర ఆహారాలలోని ఇనుమును (Iron) శరీరం సరిగ్గా గ్రహించేలా (Absorption) చేస్తుంది. అందువల్ల, ఆకుకూరలు మరియు పప్పు ధాన్యాలతో పాటు జామపండును తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరిగి, అనీమియా (రక్తహీనత) మరియు అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.
జామపండును ఉపయోగించాల్సిన సరైన విధానం ప్రకృతి సూచన: స్థానికంగా, చౌకగా లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడమే సంపూర్ణ ఆరోగ్యానికి తొలిమెట్టు.
రోజుకు ఒక మీడియం సైజ్ జామపండును తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. పిల్లలు, గర్భిణులు, శారీరక శ్రమ చేసేవారు మరియు వృద్ధులు – ఇలా ప్రతి ఒక్కరూ దీనిని నిర్భయంగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్ సమయంలో జామపండును తాజాగా కోసి తినడం వల్ల శరీరానికి అందులోని గరిష్ట పోషకాలు లభిస్తాయి.
ముగింపు: జామపండు రుచి, పోషక విలువ మరియు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎంతో విలువైన పండు. ఇందులో విటమిన్ C, పీచు, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మధుమేహ నియంత్రణకు సహకరించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం, బరువు నియంత్రణకు సహాయపడడం మరియు రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ప్రతిరోజూ సమతుల్య ఆహారంతో పాటు జామపండును మితమైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను పొందవచ్చు.
ప్రత్యేకంగా పిల్లలు, గర్భిణులు, పెద్దలు మరియు వృద్ధులకు ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. స్థానికంగా సులభంగా లభించే ఇలాంటి పోషక పండ్లను తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరళమైన మరియు ప్రభావవంతమైన మార్గం.
ఏవో ఖరీదైన పండ్ల వెనుక పడకుండా, మనకు అందుబాటులో ఉండే జామపండును క్రమం తప్పకుండా తింటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం.
బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258
బూడిద గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా, లేదా తురుము కొద్దిగా
పెరుగు – సరిపడునంత
ఉప్పు – తగిన మోతాదులో
ఆవపిండి – అర చెంచా
రెండు పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
తయారుచేసే విధానం బూడిది గుమ్మడికాయ పైన ఉన్న మందపాటి తొక్కను చాకుతో తీసివేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా పెద్ద ముక్కను తురుముగా చేసుకొని అయినా పెరుగు పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు. పెరుగును చల్లకవ్వంతోనే చిల్కి ఈ తురుమును లేదా గ్రైండ్ చేసుకున్న ముద్దను పెరుగులో కలుపుకోవాలి. దానికి తగిన మోతాదు లోపల ఉప్పు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పౌడర్, కొంచెం ఆవపిండిని కలుపుకొని చల్లకవ్వంతోని చక్కగా చిలకాలి. బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడిని అన్నంలోకి, చపాతీలోకి కూడా తినవచ్చు.
రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాము. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందుబాటులో ఉండేలా చూడడం మరియు పోషకాహారం, ఆహార భద్రత పై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే నేటి పరిస్థితుల్లో ఆహార భద్రత అంటే కేవలం ప్రతి ఒక్కరి కడుపు నింపడం మాత్రమే కాదు. పోషకమైన ఆహారం, ఆహార వైవిధ్యం, స్థానిక ఆహార వ్యవస్థల పరిరక్షణ కూడా ఆహార భద్రతలో అంతర్భాగాలే.
ఆహారం నుంచి పోషకాహారం వైపు ఒక కుటుంబానికి తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ ఆహారంలో అవసరమైన పోషకాలు లేకపోతే పూర్తి ఆరోగ్యం సాధ్యం కాదు. నేడు పోషకాహార లోపంతో పాటు అధిక బరువు, ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి జీవనశైలి వ్యాధులు కూడా పెరుగుతున్నాయి.
మన రోజువారీ ఆహారంలో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు మరియు తగినంత నీరు ఉండాలి. కేవలం కడుపు నిండేలా ఆహారం తీసుకోవడం కాకుండా, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. దీనికోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సమతుల్య ఆహారం అంటే శరీరానికి కావలసిన అన్ని పోషకాలు సరైన పాళ్లలో అందేలా తీసుకునే ఆహారం.
అందుకే మన ఆహారంలో ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, నట్స్ మరియు నూనె గింజలు వంటి వివిధ ఆహార సమూహాల నుండి ఆహారం తీసుకోవడం అవసరం. ముఖ్యంగా స్థానికంగా, కాలానుగుణంగా లభించే ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో కుటుంబ ఆహార వైవిధ్యాన్ని పెంచు కోవచ్చు.
చిరుధాన్యాలు పరిమాణంలో చిన్న, పోషకాల్లో మిన్న మన పూర్వీకుల ఆహారంలో ఒకప్పుడు జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాలు ముఖ్యమైన భాగంగా ఉండేవి. మారుతున్న ఆహార అలవాట్లతో వాటి వినియోగం తగ్గినా, ప్రస్తుతం ఆరోగ్యకరమైన మరియు సుస్థిరమైన ఆహార వ్యవస్థలలో చిరుధాన్యాల ప్రాధాన్యం మళ్లీ పెరుగుతోంది. చిరుధాన్యాలు ఆహారంలో వైవిధ్యాన్ని పెంచడమే కాకుండా అధిక మొత్తంలో కాల్షియమ్, ఐరన్, పీచు వంటి పోషకాలను అందిస్థాయి. వీటితో రొట్టెలు, సంగటి, అంబలి లాంటి పాతకాల వంటలే కాకుండా చిన్నపిల్లలు ఇష్ట పడేలా బిస్కెట్లు, కేకులు, మిక్స్చర్, దోసెలు, ఇడ్లీలు వంటి అనేక రకాల పోషకాహార పదార్థాలను తయారు చేయవచ్చు.
పొలాల్లో వైవిధ్యం పెరిగితే, తినే పళ్లెంలోనూ వైవిధ్యం పెరుగుతుంది. ఆహార భద్రతకు పునాది పొలాల్లోనే ఉంటుంది. ఒకే పంటపై ఆధారపడకుండా ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, కూరగాయలు మరియు ఇతర పంటలను కలిపి సాగు చేసే మిశ్రమ పంటలు, రైతులకు ఆహారం భద్రత మరియు ఆదాయ వనరులను అందిస్తాయి.
ఇలాంటి పద్ధతులు పంటల వైవిధ్యాన్ని పెంచడంతో పాటు స్థానిక జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి దోహదపడతాయి. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా విభిన్న పంటలను సాగు చేయడం రైతుల ఆహార మరియు జీవనోపాధి భద్రతను బలోపేతం చేయగలదు. పొలాల్లో పంటల వైవిధ్యాన్ని, ఇళ్లలో ఆహార వైవిధ్యాన్ని పెంపొందించినప్పుడే నిజమైన ఆహార భద్రత సాధ్యమవుతుంది. స్థానికంగా లభించే ఆకుకూరలు మరియు సాగు చేయబడని ఆకుకూరలు పోషకాల గనులు
గ్రామీణ ప్రాంతాల్లో అడవి సోయకూర, పున్నగంటి, బంకంటి, దూసరి, ఏలకచెవుల కూర, జొన్నచెంచలి, సన్న పయాల, తుమ్మి కూర, ఉత్తరేణి, ఎన్నాద్రి, బచ్చలి కూర, దొగ్గలి, పుండి, నేల ఉసిరి, గురుమాషి, చెన్నంగి, తడక దొబ్బుడు, చిత్రమాలం, అంగి భంగి, గంగా వాయిలి వంటి ఎన్నో రకాల సాగుచేయబడని ఆకుకూరలును చూడవచ్చు. జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో వీటిని చూడవచ్చు. ఇటువంటి ఆకుకూరల్లో అనేకమైన పోషకాలు ఉంటాయి. తరతరాలుగా గ్రామీణ కుటుంబాలు వీటిని గుర్తించి, సేకరించి, వివిధ వంటకాలలో ఉపయోగిస్తూ వచ్చారు. అయితే ఆధునిక వ్యవసాయంలో విపరీతమైన మందులు పిచికారి చేయడం వలన ఇటువంటి వనరులను కోల్పోవాల్సి వస్తుంది. సాగుచేయని ఆకుకూరల గురించి అవగాహన కల్పించడం, సురక్షితమైన వినియోగ పద్ధతులను ప్రోత్సహించడం, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా ఆహార వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఆకు కూరలను ముందుగా శుభ్రం చేసి తరువాత తరగడం ద్వారా పోషకాలను కోల్పోము. సన్నగా తరిగన తర్వాత నీటితో శుభ్రం చేయడం ద్వారా నీటిలో కరిగే విటమిన్లను కోల్పోతాం.
ఆహార వృథాను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రపంచంలో ఒకవైపు అనేక మంది ప్రజలకు తగిన ఆహారం అందకపోతుండగా, మరోవైపు ఉత్పత్తి చేసిన ఆహారంలో కొంత భాగం వృథా అవుతోంది. ఆహారాన్ని వృథా చేయడం అంటే కేవలం ఆహారాన్ని మాత్రమే కోల్పోవడం కాదు; దాని కోసం వినియోగించిన నీరు, భూమి, శ్రమ, శక్తి మరియు రైతుల కష్టం కూడా వృథా అవుతున్నాయి.
అందువల్ల అవసరానికి తగినంత ఆహారాన్ని మాత్రమే వండటం, మిగిలిన ఆహారాన్ని సురక్షితంగా నిల్వ చేయడం, అందుబాటులో ఉన్న పదార్థాలను సృజనాత్మకంగా ఉపయోగించడం మరియు ఆహారాన్ని గౌరవించడం ప్రతి కుటుంబం బాధ్యత.
ఎం.హేమలత (గృహ విజ్ఞాన శాస్త్రవేత్త), డా సి. వర ప్రసాద్ (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి), జీ. శైలజ (ఉద్యాన శాస్త్రవేత్త), మరియు వి. రమేష్ (సేద్య విభాగ శాస్త్రవేత్త) డిడిఎస్ -కృషి విజ్ఞాన కేంద్రం, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
వాము – ఒక టీ స్పూను (ఇసుక, మట్టి లేకుండా చూసుకోవాలి)
రాళ్ళ ఉప్పు – తగినంత
పచ్చిమిర్చి – అరకప్పు
తయారుచేయు విధానం: వాము కారంలో పచ్చిమిర్చిఎక్కువ ఉండాలి. వాము తక్కువ ఉండాలి. ఎందుకంటే వాము ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనిని తక్కువగా వేసుకోవాలి.
వాము కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో వాము పొడిని బాగా కలిపి ఒక ప్లేట్‌లో ఈ వాము పొడిని పలుచగా పరిచి బాగా ఎండబెట్టుకోవాలి. ఏమాత్రం తేమ ఉండకూడదు. అంటే ఆ మిశ్రమం బాగా క్రిస్పీగా ఎండాలి. అప్పుడు గాజు సీసాలో పోసి నిలువ చేసుకోవాలి. స్టీలు డబ్బాలో పోయకూడదు. ఎందుకంటే ఉప్పు ఉంటుంది కాబట్టి. ఎండిన పొడిని అలాగే అన్నంలోకి, టిఫిన్స్‌లోకి వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.
లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
తయారుచేయు విధానం: ఈ సంపూర్ణ పోషకాహారం అటుకులు, కూరల అన్నం తయారీ ఎలాగంటే…. 10 నిమిషాలు నానిన అటుకుల్లో అన్నీ కలిపేసి తినేస్తే అన్నం పనిలేకుండా సరిపోతుంది. దానిలోనే కొంచెం పెరుగు కూడా కలుపుకు తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. అన్నం తినలేదనే ఆలోచన రాదు. నీరసం రానివ్వదు!
నేను బీట్‌రూట్ పెద్దుల్లి కూడా కలుపుకుంటాను. ఇష్టమైనవారు కలుపుకోవచ్చు.
ఫణీంద్ర లక్ష్మీ అప్పసాని, తక్కెళ్ళపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
తయారుచేయు విధానం: ముందుగా పల్లీలు, నువ్వులు, బెల్లం కలిపి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుని పక్కుకు పెట్టుకోవాలి. అదే జార్‌లో ముందుగా చెక్కు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని పల్చటి క్లాత్‌తో గట్టిగా పిండాలి. ఆ జ్యూస్‌ని బీట్రూట్ జ్యూస్‌గా వాడుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఆ ముద్దకి పైన పేర్కొన్న పల్లీలు నువ్వుల బెల్లం పొడిని మరియు కొద్దిగా ఇలాచీ పొడిని చిన్నచిన్నగా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు బాదం ముక్కలను కలిపి అవసరాన్ని బట్టి తేనెను కలుపుతూ గుండ్రటి లడ్డూలు కట్టుకోవాలి.
ఇవి ఏరోజుకారోజు చేసుకుని తింటే బాగుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్లకు, పార్టీలకు అప్పటికప్పుడు పిల్లలకి రుచికరమైన, బలవర్ధకరమైన ఆహారంగా చేసి ఇవ్వవచ్చు.
ఒకేరోజు మనము బీట్రూట్ లడ్డూలను, బీట్రూట్ జ్యూస్‌ను తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు.
బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగే అలవాటు ఉన్నవాళ్లు చాలా నీటిని పోసి పిప్పి కదా అని దాన్ని వ్యర్థం చేస్తుంటారు. కాకపోతే తక్కువ నీటిని ఉపయోగించి క్యారెట్, బీట్‌రూట్ లడ్డూలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు.
సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
తయారుచేయు విధానం ముందుగా క్యాబేజీని బాగా సన్నగా బియ్యం గింజ సైజులో తురుము కోవాలి. తరువాత కీర కూడా సన్నగా తురుముకోవాలి.
3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఒకసారి పల్స్ మోడ్‌లో మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్‌లో పెరుగు తీసుకుని, దానిలో క్యాబేజి తురుము, కీర తురుము, పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమం, జీలకర్ర పొడి, సరిపోయినంత ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి.
దీన్ని రోటీల్లో తినొచ్చు. ఉత్తదే కప్పులో వేసుకుని పెరుగన్నం లాగా కూడా తినొచ్చు. బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు దీన్ని తరచుగా రోజు ఉదయం అల్పాహారం లాగా లేదా సాయంత్రం భోజనం బదులు తీసుకోవచ్చు.
దామ జ్యోతి, బాచుపల్లి, హైదరాబాద్, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
తయారు చేయు విధానం: ముందుగా బ్రకోలీ కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని, ఒక అరగంట సేపు, తేమ లేకుండా ఆరనివ్వాలి. తేమ వల్ల బూజు పడుతుంది. ఆరిన ముక్కలకి మిగతా పదార్థాలు అన్నిటిని కలుపుకొని, పొడిగా ఉన్న గాజు సీసాలో కానీ, జాడీలో కానీ తీసి పెట్టుకోవాలి. నూనె, ఉప్పు సరిపడంత ఉండాలి. అప్పుడే ఏదైనా పచ్చడి బూజు పట్టకుండా ఉంటుంది. మూడు రోజుల తర్వాత వాడుకోవాలి. బయట నిల్వ ఉంటే, పది రోజుల వరకు ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెలరోజుల వరకు కూడా ముక్క మెత్తబడకుండా ఉంటుంది.
ఇమ్మిడిశెట్టి ప్రభాకరరావు, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.